pakistan army chief
-
పాక్ సైన్యానికి కొత్త బాస్
పాకిస్తాన్లో సైనిక దళాల ప్రధానాధికారి పదవి చుట్టూ కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. చివరకు ఆ పదవి లెఫ్టినెంట్ జనరల్ ఆసిమ్ మునీర్‌కే దక్కింది. ఈ నెల 29న లాంఛనంగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. పాక్ పుట్టుపూర్వోత్తరాలూ, తీరు తెన్నులూ గమనించే వారికి దేశాధ్యక్ష, ప్రధాని పదవులకన్నా సైనిక దళాల ప్రధానాధికారి పదవికి అక్కడుండే ప్రాధాన్యత అసాధారణమైనదని ఇట్టే తెలుస్తుంది. రాజ్యాంగంలో రాసుకున్న దానికి భిన్నంగా అత్యంత శక్తిమంతమైన పదవిగా అదెందుకు మారిందో చెప్పటం అంత సులభం కాదు. కార్యనిర్వాహక వ్యవస్థ చెప్పినట్టు నడుచుకోవటానికి భిన్నంగా దాన్నే శాసించే స్థాయికి సైన్యం రావ టంలో అవినీతి రాజకీయ నేతల బాధ్యతే అధికం. ఆ సంగతలా ఉంచి మూడు దశాబ్దాలుగా సైనిక దళాల ప్రధానాధికారి పదవి ఎంపిక ప్రక్రియ చిన్న చిన్న ఇబ్బందులు మినహా సజావుగానే సాగుతోంది. కానీ ఈసారి మాత్రం పెను వివాదాలు చుట్టుముట్టాయి. లెఫ్టినెంట్ జనరల్ మునీర్‌కు ఆర్మీ చీఫ్ పదవి రాదని కొందరూ, వస్తుందని కొందరూ విశ్లేషణలు చేశారు. ఆయనకు ఆ పదవి దక్కనీయనని ఈమధ్యే మాజీ ప్రధానిగా మారిన ఇమ్రాన్ ఖాన్ ప్రతిజ్ఞలు చేశారు. తమ పార్టీనుంచి ఎన్నికైన దేశాధ్యక్షుడి ద్వారా ఆయన ఎంపికను నిలువరిస్తానన్నారు. కానీ వీటన్నిటినీ దాటుకుని కోటలో పాగా వేయటం లెఫ్టినెంట్ మునీర్‌కి సాధ్యపడిందంటే ఆయనెంత అఖండుడో అర్థం అవుతుంది. పదవీ విరమణ చేయబోతున్న జనరల్ జావేద్ బజ్వా తర్వాత సైన్యంలో అత్యంత సీనియర్ లెఫ్టినెంట్ జనరల్ మునీరే. ఆ రకంగా ఆ పదవి మునీర్ కే దక్కాలి. కానీ బజ్వా కన్నా రెండు రోజుల ముందు... అంటే ఈ నెల 27తో ఆయన పదవీకాలం ముగియాలి. కానీ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం ఆర్మీ చట్టం కింద ‘దేశ భద్రత’ను కారణంగా చూపుతూ మునీర్‌ను సర్వీసులో కొనసాగించాలని నిర్ణయించింది. ఒకసారి ఆర్మీ చీఫ్ అయ్యాక ఆయన పదవీకాలం మూడేళ్లు పెరుగుతుంది. అప్పటికున్న ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగితే బజ్వా మాదిరే రెండోసారి పొడిగింపు తెచ్చుకుని మరో మూడేళ్లు ఆర్మీ చీఫ్‌గా కొనసాగవచ్చు. ఇలా జరిగే అవకాశం ఉండబట్టే ఇమ్రాన్ మునీర్‌కు మోకాలడ్డారు. సైన్యం కనుసన్నల్లో నడిచే గూఢచార సంస్థ ఐఎస్ఐకి డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన కాలంలో మునీర్ తన కుటుంబ ఆస్తుల కూపీ లాగటానికి ప్రయత్నించటమే ఇమ్రాన్ ఆగ్రహానికి కారణం. అప్పట్లో బజ్వాతో తన సంబంధాలు బాగుండటంతో మునీర్‌ను ఐఎస్ఐ నుంచి తప్పించగలిగారు. అలాంటి అధికారి ఆర్మీ చీఫ్ కావటం ఇమ్రాన్‌కు కోపం తెప్పించటంలో వింతేమీ లేదు. సాధారణంగా అయితే పొరుగు దేశం ఆంతరంగిక విషయాలు మనల్ని పెద్దగా ప్రభావితం చేయవు. కానీ పాకిస్తాన్ తీరు వేరు. సైన్యంలో ఉండే లుకలుకలూ, సైన్యానికి పౌర ప్రభుత్వంతో ఉండే విభేదాలూ తరచు భారత్‌కు సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. ఎన్నికైన ప్రభుత్వం మన దేశంతో మంచి సంబంధాలు కలిగివుండాలని వాంఛిం చిన మరుక్షణం ఆ ప్రయత్నాన్ని వమ్ము చేయటానికి అక్కడి సైన్యం ఎత్తులు వేస్తుంది. ఎల్ఓసీలో అకారణంగా కాల్పులకు దిగుతుంది. దేశంలో భారత్ వ్యతిరేకత ప్రబలేలా చూడటమే ఈ ఎత్తుగడ వెనకున్న లక్ష్యం. దీనికితోడు ఇమ్రాన్‌పై బజ్వా కయ్యానికి కాలుదువ్విన పర్యవసానంగా అక్కడి సైన్యంలో ఇమ్రాన్ వ్యతిరేక, ఇమ్రాన్ అనుకూల వర్గాలు ఏర్పడ్డాయి. అంతకుముందు ప్రధానిగా ఉన్న నవాజ్ షరీఫ్‌ను చిక్కుల్లో పడేసి, ఇమ్రాన్‌కు అధికారం దక్కటానికి సైన్యం తెరవెనక ఎటువంటి పాత్ర పోషించిందో బహిరంగ రహస్యం. బజ్వా తన వ్యక్తిగత విభేదాలతో ఇమ్రాన్‌ను తొలగించటం వల్ల నవాజ్ షరీఫ్ సోదరుడైన షెహ్‌బాజ్‌ను నెత్తికెక్కించుకోవాల్సి వచ్చిందని సైన్యంలో ఒక వర్గం మండిపడుతోంది. లండన్‌లో మకాం వేసిన నవాజ్ అక్కడినుంచే సలహాలిస్తూ సర్కారును నడిపిస్తున్నారు. బజ్వా మొదటినుంచీ భారత్ వ్యతిరేకి. నవాజ్ మనతో మంచి సంబంధాలు నెలకొల్పుకోవా లని భావించినప్పుడు దాన్ని వమ్ము చేసిన ఘనుడు బజ్వాయే. ఆ పని కూడా ఇప్పుడు ఆర్మీ చీఫ్ కాబోతున్న మునీర్‌తోనే చేయించారు. పుల్వామాలో మన జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడి మునీర్ ఐఎస్ఐ చీఫ్‌గా ఉన్నప్పుడే చోటుచేసుకుంది. దానికి ప్రతీకారంగా పాక్ ఉగ్రవాద శిబిరాలపై మన దేశం దాడి చేసినప్పుడు మిగ్ యుద్ధ విమానం కూలి పైలెట్ అభినందన్ వర్ధమాన్ అక్కడి సైన్యానికి పట్టుబడ్డారు. ఆ సమయంలో ఆయనకు హాని జరక్కుండా చూడాలని జాతీయ భద్రతా సలహా దారు అజిత్ డోవల్ మాట్లాడింది కూడా మునీర్‌తోనే. అయితే ఆయన రావటంవల్ల మన దేశానికి మరిన్ని సమస్యలొస్తాయని చెప్పలేం. మొదట్లో భారత్ వ్యతిరేకిగా ఉన్న బజ్వా చివరికొచ్చే సరికి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మాట్లాడారు. అందుకు కారణం ఉగ్రవాదులకు సాయం అంది స్తున్న కారణంగా పాక్‌కు రావాల్సిన ఆర్థిక సాయం నిలిచిపోవటం. అది సరిచేసుకుని, అమెరికా మెప్పు పొంది ఎఫ్–16 యుద్ధ విమానాలు రాబట్టడంలో బజ్వా విజయం సాధించారు. అయితే పొరుగున అఫ్గాన్‌లో తాలిబన్ల హవా వచ్చాక తమ ప్రభ వెలిగిపోతుందనుకున్న పాక్ సైన్యం అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడటంతో అయోమయంలో పడింది. తాలిబన్లతో సరిహద్దు వివాదం తప్పటం లేదు. ఈ స్థితిలో మునీర్ రాకవల్ల మనకు కొత్తగా సమస్యలు రాకపోవచ్చు. ఏదేమైనా తగిన జాగ్రత్తలో ఉండటం తప్పనిసరి. -
పాక్ ఆర్మీ చీఫ్‌కు వేలకోట్ల అక్రమాస్తులు
పాక్ ఆర్మీ చీఫ్‌కు వేలకోట్ల అక్రమాస్తులు -
పాక్ ఆర్మీ చీఫ్‌కు కేంద్రమంత్రి గట్టి కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు తర్వాత దాయాది దేశాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జావేద్ బజ్వా శుక్రవారం మరోసారి రెచ్చగొట్టే ప్రకటన చేశాడు. కశ్మీర్ ప్రజలకు పాక్ ఎప్పుడూ తోడుగా ఉంటుందని, అవసరమైతే యుద్ధానికి సైతం వెనుకాడబోమని చెప్పారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి, మాజీ సైన్యాధిపతి వి.కె. సింగ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి పాక్ ఆర్మీ పబ్బం గడుపుకోవాలని చూస్తోందని చురకలంటించారు. తినడానికి తిండి, కార్యాలయాలు నిర్వహించేందుకు స్తోమత లేనప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి డబ్బులు గుంజడానికి ఆ దేశ ఆర్మీ ఇలా ప్రేలాపనలు చేస్తుందని ఎద్దేవా చేశారు. కశ్మీర్ అంశాన్ని చూపెడుతూ పాక్ సైన్యం తరచూ అవినీతికి పాల్పడుతుందని విమర్శించారు. ఎల్వోసీ వెంబడి రెండు వేల మందిని పాకిస్తాన్ భారత్‌లోకి పంపించడానికి యత్నిస్తోందన్న వార్తలపై ఆయన స్పందిస్తూ.. ‘వారిని వారి (పాక్ ఆర్మీ) డ్యూటీ చేయనీయండి. వారిని పైకి పంపించే డ్యూటీ మన ఆర్మీ చేస్తుంది’అని వ్యాఖ్యానించారు. (చదవండి : కశ్మీర్ కోసం యుద్ధానికి సిద్ధం: పాక్ ఆర్మీ చీఫ్) -
పాకిస్తాన్ భారీకాయుడికి సర్జరీ
లాహోర్: పాకిస్తాన్‌లోకెల్లా అత్యధిక బరువు కలిగిన వ్యక్తికి, బరువు తగ్గేందుకు చేసిన లైపోసక్షన్ సర్జరీ విజయవంతమైంది. దాదాపు 330 కేజీలకు పైగా బరువుతో కదల్లేని పరిస్థితిలో ఉన్న నూరుల్ హసన్ సోషల్‌మీడియా ద్వారా తన గోడును వెల్లబోసుకున్నాడు. దాన్నిగమనించిన పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమార్ జావెద్ సర్జరీకి ఏర్పాట్లు చేశారు. రెస్క్యూ 1122 దళ సభ్యులు అతడి ఇంటి గోడను కూల్చి మరీ సైనిక వాహనం ద్వారా మిలిటరీ ఆస్పత్రికి తరలించారు. గంటా నలభై నిమిషాలపాటు నిర్వహించిన ఆపరేషన్ కష్టతరమైనదే అయినప్పటికీ, విజయవంతంగా పూర్తయిందని డాక్టర్ మౌజ్ అల్ హసన్ తెలిపారు. రానున్న నాలుగు రోజుల పాటు నూరుల్ ఐసీయూలోనే ఉంటాడని అనంతరం ఆరునెలల్లో 200 కేజీల కంటే తక్కువ బరువుకు చేరుకుంటాడని అన్నారు. -
పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్‌పై దేశద్రోహం కేసు
-
‘భారత్‌తో సంబంధాలను బాగుచేయండి’
లాహోర్ : భారతదేశంతో దౌత్య, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేయాలని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వా స్పష్టం చేశారు. భారత్‌తో సంబంధాలను సాధారణ స్థితికి ప్రభుత్వ తీసుకు రావాలని.. ఆయన పార్లమెంట్ సెనెట్ కమిటీ ముందు తెలిపారు. ప్రభుత్వం, రాజకీయ నాయకులు తీసుకునే ఈ చొరవను సైన్యం అభినందించడంతో పాటు, అనుసరిస్తుందని ఆయన చెప్పారు. భారత్ సహా ఇతర పొరుగు దేశాలతోనూ పాకిస్తాన్ తన సంబంధాలను మెరుగుపరుచుకోవాలని సెనెట్ కమిటీ పేర్కొన్నారు. పాకిస్తాన్‌ను అభద్రతలోకి నెట్టివేయడంతో పాటు, అస్థిరపరిచేందుకు భారత సైన్యం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. రాజా రబ్బానీ నేతృత్వంలోని సెనెట్ కమిటీ సమావేశంలో జావేద్ బజ్వాతో పాటు ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స చీఫ్ నవీద్ ముఖ్తార్, మేజర్ జనరల్ సాహిర్ సంషాద్ మీర్జాచ మరో మేజర్ జనరల్ ఆషిమ్ మునీర్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పొరుగు దేశం భారత్‌తో సాధారణ సంబంధాలనే కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అదే సమయంలో భారత్ దుందుడుకు చర్యలకు దిగితే తగిన సమాధానం చెబుతామని అన్నారు. -
పాక్ ఆర్మీ చీఫ్‌గా బజ్వా ఎంపిక వెనుక..
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో సైనికాధికారులు రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయనేది జగమెరిగిన సత్యం. పాక్ ప్రభుత్వం.. ఆర్మీ, ఉగ్రవాదుల చేతుల్లో కీలుబొమ్మ అనే విమర్శ కూడా ఉంది. పాక్ లో ఆర్మీ చీఫ్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. భారత్ కూడా పాక్ సైన్యం కదలికలపై నిరంతరం దృష్టి సారిస్తుంది. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన తరుణంలో పాక్ ఆర్మీ కొత్త చీఫ్‌గా ఖమర్ బజ్వా నియమితులయ్యారు. ఈ పదవికి నలుగురు జనరల్‌లు రేసులో ఉన్నా బజ్వా వైపే ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ మొగ్గు చూపారు. ఆయన్ను ఆర్మీ చీఫ్‌గా షరీఫ్ ఎంపిక చేయడానికి పలు కారణాలున్నాయని ఆ దేశ మీడియా వెల్లడించింది. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి బజ్వా విధేయుడని, ప్రచార ఆర్భాటాలకు దూరంగా నిబద్ధతతో పనిచేసుకుపోయే వ్యక్తని.. అందువల్లే షరీఫ్ ఆయన పట్ల మొగ్గు చూపారని పాక్ మీడియా పేర్కొంది. సైనిక ఆపరేషన్లలో నిపుణుడైన, ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే అధికారిని ఆర్మీ చీఫ్‌గా నియమించాలని ప్రధాని షరీఫ్ భావించారని వెల్లడించింది. పాక్ సైన్యంలో బజ్వా కీలక బాధ్యతలు నిర్వహించారని, భారత్ సరిహద్దుల్లో మిలటరీ కార్యకలాపాలపై ఆయనకు పూర్తిగా పట్టుందని, ఈ అంశాలు కూడా కలసి వచ్చాయని పేర్కొంది. పాక్‌లో ప్రభుత్వాలను మిలటరీ కూలదోసి అధికార పగ్గాలు చేజిక్కించుకున్న సంఘటనలు గతంలో ఉన్నాయి. ఆ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దాదాపు 70 ఏళ్లలో సగానిపైగా మిలటరీ పాలన సాగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బజ్వా వల్ల తన ప్రభుత్వానికి ముప్పు ఉండదని షరీఫ్ భావించారని పాక్ మీడియా పేర్కొంది. పాక్ ఆర్మీ ప్రస్తుత చీఫ్ జనరల్ రహీల్ నుంచి మంగళవారం బజ్వా బాధ్యతలు చేపట్టనున్నారు. -
పాకిస్తాన్‌కు కొత్త ఆర్మీ చీఫ్!
పాకిస్తాన్ : రహేల్ షరీఫ్ తదుపరి పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్ ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. లెఫ్టినెంట్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వాను పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్‌గా నియమిస్తూ ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ శనివారం ప్రకటించారు. రహేల్ షరీఫ్‌ను నుంచి ఆయన 16 వ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. రహేల్ షరీఫ్ పదవీ కాలం నవంబర్ 29తో ముగియనుంది. పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కశ్మీర్లో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన ట్రైనింగ్ అండ్ ఎవల్యూషన్కు ఇన్స్పెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉడి ఉగ్రఘటన అనంతరం జరిగిన ఇరు దేశాల మధ్య నెలకొన్న యుద్ధవాతావరణ పరిణామాలతో పాకిస్తాన్ తన ఆర్మీ చీఫ్‌ను మార్చకపోవచ్చని పలు ఊహాగానాలు వచ్చాయి. ఒకవేళ ఆర్మీ చీఫ్‌గా కొత్తవారిని నియమిస్తే వారు కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని పలువురు పేర్కొన్నారు. రహేల్ షరీఫ్ కూడా పాక్ ఆర్మీగా కొనసాగేందుకు మొగ్గుచూపకపోవడంతో పాటు ఆయన పదవి కాలం ముగుస్తుండటంతో కొత్త ఆర్మీ చీఫ్‌ను నియమిస్తూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
పాక్ ఆర్మీ చీఫ్‌కు ఫీల్డ్‌మార్షల్ హోదా?
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ మరికొన్ని వారాల్లో రిటైర్ కానుండగా ఆయనకు సైన్యంలో అత్యున్నత స్థాయి అయిన ఫీల్డ్‌మార్షల్ హోదా కట్టబెట్టాలనే ప్రతిపాదన ఇస్లామాబాద్ హైకోర్టుకు చేరింది. దేశం కోసం అత్యున్నత సేవలందించి, అనేక త్యాగాలు చేసిన రహీల్ షరీఫ్‌కు ఈ అత్యున్నత హోదా ఇవ్వాలని న్యాయవాది సర్దార్ అద్నన్ సలీమ్ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అత్యంత అవసరమని, దేశ భద్రత, సరిహద్దుల రక్షణ, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను సమగ్రంగా నిర్వర్తించేందుకు ఆర్మీచీఫ్‌కు పదోన్నతి కల్పించడమే సరైన పరిష్కారమని కోర్టుకు తెలిపారు. పాక్ ఆర్మీ చీఫ్‌గా షరీఫ్ ఈ ఏడాది నవంబర్ చివర్లో పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన పాక్ ఆర్మీకి 15వ అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. 2013 నవంబర్ 29న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆయన్ను మూడేళ్ల కాలానికి ఆర్మీచీఫ్‌గా నియమించారు. -
‘తూటాల వర్షంతో పరిష్కారం దొరకదు’
ఇస్లామాబాద్: కశ్మీర్ సమస్యకు సంబంధించి భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధానికి మరింత ఆజ్యం పోశారు పాక్ ఆర్మీ చీఫ్ రహీల్. కశ్మీర్ లోయలోని ప్రజలపై తూటాల వర్షం కురిపించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభించదని చెప్పారు. కశ్మీర్ పాక్‌కు జీవనాడి అని, అక్కడి ప్రజల స్వాతంత్య్ర పోరాటానికి అన్ని స్థాయిల్లోనూ దౌత్య, నైతిక మద్దతు కొనసాగిస్తామన్నారు. కశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపించడమంటే.. బుల్లెట్ల వర్షం కురిపించడం కాదని, వారి ఆకాంక్షలను గౌరవించడం, వారి వాదనను వినడమే సరైన పరిష్కారమని చెప్పారు. ఐక్యరాజ్యసమితి తీర్మానాలను అమలు పరిచినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. మంగళవారం రావల్పిండిలో జరిగిన డిఫెన్స్ డే సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. -
'తాలిబన్ శిబిరాలపై బాంబులు వేయండి'
ఇస్లామాబాద్: అఫ్ఘానిస్థాన్ లోని తాలిబన్ శిబిరాలు, దాని చీఫ్ ముల్లా ఫజుల్లాలను టార్గెట్ చేయాలని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ అమెరికాను కోరారు. అఫ్ఘాన్, పాకిస్థాన్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న అమెరికా ప్రత్యేక ప్రతినిధి రిచర్డ్ ఓల్సన్, అఫ్గన్‌లో చేపట్టిన మిషన్ కమాండర్ జాన్ నిచల్సన్లతో శుక్రవారం రాత్రి జరిగిన భేటీలో ఈ అంశంపై చర్చించారు. మే 21న తాలిబన్ చీఫ్ ముల్లా మన్సోర్‌ను సీఐఏ డ్రోన్ సహాయంతో హతమార్చిన తర్వాత మొదటిసారిగా పాకిస్థాన్‌తో అమెరికాకు చెందిన ఉన్నతస్థాయి అధికారుల సమావేశం జరిగింది. సమష్టిగా కృషి చేస్తేనే ఈ ప్రాంతంలో శాంతిని కాపాడగలుగుతామని రహీల్ స్పష్టం చేశారు. అఫ్ఘాన్‌లో అస్థిరతకు పాకిస్తాన్‌ను లక్ష్యం చేయడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. -
కరడుగట్టిన 12మంది ఉగ్రవాదులకు ఉరి
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో కరడుగట్టిన 12 మంది ఉగ్రవాదులకు ఉరి శిక్ష విధించినట్లు పాక్ ఆర్మీ స్పష్టం చేసింది. వీరిని త్వరలోనే ఉరి తీయనున్నట్లు తెలిపింది. వీరంతా కూడా హీనాతిహీనమైన నేరాలకు పాల్పడినవారేనని ఈ సందర్భంగా వివరించింది. దేశంలో పలు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటమే కాకుండా, బన్ను జైలు గోడలు బద్ధలు కొట్టడం, సైనికులపై దాడులకు తెగబడటం, ప్రజలపై, చట్టసభలపైన బాంబులతో దాడులు చేయడంవంటి పనులు చేసినట్లు పాక్ ఆర్మీ వివరించింది. ఈ నేరాలకింద అరెస్టు చేసిన వీరికి ఇప్పటికే మిలటరీ కోర్టులు ఉరి శిక్షను విధించాయని, ఆ శిక్షను ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ ఆమోదించారని పేర్కొంది. 'గురువారం ఆర్మీ చీఫ్ 12మంది కరుడుగట్టిన ఉగ్రవాదులకు ఉరి శిక్షను ఖరారు చేశారు. వీరంతా కూడా హీనమైన నేరాలకు పాల్పడిన వారే' అని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. 2014 డిసెంబర్ 16న పెషావర్ లోని ఓ పాఠశాలపై బాంబుదాడికి పాల్పడి 150మందిని వీరు పొట్టనపెట్టుకున్నారు. అక్కడ చనిపోయినవారిలో విద్యార్థులే అధికంగా ఉన్నారు. -
'భారత్ ను ఎదుర్కోగల సామర్థ్యం మాకూ ఉంది'
ఇస్లామాబాద్: భారత్ ను ఎదుర్కోగల సామర్థ్యం తమకూ ఉందంటూ పాకిస్థాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. భారత్ ఎలాంటి దుందుడుకు చర్యకు పాల్పడినా ఎదుర్కోగల సామర్థ్యం పాక్ బలగాలకు ఉందని గురువారం సైనిక దళాల అధిపతి రహీల్ షరీఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత్ గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. భారత్ ఎటువంటి చర్యలకు పాల్పడినా తిప్పికొట్టే సామర్థ్యం ఉందన్నారు 1947లో భారత్-పాక్ ల కు సంబంధించిన కశ్మీర్ అంశం నేటికి పరిష్కారం కాలేదని.. అయినా పాకిస్థాన్ -కశ్మీర్ లు విడదీయలేని బంధంగా అభివర్ణించారు. -
'కశ్మీర్ - పాకిస్తాన్ విడదీయలేనివి'
న్యూఢిల్లీ: కశ్మీర్ విభజన ఎప్పటికీ ముగిసిపోని అంకం అని పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్, పాకిస్తాన్ రెండూ ఎప్పటికీ విడదీయలేనివని ఆయన అన్నారు. ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసి కశ్మీర్‌ను పాక్‌లో కలిపితే శాంతి పరిఢవిల్లుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలువురు కేంద్రమంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రహీల్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇండియా - పాక్ మధ్య సంబంధాలను దెబ్బతీస్తాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు.