దావోస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కరచాలనం
దావోస్: కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కి సాయపడతానంటూ మరోమారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు.. అవసరమైతే బాసటగా ఉంటానంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో సమావేశంలో ట్రంప్ బుధవారం తెలిపారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొన్న ట్రంప్.. పాక్ ప్రధాని ఇమ్రాన్‌తో వేరుగా సమావేశం అయ్యారు. కశ్మీర్ వివాదంపై భారత ప్రధాని మోదీతో మాట్లాడతానని ఇమ్రాన్‌కు హామీ ఇచ్చారు.
కాగా, కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘కశ్మీర్ అంశం భారత్–పాక్‌కు సంబంధించింది. దీంట్లో ఎవ్వరి ప్రమేయాన్ని అంగీకరించే ప్రశ్నే లేదు’ అని పేర్కొంది. పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌ని కలుసుకోవడం తనకు చాలా ఇష్టమనీ, అయితే ఆమె తన కోపాన్ని అమెరికాపై ప్రదర్శించవద్దంటూ ట్రంప్ సూచించారు. అనేక దేశాలు అమెరికా కంటే ఎక్కువ కాలుష్యంతో నిండిఉన్నాయనీ గ్రెటా ఆ ప్రాంతాలపై దృష్టిసారించడం మంచిదని హితవు పలికారు. ట్రంప్ ఉపన్యాసాన్ని ప్రశాంతంగా కూర్చుని విన్న గ్రెటా ‘‘మా ఇళ్లు ఇంకా మంటల్లో కాలుతున్నాయి’’ అని వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment