ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం(మెడిటేషన్ సెంటర్) మన భారతదేశంలోనే కొలువుదీరింది. ఈ భారీ నిర్మాణంతో భారత్ అధ్యాత్మకి వికాసానికి పెద్ద పీఠవేస్తూ శాంతియుతంగా ఉండేలా చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆ అతిపెద్ద ధ్యాన కేంద్రం ఎక్కడ ఉందంటే..?
ఆ అతిపెద్ద ధ్యాన కేంద్రం(మెడిటేషన్ సెంటర్) ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ నియోజకవర్గమైన వారణాసిలో ఉంది. దీన్ని ప్రధాని మోదీ సోమవారమే ప్రారంభించారు. ఈ ధ్యాన కేంద్రం పేరు 'స్వర్వేద్ మహామందిర్'. ఆధ్యాత్మికంగా దైవత్వ వైభవానికి ఆ ధ్యాన కేంద్రం ప్రధాన ఆకర్షణ అని మోదీ పేర్కొన్నారు. ఇది భారతదేశ సామాజిక ఆధ్యాత్మిక బలానికి అత్యాధునిక చిహ్నం ఈ స్వర్వేద్ మహామందిర్. ఈ ప్రారంభోత్సవంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు.
ఈ మందిర్‌కి సంబంధించిన ఆసక్తికర విశేషాలు..
- ఇది ఏడు అంతస్తుల నిలయం. దీన్ని సుమారు మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. దాదాపు 125 రేకుల తామర గోపురాల డిజైన్‌తో అత్యంత అద్దంగా తీర్చిదిద్దారు. అంతేగాదు ఒకేసారి 20 వేలమంది కూర్చొగలిగే సామర్థ్యం కలది.
- దీన్ని వారణాసి సిటీ సెంటర్‌కి దాదాపు 12 కి.మీ దూరంలో ఉమరహా ప్రాంతంలో నిర్మించారు. ఈ ఆలయం మకరతోరణంపై దాదాపు 3 వేలకు పైగా స్వర్వేద్ శ్లోకాలు చెక్కారు.
- ఈ గుడి గోడల చుట్టూ గులాబీరంగు ఇసుకరాయి మంచి అలంకరణగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తలుపులపై శిల్ప కళా నైపుణ్యం తెలియజేశాలా పలు శిల్పాలను చెక్కారు. పైగా ఇందులో దాదాపు 101 పౌంటైన్‌లు ఉన్నాయి.
- 2004లో ప్రారంభమైన ఈ మహామందిర్ నిర్మాణం 15 మంది ఇంజనీర్లు, సుమారు 600 మంది కార్మికులు కృషి ఫలితం. విహంగం యోగా వ్యవస్థాపకుడు సదాఫల్ డియోజీ మహారాజ్ రచించిన గ్రంథం స్వర్వేదానికి ఈ మహామందిరాన్ని అంకితం చేసినట్లు ఆలయ వెబ్‌సైట్ తెలిపింది. ఈ మహామందిర్ దాని అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రకాశంతో యావత్ మానవాళిని ప్రకాశవంతం చేయడమే గాక ఈ ప్రంపంచాన్ని సదా శాంతియుతంగా ఉండేలా అప్రమత్తం చేస్తుందని ఆలయ వెబ్‌సైట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment