breaking news
UNGA
-
అరెస్టు భయంతో నెతన్యాహు ఏం చేశారంటే..!
ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు(Benjamin Netanyahu) చేసిన పని ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ(UNGA) సమావేశాలకు హాజరయ్యేందుకు ఆయన న్యూయార్క్ వెళ్లారు. అయితే ప్రయాణంలో ఆయన యూరప్ గగనగలం కాకుండా.. సుదీర్ఘ మార్గంలో ప్రయాణించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గాజా యుద్ధ నేపథ్యంతో.. అంతర్జాతీయ న్యాయస్థానం(International Court Of Justice) నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. యుద్ధ నేరాలకు పాల్పడ్డ ఆయన్ను అవకాశం దొరికితే అరెస్ట్ చేయొచ్చని అందులో సభ్యత్వం ఉన్న 125 దేశాలకు ఇంటర్నేషనల్ కోర్టు సూచించింది. దీంతో ఐక్యరాజ్య సమితి సమావేశాలకు హాజరు కావాల్సిన ఆయన యూరప్ దేశాల మీదుగా కాకుండా.. మరో మార్గంలో వెళ్లారనే చర్చ నడుస్తోంది. ఫ్లైట్ ట్రాకింగ్ డాటా ప్రకారం.. ఆయన అధికారిక విమానం ‘వింగ్స్ ఆఫ్ జియాన్’ మధ్యధరా సముద్రం, జిబ్రాల్టార్ ద్వారం.. అట్లాంటిక్ మీదుగా న్యూయార్క్‌కు చేరుకుంది. ఈ క్రమంలో.. ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్ ఎయిర్‌స్పేస్‌ను తప్పించుకున్నట్లైంది. అయితే ఈ రూట్లో వెళ్లడం ద్వారా ఆయన అదనంగా 600 కిలోమీటర్లు ప్రయాణించారని సమాచారం. ఇదిలా ఉంటే కిందటి ఏడాది కూడా ఆయన ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే అప్పటికి నెతన్యాహుపై వారెంట్ జారీ కాలేదు. కానీ, ఆయన ప్రసంగిస్తున్న సమయంలో పలు దేశాల ప్రతినిధులు లేచి వెళ్లిపోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక అంతర్జాతీయ న్యాయస్థానం కిందటి ఏడాది నవంబర్‌లో నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్లను యుద్ధనేరస్తులుగా పేర్కొంటూ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే ఈ అభియోగాలను ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. ఇదీ చదవండి: ఎవరు బతకాలో ఆయుధాలే నిర్ణయిస్తాయి! -
అనుమానపు ట్రంప్.. రహస్య విచారణకు ఆదేశం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్య సమితికి మంగళవారం సతీమణి మెలానియాతో కలిసి వెళ్లిన ఆయన.. జనరల్ అసెంబ్లీ 80వ సమావేశంలో ప్రసంగించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ తనకు ఎదురైన అనుభవాలు యాదృచ్ఛికమేమీ కాదని.. ఇందులో కుట్ర దాగి ఉందని అంటున్నారాయన. ఐక్యరాజ్య సమితిలో వరుస చేదు అనుభవాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు సార్లు సాంకేతిక వైఫల్యాలు చోటుచేసుకున్నాయన్న ఆయన.. అదేం యాదృచ్ఛికం కాదని అనుమానం వ్యక్తం చేశారు. ఎస్కలేటర్, టెలిప్రాంప్టర్, సౌండ్ సిస్టమ్ పనిచేయకపోవడం.. ఈ మూడు ఘటనలు దురుద్దేశపూర్వకంగానే కనిపిస్తున్నాయన్నారు. మొదటిది.. ట్రంప్ తన సతీమణి మెలానియా, సిబ్బందితో ఎస్కలేటర్‌పై ఉన్న సమయంలో అది అకస్మాత్తుగా ఆగిపోయింది. రెండోది.. ఆయన యూఎన్‌జీఏలో ప్రసంగించేటప్పుడు టెలిప్రాంప్టర్ పని చేయలేదు. దీంతో ఆయన ప్రింటెడ్ కాపీ ద్వారా తన సందేశాన్ని చదివి వినిపించారు. మూడోది.. ప్రసంగ సమయంలో మైక్ పనిచేయకపోవడం. దీని వల్ల అక్కడున్నవాళ్లు(భార్య మెలానియాతో సహా) తన మాటలు వినలేకపోయారని.. ఇంటర్ప్రెటర్లు ద్వారా మాత్రమే వాళ్లకు వినిపించిందని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై ఆయన అక్కడికక్కడే తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే..NEW: White House Press Secretary Karoline Leavitt calls for investigation after a UN escalator shut off as President Trump and First Lady Melania Trump stepped on.According to The Times, UN staff members had previously "joked" about turning off the escalator."To mark Trump’s… pic.twitter.com/UE1AFdCn2R— Collin Rugg (@CollinRugg) September 23, 2025ఇది తనపై జరిగిన కుట్రగా ఆయన భావిస్తున్నారట. వీటిపై విచారణకు రహస్య దర్యాప్తు సంస్థలను పురమాయించినట్లు, వీటి వెనుక ఎంతటివారున్నా వదిలే ప్రసక్తే లేదంటూ సోషల్ మీడియా ద్వారా ట్రంప్ వెల్లడించారు. అయితే.. ఐక్యరాజ్య సమితి(UNO) ట్రంప్ అనుమానాలను తోసిపుచ్చింది. అమెరికా ప్రతినిధుల బృందంలోకి ఓ వీడియోగ్రాఫర్ పొరపాటున స్టాప్ బటన్ నొక్కడంతో ఎస్కలేటర్ ఆగిపోయి ఉంటుందని యూఎన్ అధికార ప్రతినిధి ఒకరు చెబుతున్నారు. ఇక.. టెలిప్రాంప్టర్ నిర్వహణ వైట్ హౌస్ బాధ్యత కాబట్టి తమపై ఆరోపణలు సరికావని అంటోంది. ఇదిలా ఉంటే.. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్(New York City)లో ఉంది. ఇక్కడ నిర్వాహణ లోపాలు బయటపడడం తరచూ జరిగేదే. దీనికి తోడు నిధుల లేమితో ఈ అంతర్జాతీయ సంస్థ ఈ మధ్యకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే హెడ్ ఆఫీస్‌తో పాటు జెనీవాలో ఉన్న కార్యాలయంలోనూ ఎలివేటర్లు, ఎస్కలేటర్లు, ఏసీలు, లైట్లు ఆఫ్ చేయిస్తోంది కూడా. యూఎన్‌కు అత్యధికంగా ఆర్థిక సాయం అందించేది అమెరికానే. అలాంటి దేశం నుంచి ఫండింగ్ ఆగిపోవడంతో ఐరాసకు ఈ పరిస్థితి నెలకొంది.ఇదీ చదవండి: 150 దేశాలు.. ఐరాసను చీల్చి చెండాడిన ట్రంప్ -
ఐరాసలో ట్రంప్‌కు చేదు అనుభవం.. బుర్రున్నోడంటూ జేడీ వాన్స్ ట్వీట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితిలో చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం సాధారణ అసెంబ్లీని(UNGA) ఉద్దేశించి ఆయన సుదీర్ఘంగా ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు ఏ అమెరికా అధ్యక్షుడు కూడా అంతసేపు మాట్లాడకపోవడం గమనార్హం. అయితే.. న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలోకి అడుగుపెట్టాక అక్కడ ఎస్కలేటర్ పని చేయకపోవడంతో డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కాస్త అసౌకర్యానికి గురయ్యారు. అలాగే.. యూఎస్జీఏ ప్రసంగం చేసే సమయంలోనూ అక్కడ టెలిప్రాంప్టర్ పని చేయలేదు. దీంతో ఆయన ఇబ్బంది పడతారేమోనని అక్కడి సిబ్బంది ఆందోళన చెందారు. కానీ, ఏమాత్రం తడబడకుండా 79 ఏళ్ల ట్రంప్ తన సందేశాన్ని చదువుతూ పోయారు. కాసేపటికి వ్యక్తిగత సిబ్బంది ప్రింటెడ్ కాపీని అందించగా.. అందులో సందేశాన్ని అలవోకగా చదువుతూ పోయారు. ఆ సమయంలో.. ‘‘ ఇక్కడున్న టెలిప్రాంప్టర్(Teleprompter) పని చేయడం లేదు. అయినా ఫర్వాలేదు. అది లేకుండా నేను చదవగలను’’ అని అన్నారు. అయితే.. దీనిని ఉపయోగించి ఇక్కడ మాట్లాడాలనుకుంటున్నవాళ్లకు మాత్రం కాస్త ఇబ్బందే అని ఆయన అనడంతో అక్కడ నవ్వులు విరబూశాయి. ఆపై అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితిపై ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పలు యుద్ధాలను ఆపేందుకు తాను ప్రయత్నిస్తున్న సమయంలో ఆ సంస్థ కనీసం స్పందించలేదని.. ఆ సంస్థవి ఉత్త మాటలేనని, చేతల్లేవని ధ్వజమెత్తారు. ‘ఐరాసకు గొప్ప సామర్థ్యముందని నేను ఎల్లప్పుడూ చెబుతూ ఉంటా. కానీ అది కనీసం దానికి దగ్గరికి చేరుకోవడానికీ ప్రయత్నించదు. ఇప్పటికైనా అది బలమైన పదాలతో లేఖ రాయడానికిగానీ, దానిని పాటించడానికిగానీ ముందుకు రాదు. అది ఉత్త పదాలనే రాస్తుంది. అవి యుద్ధాలను పరిష్కరించలేవు’ అని ట్రంప్ విమర్శించారు. చివరాఖరల్లో మ్తారం ఆ సంస్థకు వందకు వంద శాతం మద్దతుగా నిలుస్తామని ప్రకటించడం కొసమెరుపు.Trump: "I ended seven wars and never even received a phone all from the UN. These are the two things I got from the UN, a bad escalator and a bad teleprompter."😭pic.twitter.com/1DuYTtzAKm— NO CONTEXT VIDEOS (@Viralvid_89) September 23, 2025మరోవైపు.. న్యూయార్క్‌లోని ఐరాస హెడ్ ఆఫీస్‌లోని నాణ్యత లేని వసతులపైనా ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాడైపోయిన ఎస్కలేటర్, పని చేయని టెలిప్రాంప్టర్తో తను చేదు అనుభవం ఎదురైందని అన్నారాయన. అయితే.. ఈ ఘటనపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కాస్త వ్యంగ్యంగా స్పందించారు. మా అధ్యక్షుడికి బుర్ర ఉంది కాబట్టి సరిపోయింది అంటూ ఓ ట్వీట్ చేశారాయన. సరదా కోణాన్ని పక్కన పెడితే..టెలిప్రాంప్టర్ లేకపోయినా ఆయన అమెరికా విదేశాంగ విధానంపై స్పష్టంగా, సమంజసంగా ప్రసంగించినట్టు అందరూ గమనించారా? అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు. మరోవైపు.. 🤣🤣🤣https://t.co/NsPSaejzLK— JD Vance (@JDVance) September 23, 2025 NEW: White House Press Secretary Karoline Leavitt calls for investigation after a UN escalator shut off as President Trump and First Lady Melania Trump stepped on.According to The Times, UN staff members had previously "joked" about turning off the escalator."To mark Trump’s… pic.twitter.com/UE1AFdCn2R— Collin Rugg (@CollinRugg) September 23, 2025 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ UN ప్రధాన కార్యాలయంలో అసౌకర్యానికి గురి కావడం పట్ల రాజకీయ విమర్శలు వెల్లువెత్తాయి. ఇది ఐరాస నిర్వాహకుల నిర్లక్ష్యమని రిపబ్లికన్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఎస్కలేటర్, టెలిప్రాంప్టర్ ఘటనలపై విచారణ జరిపించాలని ఐరాసను వైట్ హౌస్(White House) కోరింది. అధ్యక్షుడి విషయంలో భద్రతా ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఒక ప్రకటనలో వైట్‌హౌజ్ పేర్కొంది. టెలిప్రాంప్టర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైజ్. ఇది ప్రసంగాన్ని(చదవాల్సిన స్క్రిప్ట్) స్క్రీన్‌పై చూపిస్తుంది. దాన్ని చూసుకుంటూ వక్త (speaker) మాట్లాడగలుగుతాడు. ప్రపంచ దేశాధినేతలు, పొలిటికల్ లీడర్లు, న్యూస్ రీడర్లు.. వీటిని ఉపయోగిస్తుంటారు.ఇదీ చదవండి: భారత్-పాక్ సహా ఏడు యుద్ధాలు ఆపా -
ట్రంప్ కామెంట్లు.. మోదీ కీలక నిర్ణయం
నరేంద్ర మోదీ గొప్ప ప్రధాన మంత్రి అని, తనకు మంచి స్నేహితుడని, అయినా ఈ మధ్యకాలంలో ఆయన చేసిన పనులు ఎందుకనో నచ్చడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. ప్రధాని మోదీ తీసుకున్న ఓ కీలక నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైంది.ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ(UNGA) వార్షికోత్సవ హైలెవల్ సెషన్‌కు హాజరై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించాల్సి ఉంది. అయితే తాజాగా విడుదలైన ప్రసంగ కర్తల జాబితాలో ఆయన పేరు లేదు. ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి జైశంకర్ పేరును చేర్చారు. దీంతో మోదీ ఉద్దేశపూర్వకంగానే ఆ పర్యటన నుంచి తప్పుకున్నారనే చర్చ జోరందుకుంది.సెప్టెంబర్ 9వ తేదీన ఐరాస సాధారణ అసెంబ్లీ 80వ సెషన్ ప్రారంభం కానుంది. ‘‘ఒక్కటిగా ఉన్నప్పుడు మెరుగ్గా ఉంటుంది.. శాంతి, అభివృద్ధి & మానవ హక్కుల కోసం 80 సంవత్సరాలు.. అంతకంటే ఎక్కువ’’(Better together: 80 years and more for peace, development and human rights )అనే థీమ్‌తో ఈ ఏడాది సెషన్ జరగనుంది. ఇక.. హైలెవల్ జనరల్ డిబేట్ సెప్టెంబర్ 23-29 తేదీల మధ్య జరగనుంది. ఆనవాయితీ ప్రకారం బ్రెజిల్ ఈ డిబేట్లో మొదట ప్రసంగించనుంది. అటుపై యూఎన్జీఏ పొడియంలో ప్రపంచ దేశాధినేతలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించనున్నారు. రెండో దఫా అధ్యక్షుడు అయ్యాక ఐరాస నుంచి ఆయన ప్రసంగించడం ఇదే తొలిసారి కానుంది. జులైలో విడుదల చేసిన ప్రొవిజనల్ లిస్ట్‌లో భారత్ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ హాజరై.. సెప్టెంబర్ 26వ తేదీన ప్రసంగిస్తారని ఉంది. అయితే తాజా లిస్ట్‌లో ఆయన పేరుకు బదులు జైశంకర్ పేరు చేరింది. సెప్టెంబర్ 27వ తేదీన భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రసంగించనున్నారు. అంతకు ఒక్కరోజు ముందుగానే.. ఇజ్రాయెల్, చైనా, పాక్, బంగ్లాదేశ్ అధినేతలు ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో పర్యటించారు. అయితే.. 50 శాతం సుంకాల విధింపు తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారింది. రష్యా చమురు, ఆయుధాల కొనుగోలు నేపథ్యంతో ట్రంప్ భారత్‌పై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. తక్షణమే కొనుగోళ్లు ఆపాలంటూ అల్టిమేటం జారీ చేశారు. కానీ.. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధమని మోదీ ప్రకటించారు. తాజా షాంగై సదస్సులో పుతిన్, జిన్‌పింగ్‌తో మోదీ దోస్తీపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్, రష్యాలు అమెరికాకు దూరమై.. కుటిలమైన చైనాకు దగ్గరవుతున్నారనే ఆరోపణ గుప్పించారు. అయితే కొన్నిగంటలకే మాటమార్చా.. అలాంటిదేం లేదన్నారు. భారత్‌తో బంధం ప్రత్యేకమైందన్నారు.అదే సమయంలో.. భారత్-పాక్ ఉద్రిక్తతలను తానే ఫోన్ కాల్ చేసి చల్లార్చానంటూ ట్రంప్ ప్రకటించుకుంటూ వస్తుండగా.. భారత్ ఆ వాదనను తోసిపుచ్చుతూ వచ్చింది. ఈ వ్యవహారం భారత్‌లో రాజకీయ దుమారానికి కూడా కారణమైంది. ఈ క్రమంలోనే కెనడాలో జరిగిన జీ7 సదస్సు నుంచి ట్రంప్ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించి.. ప్రధాని మోదీ భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చింది. ఇక కొత్త రక్షణ ఒప్పందం కోసం రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికాలో పర్యటించాల్సి ఉండగా.. అది వాయిదా పడింది. ఇప్పుడు ఐరాస కార్యక్రమానికి మోదీ గైర్హాజరు అవుతుండడం ట్రంప్ వైఖరికి నిరసనగానే అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. -
ఐరాస సమావేశానికి ప్రధాని మోదీ .. ట్రంప్‌తో ముఖాముఖీ?
న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి(ఐరాస) సర్వసభ్య సమావేశం (యూఎన్జీఏ) వార్షిక ఉన్నత స్థాయి సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే అవకాశం ఉందని పీటీఐ తెలిపింది. ఇదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ సమావేశంలో ప్రసంగించనున్నారని పేర్కొంది.భారత దిగుమతులపై ట్రంప్ పరస్పర సుంకాలు విధించడంతో భారత్- అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో ప్రధాని మోదీ యూఎన్జీఏ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశం అమెరికాలోని న్యూయార్క్‌లో జరగనుంది. సెప్టెంబర్ 23 నుండి 29 వరకు జరిగే ఈ సదస్సును సాంప్రదాయకంగా బ్రెజిల్ ప్రారంభించనుంది. ఆ తరువాత యునైటెడ్ స్టేట్స్ సెషన్ ఉంటుందని సమాచారం. భారత ప్రతినిధి సెప్టెంబర్ 26న ఉదయం అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు పీటీఐ పేర్కొంది. అదే రోజున ఇజ్రాయెల్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రతినిధులు కూడా ప్రసంగించే అవకాశం ఉంది.గత ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికాలోని వైట్ హౌస్‌లో ట్రంప్‌తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం భారత్‌తో వాణిజ్య చర్చలు నడుస్తున్న తరుణంలోనే ట్రంప్ భారతదేశంపై 25 శాతం అదనపు సుంకం విధించారు. దీంతో మొత్తం విధించిన సుంకం 50 శాతంగా మారింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ చర్యను అన్యాయమైనదిగా పేర్కొంది. కాగా సెప్టెంబర్ 26న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోదీ.. అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి భేటీ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సహా పలు దేశాధినేతలతో మోదీ భేటీ కానున్నారని తెలుస్తోంది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై వివాదం నెలకొన్న ప్రస్తుత తరుణంలో ప్రధాని మోదీ , అధ్యక్షుడు ట్రంప్ భేటీ కానుండటం ఆసక్తికరంగా మారింది. -
విజయసాయి రెడ్డికి అరుదైన అవకాశం...
-
విజయసాయిరెడ్డికి అరుదైన అవకాశం
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి అరుదైన అవకాశం దక్కింది. ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ (UNGA) 29వ సెషన్‌కు వెళ్లే బృందంలో ఆయనకు స్థానం దక్కింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలియజేశారాయన.న్యూయార్క్(అమెరికా)లోని యూఎన్జీఏ 29వ సెషన్లో పాల్గొనబోయే బృందంలో ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నా. ఈ అవకాశం దక్కడం పట్ల ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.ఐరాస లాంటి గౌరవప్రదమైన వేదికపై దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడంతో పాటు ప్రపంచ ఆసక్తులలో దేశ భాగస్వామ్యాలను మరింతంగా పెంచే అర్థవంతమైన చర్చల్లో పాల్గొనేందుకు ఎదురు చూస్తున్నాం అని ట్వీట్ చేశారాయన. నవంబర్ 18 నుంచి 23వ తేదీ దాకా ఈ సెషన్ జరగనుంది. -
థాంక్స్ టు ఇండియా
ఐక్యరాజ్యసమితి: కరోనాపై పోరాటంలో సరైన సమయంలో కోవిడ్ వ్యాక్సిన్ డోసుల్ని ప్రపంచ దేశాలకు పంపిణీ చేసినందుకు గాను ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి వేదికగా భారత్‌కు వివిధ దేశాలు కృతజ్ఞతలు తెలిపాయి. సెప్టెంబర్ 21–27 వరకు జరిగిన సదస్సులో వివిధ దేశాధినేతలు భారత్‌కు ధన్యవాదాలు చెప్పారు. టీకా డోసులు ఎగుమతితో పాటు, ఇతర అత్యవసర మందులు కూడా పంపిణీ చేసినందుకు భారత్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు. నైజీరియా, ఘనా, ఫిజి, డొమినికా, నేపాల్, భూటాన్ తదితర దేశాలకు చెందిన నాయకులు భారత్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవాగ్జ్ కార్యక్రమంలో భాగంగా భారత్ 100కిపైగా దేశాలకు 6.6 కోట్ల టీకా డోసుల్ని ఎగుమతి చేసింది. ఏప్రిల్‌లో దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చడంతో ఎగుమతుల్ని నిలిపి వేసింది. మళ్లీ అక్టోబర్ నుంచి ఎగుమతుల్ని ప్రారం భిస్తామని క్వాడ్ సదస్సు వేదికగా తెలిపింది. భారత్ సహకారం లేనిదే ప్రపంచంలో ఎన్నో దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం సక్రమంగా జరిగేది కాదని నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారి ప్రశంసిం చారు. సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను యూకే గుర్తించకపోవడాన్ని కూడా పలు దేశాధినేతలు తప్పు పట్టారు. మరోవైపు భారత్ టీకా ఎగుమతుల్ని పునరుద్ధరించాలన్న నిర్ణయాన్ని అమెరికాలో రిపబ్లికన్ పార్టీ సెనెటర్ స్వాగతించారు. అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌కి తగ్గట్టుగా ఉత్పత్తిని పెంచాలని సెనేటర్ జిర్ రిస్చ్ చెప్పారు. -
