Fountains
-
Swarved: ఆధ్యాత్మిక బలానికి అత్యాధునిక చిహ్నం
ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం(మెడిటేషన్ సెంటర్) మన భారతదేశంలోనే కొలువుదీరింది. ఈ భారీ నిర్మాణంతో భారత్ అధ్యాత్మకి వికాసానికి పెద్ద పీఠవేస్తూ శాంతియుతంగా ఉండేలా చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆ అతిపెద్ద ధ్యాన కేంద్రం ఎక్కడ ఉందంటే..? ఆ అతిపెద్ద ధ్యాన కేంద్రం(మెడిటేషన్ సెంటర్) ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ నియోజకవర్గమైన వారణాసిలో ఉంది. దీన్ని ప్రధాని మోదీ సోమవారమే ప్రారంభించారు. ఈ ధ్యాన కేంద్రం పేరు 'స్వర్వేద్ మహామందిర్'. ఆధ్యాత్మికంగా దైవత్వ వైభవానికి ఆ ధ్యాన కేంద్రం ప్రధాన ఆకర్షణ అని మోదీ పేర్కొన్నారు. ఇది భారతదేశ సామాజిక ఆధ్యాత్మిక బలానికి అత్యాధునిక చిహ్నం ఈ స్వర్వేద్ మహామందిర్. ఈ ప్రారంభోత్సవంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. ఈ మందిర్‌కి సంబంధించిన ఆసక్తికర విశేషాలు.. ఇది ఏడు అంతస్తుల నిలయం. దీన్ని సుమారు మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. దాదాపు 125 రేకుల తామర గోపురాల డిజైన్‌తో అత్యంత అద్దంగా తీర్చిదిద్దారు. అంతేగాదు ఒకేసారి 20 వేలమంది కూర్చొగలిగే సామర్థ్యం కలది. దీన్ని వారణాసి సిటీ సెంటర్‌కి దాదాపు 12 కి.మీ దూరంలో ఉమరహా ప్రాంతంలో నిర్మించారు. ఈ ఆలయం మకరతోరణంపై దాదాపు 3 వేలకు పైగా స్వర్వేద్ శ్లోకాలు చెక్కారు. ఈ గుడి గోడల చుట్టూ గులాబీరంగు ఇసుకరాయి మంచి అలంకరణగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తలుపులపై శిల్ప కళా నైపుణ్యం తెలియజేశాలా పలు శిల్పాలను చెక్కారు. పైగా ఇందులో దాదాపు 101 పౌంటైన్లు ఉన్నాయి. 2004లో ప్రారంభమైన ఈ మహామందిర్ నిర్మాణం 15 మంది ఇంజనీర్లు, సుమారు 600 మంది కార్మికులు కృషి ఫలితం. విహంగం యోగా వ్యవస్థాపకుడు సదాఫల్ డియోజీ మహారాజ్ రచించిన గ్రంథం స్వర్వేదానికి ఈ మహామందిరాన్ని అంకితం చేసినట్లు ఆలయ వెబ్సైట్ తెలిపింది. ఈ మహామందిర్ దాని అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రకాశంతో యావత్ మానవాళిని ప్రకాశవంతం చేయడమే గాక ఈ ప్రంపంచాన్ని సదా శాంతియుతంగా ఉండేలా అప్రమత్తం చేస్తుందని ఆలయ వెబ్సైట్ పేర్కొంది. (చదవండి: ఆ గుహలోకి వెళ్తే ..ఆత్మలను లైవ్‌లో చూడొచ్చట!) -
కొత్త సచివాలయంలో.. సరికొత్త ఫౌంటెయిన్లు!
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలోని పార్లమెంటు ముందు ధోల్పూర్ ఎర్రరాతితో నిర్మించిన ఫౌంటెయిన్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. పార్లమెంటు సభ్యులు సహా సందర్శకులు దాని ముందు నిలబడి ఫొటోలు దిగుతుంటారు.. ఇప్పుడు అచ్చుగుద్దినట్టు అలాంటి ఫౌంటెయినే తెలంగాణ కొత్త సచివాలయంలో సిద్ధమైంది. పార్లమెంటు ముందు ఒకటే ఫౌంటెయిన్ ఉండగా, సచివాలయంలో రెండు రూపుదిద్దుకున్నాయి. ఇప్పుడు ఇవి ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. –ఇండోపర్షియన్ ఆకృతిలో గుమ్మటాలతో రూపుదిద్దుకుంటున్న సచివాలయానికి మరో ప్రత్యేకత కూడా ఉండాలన్న ఉద్దేశంతో పార్లమెంటు ముందున్న ఆకృతిలో ఫౌంటెయిన్లను డిజైన్ చేశారు. సచివాలయ భవనం ముందు రెండు వైపులా విశాలమైన లాన్లు ఉంటాయి. వాటి మధ్యలో రెండు వైపులా రెండు ఫౌంటెయిన్లు నిర్మించాలని భావించి రకరకాల ఆకృతులు పరిశీలించారు. కానీ, చివరకు పార్లమెంటు ముందున్న ఆకృతిని ఎంపిక చేశారు. ►దిగువ 47 అడుగుల వెడల్పుతో భారీ వేదిక.. దానిమీద 25 అడుగుల వెడల్పుతో సాసర్ ఆకృతిలో నీటి తొట్టె, దాని మీద 9 అడుగుల వెడల్పుతో మరో తొట్టె.. ఈ మూడింటిని అనుసంధానిస్తూ దాదాపు 27 అడుగుల ఎత్తున్న శిల.. అంతా ఎరుపు రంగు.. ఇది దీని ఆకృతి. ►అప్పట్లో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ దీన్ని డిజైన్ చేయగా పార్లమెంటు భవనం ముందు నిర్మించారు. ఇప్పుడు అదే డిజైన్‌ను వినియోగించి ఇక్కడ నెలకొల్పారు. పార్లమెంటు ముందున్న ఫౌంటెయిన్‌కు మొత్తం రాజస్థాన్‌లోని ధోల్పూర్ ఎర్రరాతి ఫలకాలను వాడారు. ఆ నిర్మాణానికి ప్రత్యేకంగా రంగు ఉండదు. ఇక్కడ కూడా అదే రాతిని వినియోగించటం విశేషం. ►సచివాలయం బేస్‌కు పూర్తిగా ఈ ఎర్రరాయినే వాడారు. ఇందుకోసం రాజస్థాన్ ధోల్పూర్ క్వారీలకు వెళ్లి అక్కడ రాయిని ఎంపిక చేసి తెప్పించిన విషయం తెలిసిందే. పార్లమెంటు ముందున్న ఫౌంటెయిన్ తరహాలోనే పాటా్నలో ఇటీవల ఫౌంటెయిన్‌ను రూపొందించిన శిల్పిని కలిసి చర్చించి సలహాలు తీసుకున్నారు. ఇప్పుడు అదే డిజైన్‌తో రెండు ఫౌంటెయిన్ల నిర్మాణం పూర్తయింది. దీంతో సచివాలయ ప్రధాన నిర్మాణం పనులు పూర్తయినట్టయింది. ఈ ఫౌంటెయిన్ నుంచి నీళ్లు ధారలుగా ఎగజిమ్మి దిగువకు పడుతుండగా, వాటిపై లైట్ల కాంతులు ప్రసరిస్తూ అందాన్ని రెట్టింపు చేస్తాయి. -
కొత్త సచివాలయం ముందు 2 భారీ ఫౌంటెయిన్లు
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: గంభీరంగా కనిపించే పార్లమెంటు భవన సముదాయం ముందు రాచఠీవీ ఒలకబోస్తూ నీటిని విరజిమ్మే 50 అడుగుల ఎత్తున్న ఫౌంటెయిన్ నమూనా తెలంగాణ కొత్త సచివాలయం ముందు సాక్షాత్కారం కానుంది. ఆ ఫౌంటెయిన్ నమూనాపై సీఎం కేసీఆర్ ప్రత్యేక ఆసక్తి చూపటంతో అదే డిజైన్‌తో కొత్త సచివాలయ ప్రాంగణంలో ఫౌంటెయిన్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే పార్లమెంటు భవనం ఎదుట పచ్చిక మైదానంలో ఒకటే ఫౌంటెయిన్ ఉండగా, సచివాలయ ప్రాంగణంలో ఒకే తరహావి రెండు ఏర్పాటు కానున్నాయి. అక్కడ 50 అడుగుల ఎత్తుంటే ఇక్కడ మాత్రం 16 అడుగుల ఎత్తుతో రూపుదిద్దుకోనున్నాయి. ఈ మేరకు ఢిల్లీ పార్లమెంటు భవనం ముందున్న ఫౌంటెయిన్ నిర్మాణాలను రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆ శాఖ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఈఈ శశిధర్, ఆర్కిటెక్ట్ ఆస్కార్, నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి లక్ష్మణ్‌లతో కలసి పరిశీలించారు. ధోల్పూర్ ఎర్ర రాయి వినియోగం.. పార్లమెంటు భవనం ముందున్న ఫౌంటెయిన్‌కు రాజస్తాన్‌లోని ప్రఖ్యాత ధోల్పూర్ ఎర్ర ఇసుక రాతిని వినియోగించారు. అదే రాయిని తెలంగాణ సచివాలయ ఫౌంటెయిన్‌కు కూడా వాడనున్నారు. ఈ రాతితో ఇటీవల పట్నాలో అదే నమూనా ఫౌంటెయిన్‌ను రూపొందించిన శిల్పిని కూడా అధికారులు పిలిపించి దీనిపై మాట్లాడారు. సచివాలయ ఫౌంటెయిన్ తయారీ బాధ్యత కూడా అతనికే అప్పగించాలని భావిస్తున్నారు. పార్లమెంట్ భవనం వద్ద మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఇతర అధికారులు ‘రీజనల్ రింగ్ రోడ్డు’మంజూరు చేయండి.. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ సెక్రటరీ గిరిధర్‌ను మంత్రి ప్రశాంత్‌రెడ్డి కలిశారు. తెలంగాణకు నూతన జాతీ య రహదారులు, రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు మంజూరు చేయాలని ఆయనను మంత్రి కోరారు. హైదరాబాద్‌కు ఉత్తరాన ఉన్న బోయిన్పల్లి–మేడ్చల్ మధ్య, దక్షిణాన ఉన్న శంషాబాద్–కొత్తూరు మధ్య రహదారులను మెరుగుపర్చే అంశం ప్రస్తుతం జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ వద్ద పెండింగ్‌లో ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. కల్వకుర్తి–నంద్యాల మధ్య నూతన జాతీయ రహదారి ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినందుకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి గడ్కరీ, శాఖ సెక్రటరీ గిరిధర్‌కు ప్రశాంత్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నేరుగా ధోల్పూర్ క్వారీ నుంచి రాయి.. సచివాలయ భవనం దిగువ భాగానికి ధోల్పూర్ ఎర్రరాతి ఫలకాలనే ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఈ భవన ఆకృతిపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలోనే ఈమేరకు నిర్ణయించారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు రాజస్తాన్‌లోని ధోల్పూర్లో ఉన్న క్వారీల నుంచి నేరుగా ఆ రాయికి ఆర్డర్ ఇవ్వనున్నారు. ఈమేరకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, అధికారులు ధోల్పూర్ వెళ్లారు. సచివాలయ భవనానికి 2 వేల క్యూబిక్ మీటర్ల మేర ధోల్పూర్ ఎర్ర రాతి ఫలకాలను, గోడలు, ఫుట్‌పాత్‌లకు ధోల్పూర్ క్వారీలో లభిం చే లేత గోధుమ రంగు రాయిని వినియోగించనున్నారు. దాదాపు లక్ష చదరపు అడుగుల మేర ఆ రాతిని వినియోగించనున్నారు. కావాల్సిన రాతిని నేరుగా క్వారీలకే ఆర్డర్ ఇచ్చి తెప్పించనున్నారు. దీనివల్ల నాణ్యమైన రాయి వస్తుందని అధికారులు చెబుతున్నారు. అంతకుముందు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, అధికారులు.. ఢిల్లీలోని పార్లమెంటు, నార్త్‌బ్లాక్, సౌత్‌బ్లాక్, రాష్ట్రపతి భవనం, అశోకా హాల్‌లను సందర్శించారు. ఈ భవనాలకు ఆ ఎర్ర రాయినే వినియోగించటంతో వాటి నిర్మాణ ప్రత్యేకతలను పరిశీలించారు. శని, ఆదివారాల్లో ఆగ్రా ఎర్రకోట, తాజ్‌మహల్, ధో ల్పూర్, కరోలీ క్వారీలను పరిశీలించనున్నారు. చదవండి: (ఆర్టీసీలో మరో సరికొత్త వ్యవస్థ..!) (10,673 టీచర్ పోస్టులు ఖాళీ) -
షైన్ టెయిన్..
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో ఏళ్ల క్రితమే ఏర్పాటు చేసిన ఫౌంటెయిన్లు ఎన్నో ఉన్నాయి. అయితే నిర్వహణ సరిగా లేకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. కనీస మరమ్మతులు కూడా చేయకపోవడంతో చాలా వరకు పాడైపోయాయి. రెండేళ్ల క్రితం తెలుగు మహాసభల సందర్భంగా వాటికి మరమ్మతులు చేసి వినియోగంలోకి తేవాలనుకున్నారు. ప్రధాన మార్గాల్లోని కొన్నింటికి తాత్కాలికంగా మరమ్మతులు చేసినా, మళ్లీ నిర్వహణ లోపంతో అందం మూణ్నాళ్ల చందమే అయింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని జంక్షన్లను ప్రత్యేక థీమ్‌లతో తీర్చిదిద్దిన జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ విభాగం... ఇప్పుడు ఫౌంటెయిన్లపై దృష్టిసారించింది. వీటిని ఆధునికీకరించి అందుబాటులోకి తీసుకొస్తే పర్యాటకులకు కనువిందుగా ఉంటుందని భావించి ప్రతిపాదనలు రూపొందించగా, కమిషనర్ ఆమోదించడంతో పనులు చేపట్టింది. ఏజెన్సీకే ఏడాది నిర్వహణ... నగరవ్యాప్తంగా మొత్తం 65 ఫౌంటెయిన్లను గుర్తించి ఆధునికీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటిలో 35 ప్రధాన రహదారుల మార్గాల్లోని జంక్షన్లు, ఫ్లైఓవర్ల దిగువన ఉండగా... మిగతా 30 పార్కుల్లో ఉన్నాయి. తొలుత ప్రధాన రహదారుల మార్గాల్లోని ఫౌంటెయిన్లను ఆధునికీకరించాలని నిర్ణయించారు. వాటిలోనూ ముఖ్యమైనవిగా భావించే 24 ప్రాంతాల్లో ముందుగా మరమ్మతులు చేసి, లైటింగ్ ఏర్పాటు చేయాలని, ఇందుకు దాదాపు రూ.25 లక్షల వ్యయమవుతుందని అంచనా వేశారు. వీటిలో కేవలం రూ.50 వేలు మాత్రమే వ్యయమయ్యే వాటితో పాటు రూ.లక్షకు పైగా నిధులు వెచ్చించాల్సినవీ ఉన్నాయి. ఫౌంటెయిన్‌ను ఆధునికీకరించి వినియోగంలోకి తెచ్చినా తిరిగి పాతకథ పునరావృతం కాకుండా ఉండేందుకు... పనులు చేపట్టేందుకు ముందుకొచ్చే కాంట్రాక్టు ఏజెన్సీనే ఏడాది పాటు నిర్వహణ కూడా చూసుకునేలా నిబంధన విధించారు. ఇప్పటికే వీటి పనులు ప్రారంభమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పూర్తయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో పురోగతిలో ఉన్నాయి. జనవరిలోగా అన్ని ప్రాంతాల్లోనూ పూర్తవుతాయని అర్బన్ బయోడైవర్సిటీ విభాగం అడిషనల్ కమిషనర్ వి.కృష్ణ తెలిపారు. వీటి పనులు పూర్తయ్యాక పార్కుల్లోని పౌంటెయిన్లను మలి దశలో ఆధునికీకరిస్తామన్నారు. పనులు చేపట్టిన ప్రాంతాలివీ... గుల్జార్‌హౌస్, మాసబ్‌ట్యాంక్ ఫ్లైఓవర్ కింద, ఫ్లెమింగోస్ ఫౌంటెయిన్ (మాసబ్‌ట్యాంక్ జంక్షన్), బీఆర్కే విగ్రహం, మాధవరెడ్డి విగ్రహం, బషీర్‌బాగ్ ఫ్లైఓవర్, బాబూజగ్జీవన్‌రామ్ ఫ్లైఓవర్, గన్‌పార్క్, బర్కత్‌పురా త్రీక్రేన్ ఫౌంటెయిన్, నారాయణగూడ ఫ్లైఓవర్, విశ్వేశ్వరయ్య విగ్రహం (ఖైరతాబాద్), రాజ్‌భవన్‌రోడ్(సెంట్రల్ మీడియన్), రాజీవ్ ఐలాండ్, సోమాజిగూడ క్రాస్‌రోడ్స్, ఎస్సార్‌నగర్ క్రాస్‌రోడ్స్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ (బంజారాహిల్స్), బంజారాహిల్స్ రోడ్ నంబర్.12 జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, శతధార వాటర్‌ఫాల్స్ (ఖైరతాబాద్ జంక్షన్), మంజీరా గెస్ట్‌హౌస్, ఎల్వీ ప్రసాద్ విగ్రహం, కేబీఆర్ సెంట్రల్ మీడియన్స్, హరిహర కళాభవన్ ఫ్లైఓవర్, మహాత్మాగాంధీ విగ్రహం, ఎంజీరోడ్. -
అవి ఫౌంటేన్లు కావు.. బోర్లు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: కరువుతో రాష్ట్రం విలవిలలాడుతుండగా.. ఆ గ్రామంలో జల కళ ఉట్టి పడుతోంది. రాష్ట్రంలోని ఏ గ్రామం లో చూసినా భూగర్భజలాలు పాతాళానికి చేరాయి. కానీ, ఈ ఊరిలోని బోర్లు ఫౌంటేన్ల ను తలపిస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 40కి పైగా బోర్లలో నీళ్లు ఫౌం టేన్లా విరజిమ్ముతున్నాయి. ఎలాంటి మోటార్లుగానీ, పంపుసెట్లు కానీ అమర్చకుం డానే నీళ్లు ఎగజిమ్ముతున్నాయి. మండు వేసవిలో కూడా ఈ గ్రామంలో ఏడాది పొడవునా ఇలాగే బోర్ల నుంచి నీళ్లు పైపైకి వస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామ పంచాయతీ పరిధిలోని మామడ గ్రామంలో ఈ అద్భుత దృశ్యం దర్శ నమిస్తోంది. గ్రామంలో సుమారు 50 కుటుం బాలున్నాయి. గ్రామ సమీపంలోనే నీల్వాయి వాగుపై ప్రాజెక్టు ఉంది. ప్రాజెక్టులో నిండా నీరుండటంతో ఆ ప్రాంతంలో భూగర్భ జలా లు బాగా పైకి పెరిగాయి. భూగర్భ జలాలు పుష్కలంగా ఉండటం ఒక రకంగా ఈ గ్రామస్తులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అతిగా నీళ్లు పైకి రావడంతో గ్రామంలో నివసించడం, భూములను సాగు చేసుకోవడం కష్టమ వుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు కుంగిపోయి, గోడలు బీటలు వారుతున్నాయి. పలు ఇళ్ల గోడలు కూలిపోయాయి. తమ ఇళ్లు కూలిపోవడంతో గ్రామానికి దూరంగా గుడిసె వేసుకున్నామని మం చినీళ్ల నాగరాజు ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొ న్నారు. ఇక వర్షాకాలంలో పంట పొలాలను సాగు చేయలేని పరిస్థితి. ట్రాక్టర్లు బురదలో కూరుకుపోతున్నాయి. ఏటా వర్షాకాలంలో నాలుగైదు పశువులు ఈ బురదల్లో కూరుకుపోయి చనిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. మరుగుదొడ్డి కోసం 2, 3మీటర్ల లోతు తవ్వితే నీళ్లు వస్తుండటంతో గుంతలు తీసి వదిలివేశామని గ్రామస్తులు చెబుతున్నారు.