
కశ్మీర్‌పై పుతిన్ మధ్యవర్తిత్వం!
భారత్–పాకిస్తాన్ మధ్య కశ్మీర్ సహా ద్వైపాక్షిక సమస్యల పరిష్కారంలో మధ్యవర్తిత్వానికి సిద్ధమని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపినట్లు పాక్ పేర్కొంది.
► స్వాగతిస్తున్నామన్న పాక్
► తోసిపుచ్చిన రష్యా, ఖండించిన భారత్
న్యూఢిల్లీ: భారత్–పాకిస్తాన్ మధ్య కశ్మీర్ సహా ద్వైపాక్షిక సమస్యల పరిష్కారంలో మధ్యవర్తిత్వానికి సిద్ధమని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపినట్లు పాక్ పేర్కొంది. గతవారం అస్తానాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో భాగంగా పాకిస్తాన్ ప్రధాని షరీఫ్‌తో వ్యక్తిగత సమావేశంలో పుతిన్ ఈ అభిప్రాయాన్ని వెల్లడించారని వెల్లడించింది.
అయితే.. పుతిన్ మధ్యవర్తిత్వంపై పాక్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని రష్యా స్పష్టం చేసింది. అస్తానాలో షరీఫ్–పుతిన్ మధ్య భారత్–పాక్ అంశంపై చర్చే జరగలేదని భారత్‌లో రష్యా దౌత్యవేత్త స్పష్టం చేశారు. ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఇరుదేశాల సమస్యలు పరిష్కారం కావాలని రష్యా కోరుకుంటోందన్నారు. పాక్ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ ఖండించింది. మధ్యవర్తిత్వంపై రష్యానుంచి తమకెలాంటి సమాచారం లేదని స్పష్టం చేసింది.