పాకిస్తాన్పై నిప్పులు చెరిగిన భారత్ | Pak is a terrorist state which channelizes billions of dollars says india in UNGA | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్పై నిప్పులు చెరిగిన భారత్

Published Thu, Sep 22 2016 9:17 AM | Last Updated on Wed, Jul 25 2018 1:49 PM

పాకిస్తాన్పై నిప్పులు చెరిగిన భారత్ - Sakshi

పాకిస్తాన్పై నిప్పులు చెరిగిన భారత్

న్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌పై భారత్ నిప్పులు చెరిగింది. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కశ్మీర్ అంశంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో భారత్ తన వాదనను ఇలా వినిపించింది.. 'ప్రపంచంలోనే తీవ్రవాదానికి కేంద్రబిందువుగా మారిన పాకిస్తాన్‌ మానవ హక్కుల గురించి ప్రస్తావించడం హాస్యాస్పదంగా ఉంది. అంతర్జాతీయంగా అందుతున్న సహాయసహకారాలతో తీవ్రవాదసంస్థలకు శిక్షణనిచ్చి, పెంచి పోషిస్తూ పొరుగు దేశాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలను కొనసాగిస్తోంది. పాకిస్తాన్ అండదండలతోనే తీవ్రవాద సంస్థలను నడిపించే ఉగ్రనాయకులు స్వేచ్ఛగా అక్కడ బహిరంగంగా తిరగగలుగుతున్నారు.

తీవ్రవాది, హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వానీని ఐక్యరాజ్యసమితిలోనే అమరవీరుడిగా నవాజ్ షరీఫ్ కీర్తించడమే ఇందుకు నిదర్శనం. పాక్ అణ్వాయుధ వ్యాప్తికి కృషి చేస్తూ..శాంతి సామరస్యాల గురించి మాట్లాడుతోంది. భారత్‌తోనే కాక అంతార్జాతీయ సమాజానికి టెర్రరిజమ్‌పై పాక్ తప్పుడు వాగ్దానాలు చేసి తుంగలో తొక్కుతోంది.  ఉన్నత విద్యకు నిలయంగా నిలిచిన ఒకప్పటి చారిత్రక తక్షశిలా నగరం ప్రస్తుతం తీవ్రవాద సంస్థలకు అడ్డాగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాద భావజాలమున్న యువతను ఆకర్షిస్తోంది. దాని విష పాఠ్యాంశాలు ప్రపంచ వ్యాప్తమువుతున్నాయి. భారత్‌లో తీవ్రవాదాన్ని వ్యాప్తి చేయనియం. కశ్మీర్‌లోని తీవ్రవాద చర్యల నుంచి భారత పౌరులను రక్షించడానికి భారత్ సిద్ధం ఉంది' అని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement