న్యూఢిల్లీ: వివిధ దేశాల్లో ఖైదీలుగా మగ్గుతున్న భారతీయుల వివరాలను విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ పార్లమెంటులో లిఖిత పూర్వకంగా వెల్లడించారు. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. మొత్తం 75 దేశాల్లోని జైల్లలో 6,567 మంది భారతీయులు ఉన్నారు. అత్యధికంగా సౌదీ అరేబియా లో 1,896 మంది శిక్షను అనుభవిస్తున్నారు.
అరబ్ దేశాల్లో 764 , నేపాల్లో 614, అమెరికాలో 595 , పాకిస్థాన్ లో 518, కువైట్ లో 325 , మలేషియా లో 293 , బహరేన్ లో 235, సింగపూర్ లో 147, చైనాలో 105, బంగ్లాదేశ్ లో 130 మంది మంది ఉన్నారు. 354 మంది శిక్ష పూర్తై స్వదేశానికి రావడానికి సిద్ధంగా ఉన్నారని వీకే సింగ్ తెలిపారు.
విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మరోప్రశ్నకు సమాధానంగా 261 మంది భారతీయ మత్సకారులు పాకిస్థాన్ జైల్లలో శిక్ష అనుభవిస్తున్నారని తెలిపారు. భారతదేశం 42 దేశాలతో ఖైదీల సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు ఒప్పందం చేసుకుంది.
విదేశీ జైల్లలో 6,567 మంది భారతీయులు
Published Thu, Jul 21 2016 10:46 AM | Last Updated on Tue, Nov 6 2018 4:56 PM
Advertisement