
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని అభివృద్ధి ప్రాజెక్టుల్లో దాదాపు రూ.7,164.55 కోట్లు(బిలియన్ డాలర్ల) పెట్టుబడులు పెడతామని చైనా ప్రకటించింది. తద్వారా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు సరికొత్త ఎత్తుకు చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తంచేసింది. ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో చైనా రాయబారి యావో జింగ్ మాట్లాడారు. కశ్మీర్ సమస్యను భారత్–పాకిస్తాన్‌లు పరస్పర గౌరవంతో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా సూచించింది. పాకిస్తాన్ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి మద్దతుగా నిలుస్తామని ప్రకటించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పాక్ పర్యటన ముగిసిన నేపథ్యంలో ఇరుదేశాలు ఆదివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశాయి. కశ్మీర్‌ను పరోక్షంగా ప్రస్తావించిన చైనా.. ప్రస్తుతమున్న పరిస్థితులను మరింత జటిలం చేసే ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment