ఉగ్రవాదుల దాడుల కారణంగా ఏడేళ్లుగా వేడుకలకు దూరంగా ఉన్న పాక్ సైనిక బలగాలు సోమవారం 'పాకిస్థాన్ పరేడ్ డే'ని ఘనంగా నిర్వహించాయి.
టెర్రరిస్టులతో పోరాటంలో దేశం యావత్తు ఒక్కటయిందని, టెర్రర్ భూతాన్ని పాక్ నుంచి తరిమేస్తామని పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ అన్నారు. ఇస్లామాబాద్లో జరిగిన ప్రధాన వేడుకలో పాల్గొన్న ఆయన.. తాము భారత్తో స్నేహ సంబంధాల్ని కోరుకుంటున్నామని చెప్పారు. ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు ఇరుదేశాలు ఒక అంగీకారానికి వచ్చినట్లయితే ఏళ్లుగా నలుగుతున్న కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని వ్యాఖ్యానించారు. ఆ దిశగా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఉగ్రవాదులతో పోరులో అమరులైన వీర జవాన్లతోపాటు పెషావర్ మృతులకూ నివాళులు అర్పించిన మమ్నూన్.. తాలిబన్ల వేటకోసం పైన్యం అనుసరిస్తున్న 'జర్బ్ ఏ అజబ్' విధానాన్ని ప్రశంసించారు. 1947లో స్వాతంత్ర్యం పొందిన నాటినుంచి పాక్ అనేక సమస్యల్ని ఎదుర్కొంటోందని, ప్రధాని నవాజ్ షరీఫ్ వాటిని పరిష్కరించగల సమర్ధుడేనని అన్నారు.
'పాక్ నుంచి ఆ భూతాన్ని తరిమేస్తాం'
Published Mon, Mar 23 2015 3:14 PM | Last Updated on Sat, Mar 23 2019 8:29 PM
Advertisement