పాకిస్తాన్కు కొత్త ఆర్మీ చీఫ్!
పాకిస్తాన్కు కొత్త ఆర్మీ చీఫ్!
Published Sat, Nov 26 2016 6:56 PM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM
పాకిస్తాన్ : రహేల్ షరీఫ్ తదుపరి పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్ ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. లెఫ్టినెంట్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వాను పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్గా నియమిస్తూ ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ శనివారం ప్రకటించారు. రహేల్ షరీఫ్‌ను నుంచి ఆయన 16 వ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. రహేల్ షరీఫ్ పదవీ కాలం నవంబర్ 29తో ముగియనుంది. పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కశ్మీర్లో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన ట్రైనింగ్ అండ్ ఎవల్యూషన్కు ఇన్స్పెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఉడి ఉగ్రఘటన అనంతరం జరిగిన ఇరు దేశాల మధ్య నెలకొన్న యుద్ధవాతావరణ పరిణామాలతో పాకిస్తాన్ తన ఆర్మీ చీఫ్ను మార్చకపోవచ్చని పలు ఊహాగానాలు వచ్చాయి. ఒకవేళ ఆర్మీ చీఫ్‌గా కొత్తవారిని నియమిస్తే వారు కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని పలువురు పేర్కొన్నారు. రహేల్ షరీఫ్ కూడా పాక్ ఆర్మీగా కొనసాగేందుకు మొగ్గుచూపకపోవడంతో పాటు ఆయన పదవి కాలం ముగుస్తుండటంతో కొత్త ఆర్మీ చీఫ్ను నియమిస్తూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Advertisement
Advertisement