పాకిస్తాన్‌తో స్నేహం కోసం ప్రయత్నిస్తే.. దానికి బదులుగా భారత్‌కు ఉగ్రదాడులు లభించాయని ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ తూర్పారబట్టింది. హక్కుల ఉల్లంఘనలపై ఇతరులను నిందించే వాళ్లు ముందుగా ఆత్మపరిశీలన చేసుకోవాలని పాక్‌కు హితవుపలికింది. బలూచిస్తాన్‌లో పాక్ అత్యంత పాశవికమైన అణచివేతను సాగిస్తోందంటూ.. ఐరాస సర్వసభ్య సభ సమావేశంలో తొలిసారి ఆ దేశాన్ని భారత్ అభిశంసించింది. ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న దేశాలను ఏకాకులను చేయాలని ప్రపంచానికి పిలుపునిచ్చింది. సమితి 71వ సర్వసభ్య సమావేశంలో సోమవారం భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రసంగించారు. వారం కిందట ఇదే వేదిక నుంచి పాక్ ప్రధాని షరీఫ్ భారత్‌పై చేసిన విమర్శలను తిప్పికొట్టారు. ‘కొన్ని దేశాలున్నాయి.