Skill Development Scam బోడి గుండుకు మోకాలికి ముడి పెట్టడం అంటే ఎంటో పచ్చమీడియా చూస్తే అర్ధమవుతుంది. స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్టు అయి జైలుకు వెళితే.. పచ్చమీడియా దీనిపై మాత్రం మాట్లాడదు. కేసులో చంద్రబాబు పాత్రపై ఎల్లో మీడియా మాట్లాడదు. అయితే విచిత్ర వాదనలతో కేసును బలహీనపరిచేందుకు ఎల్లో మీడియా కుయుక్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ స్కామ్.. జగన్ స్కీమ్ అంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే దీని నిజానిజాలేంటో ఒకసారి చూద్దాం.
స్కిల్ స్కాం కేసులో తీవ్రమైన అవినీతి జరిగిందని, ఆధారాలతో సహా బయటపడింది. అయితే ఆ ఆధారాలను తప్పు అని ప్రచారం చేసే బాధ్యతను టీడీపీ అనుకూల మీడియా భుజానికెత్తుకుంది. ఇందులో భాగంగానే కళ్లముందు వాస్తవాలు కనిపిస్తున్నా… అబద్ధాలను అసలు సిసలైన వాస్తవాలుగా ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతోంది. స్కిల్ స్కాం కేసులో తీవ్రమైన అవినీతి జరిగిందని… నిధులు దారి మళ్లించారని ఫొరెన్సిక్ ఆడిటింగ్‌లో తేలింది.ప్రఖ్యాత ఆడిటింగ్ సంస్థ శరత్ అండ్ అసోసియేట్స్ఈ ఫొరెన్సిక్ ఆడిటింగ్ పూర్తి చేసి దాదాపు 70షెల్ కంపెనీల ద్వారా ప్రభుత్వ నిధులు సుమారు 241 కోట్ల రూపాయలు దారి మళ్లాయని నివేదించింది. ఇదే విషయాన్ని సీఐడి తన విచారణ నివేదికలో స్పష్టంగా కోర్టుకు సమర్పించింది.
అయితే కోట్ల రూపాయల ప్రజాధనం దారిమళ్లిన విషయంపై నోరు మెదపని పచ్చమీడియా… ఆడిటింగ్ సంస్థపై బురద జల్లుతోంది. శరత్ అండ్ అసోసియేట్స్ అనే సంస్థతో ఏపీ ముఖ్యమంత్రికి సంబంధం ఉందని కథలు అల్లుతోంది. ఈ కథనానికి ఆంధ్రజ్యోతి పత్రిక చెప్పిన కారణాలు చూస్తే.. బుర్ర ఉన్నవాళ్లేవరైన ఇది అబద్ధపు వార్త అని అర్ధం చేసుకుంటారు. శరత్ అండ్ అసోసియేట్స్ వెబ్‌సైట్‌తో పాటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కంపెనీలకు చెందిన ఆడిటర్స్ ఐవీఎస్ అండ్ అసోసియేట్స్ వెబ్ సైట్ ఒకే సర్వర్‌లో ఉందనేది ఆంధ్రజ్యోతి ఆరోపణ. అసలు సర్వర్లు ఎవరు హోస్ట్ చేస్తారు.. వాటికి ఐపీ అడ్రస్లు ఎలా కేటాయిస్తారు అనేది తెలిస్తే… ఆంధ్రజ్యోతివి పిచ్చిరాతలని స్పష్టమైపోతుంది.
అసలు ఆంధ్రజ్యోతి రాసినట్లు శరత్ అండ్ అసోసియేట్స్, ఐవీఎస్ అసోసియేట్స్ వెబ్సైట్స్ ఒకే సర్వర్లో ఉన్నాయా అనేది పరిశీలిస్తే ఇది పూర్తి అవాస్తవం. ఆంధ్రజ్యోతి రాసిన వార్తలోనే చాలా స్పష్టంగా రెండు వేరు ఐపి అడ్రస్లు కనిపిస్తున్నాయి. ఇందులో శరత్ అండ్ అసోసియేట్స్ ఐపి అడ్రస్-115. 124. 126. 242. 80కాగా ఐవీఎస్ అండ్ అసోసియేట్స్ ఐపి అడ్రస్-115.124.126.216.80 అని ఆంధ్రజ్యోతే రాసింది. మరి రెండు వేరు ఐపి అడ్రస్లు ఉంటే ఒకే అడ్రస్లో ఉన్నాయని ఆంధ్రజ్యోతి రాయడం హాస్యాస్పదం. ESDSఅనేది కేవలం డొమైన్ ప్రొవైడర్ మాత్రమే చాలా కంపెనీలు డొమైన ఒక కంపెనీ ద్వారా హోస్ట్ ఇంకోచోట రిజిస్టర్ చేసుకుంటారు. ఇక ESDS అనేది కేవలం డొమైన్ ప్రొవైడర్ అయినంత మాత్రానా ఈ కంపెనీల డేటా వీరివద్దే ఉందనడానికి ఆధారాలు లేవు.
ఒకసారి ఐపీ అడ్రస్లు వాటి వెనక ఉన్న టెక్నికల్ ఇష్యూస్ చూస్తే
ఆంద్రజ్యోతి వార్త ఎంత పేలవమైందో అర్ధమైపోతుంది. వెబ్సైట్ హోస్ట్ చేయడం అనేది సాధారణంగా చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. అందుకే కంపెనీలు తమ వెబ్ సైట్ హోస్ట్ చేసేందుకు ఏదో ఒక సర్వీస్ ప్రొవైడర్ సహాయం తీసుకుంటాయి. ఇలాంటి సర్వీస్ ప్రొవైడర్లు ప్రపంచ వ్యాప్తంగా చాలా మందే ఉన్నారు. ఇందులో అమేజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్‌తో పాటు దేశీయ సర్వీస్ ప్రొవైడర్లు కూడా చాలా మందే ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం శరత్ అండ్ అసోసియేట్స్ , ఐవీఎస్ అండ్ అసోసియేట్స్ రెండు కంపెనీల వెబ్సైట్లు ESDS అనే సంస్థ హోస్ట్ చేస్తోంది. కాని ESDS హోస్ట్ చేస్తున్న కంపెనీల లిస్ట్ చూస్తే అసలు విషయం అర్ధం అవుతుంది. ESDS కంపెనీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా కంపెనీల వెబ్సైట్లు హోస్ట్ చేస్తోంది. ఇందులో టాటా క్యాపిటల్, యూనియన్ బ్యాంక్, ముత్తూట్ ఫైనాన్స్ , సిడ్బి, యాక్సిస్ అస్సెట్ మేనేజ్మెంట్లాంటి కార్పోరేట్ సంస్థల వెబ్సైట్లు ESDSహోస్ట్ చేస్తోంది.
దీంతో పాటు చెన్నై స్మార్ట్సిటి, ఎస్టిపీఐ, కేంద్ర గృహనిర్మాణశాఖలాంటి దాదాపు 200లకు పైగా ప్రభుత్వ వెబ్సైట్లు సైతం ESDSహోస్ట్ చేస్తోంది. ESDS క్లయింట్ లిస్ట్ చూస్తే ప్రెస్టీజ్ కుక్కర్, జేకే సిమెంట్, ఎస్సార్, ఎల్ అండ్ టీలాంటి దిగ్గజ కంపెనీలు సైతం ఉన్నాయి. అలాంటి సందర్భంలో కేవలం రెండు ఆడిటింగ్ కంపెనీలు మాత్రమే ఉన్నాయని ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలు రాసింది.
ఇక ఆంధ్రజ్యోతి రాసిన కథనం ప్రకారం.. రెండు కంపెనీల సర్వర్ ఒకటే అని చెబుతున్న మాటల్లో ఎలాంటి వాస్తవాలు లేవు. శరత్ అండ్ అసోసియేట్స్ ఐపి అడ్రస్-115. 124. 126. 242. 80కాగా ఐవీఎస్ అండ్ అసోసియేట్స్ ఐపి అడ్రస్-115.124.126.216.80 అని పచ్చ మీడియానే రాసింది. ఇందులో115.124.126 అనేది ESDS డొమైన్ పూల్ కాగా తరువాత వచ్చే నెంబర్లు ఆయా కంపెనీ ఐపి అడ్రస్ను ఇండికేట్ చేస్తుంది. అంటే ఒక పిన్కోడ్లో మొదటి మూడు నెంబర్లు ఎలా కామన్గా ఉంటాయో అలా హోస్ట్కు మొదటి మూడు నెంబర్లు కామన్గా ఉంటాయి. ఒక బ్యాంకు బ్రాంచిలో ఖాతా ఉంటే వారి అకౌంట్ నెంబర్‌కు సంబంధించి 11నెంబర్లలో మొదటి 7నుంచి 8నెంబర్లు సేమ్గా ఉంటాయి. ఇక ఫోన్ నెంబర్లలో మొదటి నాలుగైదు నెంబర్లు సేమ్ ఉంటే వారిద్దరు డేటా షేర్ చేసుకున్నట్లా. ఇక తెలుగుదేశం పార్టీ తన వెబ్సైట్ను మైక్రోసాఫ్ట్ ద్వారా హోస్ట్ చేస్తోంది. ఇదే మైక్రోసాఫ్ట్ ఎన్నో ఈ కామర్స్ వెబ్సైట్లను హోస్టు చేస్తోంది.
ఇక రెండు కంపెనీలు ఒకే హోస్టు ప్రొవైడర్ ద్వారా డొమైన్ రిజిస్టర్ చేసుకున్నా వారి డేటా ఒకే చోటా ఉండాలని లేదు. కంపెనీలు డొమైన్ రిజిస్ట్రేషన్ ఒకచోట డేటా హోస్టింగ్ మరో చోట చేసుకోవచ్చు. ఇదీ ఆంద్రజ్యోతి రాసి అడ్డమైన రాతల వెనక ఉన్న అసలు వాస్తవం. ఇక అబద్దాలను ప్రచారం చేస్తే అసలు వాస్తవాలు మరుగున పడతాయనేది ఎల్లో మీడియా తాపత్రయం. అందుకే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అసలు విషయాలు మాట్లాడకుండా.. ఇలా తప్పుడు రాతలతో బయటపడాలనేది పచ్చమీడియా ఆలోచన.
Comments
Please login to add a commentAdd a comment