కశ్మీర్ సమస్యపై చైనా
బీజింగ్: భారత్–పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం నెరిపేందుకు చైనా సిద్ధంగా ఉన్నట్టు ఆ దేశ మీడియా వెల్లడించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా వెళ్లే చైనా–పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్‌లో తమ దేశం 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిందని, అందువల్ల కశ్మీర్ సమస్య పరిష్కారం కావడం తమ దేశానికీ అవసరమేనని పేర్కొంది.
దక్షిణాసియా ప్రాంతంలో కీలక పాత్ర పోషించేందుకు చైనా చాలా ఆసక్తిని చూపిస్తోందని అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా నేతృత్వంలో నడిచే గ్లోబల్ టైమ్స్ పత్రికలో ఒక కథనం ప్రచురితమైంది. ఇతర దేశాల అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవడం చైనా అభిమతం కాదని, అయితే విదేశాల్లోని తమ దేశ పెట్టుబడులకు రక్షణ కల్పించే విషయంలో పట్టనట్టు వ్యవహరించబోదని స్పష్టం చేసింది.