Mark Toner
-
నోట్ల రద్దుపై అగ్రరాజ్యం ఏమందో తెలుసా?
ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న పెద్దనోట్లు రూ.500, రూ.1000 రద్దుపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. భారత్ తీసుకున్న పెద్దనోట్ల రద్దుకు తాము మద్దతు పలుకుతున్నట్టు అగ్రరాజ్యం అమెరికా గురువారం వెల్లడించింది. అవినీతిని అంతమొందిచడానికి పెద్ద నోట్ల రద్దు ఎంతో ముఖ్యమైన, అవసరమైన చర్యగా అమెరికా అభివర్ణించింది. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలన్నింటికీ ఫుల్‌స్టాఫ్ పెట్టడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని తాము విశ్వసిస్తున్నట్టు స్టేట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ ప్రతినిధి మార్క్ టోనర్ తెలిపారు. '' భారత్‌లో నివసించే, పనిచేసే అమెరికా సిటిజన్లకు దీనిపై సరియైన సమాచారం అందే ఉంటుందని నేను భావిస్తున్నా. వారు పాత నోట్లను మార్చుకుని కొత్త నోట్లను తీసుకునే ఉంటారు. పెద్ద నోట్ల రద్దు వల్ల చాలామంది భారతీయులకు కొంత అసౌకర్యం ఏర్పడింది. భారతీయులతో పాటు అమెరికన్లు ఈ అసౌకర్యం ఏర్పడి ఉండొచ్చు. కానీ తమ రాయబారి ద్వారా అమెరిక సిటిజన్లకు భారత్‌లో జరుగుతున్న మార్పులను గురించి వివరించాం. అవినీతిని నిర్మూలించడానికి పెద్ద నోట్ల రద్దు ఎంతో ముఖ్యమైన చర్య, దీనికి మా మద్దతు ఉంటుంది'' అని టోనర్ చెప్పారు. అవినీతితో పాటు, పన్ను ఎగవేతదారులను టార్గెట్‌గా చేసి ఈ చర్యను భారత్ తీసుకుందని పేర్కొన్నారు. -
పాక్ ‘అణు’ హెచ్చరికలపై అమెరికా ఆగ్రహం
వాషింగ్టన్: భారత్‌తో యుద్ధం వస్తే అణ్వస్త్రాలు వాడతామంటూ పాకిస్థాన్ హెచ్చరించడాన్ని అమెరికా ఆక్షేపించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని, మాటలు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించింది. భారత్‌కు వ్యతిరేకంగా అణ్వస్త్రాలు వాడుతామని, తమపై యుద్ధానికి వస్తే భారత్‌ను నాశనం చేస్తామని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ గత పదిహేను రోజుల్లో రెండుసార్లు హెచ్చరించారు. ఇలాంటి ప్రకటనలు పాకిస్థాన్ నాయకుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అమెరికా విదేశాంగ ప్రతినిధి మార్క్ టోనర్ అన్నారు. పాక్ అణు ఆయుధాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. సామూహిక వినాశనానికి దారి తీసే వీటి భద్రతను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. -
పాక్‌కు యూఎస్ సందేశం
వాషింగ్టన్: అణ్వాయుధాల వాడకం విషయంలో పాకిస్తాన్ నిగ్రహాన్ని పాటించాని అమెరికా సందేశాన్ని పంపింది. పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాద సంస్థల మీద చర్యలు తీసుకోవాలని పాక్‌కు సూచించింది. అణ్వాయుధాలు కలిగిన దేశాలు, వాటి వాడకం విషయంలో నిగ్రహంతో ఉండాల్సిన బాధ్యత ఉందని యూఎస్ ఉప అధికార ప్రతినిధి మార్క్ టోనర్ అన్నారు. పాక్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అణ్వాయుధాలను సైతం వాడడానికి సిధ్దంగా ఉన్నామని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో మార్క్ టోనర్ విలేకరులు అడిగిన ప్రశ్నకు పై విధంగా బదులిచ్చారు. భారత్, పాకిస్తాన్ మధ్య చోటు చేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులను అమెరికా నిశితంగా పరిశీలిస్తోందన్నారు. ఉడీ ఉగ్రదాడుల అనంతరం జరుగుతున్న పరిణామాల తర్వాత తమ వద్ద అణ్వస్త్రాలు ఉన్న విషయాన్ని పాకిస్థాన్ పదే పదే బయటకు చెబుతున్న విషయం తెలిసిందే. భారతదేశంతో ఒకవేళ యుద్ధం అంటూ వస్తే వాటిని ఉపయోగించడానికి ఏ మాత్రం వెనకాడేది లేదని అంటోంది. తమ వద్ద ఉన్న అణ్వస్త్రాలు ఆటబొమ్మలేవీ కావని ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ అన్నారు. ''మా దగ్గర ఉన్న వ్యూహాత్మక ఆయుధాలను మా రక్షణ కోసమే తయారు చేశాం. ఈ ఆయుధాలు ఆటబొమ్మలు ఏమీ కావు. మా క్షేమానికి ఏమైనా ముప్పు ఉందనుకుంటే వాటిని వెంటనే ఉపయోగంలోకి తీసుకొస్తాం'' అని ఆసిఫ్ చెప్పారు. ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తుందన్న భయం ఏమీ లేదని.. కానీ ఖురాన్లో అల్లా చెప్పినట్లు, 'గుర్రాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి' అని ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ అన్నారు. పాకిస్థాన్ మీద ఎప్పుడూ ఒత్తిడి ఉంటూనే ఉందని, అందువల్ల అవసరమైన వాటి కంటే ఎక్కువగా తమదగ్గర వ్యూహాత్మక ఆయుధాలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయంలో తమదే ఆధిక్యం అన్న విషయానికి అంతర్జాతయంగా కూడా గుర్తింపు ఉందని చెబుతూ.. ఎవరైనా తమ గడ్డమీద అడుగుపెట్టినా, తమ అంతర్గత భద్రతకు ముప్పు తేవాలని చూసినా తమ రక్షణ కోసం ఆ ఆయుధాలను ఉపయోగించడానికి వెనుకాడబోమని అన్నారు. భారతదేశంతో యుద్ధం వస్తే పాకిస్థాన్ అణ్వాయుధాలు ఉపయోగిస్తుందా అన్న ప్రశ్నకు.. అది పరిస్థితులను బట్టి ఆధారపడుతుందని, తమ ఉనికి ప్రమాదంలో పడితే తాము అన్నింటినీ ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. అందులో భయపడాల్సింది ఏముందని ఎదురు ప్రశ్నించారు. హిల్లరీ ఆందోళన పాకిస్తాన్లో అణ్వాయుధాలు జీహాదీల చేతుల్లోకి వెళితే పెను ప్రమాదం తప్పదని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ భయాందోళనలు వ్యక్తం చేశారు. తద్వారా అణుఆత్మాహుతి దాడులు జరిగే అవకాశం ఉందన్నారు. ‘జీహాదీలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారన్న భయంతో జీవిస్తున్నాం. వారు అణ్వాయుధాలు హస్తగతం చేసుకుంటారు. ఫలితంగా అణు ఆత్మాహుతి దాడులకు అవకాశం ఏర్పడుతుంది’ అని ఆందోళన వ్యక్తం చేసినట్టు ‘న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది. డెమోక్రటిక్ పార్టీ కంప్యూటర్ల హ్యాకింగ్ ద్వారా హిల్లరీ మాట్లాడిన ఆడియో సారాంశాన్ని పత్రిక వెల్లడించింది.గత ఫిబ్రవరిలో వర్జీనియాలో నిధుల సేకరణ సందర్భంగా ఆమె సన్నిహితులతో ఈ వ్యాఖ్యలు చేశారంది. భారత్‌తో ఉన్న శత్రుత్వంతో పాక్ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందని హిల్ల రీ పేర్కొన్నారు. రష్యా, చైనాతో పాటు పాక్, భారత్ అణ్వాయుధాల్లో పోటీపడుతున్నాయని... ఇది అత్యంత ప్రమాదకర పరిణామమని అన్నారు. -
కశ్మీర్‌పై చర్చలతో పరిష్కరించుకోవాలి: యూఎస్
వాషింగ్టన్: కశ్మీర్ అంశంపై నెలకొన్న వివాదాలను భారత్, పాకిస్తాన్ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని యూఎస్ సూచించింది. ఇరు దేశాలు శాంతి స్థాపనకు కృషి చేయాలని.. అది భారత్, పాక్‌తో పాటు ఆసియన్ రీజియన్ పురోగభివృద్ధి ఎంతో కీలకమని యూఎస్ ఉప అధికార ప్రతినిధి మార్క్ టోనర్ అన్నారు. దవ్యోల్బణం కట్టడికి, ఆర్థిక వృద్ధికి, ఉపాధి అవకాశాల పెంపనకు.. తదితర రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ చర్చలు ద్వారా ఆసియ రీజియన్‌లో ఉద్రిక్తత పరిస్థితులు తొలగిపోతాయని టోనర్ వివరించారు. భారత్, పాక్‌ల మరింత అభివృద్ధి సాధించేందుకు యూఎస్ తోడ్పాటును అందిస్తుందని చెప్పారు. ఉగ్రవాద అంతానికి భారత్ కలసి పనిచేస్తాం: యూఎస్ పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా నిర్మూలించేలా ఆ ప్రభుత్వంపై అమెరికా ఒత్తిడి పెంచింది. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు భారత్ సహా ఇతర దేశాలతో కలసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని యూఎస్ ఉప అధికార ప్రతినిధి మార్క్ టోనర్ పేర్కొన్నారు. ఉగ్రవాద బాధిత దేశాల్లో భారత్ ఒకటని అన్నారు. స్వదేశంలో ఉగ్రవాద అంతానికి పాక్ పోరాటం చేయాలని సూచించింది. ఆసియా రీజియన్‌లో ఉగ్రవాద నిర్మూలనకు భారత్, పాక్, అఫ్ఘాన్‌తో కలసి యూఎస్ పనిచేస్తుందని అన్నారు.