మే 31వ తేదీ చారిత్రాత్మకంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజు. ప్రముఖులు పుట్టిన రోజు నుంచి ఐక్యత చిహ్నాలను స్వీకరించిన.. ఎన్నో గొప్ప ఘట్టాలకు నిలువెత్తు సాక్షి ఈ రోజు. సమానత్వాన్ని ప్రోత్సహించే చట్టాన్ని రూపొందించడం నుంచి కొత్తగా పుట్టుకొచ్చిన మ్యూజిక్ ట్యూన్ రికార్డు సృష్టించింది ఈరోజే. చరిత్రలో ఈ రోజున జరిగిన ఆసక్తికర విషయాలు ఏంటంటే..
తొలి పోస్టల్ సర్వీస్(1774)
ఈ రోజునే భారతదేశంలో 1774లో తన తొలి పోస్టల్ సర్వీస్ కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కీలకమైన క్షణం విశాలమైన ఉపఖండాన్ని అనుసంధానించే వ్యవస్థకు పునాది వేయడమే గాక విభిన్న ప్రాంతాలలో కమ్యూనికేషన్‌ను సులభతరం చేసింది.
మాడిసన్ స్క్వేర్ గార్డెన్ ప్రారంభోత్సవం
న్యూయార్క్ నగరంలోని ఒక ఐకానిక్ వేదిక మాడిసన్ స్క్వేర్ గార్డెన్ ప్రారంభమయ్యింది ఈ రోజే. ఇది లెక్కలేనన్ని క్రీడలకు, మరుపురాని సంగీత వినోద కార్యక్రమాలను వేదికగా మారింది.
భారత జాతీయ కాంగ్రెస్ జెండా స్వీకరణ (1921)
భారత జాతీయ కాంగ్రెస్ జెండాను జాతీయ జెండాగా స్వీకరించింది మే 31, 1921న. ఇది స్వేచ్ఛ, ఐక్యత, చిహ్నం. పైగా వలస పాలన నుంచి విముక్తి కలిగేల స్వాతంత్ర్య పొరాటిన్ని ఉత్తేజపరిచింది.
గంగమ్ స్టైల్
దక్షిణ కొరియా కళాకారుడు రూపొందించిన గంగమ్ స్టైల్ ట్యూన్ యూట్యూబ్ వీడియోలో ఏకంగా రెండు బిలయన్ వ్యూస్ కలిగిన తొలి వీడియోగా మే 31న నిలిచింది. ఈ వైరల్ వీడియో సంచలన రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా ప్రపంచానికి అనేకమంది కళాకారులను పరిచయం చేసే వేదికగా సోషల్ మీడియా మారింది. దీని వల్లే దక్షిణ కొరియా పాటలు అంతర్జాతీయ ఖ్యాతీని ఆర్జించాయి కూడా.
బొంబాయిలో ఎలక్ట్రిక్ ట్రామ్ ముగింపు (1964)
బొంబాయి రవాణా వ్యవస్థలో ప్రధానమైన ఎలక్ట్రిక్ ట్రామ్ చివరిసారిగా మే 31, 1964న నడిచింది. ఇది ఒక శకానికి ముగింపు పలికింది. పట్టణ రవాణా సరికొత్త విధానాలకు నాంది పలికింది.
రిజర్వేషన్ చట్టం రూపొందించబడింది (2010)
భారతదేశంలో గుర్తింపు పొందిన ప్రతి ప్రైవేట్ పాఠశాలలో ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు 25% సీట్లను రిజర్వ్ చేస్తూ మే 31, 2010న ఒక మైలురాయి చట్టం రూపొందించబడింది. ఈ చట్టం విద్యా సమానత్వాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
క్లింట్ ఈస్ట్‌వుడ్ పుట్టినరోజు (1930)
హాలివుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు క్లింట్ ఈస్ట్‌వుడ్ 1930లో ఈ రోజునే(మే31) జన్మించాడు. పాశ్చాత్య చిత్రాలలో దిగ్గజ పాత్రలకు పేరుగాంచిన ఈస్ట్‌వుడ్ కెరీర్ అనేక దశాబ్దాలుగా చలన చిత్ర సీమలో కొనసాగింది. అతనికి అనేక అవార్డులు, ప్రశంసలు లభించాయి.
ఇందిరా గాంధీ విజ్ఞప్తి (1970)
బంగ్లాదేశ్‌లో అంతర్యుద్ధం శరణార్థుల సంక్షోభానికి దారితీసినందున మే 31, 1970న ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అంతర్జాతీయ సహాయాన్ని కోరారు. ఆమె విజ్ఞప్తి భయంకరమైన పరిస్థితికి అవసరమైన ప్రపంచ మద్దతును హైలైట్ చేసింది.
(చదవండి: దున్నపోతు మాట దేవుడెరుగు.. పోతావుపైకి!)
Comments
Please login to add a commentAdd a comment