‘మహా’ ఒప్పందంతో తెలంగాణకు అన్యాయం | "Great," the TRS contract, unfair | Sakshi
Sakshi News home page

‘మహా’ ఒప్పందంతో తెలంగాణకు అన్యాయం

Published Sun, Aug 28 2016 12:11 AM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM

"Great," the TRS contract, unfair

  • టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి
  • వరంగల్‌ : గోదావరిపై నిర్మించనున్న బ్యారేజ్‌ల కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పం దం కారణంగా తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యా యం జరగనుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. హన్మకొండలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1954నుంచి గోదావరి జలాల వివాదం ప్రారంభం కాగా అప్పటి సీఎం వెంగళరావు, మ హారాష్ట్ర సీఎం ఎస్‌బీ.చవాన్‌ మధ్య జరిగిన చర్చ ల్లో భాగంగా రాష్ట్రంలో లెండి, లోయన్‌ పెన్‌గంగ, ప్రాణహిత ప్రాజెక్టుల నిర్మాణానికి నిర్ణయం తీసుకుని టెక్నికల్‌ కమిటీని నియమించారని తెలిపా రు. అయితే, పలుకారణాలతో నిర్మాణాలు ఆల స్యమయ్యాయన్నారు. 2012లో ఇరు రాష్ట్రాల సీఎంలు కిరణ్‌కుమార్‌రెడ్డి, పృథ్వీరాజ్‌చవాన్‌ సమావేశమై 152 మీటర్ల ఎత్తుకు బ్యారేజీ నిర్మిం చాలని అంగీకారం కుదుర్చుకున్నారని ప్రకాష్‌రెడ్డి తెలిపారు. కానీ ఇప్పుడు ప్రాజెక్టుల రీడిజైన్‌ పేరు తో 148మీటర్లకు కేసీఆర్‌ ఒప్పుకోవడం వల్ల తె లంగాణకు తీదని అన్యాయం జరగనుందన్నారు. కాగా, ఒ ప్పందంపై సీఎం కేసీఆర్‌ వైఖ రిని నిరసిస్తూ ఈనెల 29న హైదరాబాద్‌లో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 
    అప్పుల్లోకి నెట్టారు..
    తెలంగాణ ఏర్పాటు సమయం లో రూ.8వేల కోట్ల మిగులు బడ్జెట్‌ ఉండగా కేసీఆర్‌ అప్పుల ఊబిలోకి లాగారని టీడీపీ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి సీతక్క విమర్శించారు. పార్టీ ప్ర ధాన కార్యదర్శి ఈగ మల్లేశం మాట్లాడుతూ తన పాలనపై ప్రజలు ఆలోచన చేయకుండా ఉండేం దుకు సీఎం మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారన్నారు.
    30న బంద్‌కు మద్దతు
    చారిత్రక వరంగల్‌ను రెండు జిల్లాలుగా చేసేం దు కు ప్రభుత్వం జారీ చేసిన ముసాయిదాను రద్దు చేసుకోవాలనే డిమాండ్‌తో అఖిలపక్షం ఈనెల 30 న చేపట్టిన బంద్‌కు టీడీపీ మద్దతు ప్రకటిస్తోందని జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణ తెలిపారు. ఈమేరకు శనివారం జరిగిన పార్టీ సమావేశంలో తీర్మానం చేశామన్నారు. అలాగే, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 31న కలెక్టరేట్‌ ఎదు ట ధర్నా చేయనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు గట్టు ప్రసాద్, పుల్లూరు అశోక్‌కుమార్, మార్గం సారంగం, రహీం, సంతోష్, సాంబయ్య, విజయ్‌ పాల్గొన్నారు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement