భారత్, పాకిస్తాన్ మధ్య కశ్మీర్ సమస్య పరిష్కారానికి మూడో దేశం (థర్డ్ పార్టీ) మధ్యవర్తిత్వం అవసరమని నేషనల్ కాన్ఫెరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ఇది దేశ అంతర్గత వ్యవహారమని, ఇందులో మూడో దేశం జోక్యం అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కశ్మీర్‌ను నాశనం చేస్తున్నాయని మండిపడ్డారు.