పాకిస్థాన్ మళ్లీ తన బుద్ధి చూపించుకుంది. కశ్మీర్ అంశంలో మూడో పక్షం జోక్యం ఉండకూడదని భారత్ పదేపదే చెబుతున్నా, దొరికిన ప్రతి వేదికపైనా ఇదే అంశాన్ని లేవనెత్తుతోంది. తాజాగా జమ్ము కశ్మీర్లో ప్లెబిసైట్ నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ను పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కోరారు. అలాగే ఐక్యరాజ్య సమితికి చెందిన సైనిక పరిశీలన బృందం ఒకటి భారత్, పాకిస్థాన్ల కోసం ఏర్పాటుచేయాలన్నారు. అయితే ఐక్యరాజ్య సమితిలో బాన్ కీ మూన్ ప్రతినిధి మాత్రం, భారత్, పాక్లు శాంతియుత చర్చలను కొనసాగించాలని మాత్రమే మూన్ ఆకాంక్షించినట్లు తెలిపారు. ఉగ్రవాదంపై పోరు గురించి చర్చించామన్నారు.
ఇక ఐక్యరాజ్య సమితిలో జరిగిన ప్రసంగాలలో కూడా చాలామంది దేశాధ్యక్షులు కేవలం అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడగా, బెలారస్, వెనిజువెలా లాంటి వాళ్లు మాత్రం పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఒక్క నవాజ్ షరీఫ్ మాత్రం ద్వైపాక్షిక అంశాలను కూడా అక్కడ ప్రస్తావించారు. కాగా, ఆయనకు వచ్చేవారం జరిగే ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ వార్షిక సమావేశంలో కూడా మాట్లాడే అవకాశం వస్తుంది. అప్పుడు కూడా కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తారనే భావిస్తున్నారు.
ఐరాసలో మళ్లీ కశ్మీర్ ప్రస్తావన తెచ్చిన పాక్
Published Mon, Sep 28 2015 8:53 AM | Last Updated on Sat, Mar 23 2019 8:29 PM
Advertisement