వాషింగ్టన్: కశ్మీర్ అంశంపై నెలకొన్న వివాదాలను భారత్, పాకిస్తాన్ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని యూఎస్ సూచించింది. ఇరు దేశాలు శాంతి స్థాపనకు కృషి చేయాలని.. అది భారత్, పాక్‌తో పాటు ఆసియన్ రీజియన్ పురోగభివృద్ధి ఎంతో కీలకమని యూఎస్ ఉప అధికార ప్రతినిధి మార్క్ టోనర్ అన్నారు.
దవ్యోల్బణం కట్టడికి, ఆర్థిక వృద్ధికి, ఉపాధి అవకాశాల పెంపనకు.. తదితర రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ చర్చలు ద్వారా ఆసియ రీజియన్‌లో ఉద్రిక్తత పరిస్థితులు తొలగిపోతాయని టోనర్ వివరించారు. భారత్, పాక్‌ల మరింత అభివృద్ధి సాధించేందుకు యూఎస్ తోడ్పాటును అందిస్తుందని చెప్పారు.
ఉగ్రవాద అంతానికి భారత్ కలసి పనిచేస్తాం: యూఎస్
పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా నిర్మూలించేలా ఆ ప్రభుత్వంపై అమెరికా ఒత్తిడి పెంచింది. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు భారత్ సహా ఇతర దేశాలతో కలసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని యూఎస్ ఉప అధికార ప్రతినిధి మార్క్ టోనర్ పేర్కొన్నారు. ఉగ్రవాద బాధిత దేశాల్లో భారత్ ఒకటని అన్నారు. స్వదేశంలో ఉగ్రవాద అంతానికి పాక్ పోరాటం చేయాలని సూచించింది. ఆసియా రీజియన్‌లో ఉగ్రవాద నిర్మూలనకు భారత్, పాక్, అఫ్ఘాన్‌తో కలసి యూఎస్ పనిచేస్తుందని అన్నారు.
కశ్మీర్‌పై చర్చలతో పరిష్కరించుకోవాలి: యూఎస్
Published Fri, Jul 1 2016 7:13 PM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM
Advertisement
Advertisement