Violation of the ceasefire
-
‘హద్దు’ మీరిన పాక్ ఆగడాలు
పొరుగు దేశం కాల్పుల్లో మరొకరి మృతి, ఐదుగురికి గాయాలు జమ్మూ: సరిహద్దులో పాకిస్తాన్ ఆగడాలు శ్రుతిమించాయి. పాక్ సైన్యం ఆదివారం వరుసగా ఎనిమిదో రోజూ జమ్మూకశ్మీర్ సరిహద్దులోని పల్లెలు, ఆర్మీ పోస్టులపై భారీ కాల్పులకు, మోర్టారు బాంబు దాడులకు పాల్పడింది. పూంచ్ జిల్లాలోని పూంచ్, రాజౌరీ, బాలాకోట్, హమీర్పూర్, మండీ సెక్టార్లలో విచక్షణ రహితంగా దాడులు చేసింది. బాలాకోట్ సెక్టార్‌లోని బెహ్రోత్ గ్రామంపై జరిగిన మోర్టారు బాంబుల దాడిలో నసరత్ బేగం(35) అనే మహిళ మృతిచెందగా, ఇద్దరు గాయపడ్డారు. రాజౌరీలోని మంజకోట్‌లో మరో ముగ్గురు గాయపడ్డారు. దీంతో.. శని, ఆదివారాల్లో పాక్ కాల్పుల్లో మృతిచెందిన భారత పౌరుల సంఖ్య ఆరుకు, క్షతగాత్రుల సంఖ్య 10కి చేరింది. మృతుల్లో 12 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. పాక్ జవాన్లు ఆర్మీ పోస్టులపై, పల్లెలపై భారీ కాల్పులు, మోర్టారు దాడులకు పాల్పడ్డార ని, వాటిని తమ సైన్యం దీటుగా తిప్పికొట్టిందని రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ మనీశ్ మెహతా చెప్పారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించారు. పాక్ కాల్పులకు సైన్యం రెండుమూడు రెట్లు దీటుగా జవాబిస్తోందని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ చెప్పారు. శాంతికి భంగం కలిగించొద్దు.. కాల్పుల విరమణ ఉల్లంఘనపై భారత్ మండిపడింది. విదేశాంగ శాఖ కార్యదర్శి(తూర్పు) అనిల్ వాధ్వా.. ఆదివారం ఢిల్లీలోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌ను పిలిపించుకుని తీవ్ర ఆగ్రహం, నిరసన వ్యక్తం చేశారు. సరిహద్దులో పాక్ సైన్యం శాంతికి తూట్లు పొడవకుండా ఆ దేశ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కాల్పులు జరగవని పాక్ చెప్పిన హామీలు అమలు కావడం లేదని ఆక్షేపించారు. ప్రధాని మోదీ వెంట యూఏఈలో పర్యటిస్తున్న విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్ ఈ వివరాలు తెలిపారు. అయితే భారతే కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోందని, గత నెల నుంచి ఇప్పటి వరకు 70 సార్లు కాల్పులు జరిపిందని బాసిత్ అన్నారు. ముందస్తు కాల్పులకు ఎవరు పాల్పడుతున్నారో తేల్చడానికి శక్తిమంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఖండించిన పార్టీలు.. పాక్ కాల్పులను పలు పార్టీలు ఖండించాయి. నియంత్రణ రేఖ వద్ద పరిస్థితిపై జమ్మూకశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో చర్చించారు. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని పాక్ సైన్యం ఇస్లామికేతర చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. పాక్ కాల్పులపై ప్రధాని మోదీ పెదవి విప్పాలని, పాక్‌కు గట్టి సందేశాన్ని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. -
కాశ్మీర్‌పై పాక్‌కు చుక్కెదురు!
జోక్యానికి ఐరాస అయిష్టత చర్చలతో పరిష్కరించుకోవాలని సూచన న్యూయార్క్/జమ్మూ: సరిహద్దులో పదేపదే కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాకిస్థాన్, కాశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి జోక్యం కోసం చేసిన తాజా ప్రయుత్నం ఫలించలేదు. ఈ అంశంపై పాక్ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి పట్టించుకోలేదు. కాశ్మీర్‌పై కలుగజేసుకునేందుకు అరుుష్టత వ్యక్తంచేస్తూ, ఈ అంశంపై భారత్, పాకిస్థాన్‌లు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించింది. సరిహద్దులో ఇటీవలి ఉద్రిక్తతలకు భారతదేశమే కారణమని, సరిహద్దులో పరిస్థితి చక్కదిద్దేందుకు, కాశ్మీర్ సమస్య పరిష్కారానికి జోక్యంచేసుకోవాలని కోరుతూ పాక్ ఇటీవల ఐరాసను కోరింది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మున్కు లేఖ రాశారు. అయితే, కాశ్మీర్ వివాదాన్ని ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకోవాలని బాన్ కీ వుూన్ అభిప్రాయుపడినట్టు బాన్ ప్రతినిధి ఫర్హాన్ చెప్పారు. పాత ఎత్తుగడే.. భారత్: కాశ్మీర్‌పై ఐక్య రాజ్యసమితిని ఆశ్రయించడం పాకిస్థాన్ పాత ఎత్తుగడేనని, ఈ ఎత్తుగడ గతంలో ఫలించలేదని, ఇకపై కూడా ఫలించబోదని భారత్ వ్యాఖ్యానించింది. కాశ్మీర్‌పై చర్చల్లో తృతీయు పక్షానికి ప్రమేయుం కల్పించడం హర్షణీయుం కాదని విదేశాంగశాఖ ప్రతినిధి సయ్యుద్ అక్బరుదీన్ చెప్పారు. కాశ్మీర్‌సహా అన్ని అంశాలపై నేరుగా చర్చలకు భారత్ సువుుఖంగానే ఉందని, అలాంటి చర్చలపై పాక్ ఆసక్తిచూపడంలేదని అన్నారు. కాగా, కాశ్మీర్‌పై జోక్యానికి ఐక్యరాజ్యసమితి తిరస్కృతిపట్ల బీజేపీ హర్షం వ్యక్తంచేసింది. ఇది, నరేంద్ర మోదీ ప్రభుత్వం దౌత్యపరంగా సాధించిన విజయువుని బీజేపీ జమ్మూ కాశ్మీర్ విభాగం పేర్కొంది. ఆర్మీ అధికారుల హాట్‌లైన్ చర్చలు సరిహద్దులో ఉద్రిక్తతల పరిష్కార చర్యలపై భారత్, పాక్ సైన్యాధికారులు వుంగళవారం హాట్లైన్లో వూట్లాడారు. పాక్ మిలిటరీ కార్యకలాపాల డెరైక్టర్, హాట్లైన్లో భారత మిలిటరీ వ్యవహారాల డెరైక్టర్‌తో సంభాషణలు జరిపినట్టు ఓ పాక్ సైన్యాధికారి చెప్పారు. వురోవైపు.., పాకిస్థాన్ వుంగళవారం రెండు సార్లు కాల్పుల విరవుణను ఉల్లంఘించింది. కాశ్మీర్ పూంచ్ జిల్లాలో అధీనరేఖ వెంబడి భారత్‌కు చెందిన పది అవుట్‌పోస్టులపై పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఒక వుహిళ గాయుపడ్డారు. -
ఐరాసలో పాకిస్థాన్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ : ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్‌కు చుక్కెదురు అయ్యింది. కాశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోవాలని పాక్ చేసిన విజ్ఞప్తిని ఐరాస తిరస్కరించింది. కాశ్మీర్ అంశాన్ని చర్చల ద్వారా ఇరు దేశాలు పరిష్కరించుకోవాలని పాకిస్థాన్‌కు ఐక్యరాజ్య సమితి సూచించింది. కాగా కొద్దిరోజులుగా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతున్న పాకిస్థాన్... కాశ్మీర్ అంశంపైకి అంతర్జాతీయంగా దృష్టి మరల్చే యత్నాలను తీవ్రం చేసింది. కాశ్మీర్‌తో సరిహద్దుల వెంబడి ఉద్రిక్త పరిస్థితులపై జోక్యం చేసుకోవాలంటూ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్‌కు లేఖ రాసింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు తోడ్పడాలని విజ్ఞప్తి చేసింది. పాకిస్థాన్ ప్రధాని భద్రత, విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ రాసిన ఈ లేఖను పాక్ విదేశాంగ కార్యాలయం ఆదివారం విడుదల చేసిన విషయం తెలిసిందే. కొద్దివారాలుగా భారత్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, భారీగా కాల్పులకు తెగబడుతోందని ఆ లేఖలో ఆరోపించారు. భారత దళాలు జరిపిన కాల్పుల్లో తమ పౌరులు భారీ సంఖ్యలో మరణించారన్నారు. అక్టోబర్ నెల మొదటి పదిరోజుల్లోనే అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి 22 సార్లు, నియంత్రణ రేఖ వెంబడి 20 సార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించారని ఆరోపించారు. జమ్మూకాశ్మీర్‌లోని నియంత్రణ రేఖతో పాటు అంతర్జాతీయ సరిహద్దుల వద్ద కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొందని.. దీనిపై అత్యవసరంగా దృష్టి సారించాలని బాన్‌కీ మూన్‌ను అజీజ్ కోరారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సుదీర్ఘకాలంగా ఈ జమ్మూకాశ్మీర్ వివాదం ఎజెండాగా ఉందని.. అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిపిస్తామనే తీర్మానాలు కూడా చేసినా, ఇంకా ఆ పని చేపట్టలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఐరాస జోక్యం చేసుకోమని స్పష్టం చేయటంతో పాకిస్థాన్‌కు మరోసారి భంగపాటు ఎదురైందనే చెప్పవచ్చు -
కాశ్మీర్‌పై జోక్యం చేసుకోండి..
ఐక్యరాజ్యసమితి చీఫ్‌కు పాకిస్థాన్ లేఖ భారత్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపణ తమ పౌరులు భారీ సంఖ్యలో మరణించారని లేఖలో పేర్కొన్న పాక్ కాశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణకోసం ఎదురుచూస్తున్నామని వ్యాఖ్య అంతర్జాతీయ సరిహద్దు, ఎల్వోసీ వెంబడి మళ్లీ తెగబడిన పాక్ దళాలు 15 ఔట్‌పోస్టులు, గ్రామాలపైనా భారీగా కాల్పులు ముగ్గురు పౌరులకు గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం ఇస్లామాబాద్/జమ్మూ: కొద్దిరోజులుగా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతున్న పాకిస్థాన్... కాశ్మీర్ అంశంపైకి అంతర్జాతీయంగా దృష్టి మరల్చే యత్నాలను తీవ్రం చేసింది. కాశ్మీర్‌తో సరిహద్దుల వెంబడి ఉద్రిక్త పరిస్థితులపై జోక్యం చేసుకోవాలంటూ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్‌కు లేఖ రాసింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు తోడ్పడాలని విజ్ఞప్తి చేసింది. పాకిస్థాన్ ప్రధాని భద్రత, విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ రాసిన ఈ లేఖను పాక్ విదేశాంగ కార్యాలయం ఆదివారం విడుదల చేసింది. కొద్దివారాలుగా భారత్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, భారీగా కాల్పులకు తెగబడుతోందని ఆ లేఖలో ఆరోపించారు. భారత దళాలు జరిపిన కాల్పుల్లో తమ పౌరులు భారీ సంఖ్యలో మరణించారన్నారు. అక్టోబర్ నెల మొదటి పదిరోజుల్లోనే అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి 22 సార్లు, నియంత్రణ రేఖ వెంబడి 20 సార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించారని ఆరోపించారు. జమ్మూకాశ్మీర్‌లోని నియంత్రణ రేఖతో పాటు అంతర్జాతీయ సరిహద్దుల వద్ద కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొందని.. దీనిపై అత్యవసరంగా దృష్టి సారించాలని బాన్‌కీ మూన్‌ను అజీజ్ కోరారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సుదీర్ఘకాలంగా ఈ జమ్మూకాశ్మీర్ వివాదం ఎజెండాగా ఉందని.. అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిపిస్తామనే తీర్మానాలు కూడా చేసినా, ఇంకా ఆ పని చేపట్టలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇటీవల ఐక్యరాజ్యసమితి సాధారణ సభలోనూ పాక్ ప్రధాని జమ్మూకాశ్మీర్ అంశాన్ని పరిష్కరించాలని కోరారని గుర్తుచేశారు. మరోవైపు భారత్ మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని.. ఇరుదేశాల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక చర్చలను కూడా రద్దుచేసుకుందని పేర్కొన్నారు. తాము రాస్తున్న ఈ లేఖను భద్రతా మండలి అధికారిక పత్రంగా అన్ని దేశాల ప్రతినిధులకు సర్క్యులేట్ చేయాలని బాన్‌కీ మూన్‌ను కోరారు. భారత్‌తో ఉన్న అన్ని వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకొనేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందన్నారు. మళ్లీ భారీగా కాల్పులు.. భారత్‌తో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ దళాలు మళ్లీ భారీ ఎత్తున కాల్పులకు తెగబడ్డాయి. శనివారం రాత్రి జమ్మూ జిల్లా పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఆర్నియా, ఆర్ఎస్ పుర సెక్టార్లలోని 15 భారత ఔట్‌పోస్టులపై మోర్టార్లు, షెల్‌లతో రాత్రంతా విరుచుకుపడ్డాయి. దీంతోపాటు సరిహద్దు వెంబడి ఉన్న ఆర్నియా పట్టణంతో పాటు కుకుదా కోటే, మహషాకోటే, జబోవాల్, చింగియా దేవీగఢ్ తదితర గ్రామాలపైనా కాల్పులు జరపడంతో... ముగ్గురు పౌరులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో జబోవాల్ గ్రామానికి చెందిన ఒకరి పరిస్థితి విషమంగా ఉందని జమ్మూ జిల్లా మెజిస్ట్రేట్ అజిత్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఉదయం వరకూ కూడా కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇక పూంఛ్ జిల్లాలోని బన్వత్-షాపూర్ సెక్టార్ పరిధిలో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద కూడా పాక్ దళాలు కాల్పులకు తెగబడ్డాయని ఒక ఆర్మీ అధికారి తెలిపారు. సైనిక ఔట్‌పోస్టులతో పాటు షాపూర్, కిర్ని, బన్వత్, మందార్, కల్సామ్, దోడా గ్రామాలపైనా మోర్టార్లు, షెల్‌లతో దాడికి పాల్పడినట్లు ఆయన చెప్పారు. దీంతో ఐదు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, ఒక ఇల్లు దహనమైందని.. అయితే ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని వెల్లడించారు. పాకిస్థాన్‌లో అంతర్గత ఉగ్రవాదం నుంచి ప్రపంచదేశాల దృష్టిని కాశ్మీర్ అంశంపైకి మళ్లించేందుకే ఐక్యరాజ్యసమితికి లేఖ రాసిందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేగాకుండా భారత్‌లోకి లష్కరే తొయిబా వంటి ఉగ్రవాద సంస్థల చొరబాటును ప్రొత్సహించేందుకు పాక్ ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. అంతర్జాతీయంగా భారత్ పలుకుబడి పెరుగుతున్న తరుణంలో.. కాశ్మీర్ అంశాన్ని తెరపైకి తేవడానికి, భారత ప్రధాని మోదీని పరీక్షించడానికి పాకిస్థాన్ ఐక్యరాజ్యసమితికి లేఖ రాసిందని ప్రముఖ అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు సి.క్రిస్టిన్ ఫెయిర్ పేర్కొన్నారు. భారత్‌లోకి ఇసిస్, అల్‌కాయిదా వంటి సంస్థలకు చెందిన ఉగ్రవాదులు చొరబడడానికి అవకాశం కల్పించేందుకే.. పాకిస్థాన్ తరచూ కాల్పులకు పాల్పడుతోందని ఆర్మీ మాజీ లెఫ్ట్‌నెంట్ జనరల్ హస్నాన్ చెప్పారు. జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో... అక్కడ అస్థిరత సృష్టించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందన్నారు.