ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు ఉంటాయి. ప్రకృతికి మించి అద్భుతమైనది మరోకటి లేదు. దానికి మించి మనిషి తాను ఏదో కనిపెట్టాలనుకుంటే విధి చేసే మరింత విచిత్రంగా ఉంటుంది. చివరికి మనిషిని సమస్యలో పెట్టి అతడి వాళ్ల నుంచి సమస్యకు పరిష్కరం దొరికేలా చేస్తుంది విధి. అలాంటి రెండు ఆసక్తికర విషయాలు చూద్దామా..!
స్టార్‌ఫిష్‌లా ఉండే పూలు
నక్షత్రాకారంలో ఉండే ఈ పూలను స్టార్‌ఫిష్ కాక్టస్ ఫ్లవర్స్ అని, స్టార్ ఫ్లవర్స్ అని అంటారు. బ్రహ్మజెముడు జాతికి చెందిన ఒక ఎడారి మొక్కకు ఈ పూలు పూస్తాయి. ఇవి అరచేతి విస్తీర్ణాన్ని మించి చాలా పెద్దగా ఉంటాయి. ఇవి ఊదా, ముదురు ఎరుపు, లేత ఎరుపు, పసుపు, గోధమ రంగుల్లో ఉంటాయి. ఈ పూలు చూడటానికి అందంగానే ఉన్నా, వీటి నుంచి వెలువడే కుళ్లిన మాంసం వాసనను భరించడమే కష్టం.
కనిపెట్టిన మెషిన్ గన్‌తోనే
అమెరికాలో జన్మించిన బ్రిటిష్ ఆవిష్కర్త హైరమ్ స్టీవన్ మాక్సిమ్ మొట్టమొదటి ఆటోమేటిక్ మెషిన్ గన్‌ను రూపొందించాడు. ఆ మెషిన్ గన్‌తో టెస్ట్ ఫైరింగ్ చేస్తున్నప్పుడు వచ్చిన శబ్దానికి ఆయన బధిరుడిగా మారాడు. ఆ తర్వాత ఆయన కొడుకు హైరమ్ పెర్సీ మాక్సిమ్ సైలెన్సర్‌ను కనిపెట్టాడు.
(చదవండి: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?)
Comments
Please login to add a commentAdd a comment