China visit
-
మాల్దీవుల్లో విదేశీ జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నాం: చైనా
బీజింగ్: మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నామని చైనా పేర్కొంది. మాల్దీవుల సార్వ భౌమత్వం, స్వాతంత్య్రాలకు తమ మద్దతు ఉంటుందని తెలిపింది. మాల్దీవుల అధ్యక్షు డు ముయిజ్జు చైనాలో అయిదు రోజుల పర్యటన శుక్రవారంతో ముగియ నుంది. ఈ సందర్భంగా రెండు దేశాలు తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు పరస్ప రం మద్దతుగా నిలవాలంటూ ఒక ప్రకటన విడుదలైంది. ‘మాల్దీవుల సార్వభౌమాదికారం, స్వాతంత్య్రం, జాతి గౌరవాన్ని నిలబెట్టడంలో చైనా గట్టిగా మద్దతిస్తుంది. మాల్దీవుల విధానాలను గౌరవిస్తుంది, మద్దతు ఇస్తుంది. మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో బాహ్య జోక్యాన్ని వ్యతిరే కిస్తుంది’అని అందులో పేర్కొంది. భారత ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను అధ్యక్షుడు ముయిజ్జు తొలగించడం, ఈ వ్యవహారం ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తలు పెంచడం తెలిసిందే. ఈ సమయంలోనే చైనా అనుకూలుడిగా పేరున్న ముయిజ్జు బీజింగ్ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. పర్యటన అనంతరం చైనాపై ప్రకటన విడుదల చేయడం గమనార్హం. -
అయిదేళ్ల తర్వాత బీజింగ్‌కు బ్లింకెన్
బీజింగ్: అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆదివారం ఉదయం చైనా రాజధాని బీజింగ్‌కు చేరుకున్నారు. చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్‌తో ఆయన భేటీ అయ్యారు. తైవాన్ అంశం, ఉక్రెయిన్ యుద్ధం తదితర కీలక అంశాలపై వారు చర్చలు జరిపారు. అనంతరం అధికార విందులో పాల్గొన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా బ్లింకెన్ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కూడా కలుస్తారని సమాచారం. రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న సమయంలో బ్లింకెన్ చేపట్టిన ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాధారణ సంబంధాలపై ఇరుపక్షాలు ఆసక్తితో ఉన్నప్పటికీ, బ్లింకెన్ పర్యటనతో కీలక పరిణామాలకు అవకాశాలు తక్కువని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ వ్యాఖ్యానించడం గమనార్హం. -
అమెరికా అణుస్థావరంపై చైనా బెలూన్
వాషింగ్టన్/బీజింగ్: చైనాకు చెందిన నిఘా బెలూన్ అమెరికా గగనతలంపై, అదీ అణు స్థావ రం వద్ద తచ్చాడటం కలకలం రేపింది. దీనిపై అమెరికా తీవ్రంగా స్పందించింది. విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చైనా పర్యటనను వాయిదా వేసుకున్నారు. మూడు బస్సుల పరిమాణంలో ఉన్న ఈ బెలూన్ కొన్ని రోజులుగా తమ గగనతలంలో అగుపిస్తోందని, అది గురువారం మోంటానాలో ప్రత్యక్షమైందని పెంటగాన్ పేర్కొంది. అది అత్యంత ఎత్తులో ఎగురుతున్నందున వాణిజ్య విమానాల రాకపోకలకు అంతరాయమేమీ లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో సున్నిత సమాచారం లీకవకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించింది. బెలూన్ను కూల్చేస్తే దాని శకలాల వల్ల ప్రజలకు హాని కలగవచ్చని ఆర్మీ భావిస్తోంది. అన్ని అంశాలను అధ్యక్షుడు బైడెన్‌కు వివరించినట్లు పెంటగాన్ ప్రకటించింది. అమెరికాలోని మూడు భూగర్భ అణు క్షిపణి కేంద్రాల్లో ఒకటి మోంటానాలోనే ఉంది. దాంతో ఈ పరిణామం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. చైనాతో చర్చల నిమిత్తం శుక్రవారం రాత్రి బయల్దేరాల్సిన విదేశాంగ మంత్రి బ్లింకెన్ పర్యటన వాయిదా పడింది. వాతావరణ పరిశోధన కోసం ప్రయోగించిన బెలూన్ దారి తప్పి అమెరికా గగనతలంలోకి ప్రవేశించిందని చైనా పేర్కొంది. ఈ అనుకోని పరిణామానికి చింతిస్తున్నట్టు చెప్పింది. ఈ వివరణతో అమెరికా సంతృప్తి చెందలేదు. ‘‘మా గగనతలంలోకి చైనా బెలూన్ రావడం మా సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే. చైనా చర్య ఆమోదయోగ్యం కాదు. ఈ సమయంలో బ్లింకెన్ పర్యటన సరికాదని భావిస్తున్నాం’’ అని అమెరికా అధికారి ఒకరన్నారు. పరిస్థితులు అనుకూలించాక బ్లింకెన్ చైనా పర్యటన ఉంటుందన్నారు. -
భారత విద్యార్థులకు గుడ్‌న్యూస్.. చైనా కీలక ప్రకటన
బీజింగ్: కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో చైనా నుంచి వందల మంది భారత విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు. కోవిడ్ ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపు రెండేళ్లుగా ఇక్కడే ఉండిపోయారు. తాజాగా వీసాలపై నిరీక్షణకు తెరదించుతూ భారత విద్యార్థులకు చైనా శుభవార్త అందించింది. దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి చైనాకు వెళ్లేందుకు వీసాలు జారీ చేసే ప్రణాళిక చేస్తున్న ప్రకటించింది. స్టూడెంట్ వీసాలతో పాటు బిజినెస్ వంటి వివిధ కేటగిరీల వీసాలు సైతం జారీ చేయనున్నట్లు డ్రాగన్ విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. ‘భారత విద్యార్థులకు శుభాకాంక్షలు. మీ సహనం విలువైనదని రుజువైంది. నేను నిజంగా మీ ఉత్సాహాన్ని, సంతోషాన్ని పంచుకోగలను. తిరిగి చైనాకు వచ్చేందుకు స్వాగతం.’ అంటూ ట్వీట్ చేశారు చైనా విదేశాంగ శాఖ ఆసియా వ్యవహారాల కౌన్సెలర్ జి రోంగ్. భారత విద్యార్థులు, వ్యాపారవేత్తలు, కుటుంబాలకు వర్కింగ్ వీసాల జారీపై న్యూఢిల్లీలోని చైనా ఎంబసీ వివరణాత్మక ప్రకటనను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ ప్రకటన ప్రకారం చైనాలో ఉన్నత విద్య చదవాలనుకుంటున్న కొత్త విద్యార్థులు, చైనా నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులకు ఎక్స్1 వీసాలు జారీ చేయనున్నారు. కొత్తగా వెళ్లే విద్యార్థులు ఒరిజినల్ అడ్మిషన్ లెటర్‌ను అందించాల్సి ఉంటుంది. మిగిలిన వారు చైనా యూనివర్సిటీల నుంచి అనుమతి పత్రాలను అందించాలి. చైనాలో కరోనా ఆంక్షలతో స్వదేశానికి తిరిగి వచ్చి సుమారు 23వేల మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. రెండేళ్లుగా తిరిగి వెళ్లేందుకు వీసాల కోసం నిరీక్షిస్తున్నారు. చైనాకు తిరిగి వచ్చే విద్యార్థుల వివరాలను అందించాలని ఇటీవలే చైనా కోరింది. దీంతో వందల మంది విద్యార్థుల జాబితాను చైనాకు అందించింది భారత్. సుమారు 1000 మంది పాత విద్యార్థులు చైనాకు తిరిగి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు.. ఇరు దేశాల మధ్య నేరుగా విమాన రాకపోకలు లేకపోవటం విద్యార్థులకు ఇబ్బంది కలిగించనుంది. కొద్ది వారాల క్రితం శ్రీలంక, పాకిస్థాన్, రష్యా సహా పలు దేశాలకు చెందిన విద్యార్థులు చార్టెడ్ ఫ్లైట్స్ ద్వారా చైనాకు చేరుకున్నారు. ఇదీ చదవండి: తైవాన్‌లో అమెరికా గవర్నర్ పర్యటన.. చైనా ఎలా స్పందిస్తుందో? -
ఎంత పనిచేశావ్.. సుబ్రహ్మణ్యం!!
అర్ధంతరంగా చైనా నుంచి తిరిగొచ్చిన జైట్లీ.. న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తన చైనా పర్యటనను ఒకరోజు ముందే ముగించుకొని స్వదేశం చేరుకున్నారు. సొంత పార్టీ బీజేపీకి చెందిన ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తనపై, తన మంత్రిత్వశాఖ సీనియర్ అధికారులపై ఆరోపణల దాడితో విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఆయన అర్ధంతరంగా చైనా పర్యటన ముగించుకొని భారత్ వచ్చారు. నాలుగు రోజుల పర్యటన కోసం జైట్లీ ఈ నెల 24న చైనా వెళ్లారు. ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన తన షెడ్యూల్లోని సమావేశాలన్నింటినీ హడావిడిగా చేపట్టి.. ఒకరోజు ముందే స్వదేశం చేరారు. చైనా ఆర్థిక మంత్రి లౌ జీవీ, చైనా జాతీయ అభివృద్ధి, సంస్కరణల కమిషన్ చైర్మన్ జు షావోషితో జైట్లీ నిజానికి సోమవారం సమావేశం కావాల్సి ఉంది. అయితే ఆదివారం రాత్రే భారత్ చేరుకునే ఉద్దేశంతో ఆయన అదే రోజు ఈ ఇద్దరితో సమావేశమయ్యారు. కారణాలేమిటి? ఆర్థికమంత్రి జైట్లీ అర్ధంతరంగా చైనా పర్యటన ముగించుకొని భారత్ తిరిగి రావడానికి సుబ్రహ్మణ్య స్వామి చేస్తున్న ఆరోపణలే కారణమని వినిపిస్తోంది. తీవ్ర ఆరోపణలతో సొంత పార్టీలోనే ప్రకంపనలు రేపుతున్న స్వామి తీరుతో జైట్లీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అయితే, జైట్లీ సోమవారం ప్రధాని నరేంద్రమోదీతో జరిపిన భేటీలో మాత్రం స్వామి ఆరోపణల అంశం ప్రస్తావనకు రాలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నోరుమూసుకో స్వామీ..! కాగా జైట్లీపై ఆరోపణలతో చెలరేగిపోతున్న సుబ్రహ్మణ్య స్వామిపై బీజేపీ అధినాయకత్వం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. జైట్లీ, ఆర్థికశాఖ విషయంలో స్వామిని నోరుమెదపకుండా ఉండాలని బీజేపీ అధినాయకత్వం ఘాటుగా సూచించినట్టు తెలిసింది. పార్టీకి ఉపయోగపడతారని గత ఏప్రిల్‌లో ఫైర్‌బ్రాండ్ నాయకుడు స్వామిని బీజేపీ రాజ్యసభకు ఎన్నిక చేసిన సంగతి తెలిసిందే. కానీ, ఎంపీ అయిన తర్వాత స్వామి మాత్రం సొంత పార్టీని ఇరకాటంలో పెట్టేలా.. జైట్లీ లక్ష్యంగా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. -
చైనాతో సరిహద్దు సమస్యే ప్రధాన అజెండా: మన్మోహన్
చైనాతో సరిహద్దు సమస్య గురించి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ చర్చించనున్నారు. చైనా, రష్యా దేశాలకు ఐదు రోజుల పర్యటన కోసం ఆదివారం ప్రధాని బయల్దేరి వెళ్లారు. చైనాతో సరిహద్దు సహకార ఒప్పందం తన పర్యటనలో ప్రధాన అజెండా అని అంతకుముందు ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారానికి చైనాతో చర్చించనున్నట్టు మన్మోహన్ తెలిపారు. చైనా, భారత్ మధ్య ఎప్పటినుంచో సమస్యలున్నాయని చెప్పారు. ఇరు దేశాల ప్రభుత్వాలు స్నేహిపూర్వక వాతావరణంలో నిబద్ధతతో చర్చిస్తాయని వివరించాయి. ఈ పర్యటనలో చైనా అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్.. మన్మోహన్‌కు విందు ఇవ్వనున్నారు.