కశ్మీర్ అంశంపై పాకిస్తాన్‌కు చైనా వత్తాసు పలికింది. విదేశీ శక్తులేవైనా పాక్‌పై దుందుడుకు చర్యలకు దిగితే తాము అండగా నిలుస్తామని అభయ హస్తమిచ్చింది. లాహోర్‌లోని చైనా కాన్సుల్ జనరల్ యూ బోరెన్.. పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్‌తో భేటీ సందర్భంగా ఈమేరకు హామీ ఇచ్చినట్లు షాబాజ్ కార్యాలయం తెలిపింది. ‘కశ్మీర్ విషయంలో మేం పాక్ పక్షాన ఉన్నాం. ఉంటాం. నిరాయుధులైన కశ్మీరీలపై దాడులు జరపడం ఏ విధంగానూ సహేతుకం కాదు.