భారత్ అభివృద్ధి చెందితే.. ప్రపంచం కూడా వృద్ధి చెందుతుంది: మోదీ
న్యూయార్క్: న్యూయార్క్ వేదికగా శనివారం సాయంత్రం జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ...భారత్ వృద్ధి చెందితే, ప్రపంచం కూడా వృద్ధి చెందుతుందనే విషయాన్ని నొక్కి చెప్పారు. భారత్‌లో ప్రవేశపెట్టిన సంస్కరణలు ప్రపంచాన్నే మారుస్తున్నాయని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. అన్ని వర్గాలకు సమాన అభివృద్ధి అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ మా నినాదమని చెప్పారు. వ్యక్తి ప్రయోజనం కంటే సమాజ ప్రయోజనమే ముఖ్యమని, దేశంలో 36 కోట్ల మందికి బీమా సౌకర్యం కల్పించామన్నారు. మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఏడాది కాలంగా ప్రపంచం సంక్షోభంలో చిక్కుకుంది మా దేశంలో వైవిధ్యమే ప్రజాస్వామ్యాన్ని బలంగా మార్చింది వందేళ్లలో ఎప్పుడూ చూడని కరోనా కష్టకాలాన్ని చూశాం గత ఏడేళ్లలో 43 కోట్ల మందిని బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించాం కోట్ల మందికి సురక్షిత ఆరోగ్య సదుపాయాలు కల్పించాం కలుషిత నీరు ప్రపంచం మొత్తానికి పెద్ద సమస్య 17 కోట్ల మందికి సురక్షిత మంచినీటిని అందించగలిగాం కరోనా సమయంలో 3 కోట్ల మందికి ఇళ్లు కట్టించాం సమ్మిళిత అభివృద్ధి వైపు భారత్ నడుస్తోంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయగలిగాం ముక్కుద్వారా ఇచ్చే టీకాను త్వరలో తీసుకొస్తాం ఎమ్ఆర్ఎన్ఏ టీకా తయారీ చివరి దశలో ఉంది 12 ఏళ్లు దాటిన వారికి ఇచ్చే డీఎన్ఏ టీకాను తయారు చేస్తున్నాం వందేళ్లలో చూడని విపత్తును కరోనాతో చూశాం ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలన్నది భారత్ విధానం భారత్‌లో వేల ఏళ్లుగా ప్రజాస్వామ్యం కొనసాగుతోంది ప్రజాస్వామ్య పాలనలో అన్ని లక్ష్యాలను చేరుకుంటున్నాం భారత్ ప్రజాస్వామ్య ప్రకాశానికి ఒక ఉదాహరణ చదవండి: Immediately vacate Pak: పాకిస్తాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన స్నేహ దూబే.. అసలు ఎవరామే! -
పాక్‌కు భారత్ దీటైన కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య తీర్పుపై పాకిస్తాన్ చేసిన ప్రకటనను భారత్ తీవ్రస్దాయిలో ఎండగట్టింది. పాక్ ప్రభుత్వం తన మనుగడ కోసం అసత్యాలను ప్రచారంలో పెడుతోందని మండిపడింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి భేటీలో ఐరాసలో భారత ప్రతినిధి విమ్రాష్ ఆర్యన్ మాట్లాడుతూ మైనారిటీల మానవ హక్కులకు సంబంధించి చర్చించే కీలక వేదికపై పాకిస్తాన్ దుష్ర్పచారం సాగిస్తోందని, భారత్‌లో మైనారిటీ హక్కులపై పాక్ మొసలి కన్నీరు కారుస్తోందని దుయ్యబట్టారు. పొరుగు దేశంలో మైనారిటీల హక్కుల గురించి ఐరాస వేదికను తప్పుదారి పట్టించే బదులు పాకిస్తాన్ తన దేశంలో మైనారిటీల అభ్యున్నతికి పాటుపడాలని సూచించారు. తమ దేశంలో మైనారిటీలు, సొంత పౌరులు నిజమైన ప్రజాస్వామ్యాన్ని అనుభవించని క్రమంలో పాకిస్తాన్ నుంచి పాఠాలు నేర్చుకునే స్థితిలో ప్రపంచ దేశాలు లేవని ధ్వజమెత్తారు. -
భారత్‌పై గౌరవం పెరిగింది
న్యూఢిల్లీ: గత ఐదేళ్లలో ప్రపంచం దృష్టిలో భారత్ గౌరవం మరింతగా పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. దాదాపు వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని శనివారం ప్రధాని భారత్ తిరిగివచ్చారు. విమానాశ్రయానికి భారీగా తరలివచి్చన బీజేపీ కార్యకర్తలు మోదీకి ఘనస్వాగతం పలికారు. వారిని ఉద్దేశించి విమానాశ్రయం వెలుపల మోదీ కాసేపు మాట్లాడారు. ‘2014లోనూ అమెరికా వెళ్లాను. ఐరాస సమావేశాల్లో పాల్గొన్నాను. ఇప్పుడు కూడా వెళ్లాను. ఈ ఐదేళ్లలో భారత్ పట్ల ప్రపంచ దేశాల దృక్పథంలో భారీ మార్పు చూశాను. భారత్ అంటే ఆసక్తి, గౌరవం మరింత పెరిగాయి’ అన్నారు. హ్యూస్టన్‌లో అట్టహాసంగా జరిగిన హౌడీ మోదీ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పలువురు డెమొక్రాట్, రిపబ్లికన్ పారీ్టల నేతలు హాజరుకావడాన్ని ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా ప్రవాస భారతీయుల ఉత్సాహం తననెంతో ఆకర్షించిందన్నారు. మూడేళ్ల క్రితం పాక్ ఆక్రమిత కశీ్మర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ను కూడా మోదీ గుర్తు చేసుకున్నారు. ‘మూడేళ్ల క్రితం నాటి ఈ రోజును మర్చిపోలేను. ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఆ రాత్రంతా నిద్రపోలేదు’ అన్నారు. భారతీయులను గర్వపడేలా చేసిన భారతీయ సైనికుల సాహసానికి గుర్తుగా ఆ రోజు నిలిచిపోతుందన్నారు. భారత్‌కు బయల్దేరే ముందు అమెరికన్లకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ‘మీరిచ్చిన ఘన స్వాగతం, ప్రేమ, ఆతిథ్యాలను మర్చిపోలేను’ అన్నారు. తాను పాల్గొన్న వివిధ కార్యక్రమాలు భారత్ పురోభివృద్ధికి తోడ్పడతాయని ఆశిస్తున్నానన్నారు. అమెరికా పర్యటనలో కొన్ని విశేషాలు.. ►ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో (యూఎన్జీఏ) కశ్మీర్ అంశంపై మాట్లాడేం దుకు మోదీ నిరాకరించారు. ఈ సమస్య అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించేది కాదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. భారత్ అభివృద్ధి గురించే మోదీ ప్రస్తావించారు. ►ప్రపంచ దేశాలు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని పిలుపునిచ్చారే తప్ప పాక్ గురించికానీ, కశ్మీర్ గురించి కానీ యూఎన్జీఏ సదస్సులో ప్రస్తావించలేదు. ►పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య ప్రపంచం, ఉగ్రవాద నిర్మూలన వంటి అంశాలనే ప్రస్తావించి యూఎన్జీఏ సదస్సులో మోదీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారారు. ►పసిఫిక్ ఐలాండ్ దేశాలు, కరేబియన్ దేశాలు న్యూజిలాండ్, ఇరాన్ వంటి ఎన్నో దేశాలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ►హ్యూస్టన్‌లో గ్లోబల్ కంపెనీల సీఈఓలను కలుసుకొని భారత్‌కు పెట్టుబడులు వచ్చేలా మార్గాలు వేశారు. 500 కంపెనీలు భారత్‌లో పెట్టుబడులకు సుముఖత వ్యక్తం చేశాయి. ►హ్యూస్టన్‌లో టెల్లూరియన్, పెట్రోనెట్ మధ్య కుదిరిన చారిత్రక ఇంధన ఒప్పందంతో భారతీయులకు భారీగా ఉద్యోగాలు కల్పించే అవకాశం కలిగింది. ►హౌడీ–మోదీ’ కార్యక్రమానికి అధ్యక్షుడు ట్రంప్ హాజరుకావడం ద్వారా రెండు దేశాల మధ్య మైత్రి మరింత పటిష్టమైంది. -
వారంలో రెండుసార్లు దిగ్గజ నేతల భేటీ
వాషింగ్టన్ : ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రానున్న వారంలో రెండు సార్లు భేటీ కానున్నారని అమెరికాలో భారత రాయబారి నిర్ధారించారు. భారత్-అమెరికా వ్యూహాత్మక సంబంధాలు ఈ శతాబ్ధంలోనే వినూత్న భాగస్వామ్యం దిశగా సాగనున్నాయని చెప్పారు. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సదస్సుకు ప్రధాని మోదీ వచ్చే వారం రానున్న క్రమంలో అగ్రనేతలు ఇరువురూ రెండు సార్లు సమావేశం కానున్నారని భారత రాయబారి హర్ష వర్ధన్ ష్రింగ్లా పేర్కొన్నారు. మోదీ, ట్రంప్ ఈనెల 22న భేటీ అవుతారని, హోస్టన్‌లో జరిగే భారతీయుల సమ్మేళనానికి మోదీతో కలిసి ట్రంప్ పాల్గొంటారని, న్యూయార్క్‌లో జరిగే ఐరాస సమావేశాల నేపథ్యంలోనూ వారిద్దరి మధ్య ముఖాముఖి ఉంటుందని ఆయన వెల్లడించారు. కాగా జపాన్‌లో జీ20, ఫ్రాన్స్‌లో జీ 7 సదస్సుల సందర్భంగా అగ్రనేతలు ఇటీవల రెండు సార్లు భేటీ అయిన సంగతి తెలిసిందే. దీంతో కొద్ది నెలల వ్యవధిలోనే ఇరు నేతల మధ్య నాలుగు సమావేశాలు సాగినట్టవుతుందని ష్రింగ్లా వ్యాఖ్యానించారు. ఇక శనివారం హోస్టన్కు చేరుకునే ప్రధాని మోదీ మరుసటి రోజు హోస్టన్‌లో 50,000 మందికి పైగా ఇండో అమెరికన్లు పాల్గొనే హౌదీ మోదీ కార్యక్రమంలో పాల్గొంటారు. -
ఆ వేదికపై మోదీ వర్సెస్ ఇమ్రాన్..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్లు ఈనెల 27న ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం అనంతరం ఇమ్రాన్ ఖాన్ ఇదే వేదిక నుంచి ప్రసంగిస్తారని భావిస్తున్నారు. ఇరు నేతల ప్రసంగ సమయాలను ఇంకా ఖరారు చేయకపోయినా ప్రధాని మోదీ ప్రసంగం ముగిసిన కొద్ది గంటల్లోనే పాక్ ప్రధాని మాట్లాడతారని తెలిసింది. జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను భారత్ రద్దు చేసిన నేపథ్యంలో భారత్, పాక్ ప్రధానులు ఒకే వేదికను పంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పాకిస్తాన్ అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టేందుకు చేపట్టిన చర్యలు విఫలమైన సంగతి తెలిసిందే. పాక్ తీరును రష్యా, అమెరికా, బ్రిటన్ సహా కీలక దేశాలు తప్పుపట్టాయి. ఐక్యరాజ్యసమితిలోనూ కశ్మీర్ పరిణామాలపై పాక్ గగ్గోలుపెట్టినా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి నేతృత్వం వహిస్తున్న పోలండ్ సహా అన్ని దేశాలూ భారత్ నిర్ణయానికి బాసటగా నిలిచాయి. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు వ్యవహారం భారత్ అంతర్గత అంశమని అమెరికా, రష్యా స్పష్టం చేశాయి. -
ఇంతకు మన ‘గ్లోబల్ లీడర్’ ఎక్కడ ప్రసంగిస్తున్నట్టు?
సాక్షి, అమరావతి : ఐక్యరాజ్యసమతి జనరల్ అసెంబ్లీ (యూఎన్జీఏ) సమావేశాల సందర్భంగా ఐరాస అనుబంధ సంస్థ నిర్వహిస్తున్న ఓ సదస్సులో వ్యవసాయం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగించబోతున్నారంటూ టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా ఊదరగొడుతున్న ప్రచారంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పలు ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఐరాస సార్వత్రిక అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిర్వహిస్తున్న 313 అనుబంధ ఈవెంట్లలో చంద్రబాబు ప్రసంగించబోయే ఈవెంట్ లేదని, చంద్రబాబు ప్రసంగించబోయే యూఎన్ఈపీ ఈవెంట్‌ను యూఎన్ఈపీ, బీఎన్పీ బరిబాస్, వరల్డ్ ఆగ్రోఫారెస్ట్రీ నిర్వహిస్తాయని పేర్కొన్నప్పటికీ.. ఐరాస అనుబంధ ఈవెంట్స్ జాబితాలో ఇది నమోదు కాలేదని ఆయన ట్విటర్లో వెల్లడించారు. ఒకవేళ ఉంటే టీడీపీ లింక్‌ను షేర్ చేయాలని అన్నారు. ఈ నెల 24న ‘సుస్థిర వ్యవసాయాభివృద్ధిలో ప్రపంచంలో ఎదురువుతున్న సవాళ్లు’ అనే అంశంపై యూఎన్ఈపీ ఏర్పాటుచేసిన సమావేశంలో చంద్రబాబు ప్రసంగిస్తారని ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసం చంద్రబాబు అమెరికాకు బయలుదేరి వెళ్లారు. అయితే, సదరు సదస్సు ఐరాస్ వెబ్సైట్లో నమోదైన 313 ఈవెంట్లలో లేదని, కావాలంటే వెతుక్కొని చూడవచ్చునని, ఇంతకు ‘మన గ్లోబల్ లీడర్’ చంద్రబాబు ఏ సదస్సులో మాట్లాడుతున్నారని జీవీఎల్ ప్రశ్నించారు. The so-called UN event where @ncbn is speaking is not listed as an event in even 313 UNGA side events. The UNEP 'invite' says UNEP,BNP Paribas,World Agroforestry are organising it but curiously is NOT listed on their events list. @JaiTDP must share links.https://t.co/cZDcwp8hCG — GVL Narasimha Rao (@GVLNRAO) 24 September 2018 The so-called UNEP event "Financing Sustainable Agriculture: Global Problems & Challenges" on the sidelines of UN General Assembly is NOT even listed in 313 events on UNGA website. Check yourself at this link. Where is our 'Global Leader' @ncbn speaking? https://t.co/XOTn4lc2IW — GVL Narasimha Rao (@GVLNRAO) 24 September 2018 -
స్నేహ హస్తం చాస్తే.. ఉగ్రదాడులా?
-
స్నేహ హస్తం చాస్తే.. ఉగ్రదాడులా?
పాక్ తీరును ఐరాసలో ఎండగట్టిన సుష్మాస్వరాజ్ - బలూచిస్తాన్ ప్రజలపై పాశవిక అణచివేత - ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వటమే కొన్ని దేశాల చిరునామా - ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగం ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్‌తో స్నేహం కోసం ప్రయత్నిస్తే.. దానికి బదులుగా భారత్‌కు ఉగ్రదాడులు లభించాయని ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ తూర్పారబట్టింది. హక్కుల ఉల్లంఘనలపై ఇతరులను నిందించే వాళ్లు ముందుగా ఆత్మపరిశీలన చేసుకోవాలని పాక్‌కు హితవుపలికింది. బలూచిస్తాన్‌లో పాక్ అత్యంత పాశవికమైన అణచివేతను సాగిస్తోందంటూ.. ఐరాస సర్వసభ్య సభ సమావేశంలో తొలిసారి ఆ దేశాన్ని భారత్ అభిశంసించింది. ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న దేశాలను ఏకాకులను చేయాలని ప్రపంచానికి పిలుపునిచ్చింది. సమితి 71వ సర్వసభ్య సమావేశంలో సోమవారం భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రసంగించారు. వారం కిందట ఇదే వేదిక నుంచి పాక్ ప్రధాని షరీఫ్ భారత్‌పై చేసిన విమర్శలను తిప్పికొట్టారు. ‘కొన్ని దేశాలున్నాయి. ఐరాస ప్రకటించిన ఉగ్రవాదులు అక్కడ స్వేచ్ఛగా విహరిస్తుంటారు. విద్వేష ప్రబోధాలను ఇస్తూ ఉంటారు.. వారికి చట్టం, శిక్షలు వర్తించవు. అటువంటి దేశాలు అవి ఆశ్రయం ఇచ్చిన ఉగ్రవాదులు ఎంత నేరస్తులో అంతే నేరస్త దేశాలవుతాయి. అలాంటి దేశాలకు ప్రపంచ దేశాల కమిటీలో చోటు ఉండరాదు’ అంటూ పాక్‌పై పరోక్షంగా విమర్శలు ఎక్కుపెడుతూ.. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, జామత్ ఉద్-దావా అధినేతసయీద్ విషయాన్ని పేరు చెప్పకుండా సుష్మా ప్రస్తావించారు. ‘మన మధ్య కొన్ని దేశాలు ఉన్నాయి. అవి ఇంకా ఉగ్రవాద భాషను మాట్లాడుతుంటాయి, ఉగ్రవాదాన్ని పోషిస్తుంటాయి, విస్తరిస్తుంటాయి, ఎగుమతి చేస్తుంటాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వటమే వాటి చిరునామాగా మారింది. అటువంటి దేశాలను మనం గుర్తించితీరాలి. వాటిని ఏకాకులను చేయాలి’ అని అన్నారు. కశ్మీర్‌పై కలలు మానండి... చర్చలకు భారత్ తమకు ఆమోదనీయం కాని ముందస్తు షరతులు విధించిందన్న పాక్ వాదనను తిప్పికొడుతూ.. షరతులు కాకుండా స్నేహం ప్రాతిపదికన పాక్‌తో సమస్యలను పరిష్కరించటం కోసం ముందడుగు వేసినందుకుభారత్‌కు పఠాన్‌కోట్, ఉడీ దాడులు ప్రతిఫలంగా దక్కాయని సుష్మా పేర్కొన్నారు. ఇటువంటి దాడుల ద్వారా కశ్మీర్‌ను పొందగలమన్న కలను పాకిస్తాన్ విడనాడాలని ఆమె సూచించారు. వారి ప్రణాళికలు సఫలం కావని.. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, అది అలాగే ఉండిపోతుందని ఉద్ఘాటించారు. పాక్ ప్రమేయానికి సజీవ సాక్ష్యం... ‘మా ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించేముందు మేం షరతులు పెట్టామా? హార్ట్ ఆఫ్ ఏసియా సదస్సు కోసం నేను ఇస్లామాబాద్ వెళ్లి, సమగ్ర ద్వైపాక్షిక చర్చలను ప్రారంభించడానికి అంగీకరించినపుడు షరతులు పెట్టామా? మోదీ కాబూల్ నుండి లాహోర్‌కు ప్రయాణించినపుడు మేం ఏమైనా ముందస్తు షరతులు విధించామా?’ అని ప్రశ్నించారు. గత కొన్నేళ్లలో పాకిస్తాన్‌తో అనూహ్యమైన స్నేహపూర్వక విధానాన్ని భారత్ ప్రయత్నించిందని.. కానీ దీనికి ప్రతిఫలంగా భారత్‌కు పఠాన్‌కోట్, ఉడీలలో ఉగ్రదాడులు లభించాయని పేర్కొన్నారు. ‘బహదూర్ అలీ మా కస్టడీలో ఉన్న ఉగ్రవాది. సీమాంతర ఉగ్రవాదంలో పాక్ ప్రమేయానికి అతడి వాంగ్మూలం సజీవ సాక్ష్యం’ అని తెలిపారు. ఉగ్రవాదమనేది మానవాళిపైనే నేరమని, దీన్ని ఎదుర్కోడానికి దేశాలు సమర్థ వ్యూహాన్ని రచించాలన్నారు. ఐరాసలో సుష్మ సమర్థంగా, ప్రసంగించారని మోదీ అభినందించారు. ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది... జమ్మూకశ్మీర్‌లో భారత్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందంటూ పాక్ ప్రధాని ఆరోపణలను సుష్మ తిప్పికొడుతూ.. ‘మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారంటూ ఇతరులపై ఆరోపణలు చేసేవారు.. బలూచిస్తాన్ సహా తమ సొంత దేశంలో తాము ఎంతటి దురాగతాలకు పాల్పడుతున్నామనే దానిపై ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది. బలూచ్ ప్రజలపై జరుగుతున్న క్రూరత్వం రాజ్య అణచివేతలో అత్యంత దారుణ రూపం’ అని మండిపడ్డారు. -
‘ఇంతకన్నా రుజువు కావాలా?’
-
అన్నీ తెలిసిన వాణ్ని నమ్మితే దుస్థితే!
ఇస్లామాబాద్: ఉగ్రవాదం, కశ్మీర్ లే ప్రధానాంశాలుగా పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో చేసిన ప్రసంగంపై విపక్షాలు మండిపడుతున్నాయి. షరీఫ్ అమలుచేస్తోన్న అస్పష్ట విదేశాంగ విధానంతో పాక్ అంతర్జాతీయ సమాజంలో ఏకాకిగా మారుతున్నదని పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత సయీద్ ఖుర్షీద్ షా అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదలచేశారు. కీలకమైన రక్షణ, విదేశాంగ వ్యవహారాల్లో స్పష్టమైన విధానం లేకుండా ఎప్పటికప్పుడు అన్నట్లుగా వ్యవహరించడం దారుణమని షా విమర్శించారు. విదేశాంగ శాఖ మంత్రి సర్తాజ్ అజీజ్ కు షరీఫ్ ఎనలేని ప్రాధాన్యం ఇస్తుండటాన్ని ప్రస్తావిస్తూ అన్నీ తెలిసిన వాడిని (Mr know all) నమ్ముకుంటే ప్రధానికి దుస్థితి తప్పదని వ్యాఖ్యానించారు. (కశ్మీర్‌పై మళ్లీ నోరుపారేసుకున్న షరీఫ్!) పాకిస్థాన్ ను ఉగ్రవాద దేశంగా గుర్తించాలంటూ అమెరికన్ కాంగ్రెస్ లో చర్చజరగడానికి కారణం షరీఫ్ వైఫల్యమేనని, భారత్ కారణంగా పాకిస్థాన్ ఎదుర్కొటున్న సమస్యలను ఐరాసాలో ప్రస్తావించడంలో ఆయన విఫలం అయ్యారని ఖుర్షీద్ షా పేర్కొన్నారు. ముఖ్యమైన అంశాల్లో ప్రతిపక్షాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోవడాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని అన్నారు. -
పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగిన భారత్
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌పై భారత్ నిప్పులు చెరిగింది. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కశ్మీర్ అంశంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో భారత్ తన వాదనను ఇలా వినిపించింది.. 'ప్రపంచంలోనే తీవ్రవాదానికి కేంద్రబిందువుగా మారిన పాకిస్తాన్ మానవ హక్కుల గురించి ప్రస్తావించడం హాస్యాస్పదంగా ఉంది. అంతర్జాతీయంగా అందుతున్న సహాయసహకారాలతో తీవ్రవాదసంస్థలకు శిక్షణనిచ్చి, పెంచి పోషిస్తూ పొరుగు దేశాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలను కొనసాగిస్తోంది. పాకిస్తాన్ అండదండలతోనే తీవ్రవాద సంస్థలను నడిపించే ఉగ్రనాయకులు స్వేచ్ఛగా అక్కడ బహిరంగంగా తిరగగలుగుతున్నారు. తీవ్రవాది, హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వానీని ఐక్యరాజ్యసమితిలోనే అమరవీరుడిగా నవాజ్ షరీఫ్ కీర్తించడమే ఇందుకు నిదర్శనం. పాక్ అణ్వాయుధ వ్యాప్తికి కృషి చేస్తూ..శాంతి సామరస్యాల గురించి మాట్లాడుతోంది. భారత్‌తోనే కాక అంతార్జాతీయ సమాజానికి టెర్రరిజమ్‌పై పాక్ తప్పుడు వాగ్దానాలు చేసి తుంగలో తొక్కుతోంది. ఉన్నత విద్యకు నిలయంగా నిలిచిన ఒకప్పటి చారిత్రక తక్షశిలా నగరం ప్రస్తుతం తీవ్రవాద సంస్థలకు అడ్డాగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాద భావజాలమున్న యువతను ఆకర్షిస్తోంది. దాని విష పాఠ్యాంశాలు ప్రపంచ వ్యాప్తమువుతున్నాయి. భారత్‌లో తీవ్రవాదాన్ని వ్యాప్తి చేయనియం. కశ్మీర్‌లోని తీవ్రవాద చర్యల నుంచి భారత పౌరులను రక్షించడానికి భారత్ సిద్ధం ఉంది' అని తెలిపింది. -
ఇండో-పాక్ వార్ @ అమెరికా
న్యూఢిల్లీ/వాషింగ్టన్: అంతర్జాతీయ సమాజంలో దాయదిని ఏకాకినిచేసి ఏకిపారేయాలనుకుంటోన్న భారత్, పాకిస్థాన్ లు అమెరికా గడ్డపై తలపడనున్నాయి. బలూచిస్థాన్ పై భారత ప్రకటన వెలువడినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్రతరమైన ఉద్రిక్తత.. యూరి ఉగ్రదాడితో తారాస్థాయికి చేరింది. అదే వేడిలో భారత్, పాక్ లు బుధవారం నుంచి న్యూయార్క్ లో ప్రారంభంకానున్న ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో దౌత్యయుద్ధాన్ని చేయనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ గౌర్హాజరు కారణంగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ భారత బృందానికి సారథ్యం వహించనున్నారు. పాకిస్థాన్ తరఫున ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ రంగంలోకి దిగుతున్నారు. నవాజ్ 20న(బుధవారం), సుష్మా 26న(సోమవారం) ఐరాస అసెంబ్లీ సమావేశంలో మాట్లాడనున్నారు. ఎవరెవరు ఎలాంటి ఎత్తుగడలతో యుద్ధం చేయనున్నారంటే.. భారత్: కశ్మీర్ లోని యూరి సైనిక స్థావరంపై ఆదివారం (సెప్టెంబర్ 18న) జరిగిన ఉగ్రదాడి ముమ్మాటికి పాక్ ప్రభుత్వ, సైనిక ప్రోద్బలంతోనే జరిగిందని, అందుకు తగిన ఆధారాలను ప్రపంచం ముందుంచనుంది. యూరి దాడి ఒక్కటేకాదు గతంలో పఠాన్ కోట్, అంతకు ముందు ముంబై తదితర కీలక దాడుల్లో పాక్ ప్రమేయం ఉందనే విషయాన్ని బలంగా వాదించనుంది. అదేక్రమంలో బలూచిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో కొనసాగుతోన్న మానవ హక్కుల హననాన్ని భారత్ హైలైట్ చేయనుంది. ఏ కోణంలో చూసినా పాకిస్థాన్ ఉగ్రవాదులకు స్థావరంగా, ఉగ్రకార్యకలాపాల అడ్డాగా ఉన్నందున దానిని ఉగ్రవాద దేశంగా గుర్తించి, అంతర్జాతీయ సమాజం నుంచి వెలి వేయాలని భారత్ వాదించనుంది. పాకిస్థాన్: కశ్మీర్ లో అశాంతి అంశాన్ని హైటైట్ చేయడం ద్వారా భారత్ ను ఇరుకునపెట్టాలన్నది పాక్ ప్రధాన లక్ష్యం. ఉగ్రదాడుల విషయంలో భారత్ చెబుతున్నవన్నీ కట్టుకథలేనని పాకిస్థాన్ మొదటి నుంచి వాదిస్తోంది. బుధవారం నాటి నవాజ్ షరీఫ్ ప్రసంగంలో.. ఇటీవల కశ్మీర్ ఆందోళనల్లో చనిపోయిన(80 మంది)వారి గురించిన ప్రస్తావనతోపాటు కశ్మీర్ స్వయంప్రతిపత్తిపై గతంలో ఐరాసలో చేసిన తీర్మానాల అమలుకు పట్టుపట్టే అవకాశం ఉంది. అఫ్ఘానిస్థాన్: మారిన పరిస్థితుల దృష్ట్యా భారత్ కు దగ్గరైన అఫ్ఘానిస్థాన్ ఈసారి ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో భారత్ కు వెన్నుదన్నుగా నిలవనుంది. ఆ దేశాధ్యక్షుడు హమీద్ కర్జాయ్.. పాక్ పేరును ప్రస్తావించకుండా అది చేసేస్తోన్న పనులను ఎండగట్టనున్నారు. సార్క్ బహిష్కరణ: దక్షిణ ఆసియా దేశాల కూటమి(సార్క్) నుంచి వైదొలగాలని భారత్ ప్రాథమికంగా నిర్ణయించుకుంది. భారత్ నిర్ణయాన్ని సమర్థిస్తూ బంగ్లాదేశ్,అఫ్ఘానిస్థాన్ లు సైతం సార్క్ నుంచి వెలుపలికి రానున్నట్లు ఈ దేశ ప్రతినిధులు ప్రకటించారు. పాక్‌తో పోరుకు భారత్ వ్యూహమిదే.. ఆర్థికపమైన అంశాలు: ప్రస్తుతం భారత్, పాక్ ల మధ్య కొనసాగుతోన్న వ్యాపార, వాణిజ్యాలన్నింటినీ రద్దుచేసుకోవడం, పాక్ సరుకుల దిగుమతిని ఆపేయడం, పాక్ తో వ్యాపార సంబంధాలు రద్దుచేసుకునేలా ఇతర దేశాలపై ఒత్తిడి పెంచడం లాంటి చర్యలను భారత్ తన వ్యూహంలో భాగంగా అమలుచేయనున్నట్లు తెలిసింది. సైనిక పరంగా: ఇన్నాళ్ల వ్యవహార శైలికి భిన్నంగా భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్ లో పరిమిత యుద్ధం చేయనుంది. పీఓకేలోని ఉగ్రస్థావరాలపై తరచూ దాడులు చేయడంతోపాటు చొరబాట్లను ప్రోత్సహిస్తోన్న పాక్ ఆర్మీ స్థావరాలను కూడా టార్గెట్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అదే సమయంలో సరిహద్దుల్లో గస్తీని ముమ్మరం చేయనున్నారు. దౌత్యపరమైన వ్యూహం: పాకిస్థాన్ తో సంబంధాలన్నింటినీ తెంచుకోవడంతోపాటు ఆ దేశంలో రాయబారిని వెనక్కి పిలిపించాలని భారత్ భావిస్తోంది. దీనితోపాటు యూరి సహా ఇతర ఉగ్రదాడుల్లో పాక్ ప్రమేయానికి సంబంధిచిన అన్ని ఆధారాలను సమర్పించి, దర్యాప్తునకు ప్రేరేపించేలా దాయాదిపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. -
‘ఓం’ ఉచ్చరించినా వివాదమే!
ప్రధాని మోదీ వ్యాఖ్య న్యూఢిల్లీ: దేశంలో ‘ఓం’ ఉచ్చారణతో వివాదాలు తలెత్తగలవని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఆలిండియా రేడియో రూపొందించిన తులసీదాస్ రామచరితమానస్ ఆడియో సీడీలను ఆయన సోమవారం ఢిల్లీలో ఆవిష్కరిస్తూ.. ఈ పురాణంపైనా వివాదం వస్తుందేమోనన్నారు. ‘మన దేశంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. సైద్ధాంతిక ప్రాతిపదికపైనా ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా ‘ఓం’ అంటే.. ‘ఓం’ ఎలా అంటారని వారం రోజుల పాటు వివాదం రేగుతుంది’ అని అన్నారు. ‘ఇటువంటి దేశంలో రామచరితమానస్‌ను ఎవరూ ప్రశ్నించలేదు. అది ఇప్పుడూ నడుస్తోంది. ఈ రోజు తర్వాత దీనిపై ఎవరో ఒకరి దృష్టిపడి.. తుపాను సృష్టిస్తారేమో.. నాకు తెలియదు’ అని పేర్కొన్నారు. భారత దేశ సారాంశాన్ని అద్భుతంగా తెలిపే ‘రామచరితమానస్’ గొప్ప ఇతిహాసమని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో హిందూ మతానికి సంబంధించిన ‘ఓం’ ఉచ్చరించాల్సి వస్తుంది కాబట్టి తాము పాల్గొనలేమని ముస్లిం సంస్థలు పేర్కొనటం, దానిపై వివాదం తలెత్తటం తెలిసిందే. కాగా, రామచరితమానస్ ఆడియో సీడీలను తీసుకొచ్చిన ఆలిండియా రేడియో కృషి ని మెదీ కొనియాడారు. దీన్ని సంగీత సాధనతోకాకుండా సంస్కృతి, సంస్కార విలువలతో గొప్పగా తీసుకొచ్చారన్నారు. 20-22 ఏళ్లపాటు రికార్డింగ్ చేశారంటే దీని కోసం ఎంతగా శ్రమించారో అర్థమవుతుందని అన్నారు. ఆకాశవాణి రికార్డు చేసిన రామచరితమానస్‌ను 1980 నుంచి చాలా ఏళ్లపాటు భోపాల్‌కు చెందిన ప్రముఖ గాయకులు ఆలపించారు. ‘మండలి’లో సంస్కరణలు తక్షణావసరం ఈ నెల 25న జరిగే ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ (యూఎన్జీఏ) 70వ సమావేశంలో.. పెండింగ్‌లో ఉన్న భద్రతామండలి సంస్కరణలు సహా పలు అపరిష్కృత అంశాలపై నిర్ణయాత్మక ఫలితాలు రావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యూఎన్జీఏ 70వ సమావేశానికి అధ్యక్షుడిగా ఎన్నికైన మెజెన్ లికెటాఫ్ట్తో మోదీ సోమవారం భేటీ అయ్యారు. భద్రతామండలిలో సంస్కరణలు తక్షణావసరమని మోజెన్తో చెప్పారు. -
ఐక్యరాజ్య సమితి ప్రతిపాదనను వ్యతిరేకించిన భారత్
ఐక్యరాజ్య సమతి: మరణశిక్షపై మారటోరియం విధించాలన్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ తీర్మానం ముసాయిదాను భారత్ వ్యతిరేకించింది. ముసాయిదాకు వ్యతిరేకంగా భారత్ ఓటువేసింది. సొంత న్యాయవ్యవస్థపై నిర్ణయం, నేరస్థులకు శిక్ష వంటి అంశాలపై ఆయా దేశాల సార్వభౌమత్వ హక్కును గుర్తించడంలో ముసాయిదా విఫలమైనందున దానినివ్యతిరేకించినట్లు భారత్ పేర్కొంది. మరణశిక్షను పూర్తిగా రద్దుచేయాలన్న వైఖరితోనే ఈ ముసాయిదాను తెచ్చారని ఐక్యరాజ్య సమితిలో భారత దౌత్యప్రతినిధి మాయాంక్ జోషీ అభిప్రాయపడ్డారు. 'మరణశిక్ష అమలుపై మారటోరియం' పేరిట వచ్చిన తీర్మాన ముసాయిదాను ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ తృతీయ కమిటీ గత వారం ఆమోదించింది. ముసాయిదాను 114 దేశాలు సమర్థించగా, భారత్ సహా 36దేశాలు వ్యతిరేకించాయి. 34 దేశాలు గైర్హాజరయ్యాయి. ఇక ఈ తీర్మానంలోని నిబంధనల మేరకు మరణశిక్ష అమలుపై నియంత్రణతో వ్యవహరించాలని సభ్యదేశాలకు సర్వప్రతినిధి సభ విజ్ఞప్తిచేయనుంది. 18 ఏళ్ల లోపు వయస్సువారికి, గర్భిణీ స్త్రీలకు, మానసిక దౌర్బల్యం కలిగిన వారికి మరణశిక్ష విధించరాదని కూడా సభ్యదేశాలను కోరనుంది. **