USA University Students Protests Against Joe Biden Over Israel Attacks, Details Inside | Sakshi
Sakshi News home page

బైడెన్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల భారీ నిరసనలు.. కొనసాగుతున్న అరెస్ట్‌లు..

Published Thu, Apr 25 2024 1:39 PM | Last Updated on Thu, Apr 25 2024 1:39 PM

USA University Students Protests Against Joe Biden Over Israel Attacks - Sakshi

వాషింగ్టన్‌: గాజాపై ఇజ్రాయెల్‌ దాడుల ఘటన తాజాగా అమెరికాను తాకింది. గాజాపై దాడులకు వ్యతిరేకంగా అగ్ర రాజ్యం అమెరికాలో నిరసనలు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి. అధ్యక్షుడు జో బైడెన్‌కు వ్యతిరేకంగా అమెరికాలోని పలు యూనివర్సిటీ విద్యార్థులు నిరసనలకు దిగారు. దీంతో, ఉద్రిక్తత నెలకొనడంతో 133 మంది విద్యార్థులను అరెస్ట్‌ చేశారు. 

వివరాల ప్రకారం.. గాజాపై దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా బైడెన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికాలో విద్యార్థులు నిరసనలకు దిగారు. రోడ్లకు మీదకు వచ్చి భారీస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిరసనల్లో భాగంగా అమాయకులైన పాలస్తీనా మహిళలు, చిన్నారుల మరణాలకు బైడెన్‌ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

 

 

 

కాగా.. అమెరికాలోని యేల్‌, ఎంఐటీ, హార్వర్డ్‌, కొలంబియా తదితర యూనివర్సిటీల్లో విద్యార్థులు నిరసనలు చేపట్టారు. దీంతో, అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు దాదాపు 133 మంది విద్యార్థులను అరెస్ట్‌ చేశారు. ఇక, విద్యార్థుల ఆందోళనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు.. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో కొలంబియా యూనివర్సిటీలో తరగతి గదులను మూసివేశారు. మిగిలిన సెమిస్టర్‌కు హైబ్రీడ్‌ పద్దతిని అనుసరించనుంది. ఇక, తరగతులు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని కొలంబియా యూనివర్సిటీ ప్రెసిడెంట్‌ తెలిపారు.

 

 

 


ఇదిలా ఉండగా.. గాజాపై యుద్ధానికి వ్యతిరేకంగా చాలా కళాశాలల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. విశ్వవిద్యాలయాల రోజువారీ కార్యకలాపాలకు విద్యార్థులు ఆటంకం కలిగిస్తున్నారు. ఇక, సోమవారం విద్యార్థులతో పాటు. ప్రొఫెసర్లు కూడా పాలస్తీనా అనుకూల ప్రదర్శనల్లో పాల్గొన్నారు. కొలంబియా యూనివర్సిటీలో జరిగిన అరెస్టులకు నిరసనగా, బోస్టన్‌, హార్వర్డ్‌, మసాచుసెట్స్‌ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు తరగతులు బహిష్కరించారు.

 

 


న్యూయార్క్‌ యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని, పలువురు విద్యార్థులను అరెస్టుచేసినట్టు తెలుస్తోంది. ఇ‍క, కాలిఫోర్నియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల విద్యార్థులు 15 గుడారాలను ఏర్పాటు చేశారు. కాగా, విద్యార్థులు చేపట్టిన ఆందోళనను వైట్‌ హౌస్‌ ఖండించింది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement