హెరిటేజ్‌ విలువెంత? భువనేశ్వరి మాటల్లో నిజమెంత? | ​heritage foods market cap facts nara bhuvaneshwari comments | Sakshi
Sakshi News home page

హెరిటేజ్‌ విలువెంత? భువనేశ్వరి మాటల్లో నిజమెంత?

Published Tue, Sep 26 2023 6:00 AM | Last Updated on Wed, Sep 27 2023 2:37 PM

​heritage foods market cap facts nara bhuvaneshwari comments - Sakshi

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణంలో టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టయి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. గత ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పేరుతో రూ.371.25 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని చంద్రబాబుపై అభియోగాలు ఉన్నాయి. దీంతో సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కాగా ‘మా కుటుంబానికి ప్రజల డబ్బు అవసరం లేదు. నేనూ ఓ కంపెనీని నడుపుతున్నా. అందులో 2 శాతం అమ్ముకున్నా నాకు రూ.400 కోట్లు వస్తాయి. ప్రజల సొమ్ము మాకు అక్కర్లేదు’ అంటూ హెరిటేజ్‌ కంపెనీని ఉద్దేశిస్తూ చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి తాజాగా పేర్కొన్నారు.  ఆమె లెక్క ప్రకారం హెరిటేజ్‌ కంపెనీ విలువ రూ.20 వేల కోట్లు. 

ఇదీ.. హెరిటేజ్‌ అసలు విలువ 
1992లో పెట్టిన హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ కంపెనీకి నారా భువనేశ్వరి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. 2023 సెప్టెంబర్‌ 21 నాటికి హెరిటేజ్‌ కంపెనీ విలువ (మార్కెట్‌ క్యాప్‌) రూ.2,181 కోట్లు. 2023లో ఆ కంపెనీ రెవెన్యూ రూ.3,241 కోట్లు. ఇక నెట్‌వర్త్‌ చూసుకుంటే రూ.756 కోట్లు. 

నోటికొచ్చిన లెక్కలు
హెరిటేజ్‌ కంపెనీ ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ. 2,181 కోట్లు. అందులో 1 శాతం అంటే రూ. 21 కోట్లు. 2 శాతం అంటే రూ. 42 కోట్లు. వాస్తవ విలువ ఇలా ఉంటే తమ కంపెనీలో కేవలం 2 శాతం అమ్ముకుంటే చాలు రూ.400 కోట్లు వస్తాయని నారా భువనేశ్వరి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఆ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న ఆమె ఇలా నోటికొచ్చిన లెక్కలు చెప్పడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement