TDP Chandrababu Cases Petitions And Political Updates
6:58 PM, Nov 17, 2023
మద్యం కుంభకోణం కేసులో కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ
►సీఐడీ తరఫు వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్
►లిక్కర్ పాలసీ ఇతరులకు ఆర్థిక లాభాలను అందించడానికే మార్చబడింది
►క్యాబినెట్‌లో తీర్మానం చేయకుండానే నిబంధనలను తొలగించారు
►ప్రివిలేజ్ ఫీజును తొలగించే నిబంధనకు సంబంధించి క్యాబినెట్‌లో చర్చించకుండానే A2, A3 నిర్ణయం తీసుకున్నారు
►రాష్ట్రానికి వేల కోట్ల నష్టం వచ్చింది
►ప్రిన్సిపల్ అకౌంట్ జనరల్ ఏపీ తన నివేదికలో నివేదించారు
►ప్రభుత్వానికి నష్టం వచ్చింది దీంతోపాటుగా ప్రైవేటు వ్యక్తులు లాభ పొందారు
►ఎస్పీవై విషయంలో క్విట్ ప్రోకో జరిగిందని అనుమానాలు ఉన్నాయి
►లిక్కర్ పాలసీ క్యాబినెట్ నిర్ణయమని క్రిమినల్ చట్టాలు దీనికి వర్తించమని పిటిషనర్లు చెబుతున్న వాదన సరికాదు
►ఇతరులకు లబ్ధి చేకూర్చడానికి కుట్రపూరితంగా అప్పటి ప్రభుత్వం ఈ నేరానికి పాల్పడింది
►ఢిల్లీ మద్యం కేసులో సుప్రీంకోర్టు కూడా ఇదే నిర్ధారించింది
►తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసిన కోర్టు
6:40 PM, Nov 17, 2023
మెడికల్ రిపోర్ట్స్ పై డాక్టర్ సీదిరి అప్పలరాజు అనుమానాలు
►బెయిల్ కోసం ఇన్ని డ్రామాలెందుకు బాబూ ?:
►చంద్రబాబు మెడికల్ రిపోర్ట్స్ ఒక డాక్టర్‌గా పరిశీలించాను.
►చంద్రబాబు గుండె సైజ్ పెరిగిందని ఏఐజీ ఆస్పత్రి రిపోర్ట్ ఇచ్చింది.
►గుండె జబ్బులు ఉన్నాయన్న ఈ రిపోర్ట్ ప్రకారం చంద్రబాబుకి ఏ డాక్టర్ కూడా కన్ను ఆపరేషన్ చేయరు.
►సిటీ కాల్షియమ్ స్కోర్ 1611కి పెరిగి, ప్రమాదమని రిపోర్ట్‌లో ఉన్నప్పుడు కన్ను ఆపరేషన్ ఏ డాక్టర్ చేయరు.
►ఈ రిపోర్ట్ ప్రకారం గుండెకు మెయిక్టమీ, బైపాస్ సర్జరీ చేశాకే కన్ను ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది.
►మెడికల్ రిపోర్ట్స్‌లో మందుల ప్రిస్క్రిప్షన్ ఎక్కడా రాయలేదు.
►ఏంజియోగ్రామ్ రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదు.
►బెయిల్ పొడిగించుకోవడానికి టీడీపీ ఆఫీస్‌లో మెడికల్ రిపోర్ట్ తయారు చేసి కోర్టుకి ఇచ్చారు
04:34 PM, Nov 17, 2023
పచ్చమీడియాలో రేవంత్‌రెడ్డి ఇంటర్వ్యూలు
►అనుకోకుండా నిజాలు బయటపెట్టేసిన రేవంత్ రెడ్డి
►మీరు ముఖ్యమంత్రి అయితే కేసులు పెట్టరు కదా అన్న ప్రశ్నకు రేవంత్ సూటి సమాధానాలు
►అవినీతి ఉందని ఆరోపించాం, అక్రమాలు జరిగాయని చెప్పాం. కాబట్టి కెసిఆర్ కుటుంబం మీద కేసులు పెడతామన్న రేవంత్
►చంద్రబాబు అరెస్ట్ కావడం మీకు కలిసొచ్చింది కదా అన్నదానికి అవునన్న రేవంత్
►చంద్రబాబుతో తనకు చాలా రోజులుగా మంచి సాన్నిహిత్యం ఉందన్న రేవంత్
►చంద్రబాబు జైలుకు వెళ్లిన రోజు పర్సనల్‌గా చాలా బాధకు గురి అయ్యానన్న రేవంత్
►చంద్రబాబు అరెస్ట్ ఓట్ల పరంగా కాంగ్రెస్‌కు ఉపయోగపడుతుందన్న రేవంత్
►చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నారు కాబట్టి ఈ అంశం సున్నితంగా మారిందన్న రేవంత్
►ఏపీలో చంద్రబాబుతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా పోటీలో ఉన్నాడు.
►తెలంగాణలో పవన్‌కళ్యాణ్‌కు తక్కువ ఓట్లు వస్తే.. దాని ప్రభావం ఏపీలో ఆ కూటమిపై పడుతుందన్న రేవంత్
04:09 PM, Nov 17, 2023
ఫైబర్ నెట్ కేసులో ఆస్తుల అటాచ్‌మెంట్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ
►నిందితుల ఆస్తులను అటాచ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన సీఐడీ
►అక్రమాలకు పాల్పడ్డవారి వద్ద ఉన్న ఆస్తులు ఏవైనా అటాచ్ చేసే అధికారం ఉందని కోర్టుకు తెలిపిన సీఐడీ న్యాయవాదులు
►తదుపరి విచారణను 20వ తేదీకి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
2:03 PM, Nov 17, 2023
మ్యానిఫెస్టోపై కిం కర్తవ్యం.?
►ఇంకా తుదిదశకు రాని తెలుగుదేశం-జనసేన మ్యానిఫెస్టో
►మినీ మేనిఫెస్టో పేరిట కుస్తీలు పడుతోన్న టిడిపి నేతలు
►తెలుగుదేశం ఎజెండాలో ఆరు అంశాలు
►జనసేన ఎజెండాలో అయిదు అంశాలు
►మేనిఫెస్టోలో చేర్చిన ఎనిమిది అంశాలు
1. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా అంకుర సంస్థల ఏర్పాటుకు రూ. 10 లక్షల వరకూ రాయితీ
2. ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు.
3. అమరావతే రాజధానిగా కొనసాగింపు.
4. పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం.
5.అసమానతలు తొలిగిపోయి.. ఆర్థిక వ్యవస్థ బాగుపడేలా ప్రణాళికల రూపకల్పన.
6. బీసీలకు రక్షణ చట్టం తీసుకురావడం.
7. రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి బయటకు తీసుకువచ్చే విధానాలపై నిర్ణయం.
8. రద్దు చేసిన సంక్షేమ పథకాలపై పునఃపరిశీలన.
