సాక్షి, హైదరాబాద్: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడు.. జైల్లో కూడా ప్రజల కోసమే ఆలోచిస్తారని ఆయన భార్య నారా భువనేశ్వరి సానుభూతి రాజకీయం చేయడంపై ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి మండిపడ్డారు.
ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడిన పోసాని.. ‘ చంద్రబాబు జైల్లో సైతం ప్రజల కోసమే ఆలోచిస్తున్నాడని అనటం దుర్మార్గం. ఆనాడు మీ నాన్న ఎన్టీఆర్‌ను చెప్పులతో కొట్టించింది కూడా ప్రజల కోసమేనా?, మీనాన్నని వెన్నుపోటు పొడిచింది ప్రజలకోసమేనా’ అని ప్రశ్నించారు పోసాని. ఎన్టీఆర్ పదవిని చంద్రబాబు అక్రమంగా లాక్కున్నారు., ఎన్టీఆర్‌పై చెప్పులతో దాడి చేయించింది కూడా చంద్రబాబే. ఈ విషయాలు నారా భువనేశ్వరికి గుర్తులేవా? అని నిలదీశారు.
ఇదిలా ఉంచితే, రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో కుట్రలు అంటూ ఈనాడు రామోజీరావు కథనాలు రాస్తుండటంపై సైతం పోసాని ధ్వజమెత్తారు. రామోజీరావు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారంటూ విమర్శించారు. జైలు సూపరెంటింటెండ్ రాహుల్ భార్య అనారోగ్యం మృతి చెందితే రామోజీరావు పిచ్చి రాతలు రాయడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.
‘ఓ మహిళ చనిపోతే రామోజీ పిచ్చి రాతలు రాశారు. రామోజీ చనిపోతే ఆయన కుటుంబ సభ్యులు వెళ్లరా?, రాజమండ్రి జైలర్‌పై ఈనాడు తప్పుడు కథనాలు రాసింది. తన భార్య అనారోగ్యం కారణంగా రాహుల్ లీవ్ పెట్టారు. అందుకే వేరే అధికారికి ఆ బాధ్యతలు అప్పగించారు’ అని పోసాని స్పష్టం చేశారు. ఈనాడు, టీవీ5 ఎంత ఏడ్చినా ప్రజలు వైఎస్ జగన్ వెంటే ఉన్నారన్నారు పోసాని.
చదవండి: Babu : కేవలం ఆ కులానికే నాయకుడా?
Comments
Please login to add a commentAdd a comment