వెంకయ్య సీరియస్
న్యూఢిల్లీ: కశ్మీర్ అంశంపై భారత్ తో అణుయుద్ధం తప్పదని తీవ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ నేత సయీద్ సలాహుదీన్ చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తీవ్రంగా స్పందించారు. కశ్మీర్ అంశంపై మాట్లాడడానికి సలాహుదీన్ ఎవరు, ఈ విషయంపై మాట్లాడే హక్కు అతడికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. సోమవారం పార్లమెంట్ వెలుపల వెంకయ్య మీడియాతో మాట్లాడారు.
పబ్లిసిటీ కోసమే అతడు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నాడని అన్నారు. ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించడం సరైందో, కాదో పాకిస్థాన్ తేల్చుకోవాలని సూచించారు. కశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛ ప్రసాదించకుంటే అణుయుద్ధం తప్పదని, నాలుగో ప్రపంచ యుద్ధం వస్తుందని సలాహుదీన్ వ్యాఖ్యానించాడు.