చైనాతో సరిహద్దు సమస్యే ప్రధాన అజెండా: మన్మోహన్
చైనాతో సరిహద్దు సమస్య గురించి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ చర్చించనున్నారు. చైనా, రష్యా దేశాలకు ఐదు రోజుల పర్యటన కోసం ఆదివారం ప్రధాని బయల్దేరి వెళ్లారు. చైనాతో సరిహద్దు సహకార ఒప్పందం తన పర్యటనలో ప్రధాన అజెండా అని అంతకుముందు ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారానికి చైనాతో చర్చించనున్నట్టు మన్మోహన్ తెలిపారు.
చైనా, భారత్ మధ్య ఎప్పటినుంచో సమస్యలున్నాయని చెప్పారు. ఇరు దేశాల ప్రభుత్వాలు స్నేహిపూర్వక వాతావరణంలో నిబద్ధతతో చర్చిస్తాయని వివరించాయి. ఈ పర్యటనలో చైనా అధ్యక్షుడు గ్జి జిన్పింగ్.. మన్మోహన్కు విందు ఇవ్వనున్నారు.