Nov 20th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | TDP Chandrababu Cases Petitions And Political Updates 20th November | Sakshi
Sakshi News home page

Nov 20th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Mon, Nov 20 2023 7:54 AM | Last Updated on Mon, Nov 20 2023 5:43 PM

TDP Chandrababu Cases Petitions And Political Updates 20th November - Sakshi

TDP Chandrababu Cases Petitions And Political Updates..

4:35PM, Nov 20, 2023
చంద్రబాబుకు బెయిలే వచ్చింది.. నిర్దోషి అని తీర్పు కాదు: మంత్రి అంబటి
వచ్చింది బెయిలే... నిర్దోషి అని తీర్పు కాదు రెచ్చిపోయి ప్రభుత్వాన్నీ , ముఖ్యమంత్రి ని దూషిస్తున్నారు......... మూల్యం చెల్లిస్తారు !
 

4:25PM, Nov 20, 2023
చంద్రబాబు డైరెక్షన్‌లోనే స్కిల్‌ స్కామ్‌:  సజ్జల రామకృష్ణారెడ్డి
►చంద్రబాబుకు బెయిల్‌ రావడంతో ఎల్లో మీడియా హడావుడి చేస్తోంది
►​కోర్టు చేసిన వ్యాఖ్యలను ఎల్లో మీడియా చూపించడం లేదు
►ఎల్లో మీడియా ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఇస్తోంది
►స్కిల్‌ స్కామ్‌తో సంబంధం లేదని చంద్రబాబు నిరూపించుకోవాలి
►రాజకీయ సానుభూతి కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు
►స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ ఎలా జరిగిందో ఆధారాలున్నాయి
►ఆధారాలన్నీ సీఐడీ తరపు లాయర్లు కోర్టులో సమర్పించారు
►ప్రజల సొమ్మును షెల్‌ కంపెనీల పేరుతో దోచేశారు
►షెల్‌ కంపెనీల పేరుతో అవినీతి జరిగింది
►ఫేక్‌ ఇన్వాయిస్‌లతో రూ. 241 కోట్లు దోచేశారు
►కిలారి రాజేశ్‌, పెండ్యాల శ్రీనివాస్‌లకు నోటీసులిచ్చారు
►ఐటీ శాఖ నోటీసుల్లో అన్ని లింకులు బయటపడ్డాయి
►చంద్రబాబు డైరెక్షన్‌లోనే స్కిల్‌ స్కామ్‌ జరిగింది
►వివిధ స్టేజీల్లో స్కిల్‌ స్కామ్‌ ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు పెట్టారు
►ఏ రోజు కూడా స్కిల్‌ స్కామ్‌ జరగలేదని చంద్రబాబు లాయర్లు వాదించలేదు
►గంటా సుబ్బారావును ఐదు పదవుల్లో కూర్చోబెట్టారు

3:40PM, Nov 20, 2023

చంద్రబాబు బెయిల్‌ ఆర్డర్‌లో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
►స్కిల్‌ స్కాంలో చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష అనడం సరికాదు
►చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్కిల్‌ స్కామ్‌ కేసు వెలుగులోకి వచ్చిందన్న సీఐడీ వాదనతో ఏకీభవించిన హైకోర్టు
►ఇది బెయిల్‌ పిటిషన్‌ మాత్రమే కాబట్టి స్కిల్‌ స్కామ్‌ కేసు లోతుల్లోకి వెళ్లి పూర్తి విచారణ చేయాల్సిన అవసరం లేదు
►ట్రయల్‌ కోర్టులో కేసు విచారణ సందర్భంగా అన్ని అంశాలు లోతుగా విచారణకు వస్తాయి
►ఈ కేసులో పరారీలో ఉన్న చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్‌ను చట్ట ప్రకారం విచారించాలి.

