కశ్మీర్ సమస్యకు సంబంధించి కొనసాగుతున్న మాటల యుద్ధానికి మరింత ఆజ్యం పోశారు పాక్ ఆర్మీ చీఫ్ రహీల్.
ఇస్లామాబాద్: కశ్మీర్ సమస్యకు సంబంధించి భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధానికి మరింత ఆజ్యం పోశారు పాక్ ఆర్మీ చీఫ్ రహీల్. కశ్మీర్ లోయలోని ప్రజలపై తూటాల వర్షం కురిపించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభించదని చెప్పారు. కశ్మీర్ పాక్‌కు జీవనాడి అని, అక్కడి ప్రజల స్వాతంత్య్ర పోరాటానికి అన్ని స్థాయిల్లోనూ దౌత్య, నైతిక మద్దతు కొనసాగిస్తామన్నారు.
కశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపించడమంటే.. బుల్లెట్ల వర్షం కురిపించడం కాదని, వారి ఆకాంక్షలను గౌరవించడం, వారి వాదనను వినడమే సరైన పరిష్కారమని చెప్పారు. ఐక్యరాజ్యసమితి తీర్మానాలను అమలు పరిచినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. మంగళవారం రావల్పిండిలో జరిగిన డిఫెన్స్ డే సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.