

ఊసరవెల్లి నాలుక దాని శరీరం కంటే రెండు రెట్లు పొడవు ఉంటుంది. గంటకు ఈ నాలుక 60 మైళ్ళ వేగంతో ఎర్రను పట్టుకోగలదు.

ప్రపంచంలో అతిపెద్ద కాఫీ కప్పు కొలంబియాలో ఉంది. ఆ కప్పులో 22,000 లీటర్ల కంటే ఎక్కువ కాఫీ పడుతుంది.

మన శరీరంలో రక్త ప్రసరణ జరగని ఏకైక భాగం కంటిలోని "కార్నియా". ఎందుకంటే ఈ భాగం నేరుగా గాలి నుండి ఆక్సిజన్ ను గ్రహిస్తుంది.

ఆస్ట్రేలియాలో కారును బుక్ చేసుకుంటే అందులో మనం ఒక్కరిమే ప్రయాణిస్తుంటే డ్రైవర్ పక్కన కూర్చోవాలంట. వెనుక కూర్చుంటే డ్రైవర్ను అవమానించినట్లు అంట.

అతి చిన్న తేనెటీగలు ఆస్ట్రేలియాలోని యూరిగ్లోసినా జాతికి చెందినవి. ఇవి 2mm పొడవును కలిగి ఉంటాయి.

మన శరీరంలో అతి చిన్న ఎముక చెవిలోపల ఉంటుంది.

చీమలు ఒక రోజులో 16 నిమిషాలు మాత్రమే నిద్రపోతాయి.

లేడీస్ వాడే లిఫ్టిక్ ఎక్కువగా చేపలు పొలుసులతో తయారు చేయబడి ఉంటుంది.

ఒలంపిక్స్ గోల్డ్ మెడల్ లో కేవలం 1.34% మాత్రమే గోల్డ్ ఉంటుంది.