2:15 PM, Nov 20, 2023
స్కిల్‌ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్‌ బెయిల్‌
►స్కిల్‌ కుంభకోణంలో చంద్రబాబు నాయుడికి రెగ్యులర్‌ బెయిల్‌
►రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసిన రాష్ట్ర హైకోర్టు
►ఇప్పటికే ఆరోగ్య కారణాలతో బెయిల్‌ మీదున్న చంద్రబాబు
►పాత బెయిల్‌ ప్రకారం నవంబర్‌ 28న జైలుకు వెళ్లాల్సిన చంద్రబాబు
►నవంబర్‌ 28న వెళ్లాల్సిన అవసరం లేకుండా రెగ్యులర్‌ బెయిల్‌
►నవంబర్‌ 30న ACB కోర్టు ముందు చంద్రబాబు హాజరు కావాలని సూచించిన హైకోర్టు
►మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో షరతులు ఈనెల 28 వరకే వర్తిస్తాయి
►చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టులో అందించాలి
►ఈనెల 29 నుంచి రాజకీయ ర్యాలీలు, సభల్లో పాల్గొనవచ్చు
►సాక్షులను ప్రభావితం చేస్తారన్న ప్రాసిక్యుషన్ వాదనకు ఆధారాల్లేవు
►నిధులు విడుదల చేయమన్నంత మాత్రాన నేరంలో పాత్ర ఉందని చెప్పలేం
►ఉల్లంఘనలపై అధికారులు సీఎంకు చెప్పినట్లు ప్రాథమిక ఆధారాల్లేవు
►ఈ కేసు విచారణ మొదలయ్యాక 22 నెలలు చంద్రబాబు బయటే ఉన్నారు
►కొద్ది రోజుల ముందే కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు
►విచారణ కాలంలో కేసును ప్రభావితం చేశారనేందుకు ఒక్క ఆధారం లేదు

►స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో చంద్రబాబును సెప్టెంబర్‌ 9న అరెస్టు చేశారు. అదే రోజు ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది
►రిమాండ్‌ ఖైదీగా సెప్టెంబర్‌ 10 అర్ధరాత్రి 1.30 గంటలకు రాజమహేంద్రవరం సెం­ట్రల్‌ జైలుకు తరలించారు
►జైల్లో ఆయనకు ప్రత్యేకంగా స్నేహ బ్లాక్‌ కేటా­యించారు. ఏ గదిలో ఉంచారో భద్రతా కారణాల రీత్యా గోప్యంగా ఉంచారు
►కోర్టు ఆదేశాలతో రోజూ ఇంటి భోజనం, మందులు, అల్పాహారం ఆయ­­న ఇంటి నుంచే అందించే వెసులుబాటు కల్పించారు
►మొదట సెప్టెంబరు 22 వరకు చంద్రబాబు రిమాండ్‌లో ఉన్నారు. అనంతరం రెండు రోజులపాటు సీఐడీ కస్టడీకి అప్పగించారు 
►రాజమహేంద్రవరంసెంట్రల్‌ జైల్లోనే రెండురోజుల పాటు ఆయనను సీఐడీ అధికారులు విచారించారు. అన్నింటికీ ‘తెలియదు.. గుర్తులేదు.. మరిచిపోయా’ అనే తీరులో చంద్రబాబు సమాధానం చెప్పారు
►సెప్టెంబర్‌ 24న మరోసారి బాబుకు రిమాండ్‌. దీన్ని అక్టోబర్‌ 5 వరకు కొనసాగించారు
►జైల్లో దోమలు ఉన్నాయని, చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందని ఎల్లో మీడియా దుష్ప్రచారానికి దిగింది
►చంద్రబాబుకు ముందు నుంచే ఉన్న చర్మ సమస్య జైల్లో ఇంకా పెరిగిపోయిందని ఎల్లో మీడియా కథనాలు అల్లింది. ఆయనకు వైద్యులతో ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు చేశారు.
►కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు జైల్లో టవర్‌ ఏసీ వసతి కల్పించారు
►నిత్యం మూడుసార్లు వైద్య పరీక్షలతోపాటు ఒకసారి ఆయన కోసం ఏర్పాటు చేసిన ప్ర­త్యే­­క వైద్య బృందంతో పరీక్షలు
►చంద్రబాబు రిమాండ్‌ మరోసారి పొడిగింపు. అక్టోబర్‌ 5 నుంచి 19 వరకు ఏసీబీ కోర్టు జ్యుడిషియల్‌ రిమాండ్‌ పొడిగించింది
►వారానికి రెండుసార్లు బాబుతో ములాఖత్‌ అయిన ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి
►తన కుడి కంటికి కాటరాక్ట్‌ సర్జరీ అవసరమని జైలు అధికారులకు తెలిపిన చంద్రబాబు. ఆయనకు జీజీహెచ్‌ వైద్యులతో పరీక్షలు చేయించిన అధికారులు
►బాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా  అక్టోబర్‌ 31వ తేదీన చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు.

2:15 PM, Nov 20, 2023
స్కిల్‌ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది?
►టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్‌ స్కాం
►నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం
►జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్‌తో ఒప్పందం అంటూ ప్రచారం
►సీమెన్స్‌ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రచారం
►ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు
►అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు
►షెల్ కంపెనీల ద్వారా  రూ 241 కోట్ల పక్కదారి
►విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్‌
►పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్)
►ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST
►విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు
►స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ
►నిధులన్నీ సూట్‌కేస్‌ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్‌కమ్‌టాక్స్‌ శాఖ
►కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్‌మెంట్లను గుర్తించిన CID
►రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి
►ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్
►చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్‌ విత్‌ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు
►సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ
►1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్‌ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్‌ చేసిన సీఐడీ పోలీసులు
►సెప్టెంబర్‌ 10న రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలింపు
►ఐదు పర్యాయాలు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగింపు
►రిమాండ్‌ ఖైదీగా 7691 నెంబర్‌తో 52 రోజులపాటు చంద్రబాబు
►కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్‌ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
►నవంబర్‌ 20న రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు

2:05 PM, Nov 20, 2023
ఫైబర్‌నెట్‌ కేసులో విచారణ వాయిదా
►విజయవాడ : ఏపీ ఫైబర్ నెట్ కేసును విచారించిన ఏసీబీ కోర్టు
►టెరాసాఫ్ట్ ఎండీ వేమూరి హరిప్రసాద్ ఆస్తులు అటాచ్ చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ఏసీబీ కోర్టు
►తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసిన విజయవాడ ఏసీబీ కోర్టు

1:55 PM, Nov 20, 2023
చంద్రబాబు మాకు మద్ధతు తెలపడం సంతోషకరం : రేణుకా చౌదరీ
►తెలంగాణలో టిడిపి పోటీ చేయలేదు : రేణుకా చౌదరీ
►టిడిపి పోటీ చేయకుండా మాకు మద్దతు తెలపడం సంతోషం : రేణుకా చౌదరీ
►ఏపీలో ప్రచారానికి నన్ను పిలుస్తున్నారు : రేణుకా చౌదరీ
► రాష్ట్ర విభజన జరిగినా సంబంధాలు కొనసాగుతున్నాయి : రేణుకా చౌదరీ

1:10 PM, Nov 20, 2023
ఆస్తుల అటాచ్‌పై విచారణ
►నేడు సిఐడి పిటిషన్ పై ఏసీబి కోర్టులో విచారణ
►ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో అక్రమాలకు పాల్పడిన వారి ఆస్తులు అటాచ్ మెంట్ చేయాలని ఏసీబి కోర్టులో సిఐడీ పిటిషన్
►ACB కోర్టు ముందు ఇరుపక్షాల వాదనలు

1:05 PM, Nov 20, 2023
ఇవ్వాళ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు.?
►స్కిల్ కేసులో చంద్రబాబు రెగ్యులర్‌ బెయిల్ పిటిషన్‌పై నేడు తీర్పు ఇచ్చే అవకాశం
►మధ్యాహ్నం 2.15 గంటలకు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చే అవకాశం
►బెయిల్ పిటిషన్ పై ఇటీవల పూర్తయిన వాదనలు, తీర్పు రిజర్వ్
►చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన సిద్ధార్ధ లూథ్రా
►సిఐడీ తరపున వాదనలు వినిపించిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి

12:45 PM, Nov 20, 2023
కొల్లు పిటిషన్‌ వాయిదా
►మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
►విచారణ రేపటికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

12:36 PM, Nov 20, 2023
లోకేష్‌ పాదయాత్ర హడావిడి దేనికి సంకేతం
►సెప్టెంబర్‌ 9న బాబు అరెస్ట్ తర్వాత అర్థంతరంగా పాదయాత్ర ఆపేసిన లోకేష్‌
►ఆ తర్వాత నెల రోజులు ఢిల్లీకి పరిమితమైన లోకేష్‌
►ఇప్పుడు నవంబర్‌ 24నుంచి ప్రజల్లోకి లోకేష్‌ వస్తాడంటూ ఎల్లో మీడియా ప్రచారం
►చంద్రబాబు విడుదలై మూడు వారాలవుతోంది.
►చిక్కు ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా పచ్చమీడియా పాదయాత్ర ప్రచారం
►మరి ఇన్నాళ్లు లోకేష్‌ ఏం చేశాడు?
►హఠాత్తుగా ఇప్పుడెందుకు పాదయాత్ర గుర్తుకొచ్చింది?
►ఢిల్లీలో చాలా రోజుల పాటు లోకేష్‌ చేసిన కార్యక్రమాలేంటీ?
►అత్యంత రహస్యంగా లోకేష్‌ చక్కదిద్దిన పనులేంటీ?
►తెలంగాణలో ఎన్నికల కోసం ఢిల్లీ నుంచి లోకేష్‌ ఎవరెవరిని కలిసాడు?
►రేవంత్‌ కోసం అర్థరాత్రిళ్లు ఎవరెవరి దగ్గరకు లోకేష్‌ వెళ్తున్నాడు?
►ఇప్పుడు పాదయాత్ర కేవలం విశాఖ వరకే అని ఎందుకు పరిమితి?
►దానికి చంద్రబాబు పాదయాత్రకు లింకు ఎందుకు?
►రాష్ట్రం అంటే విశాఖ వరకేనా?
►ఉత్తరాంధ్రలో భాగమైన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మీకు కనిపించవా?

12:03 PM, Nov 20, 2023
నారా చంద్రబాబు నాయుడు.. కొన్ని అసలు సిసలు వాస్తవాలు
మా బాబు చాలా మంచోడు, రాజకీయ కక్షతో కేసులు పెట్టారు : ఎల్లో మీడియా
మరి చంద్రబాబు నిజంగా మంచోడేనా? చంద్రబాబుపై ఎలాంటి కేసులు లేవా?
►వేర్వేరు సందర్భాల్లో చంద్రబాబు గురించి బాగా తెలిసిన వాళ్లు ఇప్పటివరకు ఏమన్నారు?
►చంద్రబాబు కీలకమైన/వివాదస్పదమైన అంశాల గురించి ఏమన్నాడు? ఆ తర్వాత ఏం జరిగింది?

తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు
►మొదటి నుంచి చంద్రబాబుది నేరప్రవృత్తే
►ధర్నాలప్పుడు ప్రభుత్వ బస్సులు తగలబెట్టాలని చంద్రబాబు చెప్పేవాడు

టిడిపి సీనియర్‌ నాయకులు, మాజీ వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు
►అమరావతిలో  భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతుల పొలాలను  చంద్రబాబు తగలబెట్టించారని అక్కడి స్థానిక అధికారులు నాకు చెప్పారు

ఆనాటి స్పీకర్‌ కోడెల చౌదరి
చంద్రబాబు కట్టిన తాత్కాలిక భవనాల్లో ఒకటైన అసెంబ్లీలో వర్షం వచ్చినప్పుడు నీళ్లు కారితే ...
►"ఇది విపక్షాలు చేయించిన పనే అని  సీసీటీవీ ఫుటేజి ఉంది, రెండు రోజుల్లో ఆధారాలు బయటపెడతా" అని మీడియా ముందు ప్రకటనలు చేశారు. ఆ తరువాత మూడేళ్లు స్పీకర్‌గా ఉండికూడా  చూపలేదు.
►నిజంగా కుట్రే అయితే.. ఎందుకు బయటపెట్టలేదు?
►అంటే చేయించింది చంద్రబాబు, తెలుగుదేశం నేతలా?

కాపు ఉద్యమ సమయంలో  తునిలో  రత్నాచల్‌ రైలు తగలబడినప్పుడు చంద్రబాబు వెంటనే ప్రెస్‌మీట్‌ పెట్టారు
►"రైలు తగలబెట్టింది రాయలసీమ రౌడీలు, పులివెందుల రౌడీలు" అని చెప్పాడు, కానీ అరెస్ట్‌ చేసింది మాత్రం కోస్తా జిల్లాకు చెందిన కాపులను.?
►ముందు చంద్రబాబు ఎందుకు ప్రకటన చేశాడు? ఆ తర్వాత పోలీసులెందుకు అరెస్ట్‌లు చేశారు?
►అంటే రైలు తగలబెట్టే విషయం ముందే చంద్రబాబుకు తెలిసిందా? ఓట్ల కోసం మాట మడతేశారా?

చిత్తూరు జంట హత్యల కేసులో మరీ విడ్డూరం
►నవంబర్ 17 , 2015న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిత్తూరు మేయ‌ర్ దంప‌తుల హ‌త్య జరిగింది. వారిద్దరు తెలుగుదేశం పార్టీకి చెందినవారు.
►ఆ వెంటనే చంద్రబాబు ఆదేశాల మేరకు వెంట‌నే విజ‌య‌వాడ‌లో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ ప్రెస్‌మీట్ పెట్టాడు. ఇది `బ‌లిజ‌ల మీద రెడ్ల దాడి.. విపక్షనేతలే ఈ హ‌త్య చేయించారు` అని ఆరోపణలు చేశారు.
సీన్‌ క‌ట్ చేస్తే ..
►మేయ‌ర్ దంప‌తుల‌ హ‌త్య ఆస్థి త‌గాదాల కోసం జ‌రిగింద‌ని, అది చేసింది మేయ‌ర్ మేన‌ల్లుడు చింటూ అని చిత్తూరు జిల్లా ఎస్పీ స్వ‌యంగా ప్ర‌క‌టించారు.

మొత్తమ్మీద అన్ని పరిశీలన చేసి చెప్పే విషయం ఏంటంటే..
►ఏం జరిగినా.. దాన్ని స్వప్రయోజనాల కోసం, తన సామాజిక ప్రయోజనాల కోసం వాడుకునే అలవాటు చంద్రబాబుదే
►బట్టకాల్చి ఇతరుల ముఖాన వేసి మసి తుడుచుకోండి అనడం  బాబుకు వెన్నతో పెట్టిన విద్యే

ఇక చంద్రబాబుపై కేసుల గురించి వ్యాఖ్యలు చేసే వారు ఒకసారి ఆయన చరిత్ర చూడండి.
►15 సార్లు వేర్వేరు కేసుల్లో దర్యాప్తు జరగకుండా స్టే తెచ్చుకున్న చరిత్ర చంద్రబాబుది
►తన కోసం, తన వాళ్ల కోసం ఖజానాను దోచిన కేసులో అనూహ్యంగా అరెస్టయ్యారు
►ఇది అనూహ్యం అని ఎందుకు అంటారంటే.. ఏ పని చేసినా సాక్ష్యాలు లేకుండా చేస్తారన్నది చంద్రబాబుకు ఉన్న పేరు
►అందుకే మా బాబుకు ఎలా అరెస్ట్‌ చేస్తారంటూ ఎల్లో మీడియా ఎగిరెగిరి పడేది.!

11:30 AM, Nov 20, 2023
నేడు సుప్రీంకోర్టులో యూరీ రెడ్డి కేసు విచారణ
►నేడు సుప్రీంకోర్టులో యూరీ రెడ్డి కేసుపై విచారణ జరుగనుంది. 
►యూరీ రెడ్డి పిటషన్‌పై విచారణ చేపట్టనున్న హృషికేశ్‌ రాయ్‌, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌. 
►మార్గదర్శిలో షేర్లను రామోజీరావు బలవంతంగా బదలాయించారని ఏపీ సీఐడీకి యూరీరెడ్డి.
►సీఐడీ దర్యాప్తుపై స్టే విధించిన ఏపీ హైకోర్టు. 
►హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన యూరీరెడ్డి. 

11:20 AM, Nov 20, 2023
స్కిల్‌ స్కాంలో బాబు పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు
►స్కిల్‌ స్కాంలో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై ఈరోజు మధ్యాహ్నం తీర్పు
►నాలుగు రోజుల క్రితం ఇరుపక్షాల వాదనలు విని తీర్పు రిజర్వ్‌ చేసిన హైకోర్టు
►ఈరోజు మధ్యాహ్నం 2:15 గంటలకు తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు. 

9:45 AM, Nov 20, 2023
ఫైబర్‌నెట్‌ కేసులో ఆస్తుల అటాచ్‌మెంట్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ
►ఫైబర్ నెట్ స్కాంలో నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్ కోరుతూ సీఐడీ పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ
►ఫైబర్ నెట్ స్కాంలో నిందితులకి సంబంధించిన ఏడు స్థిరాస్తులను అటాచ్‌ చేయాలని సీఐడీ ప్రతిపాదన
►ఇప్పటికే సీఐడీ ప్రతిపాదనకు హోంశాఖ ఆమోదం
►అనుమతి కోసం ఇప్పటికే ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సీఐడీ
►టెరాసాఫ్ట్‌ కంపెనీ, చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు స్థిరాస్తులను అటాచ్‌ చేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ 
►ఫైబర్ నెట్ కుంభకోణంలో రూ.114 కోట్లు దుర్వినియోగమయ్యామని ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు
►ఈ కేసులో ఏ-1గా వేమూరి హరికృష్ణ, ఏ-11గా టెర్రా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్, ఏ-25గా చంద్రబాబు పేర్లు
►ఫైబర్ నెట్ స్కాంలో నిందితులైన టెర్రా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్‌కి ఆస్తులతో పాటు పలు కంపెనీల ఆస్తుల అటాచ్ చేయాలని ప్రతిపాదన
►తుమ్మల గోపీచంద్, ఆయన భార్య పావని పేర్లపై హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ కాలనీ, చిన్నమంగళారంలలో ఉన్న ఇల్లు, వ్యవసాయ క్షేత్రాలు అటాచ్
►ఈ కుంభకోణంలో నిందితులైన నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ డైరక్టర్ కనుమూరి కోటేశ్వరరావుకి చెందిన గుంటూరు, విశాఖ కిర్లంపూడి లే అవుట్‌లోని ఇల్లులు అటాచ్
►మొత్తంగా అటాచ్‌ ఆస్తుల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి
►హోంశాఖ ఉత్తర్వుల నేపథ్యంలో ఆ స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేసిన సీఐడీ
►ఈ కేసు విచారణలో భాగంగా నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌పై ఇప్పటికే సీఐడీ పరిధిని ప్రశ్నించిన న్యాయస్ధానం
►నిందితుల ఆస్తులను జప్తు చేయడానికి సీఐడీకి పూర్తి అధికారాలున్నాయని ఏసీబీ కోర్టుకి స్పష్టం చేసిన సీఐడీ తరపు న్యాయవాదులు
►సీఐడీ పిటిషన్‌పై నేడు కొనసాగనున్న విచారణ. 

7:00 AM, Nov 20, 2023
లోకేశ్‌ యువగళం పున:ప్రారంభం?
►ఈనెల 24 నుంచి లోకేశ్‌ యువగళం పునఃప్రారంభం?
►పార్టీ కార్యకర్తల నుంచి ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో పాదయాత్ర ప్రారంభించాలని లోకేశ్‌ యోచన
►చంద్రబాబు అరెస్టు కారణంగా చూపి యువగలం యాత్రకు మంగళం పాడిన లోకేశ్‌
►విశాఖలో ముగించే యోచనలో టీడీపీ అధిష్టానం 
►టీడీపీ అధినేత అరెస్టుతో సెప్టెంబర్ 9న నిలిచిన యువగళం పాదయాత్ర 
►పాదయాత్ర నిలిచిపోయిన చోట నుంచే తిరిగి ప్రారంభించాలని నిర్ణయం 
►చంద్రబాబు గతంలో విశాఖలో ముగించిన వస్తున్నా మీకోసం పాదయాత్ర 
►అదే సెంటిమెంటుతో విశాఖలోనే లోకేష్ పాదయాత్ర ముగించాలని నిర్ణయం 
►ఎన్నికలు వేళ పాదయాత్రను కుదించే యోచనలో పార్టీ వర్గాలు

6:50 AM, Nov 20, 2023
టీడీపీ సీనియర్లలో అంతర్మథనం..!
►టీడీపీ యువనేతల్లో తమ భవిష్యత్తుపై చిగురించని ఆశలు..!
►టీడీపీ పని అయిపోయింది.. టీడీపీ సీనియర్లలో అంతర్గతంగా జరుగుతోన్న చర్చ ఇది.
►టీడీపీలో ఉంటే..లోకేష్‌ను నమ్ముకుంటే మనకు భవిష్యత్తు ఉండదు
►టీడీపీ యువ నేతల్లో అంతర్గత చర్చ
►ఈ రెండు చర్చల సబ్జక్ట్ వేరైనా లైన్ ఒక్కటే
►టీడీపీని చంద్రబాబు కాదు కదా..ఎవరూ బతికించలేరనేది
►టీడీపీ నేతల అంతర్గత చర్చల సారాంశం.
►చంద్రబాబుపై కేసులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.
►మరోవైపు.. బెయిల్ షరతులు బేఖాతరు చేయడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది.
►చంద్రబాబు అరెస్ట్ సమయంలో హడావుడి చేసిన భువనేశ్వరి ఏమయ్యారు..?
►చంద్రబాబును అరెస్ట్ చేయగానే ఢిల్లీ పారిపోయి దాక్కున్న లోకేష్‌పై టీడీపీ క్యాడర్‌లో నమ్మకం ఏమాత్రం లేదు.
►చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలు..భువనేశ్వరి తీరు..లోకేష్ చేతులెత్తేసి ఢిల్లీ పారిపోవడం చూసిన..
►టీడీపీ నేతలు మింగలేక కక్కలేక టీడీపీలో ఉంటున్నారు.
►తెలంగాణ తరహాలోనే.. 2024 తరువాత ఏపీలో జెండా పీకేయాల్సి వస్తుందని..
►టీడీపీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.
►నవంబర్ 28న చంద్రబాబు జైలుకు వెళ్తే... వాట్ నెక్ట్స్‌..?
►భువనేశ్వరికి మాట్లాడటమే తెలియడం లేదు
►లోకేష్‌కు రాజకీయాలు ఏమాత్రం తెలియదు
►మరీ ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వైపు వేళ్లు చూపెడుతున్నాయి..!!
►పురందేశ్వరి అధికారికంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు అయినప్పటికీ ఆమె.. టీడీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నట్లు మాట్లాడుతున్నారు.

6:45 AM, Nov 20, 2023
బాబు క్వాష్‌ కొట్టేయడమే మిగిలిందా.?
►సుప్రీంకోర్టుకు ముగిసిన సెలవులు 
►గత వారమంతా దీపావళి సందర్భంగా సుప్రీంకోర్టుకు సెలవులు
►17ఏ సెక్షన్‌ను తనకు అనుకూలంగా మార్చుకుని చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌
►చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా వాదనలు
►చంద్రబాబు తరపున సీనియర్‌ లాయర్లు హరీష్‌ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు
►CID తరపున ముకుల్‌ రోహత్గీ వాదనలు
►17ఏ సెక్షన్‌ ప్రకారం తనను అరెస్ట్‌ చేయాలంటే గవర్నర్‌ అనుమతి తప్పని సరి అన్న బాబు లాయర్లు
►ఏ చట్టం అయినా, ఏ సెక్షన్‌ అయినా అవినీతిని అడ్డుకునేదే తప్ప.. సమర్థించేది కాదన్న CID లాయర్లు
►నేరం ముందే జరిగింది, దర్యాప్తు ముందే మొదలయింది, కాబట్టి చంద్రబాబుకు ఎలాంటి మినహాయింపు అవసరం లేదన్న CID లాయర్లు
►సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పును రిజర్వ్ లో పెట్టిన సర్వోన్నత న్యాయస్థానం
►సుప్రీంకోర్టు తీర్పుపై చంద్రబాబు బృందం కోటి ఆశలు
►చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరిస్తే.. మిగిలింది బెయిల్‌ పిటిషన్‌ మాత్రమే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement