Nov 18th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | TDP Chandrababu Cases Petitions And Political Updates 18th November | Sakshi
Sakshi News home page

Nov 18th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Sat, Nov 18 2023 7:10 AM | Last Updated on Sat, Nov 18 2023 6:38 PM

TDP Chandrababu Cases Petitions And Political Updates 18th November - Sakshi

TDP Chandrababu Cases Petitions And Political Updates

06:04 PM, Nov 18, 2023
నిమ్మగడ్డ ముసుగు తీసి రాజకీయాలు చేస్తున్నారా? : YSRCP
►ఎన్నికలు సమీపిస్తోన్నవేళ ముసుగు తీసిన నిమ్మగడ్డ రమేష్‌బాబు చౌదరీ
►YSRCPపై బురద జల్లడం, ప్రభుత్వంపై విష ప్రచారం చేయడమే రమేష్‌ బాబు పని
►కొత్త పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి పని మొదలుపెట్టిన రమేష్‌ బాబు నిమ్మగడ్డ
►పేరుకు సిటిజన్స్‌ ఫర్‌ డెమొక్రసీ, పని చేసేదంతా తెలుగుదేశం డైరెక్షన్‌ మేరకు
►రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పని చేసిన నిమ్మగడ్డకు గతంలో ఏం జరిగిందో తెలియదా?
►ఇప్పుడు అర్జంటుగా నీతులు వల్లించవలసిన అవసరం ఏమొచ్చింది?
►మూడేళ్ల పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అడ్డంకులు సృష్టించినప్పుడు ఏమయ్యాయి ఈ నీతులు?
►ఒకసారి జరపవద్దని, మరోసారి జరపాలని, ఫలితాలు వచ్చిన కొద్దీ మాట మార్చినప్పుడు ఎటు పోయింది నైతికత?

05:55 PM, Nov 18, 2023
బెయిల్‌పై బాబు వర్గంలో భిన్నాభిప్రాయాలు
►చంద్రబాబు బెయిల్‌పై తెలుగుదేశంలో భిన్నమైన అభిప్రాయాలు
►52 రోజులు చంద్రబాబు జైల్లో ఉండడం వల్ల తెలుగుదేశానికి మేలు జరిగింది.!
►ఇన్నాళ్లు మనకు అన్యాయం జరిగిందని కలరింగ్‌ ఇచ్చేందుకు ప్రయత్నించాం
►ఇప్పుడు చెప్పుకోడానికి ఏం లేదు.! చేయడానికి ఏమీ లేదు.!
►లోకేష్‌ కోసమైనా చంద్రబాబు త్యాగం చేయాలేమో..
►లోకేష్‌ నాయకుడిగా ఎదగాలంటే.. చంద్రబాబు రాజకీయాలకు దూరంగా ఉండడం బెటరేమో
►చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత జనం అరెస్ట్‌ గురించే మాట్లాడడం లేదు
►జైల్లో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల అనవసరంగా జనసేనకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తోంది
►ఇలాగే ఉంటే లోకేష్‌బాబును పట్టించుకునే వారెవరు?
►ఇప్పటికైనా పార్టీలో సమూలంగా మార్పులు జరగాలి
►పార్టీలేదు.. xxx లేదు అన్న అచ్చెన్నను ఇంకెన్నాళ్లు భరించాలి?
►యనమల, బుచ్చయ్యచౌదరీ, చినరాజప్ప, అయ్యన్నపాత్రుడిని నమ్ముకుని పార్టీ ఎన్నాళ్లు ప్రయాణం చేస్తుంది?
►కొత్త నీరు లేక, పక్క పార్టీ జనసేనను నమ్ముకుంటే తెలుగుదేశానికి సమాధి కాదా?
►పార్టీ తీరుపై తెలుగుదేశం కార్యకర్తల్లో ఆందోళన, అసహనం

05:30 PM, Nov 18, 2023
రేవంత్‌ ఆశల్లో వాస్తవాలెంత? లాజిక్‌ ఏముంది?
►చంద్రబాబు అరెస్ట్‌పై సానుభూతి వెల్లువెత్తుతుందన్న ఆశల్లో రేవంత్‌
►చంద్రబాబు అరెస్ట్‌ అంశం వల్ల తెలంగాణలో మాకు లాభం : రేవంత్‌
►చంద్రబాబు అరెస్ట్‌కు గల కారణాలపై మీడియాలో సంపూర్ణంగా చర్చ
►చంద్రబాబుపై ఏ ఏ కేసులున్నాయి? వాటి వెనక ఎన్ని రకాల సాక్షాలున్నాయి?
►చంద్రబాబు స్వయంగా ఎక్కడెక్కడ నిబంధనలకు వ్యతిరేకంగా సంతకాలు పెట్టి నిధులు పక్కదారి పట్టేలా చేశాడు?
►చంద్రబాబు లాయర్ల వాదన ACB కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?
►చంద్రబాబు తప్పు చేయలేదు అని ఆయన తరపు లాయర్లు ఏ కోర్టు ముందుకూడా ఎందుకు చెప్పలేదు?
►మా బాబును అరెస్ట్‌ చేయాలంటే గవర్నర్‌ అనుమతి తీసుకోలేదన్న ఓ పసలేని వాదననే చర్వితచర్వణంగా ఎందుకు వినిపించారు?
►కనీసం సాధారణ బెయిల్‌కు కూడా చంద్రబాబుకు అర్హత లేదని కోర్టులు ఎందుకు నమ్మాయి?
►కేవలం ఆపరేషన్‌ చేయించుకునేందుకు మాత్రమే అని చెప్పి మరీ బెయిల్‌ ఎందుకిచ్చాయి?
►తప్పు చేశాడు, సాక్షాలున్నాయి, చట్ట ప్రకారం అరెస్టయ్యాడని స్పష్టంగా తెలిసినప్పుడు సానుభూతి ఎందుకొస్తుంది?
►ఆంధ్రప్రదేశ్‌లోనే జనాలు చంద్రబాబును పట్టించుకోనప్పుడు తెలంగాణలో సానుభూతి ఎందుకొస్తుంది?
►నిజంగా సానుభూతే వచ్చే పరిస్థితే ఉంటే తెలుగుదేశమే స్వయంగా పోటీ చేసేది కదా..!
►అంటే తెలుగుదేశానికి రాని సానుభూతి కాంగ్రెస్‌ పార్టీకి వస్తుందని పచ్చమీడియా ఊదరగొట్టేది అసత్యాలే కదా.!
►చంద్రబాబుకు సానుభూతి వచ్చే అవకాశముంటే.. పవన్‌ కళ్యాణ్‌ పరిస్థితేంటీ?
►తెలంగాణలో తమ పరిస్థితి జీరో అని తెలిసే కదా.. టిడిపి పోటీ చేయలేదు? అలాగే జనసేన కేవలం 8 చోట్ల జనాన్ని నిలబెట్టింది.!
►జనసేన తరపున, మిత్రపక్షం బీజేపీ తరపున ప్రచారానికి రాకుండా పవన్‌ కళ్యాణ్‌ ముఖం చాటేశాడు కదా.!

05:05 PM, Nov 18, 2023
చంద్రబాబు పాలసీ దోచుకో, దాచుకో
►తణుకు సామాజిక సాధికారత బస్సు యాత్రలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు
►గతంలో ఏ పార్టీ ఉంటే వారి పార్టీ వారికే చేసుకునేవారు..
►గతంలో చంద్రబాబు కలెక్టర్ల మీటింగ్‌లో మా వారికే చేయాలని ఆదేశించేవారు
►జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కులమత ప్రాంతీయ బేధాలు లేకుండా అందరికీ సంక్షేమ అందాలని చెబుతున్నారు
►సీఎం జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేక ఓటే లేదు
►పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్యను చేరువు చేశారు
►మనబడి, నాడు-నేడు, గోరుముద్ద, విద్యా కానుకతో సీఎం జగన్‌ మేనమామ లాగా పేదలకు అండగా నిలిచారు
►మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు
►గతంలో చంద్రబాబు దాచుకో దోచుకో పంచుకో అన్న రీతిలోనే పాలన సాగించాడు
►చంద్రబాబు ఏరకంగా దాచుకున్నాడు జైలు వూసలు ఏ విధంగా లెక్కపెడుతున్నాడు ప్రజలందరూ చూస్తున్నారు
►బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగానే చంద్రబాబు వాడుకున్నాడు, ఇప్పుడు ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారు
►చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసినా బడుగు బలహీన వర్గాలు వారిద్దరిని నమ్మరు
►ప్రజలు జగనే కావాలి అంటున్నారు

04:45 PM, Nov 18, 2023
టిడిపి+జనసేన=సున్నా
►మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కామెంట్స్
►సీఎం జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం పేదరికం
►తన సామాజిక వర్గం వారే మంత్రి పదవులు ఇవ్వలేదని వెళ్లిపోయారు..
►అచ్చెన్నాయుడు బీసీ సమావేశాలు పెట్టడానికి సిగ్గు లేదా?
►బీసీలకు మీరేం చేశారు మేమేం చేసామో చర్చకు సిద్ధం
►స్కాముల్లో ఇరుక్కుపోయి స్కీములను విమర్శిద్దాం అంటే కుదరదు
►ఇది  అవినీతి రహిత పారదర్శక ప్రభుత్వం
►చంద్రబాబు అబద్ధం జగన్ నిజమే అని ప్రజలు నిశ్చయించుకున్నారు

04:25 PM, Nov 18, 2023
ముఖ్యమంత్రిగా జనానికి ఏ రకంగానూ మేలు చేయని వ్యక్తి చంద్రబాబు
►తాడేపల్లిలో మాట్లాడిన డొక్కా మాణిక్యవరప్రసాద్
►స్వాతంత్ర్యం వచ్చాక అతిపెద్ద భూపంపిణీని సీఎం జగన్ చేశారు
►ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యను జగన్ చేశారు
►20 సంవత్సరాలు నిండిన అసైన్డు భూములకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించారు
►అమరావతిలో టీడీపీ నేతలు అసైన్డు భూములను బలవంతంగా లాగేసుకున్నారు
►అసైన్డ్‌ భూములను ప్రభుత్వం లాక్కుంటుందని పేదలను భయపెట్టారు
►పరిహారం కూడా తక్కువ ఇచ్చారు
►22A లో ఉన్న భూములకు కూడా సీఎం పరిష్కారం చూపారు
►లంక భూములను ఏ, బీ, సీ కేటగిరీగా విభజించి అసైన్డు పట్టాలిచ్చారు
►30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత జగన్ ది
►ప్రపంచంలో మరెవరూ ఇంతగా చేసిన దాఖలాలు లేవు
►గతంలో చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా ఇలాంటి ఆలోచనలు ఎందుకు చేయలేదు?
►ఎస్సీ, ఎస్టీల శ్మశాన వాటికల కోసం భూములు ఇచ్చిన ఘనత జగన్‌దే
►చంద్రబాబు14 ఏళ్లు సీఎం గా ఉండి ఏం చేశారు?
►పేద ప్రజల ఆత్మగౌరవం గురించి ఆయన ఎందుకు ఆలోచించలేదు?
►మనకోసం ఎవరు ఆలోచిస్తున్నారో వారికే అండగా నిలవాలి
►నా ఎస్సీ, ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలు అనే లీడర్ని గతంలో ఎప్పుడైనా చూశామా?
►వారందరినీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న జగన్ కి అండగా నిలుద్దాం
►కులగణన ద్వారా రానున్న రోజుల్లో మరింత మేలు జరగబోతోంది
►కులగణన చేయటం అనేది పెద్ద దేశభక్తికి నిదర్శనం

03:45 PM, Nov 18, 2023
సమాజాన్ని దెబ్బ తీసే వైరస్‌ బాబు
►విశాఖ : సామాజిక సాధికార సభలో అనిల్ కుమార్ యాదవ్
►సగానికి పైగా పదవులను తన సామాజిక వర్గానికి బాబు కట్టబెట్టారు
►ఒక ఊరులో ఇద్దరే బాగు పడాలి అంటే చంద్రబాబు కావాలి.. ఊరు మొత్తం బాగు పడాలి అంటే సీఎం జగన్ రావాలి..
►ఒక యాదవ్‌నైనా నాకు రెండు సార్లు ఎమ్మెల్యే గా పోటీ చేసే అవకాశం కల్పించారు
►యాదవులకు సీఎం జగన్ పదవులు ఇస్తే గొడ్లు కాసుకొనే వారికి పదవులు ఇచ్చారని హేళన చేశారు..
►శ్రీకృష్ణుడు కూడా గేదేలను కాసుకున్నారు..
►బీసీలను తోకలు కత్తిరిస్తామని బెదిరించారు..
►పార్టీ పెట్టే సీఎం కాకూడదు అనుకున్న వ్యక్తి పవన్.. చంద్రబాబు సీఎం కావాలని కోరుకునే వ్యక్తి పవన్..
►పవర్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్
►అబద్ధాలు మోసాలకు ప్రజలు ప్రలోభాలకు గురికావద్దు.
►తండ్రి జైల్‌లో ఉంటే ఢిల్లీ పారిపోయిన వ్యక్తి లోకేష్..
 

02:50 PM, Nov 18, 2023
బహిరంగ చర్చకు వచ్చే దమ్ముందా?
►విజయవాడ : చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై వెలంపల్లి ఫైర్
►చంద్రబాబు, లోకేేష్, పవన్‌కు సిగ్గుశరం ఉందా?
►జలీల్ ఖాన్ ఇంటి ముందు, జనసేన నేతల ఇంటి ముందు కూడా మేమే రోడ్లు వేశాం
►విజయవాడలో అత్యధికంగా రోడ్లు వేసింది మేమే
►గత ఐదేళ్లు చంద్రబాబు,పవన్ కలిసి  ఏం పీకారు
►మీరు రోడ్లు వేస్తే మేం ఈరోజు రోడ్లు వేయాల్సిన అవసరం ఉండేదా
►మీ హయాంలో ఏం చేశారో...మా హయాంలో ఏం చేశారో చర్చిద్దాం
►పవన్ కళ్యాణ్ వస్తాడో...లోకేష్ వస్తాడో చర్చకు మేం సిద్ధం
►మీ ఇద్దరిలో ఎవరొస్తారో తేల్చుకోండి
►400 కోట్లతో కృష్ణానదిలో రిటైనింగ్ వాల్ కట్టిన ఘనత జగన్ మోహన్ రెడ్డిది
►చంద్రబాబు,లోకేష్, పవన్ దిక్కుమాలిన రాజకీయాలు చేయడం మానుకోవాలి
►తెలంగాణలో ఎనిమిది మందిని నిలబెట్టి పార్టీని నట్టేట ముంచేశాడు
►నెలకొక సారి ఏపీకి వచ్చి ఈ రాష్ట్రం గురించి మాట్లాడే పవన్ మనకు అవసరమా?
►చంద్రబాబు జైలు కెళ్లాడు.. లోకేష్ ఏమైపోయాడు... ఎక్కడికి పోయాడు.?
►రాజకీయం కోసం 150 మంది చనిపోయారన్నారు
►నారా భువనేశ్వరి ఓదార్పు యాత్ర ఏమైపోయింది?
►చంద్రబాబు జైలు నుంచి బయటికి రాగానే చనిపోయిన 150 మంది బ్రతికి వచ్చేశారా?
►భర్త బయటికి రాగానే భువనేశ్వరి వాళ్లను వదిలేశారు

01:45 PM, Nov 18, 2023
చంద్రబాబు జబ్బుల్లో నిజమెంత?
►నిజంగానే ఇంత సీరియస్ జబ్బులుంటే ఏ టెస్ట్‌లు చేయకుండానే కంటి ఆపరేషన్ చేయించుకున్నాడా? నమ్మబుద్ధి కావడం లేదన్నది నిపుణుల మాట
►నారా చంద్రబాబునాయుడు 73 సంవత్సరాల వయసులో AIG హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు
►చంద్రబాబుకున్న జబ్బులు ఏంటంటే.. ఫ్రీక్వెంట్ బౌల్స్ ఆఫ్ హెవీనెస్ ఇన్ ద చెస్ట్ విత్ పెయిన్‌, గిడ్డినెస్, నిద్రలేమి, లో బ్యాకెట్, డిస్కంఫర్టనెస్ మరియు చర్మవ్యాధులు
ఇక్కడ రెండు ప్రధానంగా డాక్టర్లు చెప్పిన విషయాలు
#ఒకటి : కరోనరీ ఆర్డినరీ డిసీజ్ ఉంది
#రెండు : హైపర్ ట్రాఫిక్ కార్డియోమియోపతి ఉంది
#హైపర్ ట్రాపిక్‌ కార్డియోమయోపతి ఉంది, ప్రీవియస్ రిపోర్ట్స్ లో LV క్లాట్‌ ఉంది, డయాబెటిస్ ఉంది, స్కిన్ డిసీస్ ఉంది.
►వీటన్నిటికీ సంబంధించి వచ్చే మూడు నెలలలో ఇవాక్యుయేషన్ కావాలి అంటూ  ఫిజికల్ ఎక్సర్సైజెస్ అండ్ యాక్టివిటీ అవాయిడ్ చేయాలీ.  
►ఇంకా అడ్వాన్సుడ్ కార్డియాక్ లైఫ్ సపోర్టు ఉన్నటువంటి అంబులెన్స్  నిత్యం కూడా షెడ్యూల్లో ఉండాలి అని రిఫర్ చేశారు.
►వికిల్గోకి సంబంధించి ఇమ్యునో మార్జిలేటర్ డ్రగ్స్ వాడుతున్నారు
►ఎరిట్రియా ప్రోన్‌ ఉంది అంటే గుండె కొట్టుకోవడంలో సడన్‌గా వేరియేషన్స్ పరిస్థితులు ఉన్నప్పుడు ఇది చెబుతారు.
►ఇటువంటి ఆరోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు అనస్తీషియా ఇవ్వడం చాలా హై రిస్క్
►ఇన్ని సమస్యలున్నప్పుడు ఏ డాక్టర్ కూడా అనస్తీషియా ఇవ్వడానికి అంత ధైర్యం చేయడు.
►రెండో తారీఖున అడ్మిట్ కావటం,  మూడో తారీఖున సర్జరీ చేసి డిశ్చార్జ్ చేయడం కూడా అయిపోయింది.
►ఈ రిపోర్ట్స్ తీసుకుని ఏ డాక్టర్ అయినా చూపిస్తే దీనిని ఆపరేట్ చేస్తారా?
►ఇదే విషయాన్ని ప్రశ్నించిన మంత్రి డాక్టర్ సీదీరి అప్పలరాజు
►కంటి చూపు తగ్గిపోయింది అనే విషయంలో ఎవరికీ అభ్యంతరం లేదు
►గౌరవ న్యాయస్థానం కూడా అనుమతించడం జరిగింది.
►CP కాల్షియం స్కోర్ 2019లో రిపోర్టు ప్రకారం 916 ఉంది
►ఇప్పుడు స్కోర్ అయితే 1611 ఉంది ఇది చాలా ప్రమాదకరమైన విషయం అని వారు చెప్పడం జరిగింది.
►ఇన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు కనీసం కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ చేయకుండా ఆపరేషన్‌ ఎలా చేశారు?
►క్యాల్షియం స్కోరు ఇంత తక్కువ సమయంలో పెరిగితే ఏ కార్డియాలజిస్ట్ అయిన ముందుగా కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ వెంటనే చేస్తారు
►కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ చేయటం ద్వారా ఆయన కరోనరీ ఆర్తరీస్ ఎలాగ ఉన్నాయో తెలిసే అవకాశం ఉంది
►అలా తెలిసినప్పుడు ఆయనకి సరైన ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది.
►ఎందుకు చేయలేదు అంటే కేవలం బెయిల్  పొడిగించు కోవడానికి ఒక వండివార్చిన కథనమని మంత్రి సీదీరి అప్పలరాజు అనడాన్ని ఏ వైద్య నిపుణుడయినా ఖండించగలరా?
►పరిస్థితి సీరియస్‌గా ఉన్నప్పుడు..  గుండె ఎనలార్జ్ అయిన విషయాన్ని పరీక్షించి.. ఆ ఎక్సెస్ పోర్షన్‌ను ట్రీట్‌చేస్తారు
►ఆ కారణంగా గుండె కొట్టుకోవడంలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూస్తారు.
►ఇంకా చంద్రబాబు తనకు కరోనార్ ఆర్డినరీ వ్యాధి ఉందని చెబుతున్నారు కాబట్టి దానికి సంబంధించి  బైపాస్ సర్జరీ చేయాలి..
►అయోగ్టిక్ స్టినోసిస్ ఉంది అన్నారు, డైలేటెడ్ ఎస్ఎండింగ్ అయ్యోర్టా ఉందన్నారు
►నిజంగా ఇవి గానీ నిజమైతే అయోర్టిక్ వాల్ కూడా రీప్లేస్ చేయాలి.
►డెఫినిటివ్ ఇన్వెస్టిగేషన్ డెఫినేట్ ట్రీట్మెంట్ ఏమీ చేయకుండానే ఆపరేషన్ చేసేస్తారా?
►ఒక ప్రముఖ సంస్థకు సంబంధించినటువంటి రిపోర్టులను తన లాయర్ల ద్వారా తనకు నచ్చినట్లుగా రాయించుకుని కోర్టులను తప్పుదోవ పట్టించడం కాదా?
►హైపర్ ట్రాఫిక్ కార్డియామయోపతి ఉన్నప్పుడు కరోనరీ ఆర్థరైటిస్‌ ఉన్నప్పుడు మందులు ఎందుకు వాడడం లేదు?
►LV క్లాట్‌ ఉన్నప్పుడు జీవితాంతం దానికి తగ్గ మందులు వాడాలి కదా.?
►మందులు ఏవైనా కనీసం రాయాలి కదా? అవేవీ ప్రిస్క్రిప్షన్‌లో ఎందుకు లేవు?
►ఇవి సీదీరి అప్పలరాజు ప్రశ్నలే కాదు.. ఆరోగ్య శాస్త్రం తెలిసిన వారెవరయినా అడిగేవే.
►తనకు జబ్బులున్నాయని, వాటి కోసం బెయిల్‌ కావాలని అడిగినందుకే ఇంత లోతుగా విశ్లేషణ
►న్యాయస్థానానికి చెప్పిన విషయాలు నిజాలు కావా? అన్నది అత్యంత కీలకమైన అంశం

01:45 PM, Nov 18, 2023
మెడికల్ రిపోర్ట్స్‌పై డాక్టర్ సీదిరి అప్పలరాజు అనుమానాలు
►బెయిల్ కోసం ఇన్ని డ్రామాలెందుకు బాబూ ?:
►చంద్రబాబు మెడికల్ రిపోర్ట్స్ ఒక డాక్టర్‌గా పరిశీలించాను. 
►చంద్రబాబు గుండె సైజ్ పెరిగిందని ఏఐజీ ఆస్పత్రి రిపోర్ట్ ఇచ్చింది. 
►గుండె జబ్బులు ఉన్నాయన్న ఈ రిపోర్ట్ ప్రకారం చంద్రబాబుకి ఏ డాక్టర్ కూడా కన్ను ఆపరేషన్ చేయరు. 
►సిటీ కాల్షియమ్ స్కోర్ 1611కి పెరిగి, ప్రమాదమని రిపోర్ట్‌లో ఉన్నప్పుడు కన్ను ఆపరేషన్ ఏ డాక్టర్ చేయరు. 
►ఈ రిపోర్ట్ ప్రకారం గుండెకు మెయిక్టమీ, బైపాస్ సర్జరీ చేశాకే కన్ను ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. 
►మెడికల్ రిపోర్ట్స్‌లో మందుల ప్రిస్క్రిప్షన్ ఎక్కడా రాయలేదు. 
►ఏంజియోగ్రామ్ రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదు. 
►బెయిల్ పొడిగించుకోవడానికి టీడీపీ ఆఫీస్‌లో మెడికల్ రిపోర్ట్ తయారు చేసి కోర్టుకి ఇచ్చారు

12:47 PM, Nov 18, 2023
మద్యం కుంభకోణం.. చంద్రబాబు సొంతం
►మద్యం కుంభకోణం .. చంద్రబాబు కనుసన్నల్లోనే
►మంత్రి మండలిలో చర్చలేకుండానే వరుసగా జీవోలు జారీ
►స్కాంలో అప్పటి ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర  రెండో నిందితుడు
►టీడీపీ నేతల డిస్టిలరీలు, బార్లకు లబ్ధి చేకూర్చారు..
►వారి చర్యల వల్ల ఖజానాకు రూ. 1,500 కోట్ల నష్టం
►దీన్ని కాగ్‌ సైతం ధ్రువీకరించింది
►అప్పటి అధికార పార్టీకి చెందిన నేత డిస్టిలరీకి సైతం ఇదే రీతిలో లబ్ధి
►కొల్లుకు డబ్బు ముట్టడంపై దర్యాప్తు కొనసాగుతోంది
►ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దు
►హైకోర్టుకు నివేదించిన ఏజీ శ్రీరామ్‌
►తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా

12:17 PM, Nov 18, 2023
మ్యానిఫెస్టోపై కిం కర్తవ్యం.?
►ఇంకా తుదిదశకు రాని తెలుగుదేశం-జనసేన మ్యానిఫెస్టో
►మినీ మేనిఫెస్టో పేరిట కుస్తీలు పడుతోన్న టిడిపి నేతలు
►తెలుగుదేశం ఎజెండాలో ఆరు అంశాలు
►జనసేన ఎజెండాలో అయిదు అంశాలు
►మేనిఫెస్టోలో చేర్చిన ఎనిమిది అంశాలు
1. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా అంకుర సంస్థల ఏర్పాటుకు రూ. 10 లక్షల వరకూ రాయితీ
2. ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు.
3. అమరావతే రాజధానిగా కొనసాగింపు.
4. పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం.
5.అసమానతలు తొలిగిపోయి.. ఆర్థిక వ్యవస్థ బాగుపడేలా ప్రణాళికల రూపకల్పన.
6. బీసీలకు రక్షణ చట్టం తీసుకురావడం.
7. రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి బయటకు తీసుకువచ్చే విధానాలపై నిర్ణయం.
8. రద్దు చేసిన సంక్షేమ పథకాలపై పునఃపరిశీలన.
►ఇంత చేసినా.. మేనిఫెస్టో ప్రజల్లో నెగ్గుతుందన్న దానిపై టిడిపి-జనసేనలో అనుమానాలు
►ఇలాంటి మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వెళ్తే సీన్‌ రివర్సేనని రెండు పార్టీ నేతల ఆందోళన
►టిడిపి-జనసేన మేనిఫెస్టో ప్రజల ఆశలకు దూరంగా ఉందంటూ హరిరామజోగయ్య విమర్శలు
►ఏముందని ఇది ప్రజలను ఆకట్టుకుంటుందని హరిరామజోగయ్య ప్రశ్నలు
►కొత్తగా 47 సంక్షేమ పథకాలు పేదలకు పెట్టాలంటున్న హరిరామజోగయ్య
►మరి ఇన్నాళ్లు శ్రీలంకలా మారుతుందని భయపెట్టాం కదా అంటోన్న తెలుగుదేశం నేతలు
►గెలవాలంటే ఏమైనా చెప్పాల్సిందేనంటూ ఇరుపక్షాల్లో చర్చ
►2014లో అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను మాయం చేసిన చంద్రబాబు, తెలుగుదేశం నేతలు

10:13 AM, Nov 18, 2023
జైలు ముహూర్తం దగ్గరపడుతుండడంతో చంద్రబాబు టీంలో ఆందోళన
►నవంబర్‌ 28న రాజమండ్రి జైల్లో లొంగిపోవాల్సి ఉన్న చంద్రబాబు
►ఇప్పటికే కంటి ఆపరేషన్‌ పేరిట మధ్యంతర బెయిల్‌ తీసుకున్న చంద్రబాబు
►తాజాగా గుండె జబ్బు గురించి హైకోర్టుకు నివేదించిన చంద్రబాబు లాయర్లు
►నవంబర్‌ 28న జైలులోనికి వెళ్లకుండా ఉండేందుకు సర్వ ప్రయత్నాలు
►ఆరోగ్య పరిస్థితిని కారణంగా చూపి కోర్టు నుంచి మినహాయింపు పొందే వ్యూహాలు
►ఎన్నో బహిరంగ సభల్లో తన ఆరోగ్యం గురించి మాట్లాడిన చంద్రబాబు
►వయస్సు అనేది తనకొక నెంబర్‌ మాత్రమేనని ప్రకటించిన చంద్రబాబు
►40 ఏళ్ల కుర్రాళ్ల కంటే వేగంగా పనులు చేస్తానని ఎన్నో సార్లు చెప్పుకున్న చంద్రబాబు
►జైలుకు వెళ్లగానే చంద్రబాబుకు హఠాత్తుగా గుర్తుకొచ్చిన జబ్బులు

10:05 AM, Nov 18, 2023
చంద్రబాబుపై ఎన్ని కేసులు? ఎన్ని స్టేలు?
►దేశ రాజకీయాల్లో స్టేBNగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు
►1997లో రెడ్యానాయక్‌ మీ అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే 
►1998లో వైఎస్సార్‌ గారు హైకోర్టులో దావా వేస్తే స్టే
►1999లో షబ్బీర్‌ అలీ, 1999లో డీఎల్‌ రవీంద్రారెడ్డి వేసిన దావాల్లో స్టే. 
►1999, 2000, 2001 వైఎస్సార్‌ గారు తిరిగి దావా వేస్తే స్టే. 
►2003లో కృష్ణకుమార్‌ గౌడ్‌ కేసు వేస్తే స్టే 
►2003లో కన్నా లక్ష్మీనారాయణ వేసిన కేసు ఏంటంటే పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్‌ పెట్టాడని దావా వేస్తే స్టే
►2004లో కన్నా మళ్లీ కేసు వేస్తే స్టే.
►2004లో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చంద్రబాబుపై రెండు కేసులు 
►ఒకటి అక్రమాస్తులు, రెండు భూదోపిడీ.. దాంట్లోనూ స్టే
►2005లో బాబు అక్రమాస్తులపై  లక్ష్మీపార్వతి హైకోర్టులో  కేసు వేస్తే స్టే 
►2005 శ్రీహరి, అశోక్‌ అనే ఏపీ పౌరులు కేసు వేస్తే స్టే
►2011లో బి.ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు వేస్తే స్టే.

7:16 AM, Nov 18, 2023
చంద్రబాబు కనుసన్నల్లోనే మద్యం కుంభకోణం
►స్కాంలో అప్పటి ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర పాత్ర 
►టీడీపీ నేతల డిస్టిలరీలు, బార్లకు లబ్ధి చేకూర్చారు.. వారి చర్యల వల్ల ఖజానాకు రూ. 1,500 కోట్ల నష్టం 
►దీన్ని కాగ్‌ సైతం ధ్రువీకరించింది
►కొల్లుకు డబ్బు ముట్టడంపై దర్యాప్తు కొనసాగుతోంది
►ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దు
►హైకోర్టుకు నివేదించిన ఏజీ శ్రీరామ్‌
►తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా

7:13 AM, Nov 18, 2023
స్కిల్‌ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది?
►టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్‌ స్కాం
►నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం
►జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్‌తో ఒప్పందం అంటూ ప్రచారం
►సీమెన్స్‌ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రచారం
►ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు
►అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు
►షెల్ కంపెనీల ద్వారా  రూ 241 కోట్ల పక్కదారి
►విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్‌
►పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్)
►ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST
►విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు
►స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ
►నిధులన్నీ సూట్‌కేస్‌ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్‌కమ్‌టాక్స్‌ శాఖ
►కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్‌మెంట్లను గుర్తించిన CID
►రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి
►ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్
►చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్‌ విత్‌ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు
►సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ
►1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్‌ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్‌ చేసిన సీఐడీ పోలీసులు
►సెప్టెంబర్‌ 10న రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలింపు
►ఐదు పర్యాయాలు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగింపు
►రిమాండ్‌ ఖైదీగా 7691 నెంబర్‌తో 52 రోజులపాటు చంద్రబాబు
►కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్‌ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు. 

7:10 AM, Nov 18, 2023
పచ్చమీడియాలో రేవంత్‌రెడ్డి ఇంటర్వ్యూలు
►అనుకోకుండా నిజాలు బయటపెట్టేసిన రేవంత్‌ రెడ్డి
►మీరు ముఖ్యమంత్రి అయితే కేసులు పెట్టరు కదా అన్న ప్రశ్నకు రేవంత్‌ సూటి సమాధానాలు
►అవినీతి ఉందని ఆరోపించాం, అక్రమాలు జరిగాయని చెప్పాం. కాబట్టి కెసిఆర్‌ కుటుంబం మీద కేసులు పెడతామన్న రేవంత్‌
►చంద్రబాబు అరెస్ట్‌ కావడం మీకు కలిసొచ్చింది కదా అన్నదానికి అవునన్న రేవంత్‌
►చంద్రబాబుతో తనకు చాలా రోజులుగా మంచి సాన్నిహిత్యం ఉందన్న రేవంత్‌
►చంద్రబాబు జైలుకు వెళ్లిన రోజు పర్సనల్‌గా చాలా బాధకు గురి అయ్యానన్న రేవంత్‌
►చంద్రబాబు అరెస్ట్‌ ఓట్ల పరంగా కాంగ్రెస్‌కు ఉపయోగపడుతుందన్న రేవంత్‌
►చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ పొత్తులో ఉన్నారు కాబట్టి ఈ అంశం సున్నితంగా మారిందన్న రేవంత్‌
►ఏపీలో చంద్రబాబుతో పొత్తులో ఉన్న పవన్‌ కళ్యాణ్‌ కూడా పోటీలో ఉన్నాడు.
►తెలంగాణలో పవన్‌కళ్యాణ్‌కు తక్కువ ఓట్లు వస్తే.. దాని ప్రభావం ఏపీలో ఆ కూటమిపై పడుతుందన్న రేవంత్‌

7:09 AM, Nov 18, 2023
స్కిల్‌ కుంభకోణం కేసులో కీలక మలుపు
►చంద్రబాబు సన్నిహితుడు యోగేశ్‌ గుప్తానే పాత్రధారి
►ఆయన చెబితేనే వాటిని ఇచ్చా..
►పూర్తి కుట్రను వెల్లడిస్తా.. అప్రూవర్‌గా అనుమతించండి
►ఏసీఐ ఎండీ చంద్రకాంత్‌ షా పిటిషన్‌
►చంద్రబాబు సన్నిహితుడు యోగేష్ గుప్తా అమరావతి తాత్కాలిక సచివాలయం, టిట్కో ప్రాజెక్టుల కాంట్రాక్టులు కేటాయింపులో నిర్మాణ సంస్థల నుంచి ముడుపులు తీసుకుని చంద్రబాబుకు చేరవేశారు
►అందుకే యోగేష్ గుప్తకు ఐటీ శాఖ కూడా నోటీసులు ఇచ్చింది
►స్కిల్స్ స్కామ్ లో యోగేష్ గుప్తా  A-22 గా ఉన్నారు
►నిధుల అక్రమ తరలింపులో చంద్రబాబు సన్నిహితుడు యోగేష్ గుప్తా కీలక పాత్ర పోషించారు
►స్కిల్ కేసులో మరొక నిందితుడు సావన్ కుమార్ జాజు తో కలిసి యోగేష్ గుప్తా తనను సంప్రదించారు
►డిజైన్ టెక్ ,స్కిల్లర్ కంపెనీలకు సాఫ్ట్వేర్ సమకూర్చినట్లు ఐటీ సేవలు అందిస్తున్నట్లుగా బోగస్ ఇన్వాస్ లు  కావాలని అడిగారు
►ఏసీఐ కంపెనీ పేరిట స్కాల్లర్ కంపెనీకి 18 బోగస్ ఇన్వాయిసులు డిజైన్ టెక్ కంపెనీకి 2 బోగస్ ఇన్వాయిసులు ఇచ్చారు
►సీమెన్స్ -డిజైన్ టెక్ కంపెనీలతో స్కిల్ డెవపల్‌మెంట్‌ కార్పొరేషన్ తో ఒప్పందం కుదుర్చుకుని స్కిల్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు నమ్మించినందుకే బోగస్ ఇన్వాయిస్‌లు తమ నుంచి తీసుకున్నారు
►బోగస్ ఇన్వాయిసుల విలువ మేరకు 67 కోట్ల 87 లక్షల 39వేల 313 రూపాయలు  ఏసీఐ కంపెనీ బ్యాంకు జమ చేశారు
►సావన్ కుమార్ చెప్పిన పలు షెల్ కంపెనీలకు ఆ నిధులను తాను మళ్లించానని తెలిపారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement