
క్యా బాత్ హై
చక్కటి చిరునవ్వు... అందమైన రూపంతో కనిపిస్తున్న ఈ విదేశీ భామను కాస్త దగ్గరగా గమనించండి. ఓ పక్క ఒత్తుగా జుత్తు... మరో వైపు గుండు... ఆమె హెయిర్ స్టైల్ చిత్రంగా ఉంది కదూ! బంజారాహిల్స్‌లో జరిగిన ఓ ఈవెంట్ కోసం వచ్చిన ఈ న్యూయార్క్ వనిత పేరు నికోలాస్. ఏమిటీ హెయిర్‌స్టైల్ అని అడిగితే... ‘భారత్ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. వారి జుత్తూ అంతే. అందులో నేను పోటీపడలేను. అందుకే వారందరిలో కాస్త ప్రత్యేకంగా కనిపించడానికి ఈ హెయిర్ స్టయిల్’ అంటూ గలగలా నవ్వుతూ చెప్పేసిందీ సుందరి.