►ఇంత చేసినా.. మేనిఫెస్టో ప్రజల్లో నెగ్గుతుందన్న దానిపై టిడిపి-జనసేనలో అనుమానాలు
►ఇలాంటి మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వెళ్తే సీన్ రివర్సేనని రెండు పార్టీ నేతల ఆందోళన
►టిడిపి-జనసేన మేనిఫెస్టో ప్రజల ఆశలకు దూరంగా ఉందంటూ హరిరామజోగయ్య విమర్శలు
►ఏముందని ఇది ప్రజలను ఆకట్టుకుంటుందని హరిరామజోగయ్య ప్రశ్నలు
►కొత్తగా 47 సంక్షేమ పథకాలు పేదలకు పెట్టాలంటున్న హరిరామజోగయ్య
►మరి ఇన్నాళ్లు శ్రీలంకలా మారుతుందని భయపెట్టాం కదా అంటోన్న తెలుగుదేశం నేతలు
►గెలవాలంటే ఏమైనా చెప్పాల్సిందేనంటూ ఇరుపక్షాల్లో చర్చ
►2014లో అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను మాయం చేసిన చంద్రబాబు, తెలుగుదేశం నేతలు
1:50 PM, Nov 17, 2023
మద్ధతు తెలపడానికి ఏదో ఒక విధానం ఎంచుకోండి : టిడిపి శ్రేణులకు బాబు సూచనలు
►నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్ధతు తెలపడానికి ఏదో ఒక పద్ధతి ఎంచుకోవాలంటోన్న బాబు
►కుల, సంఘాలు లేదా ఉద్యోగ సంఘాలు లేదా వృత్తిపరమైన సంఘాల సమావేశానికి కాంగ్రెస్ అభ్యర్థులను ఆహ్వానించాలని సూచన
►తెలుగుదేశం పేరిట కాకుండా.. ఇతర మార్గాల్లో బహిరంగ మద్ధతు ప్రకటిస్తున్నట్టు చెప్పాలంటున్న బాబు
►కాంగ్రెస్ కోసం యూనియన్‌లకు (లేబర్, డ్రైవర్, ఆటో...) ఏంతైనా ఇవ్వాలని సూచన
1:40 PM, Nov 17, 2023
తెలంగాణ రాజకీయాల కోసం చంద్రబాబు మంత్రాంగం
►తెలంగాణ ఎన్నికల వేళ మంత్రాంగాలతో చంద్రబాబు బిజీ బిజీ
►పది ఉమ్మడి జిల్లాల పార్టీ నాయకులతో చంద్రబాబు ఫోన్ చర్చలు
►ఎంత ఖర్చైనా పెట్టండి, కాంగ్రెస్ గెలుపు కోసం ప్రయత్నించాలంటూ సూచనలు
►కాంగ్రెస్ గెలిస్తేనే.. తెలుగుదేశానికి మనుగడ అంటూ చెబుతున్నట్టు సమాచారం
►రేవంత్ కోసం ఇప్పుడు మీరు కష్టపడితే.. భవిష్యత్తుల్లో రేవంత్ మీ కోసం కష్టపడతాడని చెబుతున్న చంద్రబాబు
1:03 PM, Nov 17, 2023
సమన్వయం వెనక టిడిపి భారీ స్కెచ్
►జనసేనతో సమన్వయ సమావేశాల వెనక తెలుగుదేశం భారీ స్కెచ్
►175 నియోజకవర్గాలకు గాను 10 నుంచి 12కు జనసేనను పరిమితం చేసేందుకు సమన్వయం పేరుతో వ్యూహం
►జనసేన అభ్యర్థులను రెండు వర్గాలుగా విభజించడం, ఆనక వారి మధ్య చిచ్చు పెట్టడం
►జనసేనను విభజించి పాలించేలా చేసి.. చివరికి బలహీనపరిచి ఆ స్థానంలో టిడిపి ఎంట్రీ ఇవ్వడం
►ఏ ఏ నియోజకవర్గాల్లో జనసేన శక్తియుక్తులు ఏమున్నాయో తెలుసుకునేందుకు టిడిపికి అద్భుతమైన అవకాశం
►ఒక నియోజకవర్గంలో జనసేనకు ఒక అభ్యర్థి ఉన్నాడంటే.. ఏ రకంగా దెబ్బతీయవచ్చో.. తెలుసుకునే వ్యూహం
►తెలుగుదేశం అభ్యర్థిని ముందుగానే జనసేనలో జొప్పించడం, జనసేన అభ్యర్థిగా బరిలో దించడం
►పేరుకు పొత్తు గానీ, పార్టీని విలీనం చేస్తే ఎన్ని ప్రయోజనాలో.. అన్నింటిని చేజిక్కించుకోవడం
►ఇప్పటికే నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లకు స్వయంగా ఫోన్లు చేసి ఏం చేయాలో వివరించిన చంద్రబాబు
►తన 40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఎలాంటి లబ్ది పొందాడో చెప్పి గేమ్ ప్లాన్ వివరిస్తోన్న చంద్రబాబు
►టిడిపి విష రాజకీయానికి గిలగిలలాడుతోన్న జనసేన కార్యవర్గం
►పార్ట్‌టైం పొలిటిషియన్ పవన్ కళ్యాణ్ వచ్చేది లేదు, పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం చేసేది లేదంటున్న జనసేన నాయకులు
12:32 PM, Nov 17, 2023
యువగళానికి మంగళం
►చినబాబు లోకేష్ సూపర్ బిజీ
►ఇక యువగళానికి మంగళం పలకాలన్న యోచనలో పార్టీ
►ఇన్నాళ్లు వేర్వేరు కారణాలతో పాదయాత్రకు రాలేనన్న లోకేష్
►ఇప్పుడు అవసరం ఉన్నా.. నడవలేనంటున్న లోకేష్
►ముందు తనకొక నియోజకవర్గం కావాలంటోన్న లోకేష్
►రాష్ట్రమంతా తిరగలేను, తన నియోజకవర్గంలో పర్యటన జరుపుకోవాలన్న యోచనలో లోకేష్
12:13 PM, Nov 17, 2023
కాపులను గుంపగుత్తగా పవన్ అమ్మేస్తున్నారు : KA పాల్
►కాపులకు రాజ్యాధికారం రాకపోవడానికి కాపు నాయకులే కారణం
►వంగవీటి రంగా ఆత్మఘోషిస్తోంది
►రంగా గురించి ఆలోచించిన కాపులెవరూ టీడీపీతో కలవరు...ఉండరు
►1000 కోట్ల ప్యాకేజీకి పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి కాపులను అమ్మేశాడు
►2009లో చిరంజీవి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపులను తాకట్టు పెట్టి రాజకీయాలు చేస్తున్నారు
►మేం పెదకాపులమని చెప్పుకోవడానికి వాళ్లకి సిగ్గులేదా
►అమ్ముడు పోయిన కాపులతో మీరు ఉంటారా? ప్యాకేజీ స్టార్ తో మీరు ఉంటారా?
►కాపులను వెనక్కి నెట్టేసిన అన్నదమ్ములతో ఉంటారా?
►గుండు గీయించుకున్న కాపులు రావాలా? గుండు గీసే కాపులు కావాలా?
►1500 కోట్లకు 30 సీట్లకు పవన్ అమ్ముడుపోయాడు.!
►2014 నుంచి 19 వరకూ ఏపీని చంద్రబాబు అప్పుల పాలు చేశాడు
►ఈ రాష్ట్రాన్ని దరిద్రాంధ్ర ప్రదేశ్ గా మార్చాడు
►టీడీపీ,జనసేన పార్టీలు మీటింగ్ లలో కొట్టుకుంటున్నాయి
►అవి సమన్వయ సమావేశాలు కాదు
►బుర్రా బుద్ధి లేని మీటింగ్‌లు జరుగుతున్నాయి
11:30 AM, Nov 17, 2023
సమన్వయం కాదు అన్నీ సమస్యలే
►టిడిపి-జనసేన మధ్య క్షేత్రస్థాయిలో కుదరని సమన్వయం
►మొన్న పిఠాపురం.. నిన్న అనకాపల్లి.. నేడు జగ్గయ్య పేట..
►ఘర్షణకు దిగుతోన్న టీడీపీ - జనసేన కార్యకర్తలు
►జగ్గయ్య పేటలో టీడీపీ - జనసేన ఆత్మీయ సమావేశం రచ్చరచ్చ
►టీడీపీ - జనసేన పొత్తులో భాగంగా సీటు తనదేనని జ్యోతుల నెహ్రు ప్రకటన
►పవన్ కల్యాణ్ కూడా తన వైపే ఉన్నాడని చెప్పిన జ్యోతుల
►జగ్గయ్యపేట జనసేన ఇంచార్జి సూర్యచంద్రకు సీటు కేటాయిస్తే పొత్తుకు రాం రాం
► జ్యోతుల నెహ్రు ప్రకటనతో ఆత్మీయ సభ నుంచి ఆగ్రహంగా వెళ్లిపోయిన సూర్యచంద్ర
►చాలా నియోజకవర్గాల్లో కుదరని సయోధ్య
►నాలుగు రోజులుగా టీడీపీ - జనసేన వ్యవహారశైలి చూస్తోన్న ప్రజలు
10:40 AM, Nov 17, 2023
స్కిల్ స్కాం : కోడ్ భాషలో కొల్లగొట్టారు
►కోర్టు ముందు కుంభకోణం ఎలా జరిగిందో వివరించిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి
►హవాలా మార్గంలో స్కిల్ లో దోచిన డబ్బు మళ్లించారు
►చెన్నప్ప అనే వ్యక్తి ద్వారా సుమన్ బోస్‌కు డబ్బు ముట్టింది
►వారి మధ్య కోడ్ భాషలో నిధుల మళ్లింపు గురించి చర్చ జరిగింది
►371 కోట్ల స్కిల్ కుంభకోణం లో 241 కోట్లు హవాలా మార్గంగా లో బాబుకు చేరాయి
►ఈ స్కిల్ కుంభకోణం డబ్బులో రూ.65.86 కోట్లు టీడీపీ ఖాతాలకు చేరాయి
►ఆ వివరాలు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించడం లేదు
►సహనిందితుల ద్వారా చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తున్నారు
►బెయిల్ కోసం తప్పుడు మెడికల్ రిపోర్టు కోర్టు ముందుంచారు
►గుండె జబ్బన్నారు.. ఈసీజీలో అలాంటిదేమీ లేదు
►ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించుకునేలా ఆదేశాలివ్వండి
హైకోర్ట్ లో సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి
9:30 AM, Nov 17, 2023
ఫైబర్ గ్రిడ్ కేసులో సీఐడీ పిటిషన్‌పై నేడు విచారణ
►ఫైబర్ గ్రిడ్ స్కాంలో నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్ కోరుతూ సీఐడీ పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ
►ఫైబర్ నెట్ స్కాంలో నిందితులకి సంబంధించిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలని సీఐడీ ప్రతిపాదన
►ఇప్పటికే సీఐడీ ప్రతిపాదనకు హోంశాఖ ఆమోదం
►అనుమతి కోసం ఇప్పటికే ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ
►టెరాసాఫ్ట్ కంపెనీ, చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్
►ఫైబర్ నెట్ కుంభకోణంలో రూ.114 కోట్లు దుర్వినియోగమయ్యామని ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు
►ఈ కేసులో ఏ-1గా వేమూరి హరికృష్ణ, ఏ-11గా టెర్రా సాఫ్ట్ ఎండి తుమ్మల గోపీచంద్, ఏ-25గా చంద్రబాబు పేర్లు.
►ఫైబర్ నెట్ స్కాలో నిందితులైన తుమ్మల గోపీచంద్‌కి ఆస్ధులతో పాటు పలు కంపెనీల ఆస్తులు అటాచ్ చేయాలని ప్రతిపాదన
►గోపీచంద్, ఆయన భార్య పావని పేర్లపై హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ కాలనీ, చిన్నమంగళారంలో ఉన్న ఇల్లు, వ్యవసాయ క్షేత్రాలు అటాచ్
►ఈ కుంభకోణంలో నిందితులైన నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ డైరక్టర్ కనుమూరి కోటేశ్వరరావుకి చెందిన గుంటూరు, విశాఖ కిర్లంపూడి లే అవుట్‌లోని ఇల్లులు అటాచ్
►మొత్తంగా అటాచ్ ఆస్తుల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి
►హోంశాఖ ఉత్తర్వుల నేపథ్యంలో ఆ స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేసిన సీఐడీ.
►సీఐడీ పిటిషన్‌పై నేడు విచారణ జరపనున్న ఏసీబీ కోర్టు
8:30 AM, Nov 17, 2023
టీడీపీ-జనసేన కార్యకర్తల కుమ్ములాట
కృష్ణా జిల్లాలో ఆత్మీయ సమ్మేళనంలో తన్నులాట
టీడీపీ-జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం, కుమ్ములాట.
కృష్ణా జిల్లాలో ఆత్మీయ సమావేశం పేరుతో టీడీపీ-జనసేన కాక్యకర్తల కుమ్ములాట! pic.twitter.com/EYuOqU3p0H
— YSR Congress Party (@YSRCParty) November 16, 2023
7:30 AM, Nov 17, 2023
చంద్రబాబుపై ఎన్ని కేసులు? ఎన్ని స్టేలు?
►దేశ రాజకీయాల్లో స్టేBNగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు
►1997లో రెడ్యానాయక్ మీ అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే
►1998లో వైఎస్సార్ గారు హైకోర్టులో దావా వేస్తే స్టే
►1999లో షబ్బీర్ అలీ, 1999లో డీఎల్ రవీంద్రారెడ్డి వేసిన దావాల్లో స్టే.
►1999, 2000, 2001 వైఎస్సార్ గారు తిరిగి దావా వేస్తే స్టే.
►2003లో కృష్ణకుమార్ గౌడ్ కేసు వేస్తే స్టే
►2003లో కన్నా లక్ష్మీనారాయణ వేసిన కేసు ఏంటంటే పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్ పెట్టాడని దావా వేస్తే స్టే
►2004లో కన్నా మళ్లీ కేసు వేస్తే స్టే.
►2004లో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చంద్రబాబుపై రెండు కేసులు
►ఒకటి అక్రమాస్తులు, రెండు భూదోపిడీ.. దాంట్లోనూ స్టే
►2005లో బాబు అక్రమాస్తులపై లక్ష్మీపార్వతి హైకోర్టులో కేసు వేస్తే స్టే
►2005 శ్రీహరి, అశోక్ అనే ఏపీ పౌరులు కేసు వేస్తే స్టే
►2011లో బి.ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు వేస్తే స్టే.
7:35 AM, Nov 17, 2023
చంద్రబాబు కేసుల స్టేటస్ ఏంటీ?
కేసు: స్కిల్ స్కాం
అంశం: మధ్యంతర బెయిల్
స్టేటస్: అనారోగ్యం కారణంగా మంజూరు
వివరణ: నవంబర్ 28న జైలు ముందు లొంగిపోవాలి
కేసు : స్కిల్ స్కాం
అంశం: క్వాష్ పిటిషన్
స్టేటస్: సుప్రీంకోర్టులో పెండింగ్
వివరణ: ఈ నెలాఖరుకు తీర్పుకు ఛాన్స్
కేసు : ఇసుక కుంభకోణం
అంశం: ముందస్తు బెయిల్ పిటిషన్
స్టేటస్: హైకోర్టులో జరుగుతున్న విచారణ
వివరణ: నవంబర్ 22కి తదుపరి విచారణ వాయిదా
కేసు : ఫైబర్ నెట్ పేరిట నిధుల దోపిడి
అంశం: ముందస్తు బెయిల్ పిటిషన్
స్టేటస్: సుప్రీంకోర్టులో పెండింగ్
వివరణ: నవంబర్ 30కి తదుపరి విచారణ వాయిదా
కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు
అంశం: ముందస్తు బెయిల్ పిటిషన్
స్టేటస్: మంజూరు చేసిన హైకోర్టు
వివరణ: ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు
కేసు: ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాల కేసు
అంశం: ముందస్తు బెయిల్ పిటిషన్
స్టేటస్: హైకోర్టులో జరుగుతున్న విచారణ
వివరణ: నవంబర్ 22కి వాయిదా పడ్డ కేసు
కేసు: మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు
అంశం: ముందస్తు బెయిల్ పిటిషన్
స్టేటస్: హైకోర్టులో జరుగుతున్న విచారణ
వివరణ: నవంబర్ 21కి వాయిదా పడ్డ కేసు.
7:20 PM, Nov 17, 2023
తెలంగాణకు దారేది?
►తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కనిపించని పవన్ కల్యాణ్
►పవన్ కోసం జనసేన అభ్యర్థులతో పాటు బీజేపీ ఎదురుచూపులు
►తెలంగాణలో 111 చోట్ల బీజేపీ, 8 చోట్ల జనసేన అభ్యర్థులు
►ఇప్పటిదాకా ప్రచారానికి రాని పవన్ కల్యాణ్
►ప్రధాని మీటింగ్ తర్వాత ముఖం చాటేసిన పవన్
►అసలు పవన్ కల్యాణ్ వస్తాడా? రాడా? అన్నదానిపై కొనసాగుతున్న సస్పెన్స్
►అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ కనిపించని పవన్ కళ్యాణ్
►పార్ట్‌టైం పాలిటిక్స్‌కు పవన్ పరిమితమయ్యాడని జనసేనను నమ్ముకున్నవారి ఆవేదన
►ఈ నెల 17, 18 తేదీల్లో తెలంగాణ ఎన్నికల ప్రచారానికి రానున్న హోంమంత్రి అమిత్ షా
►కనీసం అమిత్‌షా పర్యటన సందర్భంగానైనా పవన్ కనిపిస్తాడని ఆశలు
7:10 PM, Nov 17, 2023
జైలు ముహూర్తం దగ్గరపడుతుండడంతో చంద్రబాబు టీంలో ఆందోళన
►నవంబర్ 28న రాజమండ్రి జైల్లో లొంగిపోవాల్సి ఉన్న చంద్రబాబు
►ఇప్పటికే కంటి ఆపరేషన్ పేరిట మధ్యంతర బెయిల్ తీసుకున్న చంద్రబాబు
►తాజాగా గుండె జబ్బు గురించి హైకోర్టుకు నివేదించిన చంద్రబాబు లాయర్లు
►నవంబర్ 28న జైలులోనికి వెళ్లకుండా ఉండేందుకు సర్వ ప్రయత్నాలు
►ఆరోగ్య పరిస్థితిని కారణంగా చూపి కోర్టు నుంచి మినహాయింపు పొందే వ్యూహాలు
►ఎన్నో బహిరంగ సభల్లో తన ఆరోగ్యం గురించి మాట్లాడిన చంద్రబాబు
►వయస్సు అనేది తనకొక నెంబర్ మాత్రమేనని ప్రకటించిన చంద్రబాబు
►40 ఏళ్ల కుర్రాళ్ల కంటే వేగంగా పనులు చేస్తానని ఎన్నో సార్లు చెప్పుకున్న చంద్రబాబు
►జైలుకు వెళ్లగానే చంద్రబాబుకు హఠాత్తుగా గుర్తుకొచ్చిన జబ్బులు
7:05 AM, Nov 17, 2023
స్కిల్ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది?
►టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ స్కాం
►నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం
►జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్‌తో ఒప్పందం అంటూ ప్రచారం
►సీమెన్స్ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రచారం
►ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు
►అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు
►షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల పక్కదారి
►విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్
►పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్)
►ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST
►విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు
►స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ
►నిధులన్నీ సూట్‌కేస్ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్‌కమ్‌టాక్స్ శాఖ
►కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్‌మెంట్లను గుర్తించిన CID
►రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి
►ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్
►చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు
►సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ
►1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు
►సెప్టెంబర్ 10న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
►ఐదు పర్యాయాలు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
►రిమాండ్ ఖైదీగా 7691 నెంబర్‌తో 52 రోజులపాటు చంద్రబాబు
►కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు.
Comments
Please login to add a commentAdd a comment