1/8
భారత టెలికం మార్కెట్‌లో జియోకు ముందు హవా చూపి దివాళా తీసిన ఎయిర్‌సెల్ కంపెనీ గుర్తుందా?
2/8
జియో రాక ముందు 3జీ యుగం ఉండేది. అప్పట్లో ఎయిర్‌సెల్ సంచలనంగా నిలిచింది.
3/8
చిన్నకన్నన్ శివశంకరన్ స్థాపించిన ఎయిర్ సెల్ 1999లో తమిళనాడులో కార్యకలాపాలు ప్రారంభించింది.
4/8
2010లో జరిగిన వేలంలో 3జీ స్పెక్ట్రమ్ కోసం ఎయిర్సెల్ రూ.6,500 కోట్లు చెల్లించింది. 3జీలో కీలక పాత్ర పోషించిన ఎయిర్‌సెల్ అప్పట్లో 3జీ టారిఫ్‌లను భారీగా తగ్గించింది.
5/8
2014లో 4జీ సేవలను కూడా ఎయిర్ సెల్ ప్రారంభించింది. 2జీ, 3జీ, 4జీ మూడు సాంకేతిక పరిజ్ఞానాలను అందించిన ఏకైక ప్రైవేట్ టెలికాం ఆపరేటర్‌గా నిలిచింది
6/8
2017 డిసెంబర్ నాటికి ఎయిర్ సెల్‌కు 8.4 కోట్ల మందికిపైగా యూజర్లు ఉండేవారు.
7/8
ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రధాన షర్ట్ స్పాన్సర్‌గా ఉండేది. దీంతో ఫుట్‌బాల్, ఇతర క్రీడాపోటీలలో పలు జట్లకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించింది.
8/8
ఎయిర్ సెల్ బ్రాండ్ అంబాసిడర్లుగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, హీరో సూర్య వంటి వారు వ్యవహరించారు.