కాశ్మీర్‌పై పాక్‌కు చుక్కెదురు!
జోక్యానికి ఐరాస అయిష్టత
చర్చలతో పరిష్కరించుకోవాలని సూచన
న్యూయార్క్/జమ్మూ: సరిహద్దులో పదేపదే కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాకిస్థాన్, కాశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి జోక్యం కోసం చేసిన తాజా ప్రయుత్నం ఫలించలేదు. ఈ అంశంపై పాక్ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి పట్టించుకోలేదు. కాశ్మీర్‌పై కలుగజేసుకునేందుకు అరుుష్టత వ్యక్తంచేస్తూ, ఈ అంశంపై భారత్, పాకిస్థాన్‌లు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించింది. సరిహద్దులో ఇటీవలి ఉద్రిక్తతలకు భారతదేశమే కారణమని, సరిహద్దులో పరిస్థితి చక్కదిద్దేందుకు, కాశ్మీర్ సమస్య పరిష్కారానికి జోక్యంచేసుకోవాలని కోరుతూ పాక్ ఇటీవల ఐరాసను కోరింది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మున్‌కు లేఖ రాశారు. అయితే, కాశ్మీర్ వివాదాన్ని ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకోవాలని బాన్ కీ వుూన్ అభిప్రాయుపడినట్టు బాన్ ప్రతినిధి ఫర్హాన్ చెప్పారు.
పాత ఎత్తుగడే.. భారత్: కాశ్మీర్‌పై ఐక్య రాజ్యసమితిని ఆశ్రయించడం పాకిస్థాన్ పాత ఎత్తుగడేనని, ఈ ఎత్తుగడ గతంలో ఫలించలేదని, ఇకపై కూడా ఫలించబోదని భారత్ వ్యాఖ్యానించింది. కాశ్మీర్‌పై చర్చల్లో తృతీయు పక్షానికి ప్రమేయుం కల్పించడం హర్షణీయుం కాదని విదేశాంగశాఖ ప్రతినిధి సయ్యుద్ అక్బరుదీన్ చెప్పారు. కాశ్మీర్‌సహా అన్ని అంశాలపై నేరుగా చర్చలకు భారత్ సువుుఖంగానే ఉందని, అలాంటి చర్చలపై పాక్ ఆసక్తిచూపడంలేదని అన్నారు. కాగా, కాశ్మీర్‌పై జోక్యానికి ఐక్యరాజ్యసమితి తిరస్కృతిపట్ల బీజేపీ హర్షం వ్యక్తంచేసింది. ఇది, నరేంద్ర మోదీ ప్రభుత్వం దౌత్యపరంగా సాధించిన విజయువుని బీజేపీ జమ్మూ కాశ్మీర్ విభాగం పేర్కొంది.
ఆర్మీ అధికారుల హాట్‌లైన్ చర్చలు
సరిహద్దులో ఉద్రిక్తతల పరిష్కార చర్యలపై భారత్, పాక్ సైన్యాధికారులు వుంగళవారం హాట్‌లైన్‌లో వూట్లాడారు. పాక్ మిలిటరీ కార్యకలాపాల డెరైక్టర్, హాట్‌లైన్‌లో భారత మిలిటరీ వ్యవహారాల డెరైక్టర్‌తో సంభాషణలు జరిపినట్టు ఓ పాక్ సైన్యాధికారి చెప్పారు. వురోవైపు.., పాకిస్థాన్ వుంగళవారం రెండు సార్లు కాల్పుల విరవుణను ఉల్లంఘించింది. కాశ్మీర్ పూంచ్ జిల్లాలో అధీనరేఖ వెంబడి భారత్‌కు చెందిన పది అవుట్‌పోస్టులపై పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఒక వుహిళ గాయుపడ్డారు.