'భారత్ ను ఎదుర్కోగల సామర్థ్యం మాకూ ఉంది'
ఇస్లామాబాద్: భారత్ ను ఎదుర్కోగల సామర్థ్యం తమకూ ఉందంటూ పాకిస్థాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. భారత్ ఎలాంటి దుందుడుకు చర్యకు పాల్పడినా ఎదుర్కోగల సామర్థ్యం పాక్ బలగాలకు ఉందని గురువారం సైనిక దళాల అధిపతి రహీల్ షరీఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత్ గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. భారత్ ఎటువంటి చర్యలకు పాల్పడినా తిప్పికొట్టే సామర్థ్యం ఉందన్నారు
1947లో భారత్-పాక్ ల కు సంబంధించిన కశ్మీర్ అంశం నేటికి పరిష్కారం కాలేదని.. అయినా పాకిస్థాన్ -కశ్మీర్ లు విడదీయలేని బంధంగా అభివర్ణించారు.