Tata Family Tree: టాటా వంశవృక్షం ఇదే.. | TATA Family Tree, Know About Family Background Of Ratan Tata In Telugu | Sakshi
Sakshi News home page

TATA Family Tree: టాటా వంశవృక్షం ఇదే..

Published Thu, Oct 10 2024 12:24 PM | Last Updated on Thu, Oct 10 2024 1:24 PM

Tata Family Tree

టాటా గ్రూప్ దేశంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థగా గుర్తింపు పొందింది. టాటా గ్రూప్‌లో దాదాపు 100 కంపెనీలు ఉన్నాయి. టాటా గ్రూప్ ఉత్పత్తులు ప్రపంచంలోని దాదాపు 150 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. టాటా గ్రూప్ 1868లో ట్రేడింగ్ కంపెనీగా ప్రారంభమైంది. ఈ కంపెనీ అధిపతి రతన్ టాటా ఇప్పుడు మన మధ్య లేరు.

టాటా గ్రూప్ వంశవృక్షాన్ని పరిశీలిస్తే ఈ కుటుంబంలో పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు. టాటా కుటుంబ వ్యాపారానికి రతన్ దొరబ్ టాటా  పునాది వేశారు. ఆయనకు ఇద్దరు సంతానం. వారు బాయి నవాజ్‌బాయి రతన్ టాటా, నుస్సర్వాన్‌జీ రతన్ టాటా. నుస్సర్వాన్‌జీ ఒక పార్సీ పండితుడు. ఈ కుటుంబం నుంచి వ్యాపారంలోకి అడుగుపెట్టిన మొదటి వ్యక్తి. అతను 1822లో జన్మించి 1886లో మరణించారు.  

జంషెడ్జీ టాటా
నుస్సర్వాన్‌జీ టాటాకు ఐదుగురు సంతానం. వారిలో ప్రముఖ వ్యాపారవేత్త జంషెడ్జీ టాటా ఒకరు. అతను టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు. టాటా గ్రూప్‌లోని స్టీల్ (టాటా స్టీల్), హోటళ్లు (తాజ్ మహల్) వంటి ప్రధాన వ్యాపారాలకు పునాది వేశారు. ఆయనను భారతీయ పరిశ్రమ పితామహునిగా పిలుస్తారు. అతని జీవిత కాలం 1839 నుండి 1904.

దొరాబ్జీ టాటా
దొరాబ్జీ టాటా జంషెడ్జీ టాటా పెద్ద కుమారుడు. జంషెడ్జీ టాటా తర్వాత టాటా గ్రూప్ వ్యాపారాన్ని ఆయనే చేపట్టారు. అతని జీవిత కాలం 1859-1932. టాటా పవర్ వంటి వ్యాపారాలను నెలకొల్పడంలో దొరాబ్జీ కీలక పాత్ర పోషించారు.

రతన్ జీ టాటా
రతన్‌జీ టాటా జంషెడ్జీ టాటా చిన్న కుమారుడు. అతని జీవితకాలం 1871 నుండి 1918. అతను టాటా గ్రూప్‌నకు పత్తి- వస్త్ర పరిశ్రమల వంటి వ్యాపారాలను జోడించారు.

జేఆర్‌డీ టాటా
జేఆర్‌డీ టాటా పూర్తి పేరు జహంగీర్ రతన్ జీ దాదాభాయ్ టాటా. అతని జీవితకాలం 1904-1993. ఇతను రతన్‌జీ టాటా, సుజానే బ్రియర్‌ల కుమారుడు. 50 ఏళ్లకు పైగా టాటా గ్రూప్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. టాటా ఎయిర్‌లైన్స్‌ను జెఆర్‌డి టాటా స్థాపించారు. ఈ విమానయాన సంస్థ పేరు ఎయిర్ ఇండియా.

నావల్ టాటా
నావల్ టాటా జీవిత కాలం 1904- 1989. ఇతను రతన్‌జీ టాటా దత్తపుత్రుడు. రతన్ నావల్ టాటా 1991 నుండి 2012 వరకు టాటా గ్రూప్‌కు ఛైర్మన్‌గా, 2016-17మధ్యలో తాత్కాలిక ఛైర్మన్‌గా ఉన్నారు. జాగ్వార్ ల్యాండ్ రోవర్ , టెట్లీ వంటి అంతర్జాతీయ బ్రాండ్‌ల కొనుగోలులో నావల్ టాటా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈయన టాటా ఇంటర్నేషనల్‌కు చైర్మన్‌గా కూడా ఉన్నారు.

రతన్ టాటా
రతన్ టాటా జీవిత కాలం 1937 నుండి 2024. ఈయన నావల్ టాటా, సునీ కమిషరియట్‌ల కుమారుడు. రతన్ టాటా భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్తగా  గుర్తింపు పొందారు.

నోయల్ టాటాకు ముగ్గురు కుమారులు
రతన్ టాటా వరుస సోదరుడు నోయెల్ టాటా ముగ్గురు సంతానం. వారు మాయా టాటా, నెవిల్లే టాటా, లియా టాటా. ఈ ముగ్గురూ టాటా గ్రూప్‌లో వేర్వేరు వ్యాపారాలను పర్యవేక్షిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: టాటా గ్రూప్‌ వ్యాపార వివరాలు తెలిపే వీడియో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement