'తాలిబన్ శిబిరాలపై బాంబులు వేయండి'
ఇస్లామాబాద్: అఫ్ఘానిస్థాన్ లోని తాలిబన్ శిబిరాలు, దాని చీఫ్ ముల్లా ఫజుల్లాలను టార్గెట్ చేయాలని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ అమెరికాను కోరారు. అఫ్ఘాన్, పాకిస్థాన్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న అమెరికా ప్రత్యేక ప్రతినిధి రిచర్డ్ ఓల్సన్, అఫ్గన్‌లో చేపట్టిన మిషన్ కమాండర్ జాన్ నిచల్సన్‌లతో శుక్రవారం రాత్రి జరిగిన భేటీలో ఈ అంశంపై చర్చించారు.
మే 21న తాలిబన్ చీఫ్ ముల్లా మన్సోర్‌ను సీఐఏ డ్రోన్ సహాయంతో హతమార్చిన తర్వాత మొదటిసారిగా పాకిస్థాన్‌తో అమెరికాకు చెందిన ఉన్నతస్థాయి అధికారుల సమావేశం జరిగింది. సమష్టిగా కృషి చేస్తేనే ఈ ప్రాంతంలో శాంతిని కాపాడగలుగుతామని రహీల్ స్పష్టం చేశారు. అఫ్ఘాన్‌లో అస్థిరతకు పాకిస్తాన్‌ను లక్ష్యం చేయడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.