Dec 6th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | Chandrababu Naidu Cases Petitions And Political Updates On 6th December In Telugu - Sakshi
Sakshi News home page

Dec 6th CBN Case Updates: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Wed, Dec 6 2023 7:10 AM | Last Updated on Wed, Dec 6 2023 6:10 PM

Chandrababu Cases Petitions And Political Updates 6th December - Sakshi

Updates..

5:02 PM, Dec 6, 2023
ముసుగు తీసేద్దామా?

  • తెలంగాణ ఫలితాల తర్వాత చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ తర్జనభర్జన
  • అర్జంటుగా కాంగ్రెస్‌తో చేతులు కలపాలని ఆరాటపడుతోన్న చంద్రబాబు
  • ఇప్పటికిప్పుడు కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమిలో కలిస్తే ప్రయోజనం ఉంటుందని భావిస్తోన్న చంద్రబాబు
  • అదే విషయాన్ని పవన్‌ కళ్యాణ్‌కు చెప్పిన చంద్రబాబు
  • అసలు తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించిందే తెలుగుదేశమని చెబుతోన్న చంద్రబాబు
  • ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన విజయోత్సవాల్లో కాంగ్రెస్‌ జెండాతో పాటు రెపరెపలాడిన తెలుగుదేశం పచ్చజెండాలు
  • బీజేపీని ఇక్కడితో విడిచిపెట్టేయాలని పవన్‌ కళ్యాణ్‌పై చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నట్టు ప్రచారం
  • తెలంగాణ తరహాలో ఏపీలో కాంగ్రెస్‌ క్యాడర్‌ కలుపుకోవచ్చంటున్న చంద్రబాబు
  • తెలంగాణలో కాంగ్రెస్‌కు సహకరించాం కాబట్టి, ఏపీలో కాంగ్రెస్‌ సహకారం తీసుకుందామంటోన్న చంద్రబాబు
  • పవన్‌ కళ్యాణ్‌ పార్టీ జనసేనకు వచ్చిన ఓట్ల గురించి కూడా సమావేశంలో ప్రస్తావన
  • కాంగ్రెస్‌ కలిసిరాకపోతే.. ఏపీలో జనసేనకు తెలంగాణ సీనే రిపీట్‌ అవుతోందని భావిస్తోన్న చంద్రబాబు

4:59 PM, Dec 6, 2023
తెలంగాణలో ఏం జరిగింది? నెంబర్లు ఏం చెబుతున్నాయి?

  • అసలు నిజాలు బయటపెడుతోన్న గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలు
  • సీమాంధ్ర ప్రజలు ఎక్కువగా స్థిరపడింది గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే
  • గ్రేటర్‌లోని 29 సీట్లలో బీఆర్‌ఎస్‌ 18 స్థానాల్లో విజయం
  • 3 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్
  • రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌పై ఇంకా ఆగ్రహంగానే ఉన్న సీమాంధ్రులు
  • చంద్రబాబు,  చంద్రబాబు సామాజిక వర్గం ఎంత రెచ్చగొట్టినా..దక్కని ఫలితం
  • అయినా తమ వల్లే కాంగ్రెస్‌ గెలిచిందని ప్రచారం చేసుకుంటోన్న తెలుగుదేశం

4:52 PM, Dec 6, 2023
కిం కర్తవ్యం.?

  • హైదరాబాద్ : చంద్రబాబును కలిసిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్
  • చంద్రబాబును ఆయన నివాసంలో కలిసిన అధినేత పవన్
  • తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ
  • నవంబర్ 4న ఉమ్మడి మ్యానిఫెస్టోపై చర్చించిన ఇరువురు నేతలు
  • ఇప్పటివరకు అడుగు ముందుకు పడని మ్యానిఫెస్టో
  • తెలుగుదేశం ప్రతిపాదనలకు అదనంగా తనవంతుగా కొన్ని హామీలను చేర్చిన జనసేన
  • ఇప్పటివరకు పవన్‌ కళ్యాణ్‌ ఇచ్చిన ప్రతిపాదనలపై నోరు మెదపని చంద్రబాబు
  • తరుచూ సమావేశమై పొత్తు ప్రక్రియ వేగవంతం చేయాలని నిర్ణయం

4:33 PM, Dec 6, 2023
బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్ల విచారణ వాయిదా

  • హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ
  • ఇసుక ఉచిత పాలసీ, ఐఆర్ఆర్ రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ
  • సీఐడీ సమయం కోరడంతో వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
  • ఈనెల 12 కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

4:02 PM, Dec 6, 2023
ఏపీలో టీడీపీ - కాంగ్రెస్ పొత్తు ఉంటుందేమో? : బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

  • ఇండియా కూటమిలో చంద్రబాబు చేరొచ్చు
  • తెలంగాణలో కాంగ్రెస్ విజయం కోసం టీడీపీ పని చేసింది
  • కాంగ్రెస్ గెలిచాక గాంధీభవన్ లో టీడీపీ సంబరాలు చేసుకుంది
  • తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోనూ మా పొత్తు జనసేనతో మాత్రమే : విష్ణువర్ధన్ రెడ్డి


3:52 PM, Dec 6, 2023
ఎన్నికలు పారదర్శకంగా జరగాలి : వైఎస్సార్‌సిపి

  • ఎన్నికలు పారదర్శకంగా జరగాలనేది సీఎం జగన్ ఆకాంక్ష : మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
  • వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట
  • మోసాలు చేయడమే చంద్రబాబు ప్రధాన అజెండా
  • ఒక సామాజికవర్గం ఓట్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్నాయి
  • టీడీపీ ప్రలోభాలతో ప్రజలను లోబరుచుకుంటుంది
  • డూప్లికేట్ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉంది
  • చంద్రబాబు తాను చేసిన తప్పులను ఇతరుల పైకి నెడతారు
  • ఢిల్లీ వెళ్లి జాతీయ మీడియాలో అబద్దాలు చెప్పాలని బాబు ప్రయత్నిస్తున్నారు : మంత్రి చెల్లుబోయిన

3:33 PM, Dec 6, 2023
ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి : YSRCP

  • రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనాను కలిసిన మంత్రులు, వైఎసార్సీపీ నేతలు
  • కలిసిన వారిలో మంత్రులు జోగి రమేష్, వేణుగోపాల్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి
  • తెలంగాణ లో ఓటువేసిన వారిని ఏపీలో ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన మంత్రులు
  • 4 లక్షల 30 వేల 264 మందికి తెలంగాణ , ఏపీలో ఓట్లు ఉన్నాయి
  • ఆధారాలతో సహా ఈసీకి అందించాం
  • డబుల్ ఎంట్రీలు తొలగించాలని సీఈవోను కోరాం
  • దేశంలో ఒకే చోట ఓటు ఉండాలనేది వైఎసార్సీపీ విధానం
  • ఇలాంటి ఓట్లపై విచారణ జరిపించి తొలగించాలని కోరాం
  • డూప్లికేట్‌ ఓట్లు చేర్పించిందే చంద్రబాబు
  • తాజాగా HMDA పరిధిలో పలు చోట్ల ఓట్ల బూత్‌లు తెరిచిన తెలుగుదేశం నేతలు
  • ఇప్పుడు మళ్లీ ఎన్నికల సంఘానికి వెళ్లి ఏం ఫిర్యాదు చేస్తారు? : మంత్రి జోగి రమేష్

3:02 PM, Dec 6, 2023
మంగళగిరి NRI ఆస్పత్రి వ్యవస్థాపకుడిపై కేసు నమోదు

  • చంద్రబాబు హయాంలో ఒక వెలుగు వెలిగిన NRI ఆస్పత్రి
  • ఇప్పుడు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటోన్న వాటాదారులు
  • మంగళగిరి NRI ఆస్పత్రి వ్యవస్థాపకుడిపై కేసు నమోదు
  • ఆస్పత్రి నిధులు మళ్లించారంటూ విజయవాడలో కేసు
  • రూ. 400 కోట్లు మళ్లించినట్టు సురేష్ పై ఆరోపణలు
  • కోర్టు ఆదేశాలతో సురేష్ తో పాటు 39 మందిపై కేసు
  • చాలా మంది NRIల నుంచి బ్లాక్‌ మనీ సేకరించినట్టు ఆరోపణలు

2:20 PM, Dec 6, 2023
హైకోర్టులో విశాఖ కేసు

  • విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపును సవాలు చేస్తూ పిటిషన్
  • విచారణ జరిపి ఇరుపక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు
  • కార్యాలయాలు తరలింపునుకు సంబంధించిన జీవో 2283ను సవాల్ చేస్తూ పిటిషన్
  • ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్
  • పిటిషన్ కు విచారణ అర్హత లేదన్న ఏజీ శ్రీరామ్
  • ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయాల్సిన అంశాన్ని రిట్ పిటిషన్ గా దాఖలు చేశారన్న ఏజీ శ్రీరాం
  • ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చిన ఏజీ శ్రీరామ్
  • పిటిషనర్లు రిట్ పిటిషన్ దాఖలు చేశారు : అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్
  • ప్రజా ప్రయోజన వ్యాజ్యం రూపంలో దాఖలు చేయాల్సి ఉంది
  • రాజధాని తో ముడిపడి ఉన్న అంశం చీఫ్‌ జస్టిస్‌ బెంచ్ లేదా ఫుల్ బెంచ్ ముందుకు మాత్రమే రావాల్సి ఉంటుంది
  • కానీ పిటిషనర్లు తెలివిగా కావాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు
  • జీవో అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు రిట్ పిటిషన్ దాఖలు చేశారు
  • పిటిషనర్లు అమరావతిలో భూములు కలిగి ఉన్నారు
  • ఇది ఫోరమ్ షాపింగ్ కిందకు వస్తుందన్న ఏజీ
  • ఫోరమ్ షాపింగ్ పై పలు జడ్జిమెంట్లు ఉదహరించిన ఏజీ శ్రీరామ్
  • తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసిన హైకోర్టు

11:00 AM, Dec 6, 2023

ఏపీతో సంబంధంలేని వ్యక్తి పవన్‌: ఓ సామాన్యుడు

  • జనసేన అధినేత పవన్‌కు బిగ్‌ షాక్‌
  • ఏపీతో సంబంధంలేని వ్యక్తి పవన్‌ 
  • పవన్‌కు ఏపీలో ఇల్లు లేదు. 
  • ఓటు హక్కు కూడా లేదు. 
  • అలాంటి వ్యక్తి సీఎం జగన్‌కు పోటీనే కాదు. 
  • ఈసారి కూడా గెలిచేది సీఎం జగనే.
     

7:05 AM, Dec 6, 2023
జనసేన, టీడీపీ నేతలెక్కడ?
నాడు కరోనా సమయంలో, నేడు వరదల సమయంలో కనిపించని జనసేన, టీడీపీ నేతలు
కానీ, అంతా సద్దుమణిగిన తర్వాత సుద్దులు చెప్పడానికి గుంపులుగా వస్తారు.
 

7:00 AM, Dec 6, 2023
సిగ్గుండాలి చంద్రబాబు, పవన్‌..

  • కళ్లు కనపడుతున్నాయా పవన్‌?
  • చెవులు వినబడుతున్నాయా చంద్రబాబు?
  • వరద సహాయక చర్యల్లో నిమగ్నమైన వాలంటీర్లు..

6:50 AM, Dec 6, 2023
జనసేన పొత్తులకు అర్థాలు వేరులే

  • ఏపీలో తెలుగుదేశంతో, తెలంగాణలో బీజేపీతో
  • జనసేన పొత్తులపై పవన్ కళ్యాణ్‌ ప్రకటన
  • ఏపీలో టీడీపీ, తెలంగాణ లో బీజేపీ జనసేన కలవటంపై YSRCP విమర్శలు చేస్తోంది
  • నేను ప్రజల మంచి కోసమే నిర్ణయాలు తీసుకుంటాను
  • దీని వెనుక వ్యూహాలు ఉంటాయి
  • టీడీపీ వెనుక జన సేన వెళ్ళటం లేదు
  • టీడీపీతో కలిసి జన సేన నడుస్తోంది
  • ఎన్నికలకు 100 రోజుల సమయం ముందు అయోమయం వద్దు
  • నన్ను సంపూర్ణంగా నమ్మండి అప్పుడు ఏ గొడవలు జరగవు
  • నన్ను మోడీ , అమిత్ షా, చంద్రబాబు అర్థం చేసుకున్నారు
  • కానీ నా దగ్గర ఉన్న కొందరు మాత్రం అర్థం చేసుకోలేదు
  • ఇలా ఆలోచన చేసే వారు YSRCP లోకి వెళ్లి పోవచ్చు
  • టీడీపీ జన సేన పొత్తు పై విమర్శలు చేసే వారిని YSRCP కోవర్ట్ లుగా పరిగణిస్తాం
  • వీరిపై కఠిన చర్యలు తీసుకుంటాం
  • కేంద్రం, బీజేపీ, మోడీ జనసేనకి అండగా ఉంటారు
  • రేపు ముఖ్యమంత్రి పదవి ఎవరిది అని ప్రశ్నిస్తున్నారు.!
  • నన్ను ఎమ్మెల్యేగానే గెలిపించలేదు
  • నాకు ఓటు వేసిన వారు ఈ ప్రశ్న అడిగితే గౌరవంగా ఉంటుంది
  • కానీ ఓటు వేయని వారు ఇప్పుడు నన్ను సీఎం చేస్తామంటున్నారు.!

6:50 AM, Dec 6, 2023
ఓట్లతో తెలుగుదేశం రాజకీయాలు

  • తెలంగాణ ఎన్నికలు ముగియగానే పాలిట్రిక్స్‌ మొదలుపెట్టిన తెలుగుదేశం
  • ఇప్పటివరకు ఏపీలో నకిలీ ఓటర్లంటూ ప్రచారం
  • ఇప్పుడు ఏకంగా తెలంగాణలో కౌంటర్లు ఏర్పాటు చేసిన తెలుగుదేశం
  • మీకు ఏపీలో ఓటు కావాలా? మీ ఓటు చెక్‌ చేసుకోవాలా?
  • నిజాంపేట విజ్ఞాన్‌ స్కూల్‌లో ఏకంగా కౌంటర్‌ ప్రారంభించిన తెలుగుదేశం
  • దాంతో పాటు పలు కాలనీల్లో తెలుగుదేశం పార్టీ ఓటర్‌ కౌంటర్లు
  • జిహెచ్ఎంసి పరిధిలోని నిజాంపేట్, కుత్బుల్లాపూర్ పరిధిలో ఓటు నమోదు కేంద్రాలు
  • తమకు అనుకూలంగా ఉండే వారందరిని ఏపీలో ఓటర్లుగా చేర్పించే ప్రయత్నం
  • తెలంగాణలో ఓటేసిన వారిని కూడా ఏపీలో ఓటర్లుగా చేర్పించే కుట్ర
  • ప్రతీ నియోజకవర్గంలో కనీసం 5వేల మందిని కొత్తగా చేర్పించే ప్రయత్నం
  • ఎన్నికల రోజు వీరందరిని తరలించి టిడిపికి ఓటేయించే కుట్ర.

6:45 AM, Dec 6, 2023
నారా చంద్రబాబు నాయుడు.. కొన్ని అసలు సిసలు వాస్తవాలు
మా బాబు చాలా మంచోడు, రాజకీయ కక్షతో కేసులు పెట్టారు : ఎల్లో మీడియా
►మరి చంద్రబాబు నిజంగా మంచోడేనా? చంద్రబాబుపై ఎలాంటి కేసులు లేవా?
►వేర్వేరు సందర్భాల్లో చంద్రబాబు గురించి బాగా తెలిసిన వాళ్లు ఇప్పటివరకు ఏమన్నారు?
►చంద్రబాబు కీలకమైన/వివాదస్పదమైన అంశాల గురించి ఏమన్నాడు? ఆ తర్వాత ఏం జరిగింది?

తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు
►మొదటి నుంచి చంద్రబాబుది నేరప్రవృత్తే
►ధర్నాలప్పుడు ప్రభుత్వ బస్సులు తగలబెట్టాలని చంద్రబాబు చెప్పేవాడు

టీడీపీ సీనియర్‌ నాయకులు, మాజీ వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు
►అమరావతిలో  భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతుల పొలాలను  చంద్రబాబు తగలబెట్టించారని అక్కడి స్థానిక అధికారులు నాకు చెప్పారు

ఆనాటి స్పీకర్‌ కోడెల చౌదరి
చంద్రబాబు కట్టిన తాత్కాలిక భవనాల్లో ఒకటైన అసెంబ్లీలో వర్షం వచ్చినప్పుడు నీళ్లు కారితే ...
►"ఇది విపక్షాలు చేయించిన పనే అని  సీసీటీవీ ఫుటేజి ఉంది, రెండు రోజుల్లో ఆధారాలు బయటపెడతా" అని మీడియా ముందు ప్రకటనలు చేశారు. ఆ తరువాత మూడేళ్లు స్పీకర్‌గా ఉండికూడా  చూపలేదు.
►నిజంగా కుట్రే అయితే.. ఎందుకు బయటపెట్టలేదు?
►అంటే చేయించింది చంద్రబాబు, తెలుగుదేశం నేతలా?

కాపు ఉద్యమ సమయంలో  తునిలో  రత్నాచల్‌ రైలు తగలబడినప్పుడు చంద్రబాబు వెంటనే ప్రెస్‌మీట్‌ పెట్టారు
►"రైలు తగలబెట్టింది రాయలసీమ రౌడీలు, పులివెందుల రౌడీలు" అని చెప్పాడు, కానీ అరెస్ట్‌ చేసింది మాత్రం కోస్తా జిల్లాకు చెందిన కాపులను.?
►ముందు చంద్రబాబు ఎందుకు ప్రకటన చేశాడు? ఆ తర్వాత పోలీసులెందుకు అరెస్ట్‌లు చేశారు?
►అంటే రైలు తగలబెట్టే విషయం ముందే చంద్రబాబుకు తెలిసిందా? ఓట్ల కోసం మాట మడతేశారా?.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement