ప్రపంచదేశాలను కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. అతి తక్కువ కాలంలోనే వందలాది దేశాలకు విస్తరించింది. లక్షలాది మంది ప్రాణాలను కూడా హరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా కరోనా కేసులే నమోదుకాని దేశాలు ఉన్నాయంటే నమ్మగలమా..? కానీ ఇది నిజం. ప్రపంచ వ్యాప్తంగా యూఎన్‌ఓ 193 దేశాలను అధికారికంగా గుర్తించింది. అందులోని 12 దేశాల్లో జూలై 19,2020 నాటికి ఎటువంటి కోవిడ్ కేసులు నిర్ధారించబడలేదు. ఈ దేశాలలో చాలా వరకు ఓషియానియాలోని పసిఫిక్ మహాసముద్ర ద్వీపదేశాలే ఉన్నాయి.
వివరాలు:
ఉత్తరకొరియా, పలావు, సమోవా, వనాటు, టువాలు, మార్షల్ దీవులు, పలావు, నౌరు, కిరిబాటి, మైక్రోనేషియా, సోలమన్ దీవులు, టోంగా దేశాలలో ఒక్క కరోనా వైరస్ కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment