Mediate
-
కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహిస్తా
దావోస్: కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కి సాయపడతానంటూ మరోమారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు.. అవసరమైతే బాసటగా ఉంటానంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో సమావేశంలో ట్రంప్ బుధవారం తెలిపారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొన్న ట్రంప్.. పాక్ ప్రధాని ఇమ్రాన్‌తో వేరుగా సమావేశం అయ్యారు. కశ్మీర్ వివాదంపై భారత ప్రధాని మోదీతో మాట్లాడతానని ఇమ్రాన్‌కు హామీ ఇచ్చారు. కాగా, కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘కశ్మీర్ అంశం భారత్–పాక్‌కు సంబంధించింది. దీంట్లో ఎవ్వరి ప్రమేయాన్ని అంగీకరించే ప్రశ్నే లేదు’ అని పేర్కొంది. పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌ని కలుసుకోవడం తనకు చాలా ఇష్టమనీ, అయితే ఆమె తన కోపాన్ని అమెరికాపై ప్రదర్శించవద్దంటూ ట్రంప్ సూచించారు. అనేక దేశాలు అమెరికా కంటే ఎక్కువ కాలుష్యంతో నిండిఉన్నాయనీ గ్రెటా ఆ ప్రాంతాలపై దృష్టిసారించడం మంచిదని హితవు పలికారు. ట్రంప్ ఉపన్యాసాన్ని ప్రశాంతంగా కూర్చుని విన్న గ్రెటా ‘‘మా ఇళ్లు ఇంకా మంటల్లో కాలుతున్నాయి’’ అని వ్యాఖ్యానించింది. -
‘అయోధ్య’పై మధ్యవర్తిగా ఉంటా: రిజ్వీ
న్యూఢిల్లీ: అయోధ్యలో బాబ్రీమసీదు–రామమందిరం వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకునేందుకు వీలుగా ఇరుపక్షాలతో చర్చలు జరుపుతానని మైనారిటీల జాతీయ కమిషన్(ఎన్సీఎం) చైర్మన్ ఘయోరుల్ హసన్ రిజ్వీ తెలిపారు. రామమందిరం హిందువుల విశ్వాసానికి సంబంధించిన విషయం అయినందున ముస్లింలు పెద్దమనసు చేసుకోవాలని సూచించారు. అయోధ్యలో మందిర నిర్మాణానికి ముస్లింలు అంగీకరిస్తే, కాశి, మధుర సహా మిగతా ప్రాంతాల్లోని మసీదుల విషయంలో హిందూసంస్థలు వెనక్కి తగ్గేలా కృషి చేస్తానన్నారు. -
శాంతికోసం రంగంలోకి దిగుతా
వాషింగ్టన్:భారత్, పాకిస్థాన్ లు సంయమనం పాటించాలని, శాంతి కోసం ముందడుగు వేయాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ విజ్ఞప్తి చేశారు. అవసరమైతే ఇరు దేశాలతో మాట్లాడటానికి తాను సిద్దమని ప్రకటించారు. ఇటీవలి సర్జికల్ స్ట్ర్రైక్ అనంతరం ఇరు దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో బాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, పాక్ లు అంగీక.రిస్తే ఇరు దేశాల ఉన్నతాధికారులతో కశ్మీర్ తో సహా అనేక విషయాలపై చర్చించడానికి తాను సిద్ధమని పేర్కొన్నారు. సెప్టెంబర్ 18 న ఉడీలోని సైనిక క్యాంపు కార్యాలయంపై పాక్ ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనలో 19 మంది జవాన్లు మరణించారు. మరికొంత మంది ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కశ్మీర్లో దాడులు చేసేందుకు పొంచి ఉన్నారన్న సమాచారంతో ఇండియన్ ఆర్మీ సెప్టెంబర్ 28,29 న 'సర్జికల్ స్ట్ర్రైక్' పేరుతో దాడులు నిర్వహించి 40 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది.