లాహోర్ : భారతదేశంతో దౌత్య, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేయాలని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వా స్పష్టం చేశారు. భారత్‌తో సంబంధాలను సాధారణ స్థితికి ప్రభుత్వ తీసుకు రావాలని.. ఆయన పార్లమెంట్ సెనెట్ కమిటీ ముందు తెలిపారు. ప్రభుత్వం, రాజకీయ నాయకులు తీసుకునే ఈ చొరవను సైన్యం అభినందించడంతో పాటు, అనుసరిస్తుందని ఆయన చెప్పారు. భారత్ సహా ఇతర పొరుగు దేశాలతోనూ పాకిస్తాన్ తన సంబంధాలను మెరుగుపరుచుకోవాలని సెనెట్ కమిటీ పేర్కొన్నారు. పాకిస్తాన్‌ను అభద్రతలోకి నెట్టివేయడంతో పాటు, అస్థిరపరిచేందుకు భారత సైన్యం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
రాజా రబ్బానీ నేతృత్వంలోని సెనెట్ కమిటీ సమావేశంలో జావేద్ బజ్వాతో పాటు ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స చీఫ్ నవీద్ ముఖ్తార్, మేజర్ జనరల్ సాహిర్ సంషాద్ మీర్జాచ మరో మేజర్ జనరల్ ఆషిమ్ మునీర్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పొరుగు దేశం భారత్‌తో సాధారణ సంబంధాలనే కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అదే సమయంలో భారత్ దుందుడుకు చర్యలకు దిగితే తగిన సమాధానం చెబుతామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment