Heritage Foods
-
హెరిటేజ్ కోసం పాడి పరిశ్రమను - రైతులను నట్టేట ముంచారు
-
చంద్రబాబు ఏ–1.. లోకేశ్ ఏ–14
సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు సహకార డెయిరీలను దెబ్బతీసి తమ కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ వ్యాపారం, ఆస్తులను అమాంతం పెంచగా ఆయన తనయుడు లోకేశ్ రాజధానిలో ఇన్నర్ రింగ్ రోడ్డు(ఐఆర్ఆర్) అలైన్మెంట్ ఖరారులో అక్రమాలతో హెరిటేజ్ ఫుడ్స్ కోసం భూములను కొల్లగొట్టారు. తమ బినామీ, సన్నిహితుడు లింగమనేని రమేశ్ కుటుంబంతో క్విడ్‌ప్రోకోకు పాల్పడి భారీ భూదోపిడీకి తెగబడటంలో చంద్రబాబు, లోకేశ్ చక్కటి సమన్వయం కనబరిచారు. క్విడ్ ప్రోకో కింద చంద్రబాబు కరకట్ట నివాసాన్ని తీసుకోగా హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ హోదాలో లోకేశ్ భూములను కొల్లగొట్టారు. ఈ అవినీతి భూబాగోతాన్ని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆధారాలతో సహా బట్టబయలు చేసింది. క్విడ్ ప్రోకో కింద చంద్రబాబు పొందిన కరకట్ట నివాసాన్ని, నారాయణ కుటుంబ సభ్యులు సీడ్ క్యాపిటల్‌లో పొందిన 75,888 చ.గజాల ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈమేరకు న్యాయస్థానంలో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణను పేర్కొన్న సిట్ నారా లోకేశ్‌ను ఏ–14గా పేర్కొంటూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో మంగళవారం ప్రత్యేక మెమో దాఖలు చేసింది. లింగమనేని రమేశ్, రాజశేఖర్‌లతోపాటు హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను కూడా ఈ కేసులో నిందితులుగా పేర్కొంది. ఐఆర్ఆర్ అలైన్మెంట్లో అవినీతి మెలికలు.. అమరావతి ముసుగులో చంద్రబాబు సాగించిన భారీ భూదందాలో ఐఆర్ఆర్ కుంభకోణం ఓ భాగం! మాజీ మంత్రి పొంగూరు నారాయణతోపాటు లోకేశ్ ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు తమ బినామీ, సన్నిహితుడైన లింగమనేని రమేష్‌తో క్విడ్ ప్రోకోకు పాల్పడి ఆయన భూముల విలువను భారీగా పెరిగేలా చేశారు. అందుకు ప్రతిగా బినామీల పేరిట భారీగా భూములను పొందడమే కాకుండా కరకట్ట నివాసంతోపాటు హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములు కానుకగా దక్కించుకున్నారు. నాడు సీఆర్డీఏ అధికారులు రూపొందించిన 94 కి.మీ. అమరావతి ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌పై చంద్రబాబు, నారాయణ మండిపడ్డారు. ఆ అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డు అమరావతిలోని పెదపరిమి, నిడమర్రు, చినవడ్లపూడి, పెదవడ్లపూడి మీదుగా వెళ్తుంది. హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి దాన్ని నిర్మించాల్సి వస్తుంది. దీంతో తమ భూముల విలువ అమాంతం పెరగదని వారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారి ఆదేశాలతో సీఆర్డీయే అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశారు. చంద్రబాబు, లింగమనేని కుటుంబానికి చెందిన వందలాది ఎకరాలున్న తాడికొండ, కంతేరు, కాజాను పరిగణలోకి తీసుకున్నారు. అందుకోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను 3 కిలోమీటర్లు దక్షిణానికి జరిపారు. హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి కంతేరు, కాజాలో ఉన్న భూములను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేలా 97.50 కి.మీ. అలైన్‌మెంట్‌ను రూపొందించారు. అయితే ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అనంతరం సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని రంగంలోకి తెచ్చి అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్‌ను అమరావతి మాస్టర్ ప్లాన్‌లో చేర్చారు. ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించి మాస్టర్ ప్లాన్‌లో పొందుపరిచిన అలైన్‌మెంట్‌కు అనుగుణంగా ఉండాలని ఆదేశించారు. అప్పటికే సీఆర్డీయే అధికారుల ద్వారా తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించేలా చేశారు. ఈ క్రమంలో తాడికొండ, కంతేరు, కాజాలో హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని భూములను ఆనుకుని అలైన్‌మెంట్‌ను ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ఖరారు చేసింది. హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములు ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను మెలికలు తిప్పడం ద్వారా లింగమనేని కుటుంబం భూముల విలువను భారీగా పెరిగేలా చేశారు. కంతేరు, కాజాలో లింగమనేని కుటుంబానికి ఉన్న 355 ఎకరాలను ఆనుకునే అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. అందుకు ప్రతిగా అదే ప్రాంతంలో హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములను పొందారు. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను ఆనుకుని కంతేరులో హెరిటేజ్ ఫుడ్స్‌కు 10.4 ఎకరాలు పొందగా 2014 జూన్ నుంచి సెప్టెంబరు మధ్యలో కొనుగోలు చేసినట్టు చూపించారు. లింగమనేని కుటుంబ నుంచి మరో 4.55 ఎకరాలను కొనుగోలు పేరిట హెరిటేజ్ ఫుడ్స్ దక్కించుకుంది. అప్పటికే ఈ కుంభకోణం గురించి బయటకు పొక్కడంతో ఆ సేల్ డీడ్‌ను రద్దు చేసుకున్నారు. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను ఆనుకుని లింగమనేని కుటుంబానికి చెందిన 355 ఎకరాలతోపాటు హెరిటేజ్ ఫుడ్స్ భూములు ఉండటం గమనార్హం. లోకేశ్ కీలక ‘భూ’మిక క్విడ్‌ప్రోకోకు పాల్పడి హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములను దక్కేలా చేయడంలో లోకేశ్ కీలక భూమిక పోషించారు. ఆయన 2008 జూలై 1 నుంచి 2013 జూన్ 29 వరకు హెరిటేజ్ ఫుడ్స్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు. అనంతరం 2017 మార్చి 31 వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను ఆనుకుని కొనుగోలు పేరిట భూములను దక్కించుకోవాలని నిర్ణయించిన హెరిటేజ్ ఫుడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో లోకేశ్ కూడా పాల్గొన్నారు. క్విడ్ ప్రోకో కింద భూములను పొందే ప్రక్రియలో ఆయన కీలక భూమిక పోషించారు. లోకేశ్ పేరిట హెరిటేజ్ ఫుడ్స్‌లో 23,66,400 షేర్లు ఉన్నాయి. అంటే హెరిటేజ్ ఫుడ్స్‌లో లోకేశ్‌కు 10.20 శాతం వాటా ఉంది. బాబుకు కరకట్ట నివాసం క్విడ్‌ప్రోకోలో భాగంగా లింగమనేని రమేశ్ విజయవాడ వద్ద కృష్ణా కరకట్టపై ఉన్న తన బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారు. దీనిపై కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారాన్ని మసిపూసేందుకు చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ఆ బంగ్లాను అద్దెకు ఇచ్చానని లింగమనేని రమేశ్ బుకాయించారు. కానీ ఆయన అద్దె వసూలు చేసినట్టుగానీ, చంద్రబాబు చెల్లించినట్టుగానీ ఆదాయపన్ను వివరాల్లో లేవు. తరువాత ఆ ఇంటిని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చానని చెప్పారు. మరి చంద్రబాబు ప్రభుత్వం నుంచి హెచ్ఆర్ఏ ఎందుకు పొందారన్న ప్రశ్నకు సమాధానం లేదు. దీంతో ఆ బంగ్లాను చంద్రబాబుకు వ్యక్తిగతంగా క్విడ్‌ప్రోకో కింద ఇచ్చారని స్పష్టమైంది. లింగమనేని నుంచి కానుకగా స్వీకరించిన కరకట్ట ఇంట్లోనే చంద్రబాబు, లోకేష్ దర్జాగా నివసించడం గమనార్హం. పవన్‌కూ వాటా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా ఈ అవినీతి పాపంలో పిడికెడు వాటా ఇచ్చారు. కాజాకు సమీపంలో ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌కు చేరువలో పవన్‌కల్యాణ్‌కు 2.4 ఎకరాలున్నాయి. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా రూ.8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్లు చూపించారు. ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించిన భూమినే పవన్ కల్యాణ్‌కు ఇవ్వడం గమనార్హం. భారీగా పెరిగిన విలువ ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని కుటుంబం ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.8 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. మార్కెట్ ధర ప్రకారమైతే ఎకరా రూ.50 లక్షలు ఉంది. అంటే ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లు. ఇక ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు తరువాత ఎకరం రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లకుపైగా పెరిగింది. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతంగా రూ.887.50 కోట్లకు పెరిగింది. అమరావతి నిర్మాణం పూర్తయితే సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా విలువ రూ.4 కోట్లకు చేరుతుందని నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. ఆ ప్రకారం మార్కెట్ ధరను బట్టి హెరిటేజ్ ఫుడ్స్ 10.4 ఎకరాల మార్కెట్ విలువ రూ.5.20 కోట్ల నుంచి రూ.41.6 కోట్లకు కోట్లకు పెరిగింది. అమరావతి నిర్మాణం పూర్తయితే రూ.62.4 కోట్లకు చేరుతుందని తేలింది. హెరిటేజ్ ఫుడ్స్ ఒప్పందం చేసుకుని రద్దు చేసినట్టు చూపిన మరో 4.55 ఎకరాల విలువ కూడా రూ.27.3 కోట్లకు చేరుతుంది. ఇక చంద్రబాబు బినామీల పేరిట ఉన్న వందలాది ఎకరాల విలువ అమాంతం పెరిగింది. -
హెరిటేజ్ విలువెంత? భువనేశ్వరి మాటల్లో నిజమెంత?
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. గత ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో రూ.371.25 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని చంద్రబాబుపై అభియోగాలు ఉన్నాయి. దీంతో సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ‘మా కుటుంబానికి ప్రజల డబ్బు అవసరం లేదు. నేనూ ఓ కంపెనీని నడుపుతున్నా. అందులో 2 శాతం అమ్ముకున్నా నాకు రూ.400 కోట్లు వస్తాయి. ప్రజల సొమ్ము మాకు అక్కర్లేదు’ అంటూ హెరిటేజ్ కంపెనీని ఉద్దేశిస్తూ చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి తాజాగా పేర్కొన్నారు. ఆమె లెక్క ప్రకారం హెరిటేజ్ కంపెనీ విలువ రూ.20 వేల కోట్లు. ఇదీ.. హెరిటేజ్ అసలు విలువ 1992లో పెట్టిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీకి నారా భువనేశ్వరి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. 2023 సెప్టెంబర్ 21 నాటికి హెరిటేజ్ కంపెనీ విలువ (మార్కెట్ క్యాప్) రూ.2,181 కోట్లు. 2023లో ఆ కంపెనీ రెవెన్యూ రూ.3,241 కోట్లు. ఇక నెట్‌వర్త్ చూసుకుంటే రూ.756 కోట్లు. నోటికొచ్చిన లెక్కలు హెరిటేజ్ కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 2,181 కోట్లు. అందులో 1 శాతం అంటే రూ. 21 కోట్లు. 2 శాతం అంటే రూ. 42 కోట్లు. వాస్తవ విలువ ఇలా ఉంటే తమ కంపెనీలో కేవలం 2 శాతం అమ్ముకుంటే చాలు రూ.400 కోట్లు వస్తాయని నారా భువనేశ్వరి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఆమె ఇలా నోటికొచ్చిన లెక్కలు చెప్పడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. -
స్కామ్‌స్టర్ ‘బాబు’ సెగ: హెరిటేజ్ షేర్లు ఢమాల్
రూ. 371 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ స్మాం కేసులో మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌తో హెరిటేజ్ స్టాక్ ఢమాల్ అంది. వరుసగా మూడు రోజుల పాటు ఇన్వెస్టర్ల అమ్మకాలతో ఈ షేరు పాతాళానికి పడియింది. ముఖ్యంగా చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపడంతో పెట్టుబడిదారులు కంపెనీ భవిష్యత్తుపై ఆశలో కోల్పోయి, షేర్ల అమ్మకానికి ఎక్కువశాతం మొగ్గు చూపిస్తుండటం గమనార్హం. సోమవారం బీఎస్ఈ హెరిటేజ్ ఫుడ్స్ స్క్రిప్ 7 శాతం నష్టంతో రూ.253 వద్ద ముగిసింది. మంగళవారం కూడా ఈ నష్టాలు కొనసాగాయి. ఏకంగా 13 శాతం కుప్పకూలి 221.45 వద్ద ముగిసింది. ఈ షేరు 52 వారాల గరిష్టం రూ. 287.35 , 52 వారాల కనిష్ట ధర రూ.135.15. కాగా చంద్రబాబు భార్య భువనేశ్వరి డెయిరీ సంస్థ వైస్-ఛైర్పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గాను, కుమారుడు లోకేశ్ భార్య బ్రాహ్మణి నారా హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. -
అప్పటి టీడీపీ ప్రభుత్వం అంటే హెరిటేజ్ ప్రభుత్వమేనా..!
సాక్షి, అమరావతి: కుక్క తోకను ఆడించాలి. కానీ, తోకే కుక్కను ఆడిస్తే ఎలా ఉంటుందో.. అలాగే ఉంది టీడీపీ, హెరిటేజ్ ఫుడ్స్ వ్యవహారం. టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతిని ప్రస్తావిస్తే చంద్రబాబు నోరుమెదపడం లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతిని సీఐడీ వెలికితీసిందని చెబితే టీడీపీ నేతలు స్పందించడం లేదు. కానీ.. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ మాత్రం స్పందిస్తూ గత టీడీపీ ప్రభుత్వాన్ని వెనకేసుకురావడం విడ్డూరంగా ఉంది. అంటే టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడి హెరిటేజ్ ఫుడ్స్‌కు భారీగా ప్రయోజనం కల్పించారన్న ఆరోపణలు, అభియోగాల్లో వాస్తవం ఉందని పరోక్షంగా అంగీకరించినట్టుగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా.. చంద్రబాబు ప్రభుత్వ అవినీతికి సంబంధించి రెండు అంశాలపై టీడీపీ కాకుండా హెరిటేజ్ స్పందించడం గమనార్హం. క్విడ్ ప్రోకో లేదంటూ హెరిటేజ్ ఖండన రాజధాని మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారులో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతికి జరిగిందని సీఐడీ విచారణలో ఆధారాలతో సహా బయటకొచి్చంది. లింగమనేని రమేశ్ కుటుంబానికి చెందిన భూములను అమరావతి భూ సమీకరణ నుంచి తప్పించారని.. ఆ కుటుంబానికి సంబంధించిన భూములను ఆనుకుని నిరి్మంచేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మూడుసార్లు మార్చారని బట్టబయలైంది. అందుకు ప్రతిగా క్విడ్ ప్రోకో కింద లింగమనేని కుటుంబానికి చెందిన కరకట్ట నివాసాన్ని చంద్రబాబుకు ఇచ్చారు. మరోవైపు లింగమనేని కుటుంబానికి చెందిన భూములను కొనుగోలు పేరుతో హెరిటేజ్ ఫుడ్స్‌కు అప్పగించేలా ఒప్పందం చేసుకోవడం కూడా ఆ క్విడ్ ప్రోకోలో భాగమనే తేలింది. సీఐడీ విజ్ఞప్తి మేరకు కరకట్ట నివాసాన్ని అటాచ్ చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచి్చంది. అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని సీఐడీ వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం ఆమోదించింది. హెరిటేజ్ ఫుడ్స్ భూములకు సంబంధించిన విషయాన్ని ఈ కేసులో ఏ–1గా ఉన్న చంద్రబాబు వెల్లడించలేదని కూడా న్యాయస్థానం తన తీర్పులో వ్యాఖ్యానించింది. ఇదే విషయాన్ని సాక్షి పత్రిక సోమవారం ఎడిషన్‌లో ప్రచురించింది. దీనిపై చంద్రబాబుగానీ.. టీడీపీ గానీ స్పందించలేదు. ఆ వార్త కథనానికి ఎలాంటి ఖండనా ఇవ్వలేదు. కానీ.. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ మాత్రం ఆ వార్త కథనానికి ఖండనగా ఓ పత్రికా ప్రకటన పంపించడం విస్మయపరుస్తోంది. సాక్షిలో ప్రచురించిన వార్త తప్పని హెరిటేజ్ ఫుడ్స్ ఖండిస్తూ తాము క్విడ్ ప్రోకోకు పాల్పడలేదని చెప్పుకొచ్చింది. టీడీపీ ప్రభుత్వం అంటే తమ ప్రభుత్వమేనని హెరిటేజ్ ఫుడ్స్ భావిస్తున్నట్టుగా ఉంది. చిత్తూరు డెయిరీ విషయంలోనూ అంతే.. చిత్తూరు డెయిరీకి సంబంధించి గత నెల 30న సాక్షిలో ప్రచురించిన కథనాన్ని ఖండిస్తూ హెరిటేజ్ ఫుడ్స్ ప్రకటన జారీ చేయడం విస్మయపరుస్తోంది. చంద్రబాబు 1995–2004 మధ్య సీఎంగా ఉన్నకాలంలో రాష్ట్రంలో సహకార డెయిరీలను నిర్వీర్యం చేసి మూతపడేలా చేశారు. అందులో భాగంగానే చిత్తూరు డెయిరీని కూడా మూయించారని ఆ కథనంలో ప్రస్తావించారు. చంద్రబాబు మూత వేయించిన చిత్తూరు సహకార డెయిరీకి సహకార రంగానికి చెందిన అమూల్ సంస్థ ద్వారా పునరుజ్జీవం కల్పించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని కూడా చెప్పారు. ఈ వార్త కథనాన్ని చంద్రబాబుగానీ టీడీపీ గానీ ఖండించలేదు. కానీ.. హెరిటేజ్ ఫుడ్స్ మాత్రం ఖండిస్తూ ప్రకటన జారీ చేసింది. 1991–93 మధ్య చిత్తూరు డెయిరీ తీవ్రమైన నష్టాలు ఎదుర్కొందని.. ఆ విషయాన్ని శాసనసభా ఉపసంఘం కూడా నిర్ధారించిందని ఆ ప్రకటనలో పేర్కొంది. అసలు టీడీపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలు, ఆరోపణలను హెరిటేజ్ ఫుడ్స్ ఖండించడమే విడ్డూరంగా ఉంది. చదవండి: రైతుకుంది ధీమా.. రామోజీకే లేదు ఇక శాసనసభా ఉపసంఘం విచారణ అంశాలను కూడా హెరిటేజ్ ఫుడ్స్ ప్రస్తావించాల్సిన అవసరం ఏముందన్నది అంతుబట్టడం లేదు. శాసనసభ ఉపసంఘం తన నివేదికను హెరిటేజ్ ఫుడ్స్‌కు సమర్పించలేదు కదా! మరి హెరిటేజ్ ఫుడ్స్ ఆ విషయాలను తన ప్రకటనలో ఎలా ప్రస్తావించిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. అంటే చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం తమ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేసినట్టుగా పరోక్షంగా అంగీకరించినట్టేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
పా‘పాల’ పుట్ట హెరిటేజ్!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: పాల సేకరణలో ఎస్ఎన్ఎఫ్ (సాలిడ్ నాట్ ఫ్యాట్) పేరిట హెరిటేజ్ డెయిరీ పాడి రైతులకు కుచ్చుటోపీ పెడుతోంది. చిత్తూరు జిల్లాలోని 9 హెరిటేజ్ డెయిరీల నుంచి రోజూ 1.41 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. పాల సేకరణ సమయంలో ల్యాక్టోమీటరుతో వెన్న, కొవ్వు శాతాలను గుర్తించి ధర నిర్ణయిస్తారు. ఎస్ఎన్ఎఫ్ 7.69 శాతం, ఫ్యాట్ 0.75 శాతం ఉన్న పాలకు లీటరు రూ.17.97 మాత్రమే చెల్లిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని చాలా హెరిటేజ్ కేంద్రాల్లో ఇదే ధర చెల్లిస్తూ రైతులను నిలువు దగా చేస్తున్నారు. కానీ ఇదే ఎస్ఎన్ఎఫ్, ఫ్యాట్ శాతం ఉన్న లీటరు పాలకు పక్కనే గొల్లపల్లిలో శివశక్తి డెయిరీలో, రొంపిచర్ల క్రాస్ శ్రీజ డెయిరీలో, మదనపల్లి అమూల్ డెయిరీ పాల కేంద్రంలో రూ.25 నుంచి రూ.27 వరకు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన హెరిటేజ్‌కు మిగిలిన డెయిరీలకు రైతులు చెల్లించే సేకరణ ధరల్లో ఎంత తేడా ఉందో అర్ధం చేసుకోవచ్చు. (చదవండి: రాజధాని ఎక్కడ ఉండాలనే అంశం జోలికెళ్లం: హైకోర్టు ) వెన్నశాతం పెరిగినా రైతుకిచ్చే ధర తక్కువే హెరిటేజ్ పాల సేకరణలో ఎస్ఎన్ఎఫ్ 7.79 శాతం, ఫ్యాట్ 4.19 శాతం ఉన్న పాలకు లీటరుకు రూ.18.09 ఇస్తున్నారు. ఫ్యాట్ 3.10 శాతం ఉండి ఎస్ఎన్ఎఫ్ 8.06 శాతం ఉన్న పాలకు లీటరుకు రూ.23.52 చెల్లిస్తున్నారు. ఫ్యాట్ 3.10 శాతం ఉండి ఎస్ఎన్ఎఫ్ 8.08 శాతం ఉంటే రూ.27.97 చెల్లిస్తున్నారు. కానీ ఇవే శాతం ప్రకారం ఉంటే అమూల్ కంపెనీతో పాటు ఇతర కంపెనీలు లీటరు రూ.33.24 నుంచి రూ.40 వరకు కొనుగోలు చేస్తుండటం గమనార్హం. రైతులకు దగా.. వినియోగదారులకు వంచన వాస్తవానికి పాలల్లో నిర్దేశించిన మేరకు ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ లేకపోతే వాటిని కొనుగోలు చేయకూడదు. కానీ హెరిటేజ్ నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ పాలు తగిన నాణ్యతతో లేకున్నా కొనుగోలు చేసి వాటితో పాల ఉత్పత్తులు తయారు చేసి మార్కెట్లో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటోంది. బాలకృష్ణను పిండేసింది...! చిత్తూరు జిల్లాలో పాడి రైతు బాలకృష్ణకు హెరిటేజ్ చెల్లించిన ధర లీటర్‌కు రూ.17.97. పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలం బెల్లంవారి పల్లెలోని హెరిటేజ్ పాల సేకరణ కేంద్రంలో ఆయనకు 20 రోజుల పాటు దాదాపు ఇలాగే చెల్లించారు. ఓసారి అయితే రూ.16.65 మాత్రమే ఇచ్చారు. ఆయనొక్కరే కాదు.. భాస్కర్, వి.గంగిరెడ్డి, పసుపులేటి రాణి, హరినాథ్, నాగమ్మ, కిరణ్ తదితర పాడి రైతులందరికీ జనవరిలో ఇదే మాదిరిగా బిల్లులు చెల్లించారు. అక్కడే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లోని హెరిటేజ్ పాల సేకరణ కేంద్రాల్లో దారుణాలు ఇవీ.. (చదవండి: సానుకూలంగా చర్చలు) -
టీడీపీ ఢమాల్ : బాబు ఫ్యామిలీకి మరో ఎదురుదెబ్బ
సాక్షి : ముంబై: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టిస్తోంది. దాదాపు 130కి పైగా స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ముందంజ దూసుకుపోతోంది. దీంతో ఫ్యాన్ ప్రభంజనంలో టీడీపీ కొట్టుకుపోతోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడుకి భారీ షాక్ తగిలింది. అంతేకాదు ఫలితాల సరళి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఖాయం అన్న సంకేతాలందిస్తున్న నేపథ్యంలో బాబు కుటుంబానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఫలితాల్లో టీడీపీ ఢమాల్ అనడంతో ఇన్వెస్టర్లు హెరిటేజ్ ఫుడ్స్ కౌంటర్లో అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో ఈ షేర్లో భారీ అమ్మకాల ఒత్తిడి పెరిగింది. బుధవారం రూ. 475 వద్ద ముగిసిన హెరిటేజ్ షేర్ గురువారం ఓపెనింగ్‌లోనే పది శాతంపైగా నష్టపోయి రూ. 411కి పతనమైంది. ప్రస్తుతం 9శాతం నష్టాలతో కొనసాగుతోంది. ఫలితాలు ముగిసే సమయానికి ఎన్నికల ఫలితాల ప్రభావంతో మరింత కుదేలయ్యే అవకాశం ఉందని మార్కెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుమ్మురేపుతోంది. ఏపీ ఫలితాలతో పాటు 13 లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గెలుపు ఓటముల మధ్య ఊగిసలాడుతుండగా, అధికార పార్టీ మంత్రులు పలువురు వెనుకంజలో ఉండటం గమనార్హం. -
హెరిటేజ్ ఫుడ్స్ లాభం రూ.21 కోట్లు
సెప్టెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో హెరిటేజ్ ఫుడ్స్ నికరలాభం క్రితంతో పోలిస్తే రూ.7.4 కోట్ల నుంచి రూ.21 కోట్లకు పెరిగింది. టర్నోవరు మాత్రం రూ.828 కోట్ల నుంచి తగ్గి రూ.767 కోట్లకు పరిమితమయింది. గడిచిన ఆరు నెలల్లో చూస్తే (ఏప్రిల్– సెప్టెంబరు) రూ.1,382 కోట్ల టర్నోవరుపై రూ.42 కోట్ల నికరలాభం ఆర్జించింది. -
హెరిటేజ్ భూముల బాగోతంపై విచారణ జరిపించండి: ఈఏస్ శర్మ
సాక్షి, అమరావతి బ్యూరో: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ అమరావతిలో భూములు కొనుగోలు వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరీష్ కుమార్‌కు శనివారం లేఖ రాశారు. రాజధాని ఎంపికకు ముందే అదే ప్రాంతంలో హెరిటేజ్ సంస్థ భూములు కొనడం వెనుక భారీ అవినీతి ఉందని శర్మ చెప్పారు. అది పరస్పర విరుద్ధ ప్రయోజనాల పరిధిలోకి వస్తుందని కూడా స్పష్టం చేశారు. అవినీతి నిరోధక చట్టం కింద దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
నాలుగేళ్లలో బిలియన్ డాలర్లకు!!
-
నాలుగేళ్లలో బిలియన్ డాలర్లకు!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే నాలుగేళ్లలో ఆదాయాన్ని రూ.6 వేల కోట్ల స్థాయికి తీసుకెళ్ళాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ వెల్లడించింది. కంపెనీ 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.2,700 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ‘‘గతేడాది 15 శాతం వృద్ధిని నమోదు చేశాం. ఇప్పటి నుంచి 25 శాతం వృద్ధి రేటును లకి‡్ష్యంచాం’‘ అని సంస్థ ఈడీ నారా బ్రాహ్మణి తెలిపారు. తమ వ్యాపారంలో 40 శాతం వాటా విలువ ఆధారిత ఉత్పత్తులదేనన్నారు. బుధవారమిక్కడ అల్పెన్వీ పేరిట ఐస్‌క్రీమ్ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘వచ్చే నాలుగేళ్లలో ఐస్‌క్రీమ్ ఉత్పత్తులపై రూ.80 కోట్ల పెట్టుబడులు పెడతాం. 2022 నాటికి ఐస్‌క్రీమ్‌ల నుంచి రూ.230 కోట్ల వ్యాపారం లకి‡్ష్యంచాం’’ అని తెలిపారు. ప్రస్తుతానికివి దక్షిణ, పశ్చిమాది రాష్ట్రాల్లోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో లభ్యమవుతాయని.. మెల్లగా దేశవ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు. మిల్క్ క్రీమ్, ఫ్రూట్స్, నట్స్, చాక్లెట్స్ ఫేవర్లు, ఫార్మాట్లలో లభ్యమవుతాయి. ధరలు రూ.10–45 మధ్యలో ఉంటాయి. ఈ కార్యక్రమంలో సంస్థ వైస్ చైర్పర్సన్ అండ్ ఎండీ నారా భువనేశ్వరీ, ప్రెసిడెంట్ డాక్టర్ ఎం సాంబశివరావు పాల్గొన్నారు. -
హెరిటేజ్ ఫుడ్స్ లో కీలక పరిణామం
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడికి చెందిన డెయిరీ, రిటైల్ రంగ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రిలయన్స్ రిటైల్‌కి (ఆర్ఆర్ఎల్) చెందిన డెయిరీ వ్యాపార విభాగాన్ని హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసింది. రిలయన్స్ రిటైల్ డెయిరీ బిజినెస్‌ల కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్టు హెరిటేజ్ ఫుడ్స్ గురువారం ప్రకటించింది. '' ఈ డీల్ కు సంబంధించి కంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం పొందాం. రిలయన్స్ డెయిరీ బిజినెస్ కొనుగోలును పూర్తిచేశాం'' అని నేడు బీఎస్ఈ ఫైలింగ్ లో పేర్కొంది. ఏప్రిల్ 12 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వస్తుందని తెలిపింది. రిలయన్స్ రిటైల్ దుకాణాల్లో యథావిధిగా అమ్మకాలు నిర్వహిస్తాయని కంపెనీ పేర్కొంది. రిలయన్స్ రిటైల్ డెయిరీ ప్రొడక్ట్ లను పూర్తిగా తమ సొంతం చేసుకున్నట్టు కంపెనీ ప్రకటించగానే హెరిటేజ్ షేర్లు ఒక్కసారిగా పైకి ఎగిశాయి. 1.71 శాతం లాభాలతో 1092.20గా ట్రేడవుతున్నాయి. మార్కెట్ అవర్స్ లో ఈ ప్రకటనను హెరిటేజ్ ఫుడ్స్ విడుదల చేసింది. 2016 డిసెంబర్ క్వార్టర్లో హెరిటేజ్ ఫుడ్స్ నికరలాభాలు 75.11 శాతం పైకి ఎగిసి 19.91 కోట్లగా నమోదైన సంగతి తెలిసిందే. హెరిటేజ్ ఫుడ్స్ డెయిరీ, రిటైల్, అగ్రి, బేకరీ, రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్లలో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. రిలయన్స్ డెయిరీ విభాగం 2007 నుంచి దేశవ్యాప్తంగా పాల సేకరణ, ప్రాసెసింగ్, పంపిణీ కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రధానంగా డెయిరీ లైఫ్, డెయిరీ ప్యూర్ బ్రాండ్స్ కింద ప్యాక్డ్ మిల్క్, ఫ్లేవర్డ్ మిల్క్, డెయిరీ వైట్నర్, నెయ్యి, వెన్న, స్వీట్స్ తదితర ఉత్పత్తులు విక్రయిస్తోంది. -
హెరిటేజ్ ఫుడ్స్ చేతికి రిలయన్స్ డెయిరీ వ్యాపారం
• డీల్ విలువ వెల్లడించని సంస్థ • దేశవ్యాప్త విస్తరణకు అవకాశం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : డెయిరీ, రిటైల్ రంగ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ తాజాగా రిలయన్స్ రిటైల్‌కి (ఆర్ఆర్ఎల్) చెందిన డెయిరీ వ్యాపార విభాగాన్ని కొనుగోలు చేస్తోంది. డీల్ ఖరారయినా... డీల్ విలువ ఎంతన్నది మాత్రం వెల్లడి కాలేదు. నియంత్రణ సంస్థల అనుమతులు, ఇతరత్రా అంశాలకు లోబడి ప్రతిపాదిత లావాదేవీ ఉంటుందని హెరిటేజ్ ఫుడ్స్ శుక్రవారం ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. రిలయన్స్ డెయిరీ విభాగం 2007 నుంచి దేశవ్యాప్తంగా పాల సేకరణ, ప్రాసెసింగ్, పంపిణీ కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రధానంగా డెయిరీ లైఫ్, డెయిరీ ప్యూర్ బ్రాండ్స్ కింద ప్యాక్డ్ మిల్క్, ఫ్లేవర్డ్ మిల్క్, డెయిరీ వైట్నర్, నెయ్యి, వెన్న, స్వీట్స్ తదితర ఉత్పత్తులు విక్రయిస్తోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 553 కోట్ల ఆదాయం నమోదు చేసింది. ప్రస్తుతం పది రాష్ట్రాల్లోని 2,400 గ్రామాల రైతుల నుంచి రోజుకు 2.25 లక్షల లీటర్ల పాలు సేకరిస్తోంది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్ వంటి కీలక మార్కెట్లతో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, రాజస్తాన్ తదితర రాష్ట్రాల్లో కొత్తగా కార్యకలాపాలు విస్తరించేందుకు ఈ డీల్ తోడ్పడుతుందని హెరిటేజ్ ఆశాభావం వ్యక్తంచేసింది. డీల్ అనంతరం కూడా హెరిటేజ్ డెయిరీ ఉత్పత్తులు సహా.. ఇతరత్రా డెయిరీ ఉత్పత్తులను కూడా తమ రిటైల్, హోల్‌సేల్ స్టోర్స్ ద్వారా విక్రయించడం కొనసాగిస్తామని తెలియజేసింది. 1992లో ప్రారంభమైన హెరిటేజ్ ఫుడ్స్ ప్రస్తుతం డెయిరీ, రిటైల్, అగ్రి, బేకరీ తదితర ఆరు వ్యాపార విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో 1,13,500 రిటైల్ అవుట్‌లెట్స్ ద్వారా ఉత్పత్తులు విక్రయిస్తోంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో 123 హెరిటేజ్ ఫ్రెష్ రిటైల్ స్టోర్స్ ఉన్నాయి. హెరిటేజ్ రిటైల్ వ్యాపార విభాగాన్ని ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు చేస్తున్నట్లు వచ్చిన వార్తలను హెరిటేజ్ ధ్రువీకరించటం తెలిసిందే. హెరిటేజ్ లాభం రూ. 16 కోట్లు.. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో హెరిటేజ్ ఫుడ్స్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.641 కోట్ల ఆదాయంపై సుమారు రూ.15.69 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ2లో ఆదాయం రూ.587 కోట్లు కాగా లాభం రూ.15.29 కోట్లు. అయితే స్టాండెఅలోన్ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ2లో డెయిరీ విభాగం రూ.462 కోట్ల ఆదాయంపై రూ.30 కోట్ల లాభం నమోదు చేసింది. రిటైల్ విభాగం మాత్రం నష్టాల్లోనే ఉంది. ఈ విభాగం రూ.175 కోట్ల అమ్మకాలపై రూ.6 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. -
హెరిటేజ్ ఫుడ్స్ లాభం రూ. 18 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో హెరిటేజ్ ఫుడ్స్ నికర లాభం (కన్సాలిడేటెడ్) దాదాపు 41% వృద్ధి చెంది రూ. 12.75 కోట్ల నుంచి రూ. 18.04 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ. 544 కోట్ల నుంచి సుమారు రూ. 633 కోట్లకు చేరింది. మరోవైపు పూర్తి ఆర్థిక సంవత్సరం హెరిటేజ్ ఫుడ్స్ లాభం రూ. 28 కోట్ల నుంచి రూ. 55 కోట్లకు పెరగ్గా.. ఆదాయం రూ. 2,073 కోట్ల నుంచి రూ. 2,381 కోట్లకు చేరింది. మార్చి నెలలో అనంతపురం జిల్లా వజ్రకరూర్‌లోని ప్లాంటులో స్వంత వినియోగం కోసం 2.1 మెగావాట్ల పవన విద్యుత్ యూనిట్ ఏర్పాటు చేసినట్లు కంపెనీ పేర్కొంది. రూ. 10 ముఖవిలువ చేసే షేరు ఒక్కింటికి రూ. 3 తుది డివిడెండును ప్రకటించింది. ఇటీవల పనామా పేపర్స్‌లో ప్రస్తావనకొచ్చిన నాన్ ఎగ్జిక్యూటివ్ స్వతంత్ర డెరైక్టర్ ఎం శివరామ వరప్రసాద్ రాజీనామాను కంపెనీ బోర్డు ఆమోదించింది. అలాగే, కర్ణాటకలోని సింధనూర్‌లో ఉన్న తేజా డైరీ అసెట్స్‌ను రూ. 60 లక్షలకు కొనుగోలు చేసేందుకు ఆమోదముద్ర వేసింది. రోజుకు 20,000 లీటర్ల ప్రాసెసింగ్ సామర్ధ్యం తేజా డైరీ ప్లాంటుకున్నట్లు పేర్కొంది. -
పనామా దెబ్బతో కంగుతిన్న చంద్రబాబు
హైదరాబాద్: పనామా పత్రాల లీకేజీతో హెరిటేజ్ గుట్టు బయటపడటంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉలిక్కిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్స్ కు సంబంధించి తాజాగా బయటపడిన పత్రాల్లో చంద్రబాబు నాయుడు కుటుంబ కంపెనీ హెరిటేజ్ పుడ్స్ లో ఇండిపెండెంట్ డైరెక్టర్ గా ఉన్న మోటపర్తి శివరామ వరప్రసాద్ పేరు బయటపడటం తెలిసిందే. దాంతో ఒక్కసారిగా కంగుతిన్న చంద్రబాబు కంపెనీ నుంచి ఆయనతో రాజీనామా చేయించారు. హెరిటేజ్ కంపెనీలో ఇండిపెండెంట్ డైరెక్టర్ గా శివ రామ వర ప్రసాద్ కంపెనీ నుంచి తన పదవికి రాజీనామా చేశారని హెరిటేజ్ ఫుడ్స్ వెబ్ సైట్లో శుక్రవారం రాత్రి ఒక ప్రకటన ఇచ్చింది. శివరామ ప్రసాద్ 12 వ తేదీ గురువారం రోజున తన రాజీనామా పత్రాన్ని సమర్పించారని, ఆ విషయాన్ని ముంబయ్ స్టాక్ ఎక్చేంజ్ కు తెలియజేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 23 న జరగబోయే కంపెనీ డైరెక్టర్ల సమావేశంలో ఆయన రాజీనామాను ఆమోదించే అవకాశాలున్నాయని అందులో తెలిపారు. భారీ ఎత్తున పన్నుల ఎగవేతకు మనీ లాండరింగ్ కు పాల్పడేందుకు వీలుగా చిన్న చిన్న దేశాల్లో ద్వీపాల్లో నెలకొల్పుతున్న కంపెనీల భాగోతాలను, బినామీల పేర్లను వెల్లడిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఆయా కంపెనీలతో ఉన్న లింకులను తెలియజేస్తూ పనామా పత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హెరిటేడ్ ఫుడ్స్ లో డైరెక్టర్ గా ఉన్న శివరామ వరప్రసాద్ లింకులు బయటపడటంతో చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు. తీవ్ర తర్జనభర్జనలో పడ్డారు. హెరిటేజ్ సంస్థతో ఉన్న లింకులు బయటపడటంతో చేసేది లేక చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేసి శివరమవరప్రసాద్ తో రాజీనామా చేయించినట్టు చెబుతున్నారు. శివరామ వరప్రసాద్ పేరు బయటకు రావడంతో ఈ వ్యవహారం టీడీపీలో ప్రకంపనలు సృష్టించింది. కేంద్రంలో మిత్రపక్షమైన బీజేపీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని పెద్దగా తవ్వి తియ్యబోదన్న నమ్మకం ఉన్నప్పటికీ ఇందులో తాము కూడా చర్యలు తీసుకున్నామన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లాలన్న ఉద్దేశంతో ఆయనతో రాజీనామా చేయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విదేశాల్లో కంపెనీలు ఈ మోటపర్తి ప్రసాద్ పేరును తాజా పనామా పత్రాల్లో మూడు దఫాలు ప్రస్తావించారు. ఆఫ్రికా ఖండంలోని ఘనా, టోగో దేశాల్లో ఎంపీ హోల్డింగ్స్ అసోసియేట్స్ లిమిటెడ్, బాలీవార్డ్ లిమిటెడ్, బిట్‌కెమీ వెంచర్స్ వంటి ఆఫ్‌షోర్ కంపెనీలతో ఆయనకున్న లింకుల్ని పనామా పేపర్స్ వెల్లడించింది. నామమాత్రపు కంపెనీల పేర్లమీద పన్నులు ఎగవేసారన్న అభియోగాల్ని మోపింది. బ్రిటిష్ వర్జిన్ ఐలెండ్స్, ఈక్వడార్, ఘనా, పనామా దేశాల్లో రిజిష్టర్ అయి వున్న పలు కంపెనీల్లో ప్రసాద్‌కు వాటాలున్నాయి. ఎన్నెన్నో అనుమానాలు... పనామా పత్రాల వ్యవహారం తొలిసారిగా బయటపడ్డపుడే ప్రసాద్ పేరు ప్రస్తావనకు వచ్చింది. టోగో దేశంలోని వాసెమ్ అనే కంపెనీ గురించి పనామా పేపర్స్ విస్త్రతంగా కథనాలు వెలువరించింది. వాసెమ్ యజమానుల గురించి పనామా పేపర్స్‌లో ప్రస్తావిస్తూ దానిలో బ్రిటన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కెన్లెమ్ లిమిటెడ్‌కు 40 శాతం వాటా వున్నట్లు పేర్కొంది. ఆ కెన్లెమ్ యజమాన్యంపై అనుమానాలు వ్యక్తంచేస్తూ అసలు వ్యక్తుల పేర్లు యజమానులుగా ఆ కంపెనీ చూపించడం లేదని, బినామీ పేర్లతో నడుస్తోందన్న అభియోగాల్ని పనామా పేపర్స్ మోపింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... మోటపర్తి ప్రసాద్‌కు కెన్లెమ్‌లో 24 శాతం వాటా వుంది. అలాగే కెన్లెమ్‌లో మరో 17 శాతం వాటా రఫెల్ హోల్డింగ్స్‌కు వుంది. ఈ రఫెల్ హోల్డింగ్స్ అసలు యజమానులు కూడా వేరే వ్యక్తులని పనామా పేపర్స్ వెల్లడించింది. టోగోలోని వాసెమ్ సిమెంటు కంపెనీలో 89 శాతం షేర్లు ఆ దేశానికి చెందినవారికి కావు. ఈ కంపెనీ ప్రధాన వాటాదారుల్లో మోటపర్తి ప్రసాద్ ఒకరు. బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే.... హెరిటేజ్ ఫుడ్స్ ఇండిపెండెంట్ డెరైక్టర్‌గా 2014 జూలై నెలలో ఐదేళ్ల కాలానికి ప్రసాద్ నియమితులయ్యారు. ఆయన కంపెనీకి ఇండిపెండెంట్ నాన్-ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారని హెరిటేజ్ ఫుడ్స్ తెలిపింది. 2014 జూన్ నెలలో కొత్త ఏపీ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. బాబు పదవిలోకి వచ్చిన నెలరోజులకే ప్రసాద్‌కు హెరిటేజ్ ఫుడ్స్‌లో డెరైక్టర్‌గా కూర్చోబెట్టారు. ఘనా, టొగో తదితర దేశాల్లో పలు కంపెనీలు స్థాపించిన ప్రసాద్ ఏపీ సీఎంకు అత్యంత సన్నిహితుడు. ఆయన దేశంలో, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నపుడు చంద్రబాబు నిర్వహించే ప్రతి సమావేశంలో పాల్గొనే వారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఆయన హెరిటేజ్‌లో ఉన్నతోద్యోగి అని చెప్తుండేవారని, చంద్రబాబుకు, ఆయనకు మధ్య ఇంత పెద్ద వ్యాపార, బినామీ సంబంధాలున్నాయని తమకు తెలియదని ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నా యి. అయితే ఇండిపెండెంట్ డెరైక్టర్‌గా ఈ దేశంలో వుండే ఒక వృత్తినిపుడినో, పారిశ్రామికవేత్తనో ఎంచుకోకుండా, ఎక్కడో ఘనా దేశంలో వుంటున్న ఒక ఎన్నారైని నియమించడంపై పారిశ్రామిక వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ ఎన్నో కంపెనీలు ప్రసాద్‌కు హైదరాబాద్‌లో సైతం పలు రిజిష్టర్డ్ కంపెనీలున్నాయి. చాలా కంపెనీలకు ఆయన చైర్మన్‌గా, డెరైక్టరుగా, భాగస్వామిగా ఉంటున్నారు. డిజైన్ ట్రయిబ్, విండ్సర్ ఎడిఫిసెస్, వోల్టా ఫ్యాషన్స్, వోల్టా ఎస్టేట్స్ , వోల్టా ఇంపాక్స్, తోషాలి సిమెంట్స్, ప్రకృతి సిమెంట్స్, పేపర్ ఇంజనీరింగ్ సర్వీసెస్, దక్కన్ ఆటో, పృధ్వీ అసెట్ రీకన్‌స్ట్రక్షన్స్ వీటిలో కొన్ని. ఇందులో చాలావరకూ హైద రాబాద్ సంజీవరెడ్డి నగర్‌లోని హౌస్ నంబర్ 123/3, మూడో ఫ్లోర్లో వున్నట్లు ఆల్ కంపెనీ డేటా.కామ్ సైట్ వెల్లడిస్తోంది. అయితే ఆ భవనంలో ఇప్పుడు అవేవీ లేవు. మరో కార్పొరేట్ గ్రూప్ కంపెనీలు అక్కడ వుండటం గమనార్హం. పనామా పేపర్స్‌లో ఆయన పేరు ప్రస్తావనకు రావడంపై ప్రసాద్ స్పందిస్తూ ఘనా, టోగో దేశాలతో సహా పలు దేశాల్లో తనకు పలు కంపెనీలున్నాయని, అవన్నీ హోల్డింగ్ కంపెనీలని, చట్టబద్దమైనవేనన్నారు.తాను హెరిటేజ్ ఫుడ్స్‌లో ఇండిపెండెంట్ డెరైక్టర్నని ఆయన పేర్కొన్నారు. మోటపర్తి ప్రసాద్ కుమారుడు సునీల్ అమెరికా, హైదరాబాద్‌ల్లోని స్టార్టప్ కంపెనీల్లో దాదాపు రూ. 40 కోట్లు పెట్టుబడి చేశారు. ఎవరీ ప్రసాద్... కృష్ణాజిల్లాకు చెందిన మోటపర్తి ప్రసాద్ చాలా కాలం క్రితం ఆఫ్రికా దేశాలకు వెళ్లి వ్యాపారాలతో బాగా సంపాదించారు. వరంగల్ నిట్‌లో మెటలర్జికల్ ఇంజనీరింగ్ విద్యనభ్యసించారు. ముంబై, గుజరాత్‌ల్లో ఇనుము, ఉక్కు ఫౌండ్రీల నిర్వహణకు సంబంధించి అనుభవం సంపాదించారు. 1985లో పటాన్చెరు వద్ద మార్టోపెరల్ అల్లాయిస్ అనే కంపెనీని స్థాపించి, దాని టర్నోవర్‌ను నాలుగేళ్లలో రూ. 5 కోట్లకు తీసుకెళ్లారంటూ ఆయన ఛైర్మన్‌గా వ్యవహరించే వోల్టాస్ ఫ్యాషన్ ప్రొఫైల్‌లో వివరించారు. అటుతర్వాత సిమెంటు తదితర రంగాల్లోకి ప్రవేశించి, పలు దేశాల్లో వివిధ కంపెనీలను నిర్వహిస్తున్నట్లు ఆ ప్రొఫైల్‌లో వివరించారు. దీని సంగతి పక్కనబెడితే...ఆయన చంద్రబాబునాయుడుకి సన్నిహితుడంటూ పారిశ్రామిక, రాజకీయ వర్గాలు చెపుతుంటాయి. అందుకే ఘనా దేశంలో వుంటున్న ఎన్నారైను ఏరికోరి తన కుటుంబ కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్‌లో డెరైక్టరుగా నియమింపచేశారని చెప్పుకుంటుంటారు. ప్రసాద్ కుమారుడికి రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ దివిస్ లేబరోటరీస్ యజమాని మురళీ కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు. -
అవును.. ఆయన మా డైరెక్టరే
పనామా పేపర్లలో ప్రస్తావనకు వచ్చిన ఎం.శివరామప్రసాద్ తమ సంస్థలో నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టరని హెరిటేజ్ ఫుడ్స్ ప్రెసిడెంట్ ఎం.సాంబశివరావు ఓ ప్రకటనలో తెలిపారు. 2014 జూలై 30వ తేదీన ఆయనను ఐదేళ్ల కాలానికి డైరెక్టర్‌గా నియమించామన్నారు. అయితే ఆయనకు హెరిటేజ్ ఫుడ్స్‌లో ఎలాంటి ఆర్థికపరమైన ఆసక్తి లేదని చెప్పారు. ఆయనకు కంపెనీలో షేర్లు గానీ, పెట్టుబడులు గానీ ఏమీ లేవన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు, ఆయన సొంత కంపెనీలకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఏమీ లేవని కూడా సాంబశివరావు చెప్పారు. -
చలివేంద్రాల్లో సొంత వ్యాపారం
ప్రభుత్వ చలివేంద్రాలకు హెరిటేజ్ ఫుడ్స్ నుంచి మజ్జిగ కొనుగోలు సాక్షి, హైదరాబాద్/విజయవాడ బ్యూరో: ప్రభుత్వ పథకాల్లోనూ సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిట్ట. మండే ఎండల్లో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా చలివేంద్రాల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న మజ్జిగను ముఖ్యమంత్రి సొంత కంపెనీ హెరిటేజ్ నుంచే కొనుగోలు చేస్తుండడం గమనార్హం. ఎండల ధాటికి జనం అల్లాడిపోతుండడంతో అన్ని జిల్లాల్లో చలివేంద్రాలను నెలకొల్పి 45 రోజులపాటు ప్రజలకు మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలని ఏప్రిల్ 18న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించా రు. ఇందుకుగాను ఒక్కో జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున 13 జిల్లాలకు మొత్తం రూ.39 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఏప్రిల్ 25న జీవో జారీ చేసింది. మజ్జిగ పంపిణీని ముఖ్యమంత్రి సంస్థకు మేలు చేసే పథకంగా మార్చేసినట్లు తేటతెల్లమవుతోంది. నిధులు హెరిటేజ్ ఖాతాలోకే... హెరిటేజ్ కంపెనీ నుంచి పెరుగును కొనుగోలు చేసి, చలివేంద్రాలకు సరఫరా చేయాలని జిల్లా అధికారులకు ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలు అందాయి. దీంతో ప్రభుత్వ చలివేంద్రాల్లో హెరిటేజ్ కంపెనీ పెరుగుతో చేసిన మజ్జిగనే వినియోగించాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ నుంచి పెరుగును కొనుగోలు చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎమ్.ఎమ్.నాయక్ పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి, రామభద్రపురం, సాలూరు, దత్తిరాజేరు, గజపతినగరం, గరివిడి, చీపురుపల్లి తహసీల్దార్లకు లేఖలు రాశారు. ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరీ ఇంత బరితెగింపా? అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సహకార డెయిరీల్లో పెరుగు తక్కువ ధరకే లభిస్తున్నా.. హెరిటేజ్ నుంచి అధిక ధరకు కొనుగోలు చేయడం విశేషం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సహకార డెయిరీలకు ఊతమివ్వాల్సింది పోయి ముఖ్యమంత్రి తన సొంత కంపెనీకే కాంట్రాక్టులను కట్టబెడుతుండడం పట్ల తీవ్రస్థాయిలో ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చలివేంద్రాలకు ప్రభుత్వం కేటాయించిన రూ.39 కోట్లలో సింహభాగం నిధులు హెరిటేజ్ సంస్థ ఖాతాలోకే వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పంపిణీ చేసిన చంద్రన్న సంక్రాంతి కానుకలోనూ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ నుంచి నెయ్యి కొనుగోలు చేశారు. ఈ నెయ్యి నాసిరకంగా ఉన్నట్లు లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చంద్రన్న సంక్రాంతి కానుకలో రూ.500 కోట్ల మేర అవినీతి జరిగినట్లు జాతీయస్థాయిలో చర్చ జరిగింది. చలివేంద్రాల్లోనూ చేతివాటమేనా! మండే ఎండల్లో బాటసారుల గొంతు తడపాల్సిన చలివేంద్రాలు అధికార పార్టీ నేతల జేబులు నింపుతున్నాయి. ప్రతీ జిల్లాలో దాదాపు 3 వేల చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. రూ.కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన చలివేంద్రాలను మొక్కుబడిగానే నిర్వహిస్తున్నారు. వాటిలో మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్ల జాడే కనిపించడం లేదు. ప్రభుత్వ నిధులు భారీగా దారి మళ్లుతున్నట్లు క్షేత్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. పల్లెల్లో తాటాకు పాకలు వేసి రెండు కుండలు పెట్టి, ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ నేతల ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేస్తున్న చలివేంద్రాలను తామే ఏర్పాటు చేస్తున్నట్టు టీడీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. చాలాప్రాంతా ల్లో ప్రచార ఆర్భాటమే తప్ప నీళ్లు పోసే దిక్కులేదు. బాటసారులే నీళ్లు పోసుకుని తాగి వెళ్లాల్సి వస్తోంది. చలివేంద్రాల ముసుగులో సర్కారు సొమ్మును తెలుగు తమ్ముళ్లు యథేచ్ఛగా లూటీ చేస్తున్నా.. ఇదేమిటని అడిగే దిక్కు లేకపోవడం గమనార్హం. -
పెరిగిన హెరిటేజ్ ఫుడ్స్ లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెరిటేజ్ ఫుడ్స్ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసిక నికర లాభంలో 120 శాతం వృద్ధి నమోదుచేసింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి రూ. 5 కోట్లుగా ఉన్న నికర లాభం ఇప్పుడు రూ. 11 కోట్లు దాటింది. ఇదే సమయంలో ఆదాయం రూ. 511 కోట్ల నుంచి రూ. 582 కోట్లకు పెరిగింది. ఇక వ్యాపారాల వారీగా చూస్తే డెయిరీ వ్యాపార లాభాలు రూ. 15 కోట్ల నుంచి 25 కోట్లకు పెరిగితే, రిటైల్ వ్యాపారంలో నష్టాలు రూ. 3.7 కోట్ల నుంచి రూ. 4.42 కోట్లకు పెరిగాయి. బేకరీ వ్యాపారం ఇంకా నష్టాల్లోనే ఉండగా, రెన్యువబుల్ ఎనర్జీ లాభాలు పెరిగాయి. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో హెరిటేజ్ ఫుడ్ షేరు రూ. 490 వద్ద స్థిరంగా ముగిసింది. వీఎస్టీ లాభం రూ. 41 కోట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో వీఎస్టీ ఇండస్ట్రీస్ రూ. 217 కోట్ల ఆదాయంపై రూ. 41 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 198 కోట్ల ఆదాయంపై రూ. 30 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. హిందుస్తాన్ జింక్ లాభం 24 శాతం డౌన్ న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో 24 శాతం క్షీణించింది. గత క్యూ3లో రూ.2,379 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.1,811 కోట్లకు తగ్గిందని హిందుస్తాన్ జింక్ పేర్కొంది. వ్యయాలు అధికంగా ఉండడం, ధరలు అంతంతమాత్రంగానే ఉండడం దీనికి కారణాలని కంపెనీ చైర్మన్ అగ్నివేశ్ అగర్వాల్ చెప్పారు. మొత్తం ఆదాయం రూ.3,853 కోట్ల నుంచి 11 శాతం క్షీణించి రూ.3,431 కోట్లకు తగ్గిందని పేర్కొన్నారు. మొత్తం వ్యయాలు రూ.1,973 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.2,124 కోట్లకు పెరిగాయని వివరించారు. -
3 రెట్లు పెరిగిన హెరిటేజ్ నికరలాభం
* క్యూ2లో రూ.5 కోట్ల నుంచి 15 కోట్లకు చేరిన లాభం * ఒక్క డెయిరీ విభాగంలోనే లాభం 14 కోట్ల నుంచి 34 కోట్లకు * అనూహ్య ఫలితాలతో ఒక్కరోజే 13 శాతం పెరిగిన షేరు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గడిచిన మూడు త్రైమాసికాలూ వరుసగా హెరిటేజ్ ఫుడ్స్ లాభాలు భారీగా పెరుగుతూనే వస్తున్నాయి. 2014వ సంవత్సరం సెప్టెం బర్తో ముగిసిన త్రైమాసికానికి రూ.512 కోట్ల ఆదాయంపై రూ.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన కంపెనీ... ఈ ఏడాది అదే కాలంలో రూ.586 కోట్ల ఆదాయంపై ఏకంగా రూ.15 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంటే రెండో త్రైమాసికంలో కంపెనీ నికరలాభం ఏకంగా 200 శాతం పెరిగినట్లు లెక్క. గడిచిన ఆరు నెలల్లో పాల మార్కెట్లో పోటీ విపరీతంగా పెరిగింది. కర్ణాటక కు చెందిన నందిని, గుజరాత్‌కు చెందిన అమూల్ బ్రాండ్లు కూడా ప్రవేశించటంతో పాల ధరలు కూడా తగ్గాయి. పోటీ కారణంగా హెరిటేజ్ ఫుడ్స్ కూడా తన పాల ధరలు తగ్గించినా... లాభాలు మాత్రం గణనీయంగా పెరగటం విశేషమే. 2015 జులై-సెప్టెంబరు త్రైమాసికంలో ఒక్క డెయిరీ విభాగాన్నే తీసుకుంటే... లాభాలు (పన్నులు, వడ్డీలు చెల్లించక ముందు) రూ.14 కోట్ల నుంచి రూ. 34 కోట్లకు పెరగడం మార్కెట్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేసింది. డెయిరీ ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ. 383 కోట్ల నుంచి రూ. 442 కోట్లకు పెరిగింది. ఈ త్రైమాసికంలో రిటైల్ విభాగం నష్టాలు రూ.6 కోట్లకు పెరిగితే... అగ్రి, బేకరి విభాగాల్లో కోటి రూపాయల వరకు నష్టాలు వచ్చాయి. అనూహ్యమైన ఫలితాలను ప్రకటించడంతో సోమవారం హెరిటేజ్ ఫుడ్స్ షేరు ఏకంగా 13 % పెరిగి రూ.456 వద్ద ముగిసింది. -
పవర్‌తోనే పరుగు
- హెరిటేజ్ ఫుడ్స్‌ది కూడా చంద్రబాబు తీరే - బాబుకు అధికారం ఉన్నపుడే కంపెనీకి లాభాలు - అధికార పార్టీకి బాబు కొమ్ముకాసినా పర్వాలేదు - ‘పవర్’ కట్ అయినప్పటి నుంచీ నష్టాల బాట - మిగతా డెయిరీల్లో ఎక్కడా లేని ‘ట్రెండ్’ దీని సొంతం - 1994లో లిస్టయినప్పటి నుంచీ ఇదే ‘పనితీరు’ అయితే అధికారం చేతిలో ఉండాలి! లేకుంటే అధికారం ఉన్నవారితో చేతులు కలపాలి!!. ఇదీ... తె లుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి ఫిలాసఫీ. ఆ రెండూ లేకుంటే ఆయన లేరు. అచ్చం చంద్రబాబు ఫిలాసఫీయే ఆయన వ్యవస్థాపకుడిగా ఏర్పాటు చేసి, తన కుటుంబానికి అప్పజెప్పిన హెరిటేజ్ ఫుడ్స్‌ది కూడా. ఎందుకంటే హెరిటేజ్ ఫుడ్స్ కాస్త బాగుండాలంటే చంద్ర బాబుకు అధికారం ఉండాలి. ఆ కంపెనీకి కాస్త మంచి లాభాలు రావాలంటే చంద్రబాబునాయుడి పార్టీ అధికారంలో ఉండాలి. లేకపోతే అధికారంలో ఉన్న పార్టీతో చంద్రబాబు చేతులు కలిపైనా ఉండాలి. ఈ రెండూ లేకుంటే మాత్రం... హెరిటేజ్‌కు లాభాలు రావు. నిజంగా ఒక కంపెనీకి లాభాలు రావాలంటే అధికారంతో ఏం సంబంధం? డెయిరీ రంగంలో ఉన్న హెరిటేజ్‌కు అధికారం ఉన్నపుడే లాభాలు ఎందుకొస్తున్నాయి? పోనీ.. ఈ రంగంలో ఉన్న మిగతా కంపెనీలు కూడా ఇలాగే పనిచేస్తున్నాయా? మరి ఇతర కంపెనీలు వేటికీ లేని పరిస్థితులు హెరిటేజ్‌కే ఎందుకున్నాయి? ఒకసారి చూద్దాం... చంద్రబాబు నాయుడు వ్యవస్థాపకుడిగా హెరిటేజ్ ఫుడ్స్‌ను ఏర్పాటు చేసింది 1992లో. నిజానికి అప్పటికి ఆయనేమీ రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి కాదు. అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేయటంతో పాటు... తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం 1994లో అధికారంలోకి వచ్చీ రావటంతోనే చంద్రబాబు తన కంపెనీ పబ్లిక్ ఇష్యూకు తెర తీశారు. అప్పటికది చాలా చిన్న కంపెనీ. పబ్లిక్ ఇష్యూ ద్వారా దాదాపు రూ.10 కోట్లు సమీకరించారు. ఇక అప్పటి నుంచి తన కంపెనీకి పన్ను రాయితీలివ్వటం, సహకార రంగంలో పోటీగా ఉన్న చిత్తూరు డెయిరీ వంటి డెయిరీలను బొందపెట్టడం ప్రారంభించారు. మరోవంక వాటి స్థానంలో హెరి టేజ్ను విస్తరిస్తూ వచ్చారు. ఫలితం... 2000లో రూ.6 కోట్లుగా ఉన్న కంపెనీ లాభం 2004-05లో అధికారం పోయే సమయానికి ఏకంగా రూ.17 కోట్లకు చేరుకుంది. అధికారంతో పాటు లాభాలూ... చిత్రమేంటంటే చంద్రబాబుకు 2004లో అధికారం పోయింది. హెరిటేజ్ ఫుడ్స్‌కూ పవర్ పోయినట్లుంది. అప్పటి నుంచి క్రమంగా లాభాలు తగ్గటం మొదల య్యాయి. 2005లో రూ.10 కోట్లకు తగ్గిన లాభాలు... 2007లో రూ.1.7 కోట్లకు మాత్రమే పరిమితమయింది. ఇంకా చిత్రమేంటంటే ఆ తరవాత నుంచి కంపెనీ నష్టాల్లోకి పడిపోయింది. 2009లో రూ.794 కోట్లపై ఏకంగా రూ.35 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసిన ఈ కంపెనీ... 2012-13 వరకూ అంతంతమాత్రపు ఫలితాలనే ప్రకటించింది. 2012-13లో కూడా రూ.1,393 కోట్ల అమ్మకాలపై రూ.9.3 కోట్ల లాభాన్ని మాత్రమే ఆర్జించగలిగింది. అయితే 2013 నుంచీ మళ్లీ కంపెనీ దశ తిరిగిపోయింది. ఎందుకంటే అప్పట్లో చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్రంలోని కిరణ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ము కాశారు. ఎమ్మెల్యేలు బయటికి వెళ్లిపోయి మైనారిటీలో పడిన ఆ ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం కూడా పెట్టకుండా కాపాడుతూ వచ్చారు. చాలా వ్యవహారాల్లో చంద్రబాబు అనుకున్నట్టే జరిగిందని వార్తలూ అప్పట్లో వెలువడ్డాయి. వీటన్నిటి ఫలితమో ఏమోగానీ 2013- 14 నుంచి హెరిటేజ్ ఫుడ్స్ దశ తిరిగింది. ఆ సంవత్సరంలో రూ.1,650 కోట్ల అమ్మకాలపై రూ.49 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసిన కంపెనీ... ఈ సంవత్సరం చంద్రబాబు అధికారంలో ఉండటంతో గతేడాది ఫలితాలనే దాదాపు రిపీట్ చేసింది. 2014-15లోనూ రూ.45 కోట్ల లాభాన్ని ప్రకటించింది. మిగతా కంపెనీల మాటేంటి? డెయిరీ పరిశ్రమలో సహకార రంగంలోని కంపెనీలే ఆధిపత్యం వహిస్తున్నాయి. గుజరాత్‌కు చెందిన అమూల్, కర్ణాటకకు చెందిన నందిని బ్రాండ్ల వాటా చాలా అధికం. ఇక మిగతా రాష్ట్రాల్లోనూ డెయిరీ సమాఖ్యలే అగ్రస్థానంలో ఉన్నాయి. రైతులే వాటాదార్లు కనక ఇవేవీ లిస్టెడ్ కంపెనీలు కావు. పెపైచ్చు వీటి లాభాల మార్జిన్లూ తక్కువే. అందుకే ప్రైవేటు రంగంలోని లిస్టెడ్ డెయిరీలతో హెరిటేజ్‌ను పోలిస్తే దాదాపు ఇంతే పరిమాణంలో ఉన్న హట్సన్ డెయిరీ, చిన్న కంపెనీగా ఆరంభమై ఎదిగిన క్వాలిటీ డెయిరీ గురించి చెప్పుకోవాలి. వీటికీ పరిమిత లాభాలు... ఒకోసారి నష్టాలూ వచ్చినా... అవేవీ అధికారాన్ని అనుసరించి లేవు. 2000వ సంవత్సరం నుంచి చూస్తే వరసగా నాలుగేళ్లు నష్టాలు ప్రకటించిన క్వాలిటీ డెయిరీ... ఆ తరవాత నుంచి లాభాలను నమోదు చేస్తూ వస్తోంది. ఈ లాభాలు కూడా 2004-05లో రూ.2 కోట్ల నుంచి మొదలై 2014కు వచ్చేసరికి ఏకంగా రూ.126 కోట్లకు చేరాయి. సంస్థ అమ్మకాలు కూడా ఏటికేడాది పెరుగుతూనే వచ్చాయి. ఇక హెరిటేజ్ ఫుడ్స్‌లా పాల వ్యాపారంపైనే ప్రధానంగా దృష్టిపెట్టిన హట్సన్ డెయిరీ పరిస్థితి కూడా ఇలాంటిదే. 2000 నుంచి 2003 వరకూ రూ.2 కోట్లలోపే నికరలాభం ప్రకటించిన ఈ కంపెనీ... తరవాత మెల్లగా అమ్మకాలతోపాటు లాభాలూ పెంచుకుంటూ వచ్చింది. విస్తరణపై దృష్టిపెట్టడంతో ఖర్చులు ఎక్కువై లాభాలు ఒకో ఏడాది పెరగటం, ఒకో ఏడాది తగ్గటం వంటివి జరిగినా అవేవీ అధికారంతో సంబంధం ఉన్నట్టుగా కనిపించవు. ఎందుకంటే వరుసగా ఐదారేళ్లు తగ్గటం, మరో ఐదేళ్లు పెరగటం వంటివి జరగలేదు. కాకపోతే 2010 నుంచీ సంస్థ చక్కని వృద్ధిని ప్రకటిస్తూ 2014-15లో ఏకంగా రూ.81 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. మరి హెరిటేజ్ ఫుడ్స్ ఒక్క విషయంలోనే అధికారంతో ముడిపడిన లాభాలున్నా యనేది... చంద్రబాబుకే ఎరుక!! డెయిరీ విశేషాలు.. కేవలం పాల ఉత్పత్తుల వ్యాపారం చేసే సంస్థల్లో సహకార రంగంలోని గుజరాత్ సహకార సమాఖ్య (అమూల్) పెద్దది. దీని టర్నోవర్ రూ.20,000 కోట్లు 2014-15లో హెరిటేజ్ ఫుడ్స్ వార్షిక టర్నోవర్ రూ.2,072 కోట్లుకాగా, ఇందులో డెయిరీ వ్యాపారం ద్వారా రూ.1555 కోట్ల టర్నోవర్ సమకూరింది. మిగిలింది రిటైల్, అగ్రి ఫుడ్స్, బేకరీ, విద్యుత్ వ్యాపా రాల ద్వారా వచ్చింది. హెరిటేజ్ ఫుడ్స్ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.903 కోట్లు. ఇది కంపెనీ టర్నోవర్‌తో పోలిస్తే సగానికన్నా తక్కువ. లిస్టెడ్ డెయిరీ కంపెనీల్లో నెస్లే, బ్రిటానియా వంటి బహుళజాతి సంస్థలతో పాటు దేశీ కంపెనీలు వడిలాల్, క్వాలిటీ, హట్సన్ ఉన్నాయి. వీటిలో క్వాలిటీ మార్కెట్ క్యాప్ రూ.1,583 కోట్లు వుంది. హట్సన్ మార్కెట్ విలువ మాత్రం రూ.4,320 కోట్లు. రెండెకరాల కథ చెప్పరేం? చంద్రబాబు ఎప్పుడు ఆస్తుల లెక్క చెప్పినా... 1988లో తమ కుటుంబానికి 77 ఎకరాలుండేదని, దాన్ని కుటుంబీకులంతా పంచుకున్నామని చెబుతారు. కానీ బాబు తొలిసారి ఎమ్మెల్యే అయింది 1978లో. మంత్రి అయిందీ అప్పుడే! అప్పటికి ఆయన తండ్రి ఖర్జూర నాయుడికి నారా వారి పల్లెలో ఉన్న ఆస్తి అరెకరం. తల్లి అమ్మణ్ణమ్మ పసుపు కుంకుమగా తెచ్చుకున్న భూమి రెండెకరాలు. మొత్తం రెండున్నర ఎకరాలు. కానీ 1988లో కర్షక పరిషత్‌కు బాబు నియామకాన్ని సవాలు చేస్తూ రైతు నేత పెద్దిరెడ్డి చెంగల్‌రెడ్డి పిటిషన్ వేశారు. దానికి జవాబుగా బాబు అఫిడవిట్ వేస్తూ... ‘‘నేను రైతు కుటుంబం నుంచి వచ్చా. మా కుటుంబానికి 77 ఎకరాల భూమి ఉంది. 1986 నాటికి వ్యవసాయం ద్వారా మా కుటుంబానికి రూ.2.25 లక్షల ఆదాయం వచ్చింది. 1986లో మేం విడిపోయాక నేను కూలీల్ని పెట్టి సాగు చేశా. ఏటా రూ.36,000 ఆర్జించా’’ అని చెప్పారు. ఎమ్మెల్యే, మంత్రి పదవులు చేపట్టడం తప్ప బాబుకు ఇతర వ్యాపారాలేవీ లేవు. అలాంటిది 1992-93 నాటికి హెరిటేజ్ ఫుడ్స్‌ను ఏర్పాటు చేసే స్థాయికి చేరారు. 1999లో తన ఆస్తుల్ని స్పీకరుకు ప్రకటిస్తూ... తనకు రూ.7.79 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించారు. అప్పట్లో హెరిటేజ్ ఫుడ్స్ భారీ నష్టాలు నమోదు చేసినా బాబు ఆస్తి అంతలా ఎలా పెరిగింది? 2004 నాటికి 20 కోట్లకు... 2009 నాటికి ఏకంగా 60 కోట్లకు తన ఆస్తులు చేరినట్లు బాబు ఎన్నికల అఫిడవిట్లలో చెప్పారు. అది కూడా ఆయన కొన్న విలువల ప్రకారం. మార్కెట్ విలువ చూస్తే 30 రెట్లు ఎక్కువే. మరి ఏడాదికి రూ.36,000 ఆర్జించిన బాబు అంత డబ్బెలా సంపా దించారు? ఆరంభం నుంచే ఇన్వెస్టర్లకు టోపీ.. హెరిటేజ్ ఫుడ్స్ ఆరంభం కూడా దాని వ్యవస్థాపక అధిపతి చంద్రబాబు నాయుడి అబద్ధాలతోనే జరిగింది. 1994లో దీన్ని పబ్లిక్ ఇష్యూకు తెస్తూ... ఆయన సెబీ ఎదుట ప్రాస్పెక్టస్ దాఖలు చేశారు. దాన్లో... తాను అప్పటి దాకా ఏ వ్యాపారం చేయలేదని, హెరిటేజ్ తప్ప మరో వ్యాపారం లేదని చెప్పారు. కానీ 1983లోనే ఆయన ‘భువనేశ్వరి కార్బయిడ్స్ అండ్ అల్లాయ్స్, భువనేశ్వరి కార్బయిడ్స్ అండ్ కెమికల్స్’ అనే రెండు సంస్థల్ని ఏర్పాటు చేశారు. నిర్వహణ సరిగా లేక అవి పూర్తి వ్యాపార కార్యకలాపాలు ఆరంభించకముందే మూతపడ్డాయి. వాటిపేరిట రుణాలు తీసుకుని... చెల్లించకుండా ఎగ్గొట్టారు కూడా. ఇవన్నీ దాచి ప్రాస్పెక్టస్ దాఖలు చేయటమంటే ఇన్వెస్టర్లను ఒక రకంగా మోసం చేయటమే. ఒకవేళ ఆరోజే నిజాలు చెప్పి ఉంటే ఈ చరిత్ర చూసి ఇన్వెస్టర్లు ఎందుకు ముందుకొచ్చి ఉండేవారనేది సందేహమే!!. హెరిటేజ్‌కు దోచిపెట్టడం షురూ.. 1992లో చిత్తూరు జిల్లా చంద్రగిరిలో పాలపొడి తయారు చేసే కంపెనీగా హెరిటేజ్ కథ మొదలైంది. అంతలోనే చంద్రబాబు రెవెన్యూ మంత్రి కావటంతో దీని దశ తిరిగింది. ఆ జిల్లాలో పలు డెయిరీలు మూత పడగా... హెరిటేజ్ మాత్రం బలపడింది. నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి, విశాఖ జిల్లా బయ్యవరంలో పాల శీతలీకరణ కేంద్రాల్ని ఏర్పాటు చేశాక... 2009-10 నాటికి దీని టర్నోవర్ రూ.900 కోట్లకు చేరింది. 1995లో బాబు సీఎం అవుతూనే ట్యాక్స్ డిఫర్మెంట్ స్కీమ్ అమల్లోకి తెచ్చారు. 21.11.1995న నార్కెట్‌పల్లిలోని హెరిటేజ్ చిల్లింగ్ ప్లాంట్‌కు పన్ను మినహాయింపు వర్తింపజేస్తూ ఉత్తర్వులిచ్చారు. 1996 మేలో విశాఖ బయ్యవరం ప్లాంటుకు, 1997 మార్చిలో చిత్తూరు జిల్లా కాశిపెంట్ల ప్లాంటుకు అమ్మకం పన్ను రాయితీ కోసం దరఖాస్తు చేయగా... నె ల్లోనే ఓకే అనేశారు. ఈ మూడింటికీ కలిగిన లబ్ధి రూ.15 కోట్లు. 14 ఏళ్ల వ్యవధిలో రూ.15 కోట్లు మినహాయిం చుకోవటానికి అనుమతి పొందిన బాబు... ఆ సొమ్మును అతివేగంగా రాబట్టుకోవటానికి తాజా పాలపై ఉన్న 6 శాతం పన్నును 1995 ఏప్రిల్ 1న 10 శాతానికి పెంచారు. 2000 జనవరి 1న దీన్ని 12 శాతానికి పెంచారు. అంత పెంచాల్సిన అవసరం లేదని, తమ చేతికి రావాల్సిన రూ.15 కోట్లూ వచ్చేశాయని హెరిటేజ్ ెఅధికారులు సెలవిచ్చారో ఏమో కానీ... నెల తిరిగేసరికల్లా... అంటే 2000వ సంవత్సరం జనవరి 31న సీఎం హోదాలో పాలమీద మొత్తం పన్నునే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అమ్మకం పన్నుకు బాబు 14 ఏళ్లు గడువు తీసుకున్నా 1999వ మార్చికల్లా రూ.15 కోట్లు చేతికి వచ్చేశాయి. అందుకే పాలపై పన్నును 2000లో రద్దు చేసేశారు. ఈ 15 కోట్లను వ్యాపార విస్తరణకు వెచ్చించకుండా హెరిటేజ్ కేవలం బ్యాంకులోనే డిపాజిట్ చేసినా... అప్పటి వడ్డీ 18 శాతంతో 14 సంవత్సరాలకు ఇది ఏకంగా రూ.152 కోట్లకు చేరేది. నెలకు రూపాయి వడ్డీ చొప్పున వార్షిక వడ్డీ రేటు 12 శాతాన్ని పరిగణన లోకి తీసుకున్నా దాని విలువ 14 ఏళ్ల తరవాత రూ.73 కోట్లు. - ఈ మొత్తాన్ని వెంటనే చెల్లించ కుండా మరో 14 ఏళ్ల పాటు వాయిదాల్లో చెల్లిస్తారు కనక మొత్తం వడ్డీ రూ.200 కోట్లకు పైమాటే. అదీ... బాబు మాస్టర్ ప్లాన్ ఫలితంగా హెరిటేజ్‌కు కలిగిన లబ్ధి. -
పాల ధరలు తగ్గించినా హెరిటేజ్ లాభం పెరిగింది!
♦ క్యూ2లో రూ. 26 కోట్ల నికర లాభం ♦ విదేశీ విస్తరణపై కంపెనీ దృష్టి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : తొలి త్రైమాసిక ఫలితాల్లో హెరిటేజ్ ఫుడ్స్ ఆశ్చర్యకరమైన ఫలితాలను ప్రకటించింది. గత త్రైమాసికంలో పాల ధరలు గణనీయంగా తగ్గడంతో లాభాలు తగ్గుతాయన్న మార్కెట్ వర్గాల అంచనాలను తల్లకిందులు చేస్తూ డెయిరీ వ్యాపార నికర లాభంలో 13 శాతం వృద్ధిని నమోదు చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సర చివరి త్రైమాసికంలో రూ. 23 కోట్లుగా (డెయిరీ విభాగం) ఉన్న నికర లాభం ఇప్పుడు రూ. 26 కోట్లకు చేరింది. ఇదే సమయంలో డెయిరీ అమ్మకాలు రూ. 404 కోట్ల నుంచి రూ. 437 కోట్లకు చేరుకున్నాయి. ఒక పక్క పాల సేకరణ వ్యయం తగ్గకుండా రిటైల్ మార్కెట్లో ధరలు తగ్గించినా సంస్థకు లాభాలు మాత్రం పెరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. హెరిటేజ్ సంస్థ ఇతర కంపెనీల పోటీకి తలొగ్గి గత మూడు నెలల కాలంలో పాల విక్రయ ధరను లీటరుకు దాదాపు 15 శాతం తగ్గించింది. దీంతో ఇదే కాలంలో పాలసేకరణతో సహా ఇతర ముడి పదార్థాల వ్యయం(కన్సాలిడేటెడ్) రూ.343 కోట్ల నుంచి రూ. 350 కోట్లకు పెరిగింది. ఒకవైపు వ్యయం పెరిగి, మరోవైపు ధర తగ్గించినా లాభం మాత్రం పెరగటం విశేషమే. అన్ని వ్యాపారాలు తీసుకుంటే తొలి త్రైమాసికంలో రూ. 578 కోట్ల ఆదాయంపై సంస్థ రూ.11 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. గడిచిన ఏడాది నాల్గవ త్రైమాసికంలో రూ.544 కోట్ల ఆదాయంపై రూ. 13 కోట్ల నికరలాభం రావటం గమనార్హం. గతేడాది ఇదే కాలానికి రూ. 5 కోట్లుగా ఉన్న నికరలాభం ఇప్పుడు రూ. 5 కోట్లకు చేరగా, ఆదాయం రూ. 506 కోట్ల నుంచి రూ. 578 కోట్లకు చేరింది. విదేశీ మార్కెట్‌పై దృష్టి: విదేశీ మార్కెట్లో అవకాశాల కోసం యూరోప్‌నకు చెందిన ఒక అతిపెద్ద డెయిరీ ప్రోడక్టుల కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇండియాతో పాటు విదేశాల్లో డెయిరీ ఉత్పత్తుల అమ్మకానికి సంబంధించి ఒక భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు చేయడానికి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్‌ను నియమించింది. -
జనవరి-మార్చి క్వార్టర్ ఫలితాలు...
హెరిటేజ్ లాభం జూమ్ హెరిటేజ్ ఫుడ్స్ మార్చి క్వార్టర్లో రూ. 544 కోట్ల ఆదాయంపై రూ.13 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముం దు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 438 కోట్ల ఆదాయంపై రూ.7 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2014-15 ఆర్థిక ఏడాది మొత్తానికి రూ. 2,072 కోట్ల ఆదాయంపై రూ. 28 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. షేరుకు రూ.3 డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ప్రతిపాదించింది. జెన్ టెక్నాలజీస్ లాభం 16 కోట్లు జెన్ టెక్నాలజీస్ రూ. 78 కోట్ల ఆదాయంపై రూ. 16 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి రూ. 46 కోట్ల ఆదాయంపై రూ. 9 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కాగా కంపెనీ రూపాయి ముఖ విలువ కలిగిన షేరుకు 35 పైసల డివిడెండ్‌ను కంపెనీ ప్రతిపాదించింది. టాటా మోటార్స్‌కు ‘ఫారెక్స్’ బ్రేక్‌లు టాటా మోటార్స్ నికర లాభం 56 శాతం తగ్గింది. విదేశీ మారక ద్రవ్య నష్టాలు భారీగా ఉండడంసహా పలు అంశాలు దీనికి కారణం. 2013-14 మార్చి క్వార్టర్‌కు రూ.3,918 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్) 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.1,717 కోట్లకు తగ్గింది. నికర అమ్మకాలు 4 శాతం వృద్ధితో రూ.67,300 కోట్లకు పెరిగాయని పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.13,991 కోట్ల నుంచి రూ.13,986 కోట్లకు తగ్గింది. ఈ ఏడాదికి సంస్థ డివిడెంట్ ప్రకటించలేదు. ఐఎఫ్సీఐ ఆదాయం అప్.. గత ఆర్థిక ఏడాదితో పోలిస్తే ఐఎఫ్సీఐ 2014-15వార్షిక ఆదాయంలో 13.48 శాతం వృద్ధి నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఆదాయం రూ.2,953 కోట్ల నుంచి రూ.3,348 కోట్లకు చేరింది. ఇటీవల కంపెనీలో ప్రభుత్వ వాటా పెరగడంతో ఐఎఫ్సీఐ ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందింది. వృద్ధి బాటలో లైకోస్... ఇంటర్నెట్ సేవలను అందించే లైకోస్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మార్చితో ముగిసిన ఆర్థిక ఏడాదిలో రూ. 342 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఇదే కాలానికి కంపెనీ రూ.351 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. సమీక్షా కాలంలో ఆదాయం రూ. 1,673 కోట్ల నుంచి రూ. 1,957 కోట్లకు చేరింది. నాల్గవ త్రైమాసికంలో రూ. 444 కోట్ల ఆదాయంపై రూ. 98 కోట్ల లాభాన్ని ఆర్జించింది. -
ఆంధ్రప్రదేశ్ ఆస్తులు కనబడితే చాలు ..
చెన్నై : శేషాచల అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై తమిళులు రగిలిపోతున్నారు. తమిళ రాష్ట్రంలో... ఆంధ్రప్రదేశ్ ఆస్తులు కనబడితే చాలు బూడిద చేసేందుకు ఆందోళనకారులు సిద్దపడుతున్నారు. నిన్న హెరిటేజ్ ఫుడ్స్‌పై దాడి చేసిన తమిళ తంబీలు...శుక్రవారం చెన్నైలో ఆంధ్రాబ్యాంకుపై దాడి చేశారు. బ్యాంకులోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మరోవైపు పాండిచ్చేరీలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సును దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. బస్సులోని సీట్లకు నిప్పంటించారు. అయితే బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సును మంటల నుంచి రక్షించారు. తుత్తుకుడిలో ఆంధ్రాబ్యాంక్పై నిన్న దుండగులు బాంబు విసిరిన విషయం తెలిసిందే. అయితే అప్పటికి బ్యాంక్ తెరవకపోవటంతో ప్రమాదం తప్పింది. -
హెరిటేజ్‌పై తమిళ సంఘాల దాడి
-
హెరిటేజ్‌పై తమిళ సంఘాల దాడి
చెన్నై: చిత్తూరు జిల్లా శేషాచలం ఎన్కౌంటర్లో తమిళనాడుకు చెందిన 20 మంది ఎర్రచందనం స్మగ్లర్ల మృతిపై తమిళనాడు వాసులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏపీ సీఎం చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థపై తమిళ సంఘాలు గురువారం దాడి చేశాయి. మహిళాపూర్ శివారు ప్రాంతంలో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. హెరిటేజ్ వస్తువులు ఎవరు కొనుగోలు చేయవద్దంటూ నినాదాలు చేశారు. మృతదేహాలకు మరోసారి పోస్ట్‌మార్టం నిర్వహించాలని మృతుల కుటుంబీకులు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసర విచారణ చేయాలని హైకోర్టు న్యాయమూర్తిని కోరారు. అందుకు సమ్మతించిన న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. అయితే ఎర్రచందనం స్మగ్లర్ల మృతితో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పే అవకాశాలు ఉండటంతో తమిళనాడు డీజీపీ అన్ని జిల్లాల ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. -
రైతుకు ప్రోత్సాహకంతో విజయ డెయిరీ జోష్
* 40వేల లీటర్ల పాలు అదనంగా సేకరణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతుకు ప్రోత్సాహకంగా లీటరుకు రూ. 4 పెంచడంతో విజయ డెయిరీ పాల సేకరణ గణనీయంగా పెరిగింది. అధికారుల అంచనా ప్రకారం మొదటి వారంలోనే ఏకంగా 40వేల లీటర్ల అదనపు సేకరణ జరుగుతోందని సమాచారం. ప్రైవేటు డెయిరీలు మార్కెట్‌ను ముంచెత్తుతోన్న నేపథ్యంలో ఈ పరిణామం విజయ డెయిరీకి ఊరట కలిగించే అంశం. ప్రస్తుతం విజయ డెయిరీ రాష్ట్రంలో లక్షన్నర లీటర్ల పాలను సేకరిస్తోంది. కర్ణాటక నుంచి మరో లక్ష లీటర్లు సేకరిస్తోంది. ప్రోత్సాహకం ప్రకటించిన తర్వాత రైతుల నుంచి వచ్చిన సహకారంతో వారంలోనే అదనంగా 40 వేల లీటర్లు పెరిగిం దని విజయ డెయిరీ అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ఇప్పటివరకు విజయ డెయిరీ రైతుకు లీటరుకు రూ. 53 చెల్లించేది. ప్రభుత్వ ప్రోత్సాహకంతో అది రూ.57కు చేరుకుంది. హెరిటేజ్ పాలను కేరళ ప్రభుత్వం నిషేధించడంతో విజయ పాలపై వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారని ఆ అధికారి చెప్పారు. రానున్న రోజుల్లో మరో 3 లక్షల లీటర్ల సేకరణ లక్ష్యంగా ప్రణాళిక రచించినట్లు తెలిపారు. -
పాడికి తోడేదీ?
-
పాడికి తోడేదీ?
* ఆంధ్రప్రదేశ్‌లో డెయిరీ పరిశ్రమను దెబ్బతీస్తున్న అధికార పార్టీ * ప్రభుత్వ డెయిరీలకు ప్రోత్సాహకాలివ్వకుండా ఎగనామం.. సొంత డెయిరీలపైనే దృష్టి * తెలంగాణ, కర్ణాటకల్లో ప్రభుత్వ దన్ను * రూ. 4 ప్రోత్సాహం ప్రకటించిన తెలంగాణ * రాష్ట్ర రైతులను పట్టించుకోని ఏపీ సర్కారు సాక్షి, హైదరాబాద్: అదే తీరు. నాడూ... నేడూ... ఏపీలోని తెలుగుదేశం ప్రభుత్వానిది అదే వైఖరి. తమ చేతిలోని ప్రైవేటు సంస్థల కోసం ప్రభుత్వ సంస్థల్ని బొందపెట్టడం. అయితే వాటికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవటం... లేదంటే తమ సంస్థలకు అనుకూలంగా వ్యవహరించటం. చక్కెర కర్మాగారాల్ని పప్పుబెల్లాల్లా అమ్మేసినా... నూలు మిల్లుల్ని రియల్టీ భూముల కోసం నలిపేసినా... డెయిరీల్ని దారుణంగా చిదిమేసినా... అన్నిటా అదే మార్కు. ఇన్నాళ్ల తరవాత మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కారు మళ్లీ ఇపుడు అదే మార్కును కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తోంది. మెల్లగా ప్రభుత్వ డెయిరీ పరిశ్రమను చిదిమేసేలా వ్యవహరిస్తోంది. కావాలంటే మీరే చూడండి... రాష్ట్రంలో 50 లక్షల మందికి జీవనాధారంగా ఉన్న పాడి పరిశ్రమకు ప్రోత్సాహమే లేదు. వ్యవసాయం తరవాత ఎక్కువ మందికి ఉపాధినిస్తున్న రంగంగా పాడి పరిశ్రమకున్న ప్రాధాన్యం దృష్ట్యా పక్కనున్న తెలంగాణ రాష్ట్రం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా... తమ చేతిలోని ప్రైవేటు సంస్థల కోసం టీడీపీ ప్రభుత్వం మాత్రం సాచివేత ధోరణినే కొనసాగిస్తోంది. ప్రభుత్వ డెయిరీలకు పాలు విక్రయిస్తున్న రైతులకు ప్రోత్సాహకంగా లీటరుకు రూ.4 ఇస్తామని చెబుతూ... పాల సేకరణ ధరను లీటరుకు రూ.4 మేర పెంచుతూ ఇటీవలే తెలంగాణ సర్కారు జీవో కూడా జారీ చేసింది. తెలంగాణ కన్నా దాదాపు 5 రెట్ల మంది ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా పాడి పరిశ్రమపై ఆధారపడి ఉన్నా... ఏపీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ స్పందించలేదు. కారణం... ఏపీ గనక ప్రభుత్వ డెయిరీల పాల సేకరణ ధర పెంచితే రైతులంతా ప్రభుత్వ రంగంలోని ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (ఏపీడీడీసీఎల్) సారథ్యంలోని డెయిరీలకే పాలు పోస్తారు. అపుడు చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ వంటి ప్రయివేటు డెయిరీలు కూడా పోటీ తట్టుకోవటానికి తప్పనిసరిగా పాల సేకరణ ధర పెంచాలి. అలా పెంచితే వాటికొచ్చే లాభాలు తగ్గుతాయి. అందుకే ప్రభుత్వ డెయిరీల పాల సేకరణ ధర పెంచకుండా... రైతులు తమను మాత్రమే ఆశ్రయించేలా చక్రం తిప్పుతున్నారు చంద్రబాబు. అదీ కథ. రాష్ట్రంలో సుమారు 90 లక్షల గేదెలు, 18 లక్షలకు పైగా సంకర జాతి ఆవులు, 55 లక్షల దేశవాళీ ఆవులున్నాయి. తీవ్రంగా పెరుగుతున్న పశుగ్రాసం ధర, నీటి కొరత, తవుడు, చెక్కల ధర వంటివి పాడి రైతుల్ని ఇక్కట్ల పాలు చేస్తున్నాయి. రోజుకు సగటున దాదాపుగా 50 లక్షల లీటర్లు ఉత్పత్తి అవుతుండగా, అందులో ఏపీ డెయిరీ సేకరిస్తున్నది కేవలం 1.70 లక్షల లీటర్లు. మిగిలినదంతా ప్రయివేటు డెయిరీల చేతుల్లోకే వెళుతోంది. కారణం ఒక్కటే. సేకరణ ధర. ఉదాహరణకు హోల్ మిల్క్‌ను ఏపీ డెయిరీ రూ.55.50 ఇచ్చి సేకరిస్తుండగా ప్రయివేటు డెయిరీలు రూ.57 ఇచ్చి సేకరిస్తున్నాయి. సహజంగానే ప్రయివేటు డెయిరీల ధర ఎక్కువగా ఉంటోంది కనక రైతులు వాటినే ఆశ్రయిస్తున్నారు. నిజానికి సేకరణ ధర పెంచాల్సింది ప్రభుత్వమే. అయితే ప్రభుత్వ పెద్దల చేతుల్లోనే ప్రధాన ప్రయివేటు డెయిరీలుండటంతో వారు చాకచక్యంగా వ్యవహరిస్తూ తమ నేతృత్వంలోని ప్రయివేటు డెయిరీల సేకరణ ధరే కాస్త ఎక్కువ ఉండేలా చూసుకుంటున్నారు. ఒకరకంగా ప్రభుత్వ డెయిరీల వంక ఏ రైతూ వెళ్లకుండా చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల ప్రభుత్వ డెయిరీలు కునారిల్లటమే కాదు. రైతులకూ గిట్టుబాటు ధర రావటం లేదు. రాష్ట్రంలో అత్యధిక శాతం పాలను సేకరిస్తున్నది ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డెయిరీ కావటం ఇక్కడ గమనార్హం కూడా. రాష్ట్రంలోని 13 జిల్లాలకు గాను ప్రభుత్వ సహకార డెయిరీ కేవలం ఐదు జిల్లాల్లో మాత్రమే పాలను సేకరిస్తుండటం ఇక్కడ ప్రస్తావనార్హం. రూ.4 ప్రోత్సాహకంగా ప్రకటించిన తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం లీటరు పాలకు అదనంగా రూ.4ను ప్రోత్సాహకం ప్రకటించాక ప్రభుత్వ సమాఖ్య ద్వారా పాల ఉత్పత్తి పెరిగింది. గత పదిరోజుల్లోనే రోజుకు అదనంగా 40 వేల లీటర్ల పాల సేకరణ జరగటం విశేషం. పాల సేకరణలో లీటరుకు 4 రూపాయలు పెరగడంతో ప్రభుత్వ డెయిరీకి పాలు ఇవ్వడానికి రైతులు ఉత్సాహం చూపిస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక కూడా ప్రభుత్వ పాడి పరిశ్రమకు ప్రోత్సాహకాలను ప్రకటించి అమలు చేస్తోంది. ఏపీ రైతులకు ఎందుకివ్వరు? ఆంధ్రప్రదేశ్ పాడి రైతులు ఎప్పట్నుంచో ప్రభుత్వ ప్రోత్సాహం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రం నుంచి విడిపోయిన తెలంగాణ, పొరుగునున్న కర్ణాటక ప్రభుత్వాలు పాడి రైతుల్ని ప్రోత్సహిస్తుండగా.. ఎంతో ఆర్భాటంగా వ్యవసాయ మిషన్‌ను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంతవరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. విజయవాడ, గుంటూరు, విశాఖ, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, కర్నూలు సమీప ప్రాంతాలతో పాటు ఉత్తర కోస్తా, రాయలసీమలో వాణిజ్య స్థాయిలో పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తామన్న ముఖ్యమంత్రి కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు. ఏపీ డెయిరీ మరింతగా విస్తరించాలంటే ప్రభుత్వ చేయూత లేకుండా సాధ్యం కాదు. తెలంగాణ, కర్ణాటక మాదిరి రాష్ట్ర ప్రభుత్వం కూడా బోనస్ ప్రకటిస్తే అటు ప్రైవేటు డెయిరీల ఆట కట్టించడంతో పాటు రైతులకూ ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రైవేటు డెయిరీల ఆధిపత్యానికి ముకుతాడు వేయాలంటే మరో ప్రత్యామ్నాయం లేదని వారు చెబుతున్నారు. ప్రైవేటు సంస్థల గుత్తాధిపత్యం.. ఏపీ డెయిరీ క్రమేణా నిర్వీర్యమవుతుండటం, సహకార రంగంలోని ఒకటి రెండు సంస్థలు మినహా మిగతావి దివాళా తీయడంతో ప్రస్తుతం ప్రైవేటు డెయిరీలే పాల ఉత్పత్తిదారుల భవిష్యత్తును శాసిస్తున్నాయి. పాల సేకరణ ధర పెంచాలన్నా, తగ్గించాలన్నా ఈ సంస్థలే కీలకపాత్ర పోషిస్తున్నాయి. అందులోనూ ప్రస్తుత ప్రభుత్వంలోని పెద్దలకు, వారి బంధువులకు సొంత డెయిరీలు ఉండడంతో పాల సేకరణ ధర పెంచేందుకు పాలకులు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదనే విమర్శలున్నాయి. అన్నిటా తెలంగాణ కంటే తమదే అగ్రస్థానం అనే చంద్రబాబు పాల రైతులకు బోనస్ విషయంలో వెనుకాడటానికి ఇదే కారణమని రైతు సంఘాల నేతలంటున్నారు. కర్ణాటకలో మాదిరి ప్రైవేటు డెయిరీల ఆటకట్టించి, ప్రభుత్వ రంగ సంస్థను పటిష్టం చేయాలని టీడీపీ ప్రభుత్వం అనుకుంటే తక్షణమే రైతులకు బోనస్ ప్రకటించేదని పాడి పరిశ్రమకు సంబంధించిన పలువురు ప్రముఖులు చెబుతున్నారు. హెరిటేజ్ కోసం రైతుల్ని బలిచేయొద్దు తెలంగాణ ప్రభుత్వం మాదిరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పాలరైతులకు నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించాలి. చంద్రబాబు గతంలో మాదిరి కాకుండా ఇప్పటికైనా ప్రభుత్వ రంగంలోని ఏపీడీడీసీఎల్ను, ఇతర సహకార సంస్థలను బతికించేలా చూడాలి. తన హెరిటేజ్ కోసం పాడి రైతుల్ని బలిపెట్టడం తగదు. ప్రైవేటు సంస్థల ఆగడాలు అరికట్టేలా, రైతు శ్రేయస్సును పట్టించుకునేలా ముఖ్యమంత్రి వ్యవహరించాలి. రూ.4 నగదు ప్రోత్సాహం అవసరం. అనివార్యం. - కేవీవీ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రైవేటు డెయిరీల ఒత్తిడే కారణం ఏపీ ప్రభుత్వం పాల రైతును విస్మరిస్తోంది. సేకరణ ధర పెంచేందుకు వెనుకాడుతోంది. ప్రైవేటు డెయిరీల ఒత్తిడే దీనికి కారణం. లాభం వచ్చే పని ఏదైనా చేస్తామనేది రిలయెన్స్ నినాదం. ప్రస్తుతం హెరిటేజ్ విధానం కూడా అలాగే ఉంది. దీన్ని ప్రజలు తిరస్కరించాలి. పాల సేకరణ ధరలో రాజకీయ జోక్యాన్ని నివారించి సహకార రంగం బలపడేలా చూడాలి. ప్రభుత్వం మిగతా పంటలకు ఇచ్చినట్టే పాలకూ గిట్టుబాటు ధర కల్పించాలి. - నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ రైతు సంఘం నేత -
బాబు ఆస్తి తగ్గింది
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి కోడలు బ్రహ్మణి ఆస్తులు పెరిగాయి అక్టోబర్ 2 నుంచి జన్మభూమి-మా ఊరు నెల 22న నయూ రాయపూర్ పర్యటన ముఖ్యమంత్రి చంద్రబాబు లెక్కలు ఎంత పచ్చి అబద్ధాలో చెప్పటానికి ఒకే ఒక్క ఉదాహరణ చాలు. తన కుటుంబానికి హెరిటేజ్ ఫుడ్స్‌లో 40 శాతం వాటా ఉందని బాబు శుక్రవారమూ చెప్పారు. అది స్టాక్ మార్కెట్లో లిస్టయిన కంపెనీ కాబట్టి దాని విలువను బాబు దాచినా దాగదు. శుక్రవారంనాడు దాని షేరు ధర రూ.349. ఆ ధర దగ్గర దాని మార్కెట్ క్యాప్ విలువ రూ.810 కోట్లు. మరి అందులో 40 శాతమంటే ఎంత? 324 కోట్లు కాదా? మరి బాబు ఈ వాటాల విలువతో సహా తన కుటుంబానికున్న స్థిర, చరాస్తుల విలువంతా కలిపి రూ.39 కోట్లంటారేం? ఏటేటా తగ్గించుకుని పోతున్నారేం? ఎవరిని నమ్మించాలని? ఈయన మారేదెప్పుడు? హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన, కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలను వెల్లడించారు. గత ఏడాదితో పోల్చుకుంటే తనతో పాటు భార్య, కుమారుడి ఆస్తుల్లో పెద్దగా మార్పుల్లేవని, కోడలు బ్రహ్మణి ఆస్తులు పెరిగాయని చెప్పారు. వరుసగా నాలుగో ఏడాది ఆస్తుల వివరాలను వెల్లడిస్తున్నానని, వచ్చే ఏడాది నుంచీ తన కుమారుడు, కోడలు వారి ఆస్తులను స్వయంగా వెల్లడిస్తారని చెప్పారు. శుక్రవారం రాత్రి చంద్రబాబు తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్తుల వివరాలు తెలియజేయడంతో పాటు ఇతర అంశాలపై మాట్లాడారు.. ‘‘నా భార్య ఆస్తులు అన్నీ యధాతథంగా ఉన్నాయి. పీఎఫ్ మాత్రం రూ.1.08 కోట్లు పెరిగింది. బంగారం పెరిగింది. నికర ఆస్తులు తగ్గాయి. కుమారుడు లోకేష్ ఆస్తులు కూడా యధాతథంగా ఉన్నాయి. పీఎఫ్‌లో రూ.34 లక్షలు పెరిగారుు. వాహనాల సంఖ్య ఒకటి మేరకు పెరిగింది. నికర ఆస్తుల విలువ రూ.1.40 కోట్లు తగ్గింది. బ్రహ్మణి నికర ఆస్తి పెరిగింది. నిర్వాణ హోల్డింగ్స్ ఆస్తులు పెద్దగా పెరగలేదు. గతంలో రెండున్నర కోట్ల నష్టాల్లో ఉంటే ఈసారి రూ.90 లక్షల లాభాల్లోకి వచ్చింది. హెరిటేజ్ కంపెనీ టర్నోవర్ ఏడాదికి రూ.1,722 కోట్లు ఉంది. 22 సంవత్సరాల క్రితం నేను ప్రమోటర్‌గా ప్రారంభించిన కంపెనీ ఇప్పుడు ఇంత పెద్దస్థాయిలో ఉండటం గర్వంగా ఉంది. నా భార్య భువనేశ్వరితో పాటు మిగిలిన బృందం సమర్ధ నిర్వహణ వల్లే పలు అవార్డులు సాధించింది. మెంటర్‌గా దీనికి సంతోష పడుతున్నాను. కంపెనీ కోసం ములుగులో సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశాం. క్రమశిక్షణ, నిబద్దత కోసమే ఆస్తులు ప్రకటిస్తున్నాను. ప్రతి రాజకీయ నేత ఆస్తులు ప్రకటించాలి. మెట్రో వివాదాన్ని వాళ్లే పరిష్కరించుకోవాలి హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు విషయంలో నాపై విమర్శలు రావటం బాధాకరం. ఎల్ అండ్ టీ అనే కంపెనీని నిపుణులు నిర్వహిస్తున్నారు. దానికి యజమాని ఉండరు. ఈ వివాదాన్ని తెలంగాణ ప్రభుత్వం, డెవలపర్ పరిష్కరించుకోవాలి. అయితే ఈ సమస్యను ఆ ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందో నేను మాట్లాడను. హైదరాబాద్‌కు మెట్రో రైల్‌ను కేటాయించింది నేను సీఎంగా ఉన్న సమయంలోనే. హామీలన్నీ అమలు చేస్తా హామీల అమలు, పరిపాలన తదితరాల గురించి కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, ఇతర పార్టీల నుంచి టీడీపీ నేర్చుకోవాల్సిన పనిలేదు. వీరు ఆతృత పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిన తీరు చూసి ప్రజలు బుద్ధి చెప్పారు. భూస్థాపితం చేశారు. వైఎస్సార్సీపీ ఇచ్చిన హమీలను ప్రజలు అసహ్యించుకుని టీడీపికి అధికారం కట్టబెట్టారు. వారికి మాట్లాడే అధికారం లేదు. ఇబ్బందులున్నా, ఆర్ధిక వనరులు లేకున్నా ఇచ్చిన హామీలన్నింటినీ ఒక దాని తరువాత ఒకటి అమలు చేస్తాను. అక్టోబర్ 2 నుంచి జన్మభూమి-మా ఊరు కార్యక్రమం చేపడుతున్నాం. దీపావళి వరకూ కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇదే సమయంలో సామాజిక పింఛన్లు అందచే జేస్తాం. సాధ్యమైనంత త్వరగా విజయవాడకు.. అఖిల భారత సర్వీసు అధికారులు, రాష్ర్ట అధికారుల కేటాయింపు ఇంకా పూర్తి కాలేదు. రాష్ట్ర ఆదాయం తేలాలి. సమస్యలున్నా రానున్న రోజుల్లో మంచి జరుగుతుంది. ఇప్పటికే పలు కంపెనీలు పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చాయి. విద్యుత్ కోసం రూ.85 వేల కోట్ల నుంచి లక్ష కోట్లు పెట్టుబడులు పెడుతున్నాం. విజయవాడలో స్థలాలు చూస్తున్నాం. అది పూర్తైన తరువాత వేటిని అక్కడకు తరలించగలమో వాటిని తరలిస్తాం. సాధ్యమైనంత త్వరగా అక్కడకు వెళతాం. సోమవారం ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ పర్యటనకు వెళుతున్నా. ఒకరోజంతా అక్కడ ఉండి ఆ రాష్ర్ట నూతన రాజధాని నయా రాయపూర్ను పరిశీలించటంతో పాటు పోలవరం, ఇతర సమస్యలపై ఆ రాష్ట్ర సీఎంతో చర్చిస్తా. ఎర్రచందనం స్మగ్లర్లు ఒక వ్యవస్థలా తయారయ్యారు. వారిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం వేలం వేద్దామన్నా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు.’’ చంద్రబాబే ఆయన ఆస్తులపై విచారణ కోరొచ్చుగా..! : అంబటి ఏపీ సీఎం బాబు తన ఆస్తులపై ఏటా కల్లబొల్లి ప్రకటనలు చేసే బదులు ఆయనే చట్టబద్ధ సంస్థల తో విచారణ కొరచ్చు కదా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సలహా ఇచ్చింది. బాబుకు నిజాయితీ ఉం టే దర్యాప్తునకు ముందుకు రావాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. హెరిటేజ్ కంపెనీలో వందల కోట్ల ఆస్తులు, బాలాయపల్లి భూములు, హైటెక్ సిటీ పరిసరాల్లో ఫాంహౌస్, హైదరాబాద్‌లో ఆయన తనయుడి పేరు మీద ఉన్న ఇల్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో, మహా రాష్ట్ర, తమిళనాడుతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తులు, సంపద, నగలు, నగదు.. బాబు రాజకీయాల్లో ప్రజాసేవ చేసుకుంటూ సంపాదిం చారంటే అంతకు మించి గిన్నిసు బుక్కు ఎక్కించాల్సిన అంశం ఉం టుందా అని ప్రశ్నించారు. ఏటా ఇలా ఆయన ఆస్తులం టూ ఆడిటింగ్ గానీ, చట్టబద్ధతగానీ లేకుండా తెల్ల కాగి తాల మీద అంకెలు వేసి, కనీసం సంతకం కూడా పెట్టకుండా ప్రకటన విడుదల చేయడమేమిటని ప్రశ్నిం చారు. దీనికి బదులు ఆయన స్వదేశీ, విదేశీ, బినామీ ఆస్తుల న్నింటి మీదా చట్టబద్ధమైన విచారణ కోరాలని అన్నారు. . -
‘హెరిటేజ్’ తూకాల్లో తేడాలపై కేసు
-
‘హెరిటేజ్’ తూకాల్లో తేడాలపై కేసు
సాక్షి, హైదరాబాద్: పాలు, పాల ఉత్పత్తుల తూకాల్లో తేడాలు ఉండటంతో హెరిటేజ్ మిల్క్ డెయిరీతో సహా మొత్తం ఆరు సంస్థలపై కేసులు నమోదు చేశామని తూనికలు-కొలతల శాఖ కంట్రోలర్, అదనపు డీజీ ఎస్.గోపాల్‌రెడ్డి సోమవారం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నిర్వహించిన దాడుల్లో ఈ అక్రమాలు బయటపడ్డాయని వెల్లడించారు. హెరిటేజ్, జెర్సీ, తిరుమల, శకుంతల, కర్నూలు, వర్ధన్నపేట స్వకృషి ఉమెన్స్ కోపరేటివ్ డెయిరీలు, తయారీ యూనిట్లలో ఈ తనిఖీలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. తూకాల్లో అవకతవకలకు సంబంధించి హైదరాబాద్‌లో 9, ఏలూరులో 4, నిజామాబాద్‌లో 1, కర్నూలులో 3, విశాఖపట్నంలో 2, విజయవాడలో 2, కరీంనగర్లో 2, వరంగల్‌లో ఒక కేసు నమోదు చేశామన్నారు. రెండు ప్లాంట్లలోనే తేడాలు: హెరిటేజ్ ఫుడ్స్ తూనికలు-కొలతల శాఖ దాడులకు సంబంధించి హెరిటేజ్ పా‘పాలు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్ ఎం.సాంబశివరావు లిఖిత పూర్వక వివరణ ఇచ్చారు. తూనికలు-కొలతల శాఖ అధికారులు శనివారం బయ్యవరం (విశాఖపట్నం), బొబ్బిలి (విజయనగరం), పామర్రు (తూర్పుగోదావరి), నార్కెట్‌పల్లి (నల్లగొండ), ఉప్పల్ (హైదరాబాద్)ల్లో ఉన్న తమ ప్లాంట్లలో తనిఖీలు చేశారని అంగీకరించారు. మూడింటిలో తూకాలు పక్కాగా ఉండగా... రెండింటిలో మాత్రమే తేడాలు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారని పేర్కొన్నారు. మరోపక్క తమ ఉత్పత్తులపై కేరళ ప్రభుత్వం నిషేధం విధించిన మాట వాస్తవమే అన్న ఆయన... అది తాత్కాలికమైందని, ఆపై తామిచ్చిన సాంకేతిక వివరణతో సంతృప్తి చెంది నిషేధాన్ని ఎత్తివేశారని సాంబశివరావు పేర్కొన్నారు. -
బాబు వంచనకు సాక్ష్యం ఇదిగో..
* 2000లో భువనేశ్వరి డెరైక్టర్‌గా బాబు ఐటీ కంపెనీ * దాని చిరునామా హెరిటేజ్ ఫుడ్స్ హెడ్ ఆఫీసే * ఈ కంపెనీ నలుగురు డెరైక్టర్లలో ఒకరు ఎన్నారై.. ఆ ఎన్నారై పేరు రాయపాటి వెంకటపతి నాయుడు * 2003లో పోర్టల్ ప్లేయర్ కంపెనీ పేరిట హైదరాబాద్‌లోకి.. దానికి అర్జెంటుగా గచ్చిబౌలిలో ఐదెకరాలిచ్చిన చంద్రబాబు * దాని ఎండీగా జక్కంపూడి ఆదిశేషయ్య చౌదరి అలియాస్ జేఏ చౌదరి * 4 ఏళ్లు తిరక్కుండా తమ సంస్థను ఎన్విడియాకు అమ్మేసిన పోర్టల్ ప్లేయర్ * ఇదీ... బాబు మార్కు ఐటీ అభివృద్ధి; బినామీలకే కేటాయింపులు * ఇపుడు ఐడీఎఫ్ పేరిట టీడీపీకి ప్రచారం చేస్తున్న జేఏ చౌదరి (సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘పారిశ్రామిక అభివృద్ధి ఫోరం (ఐడీఎఫ్)’ అంటూ ఈ మధ్య చంద్రబాబు ఇంటి నుంచి ఓ బస్సు బయల్దేరింది. ప్రతిచోటా పారిశ్రామిక వేత్తల ముసుగులో ‘‘జై చంద్రబాబు’’ అంటూ ప్రచారం చేసిన ఆ బృందానికి నాయకత్వం వహించింది ఎవరో తెలుసా? జేఏ చౌదరి అలియాస్ జక్కంపూడి ఆదిశేషయ్య చౌదరి. అసలు ఈయనెవరో తెలుసా? గతంలో ఈ జేఏ చౌదరి పోర్టల్ ప్లేయర్ అనే సంస్థకు మేనేజింగ్ డెరైక్టర్. ఈ సంస్థకు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా 2003లో గచ్చిబౌలిలో అత్యంత విలువైన ఐదెకరాలను కేటాయించారు. ఇది అమెరికాకు చెందిన సంస్థగా పేర్కొన్నారు. ఇంకా ఘోరమేంటంటే అమెరికా సంస్థ పోర్టల్ ప్లేయర్ తరఫున ఇండియాలో డెరైక్టర్‌గా వ్యవహరించింది, ప్రభుత్వంతో డీల్ చేసింది వేరెవరో కాదు. ఎన్నారై రాయపాటి వెంకటపతినాయుడు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఈ రాయపాటి వెంకటపతి చంద్రబాబుకు ఎంత సన్నిహితుడంటే... 2000వ సంవత్సరంలో వెంక టపతి నాయుడితో కలిసి చంద్రబాబు భార్య భువనేశ్వరి ఓ సాఫ్ట్వేర్ కంపెనీని కూడా ఏర్పాటు చేశారు. ‘ఎ టు జెడ్ ఈ-మల్టీసాఫ్ట్ లిమిటెడ్’ పేరిట ఏర్పాటు చేసిన ఈ కంపెనీలో భువనేశ్వరి, వెంకటపతి సహా కార్వీ అధిపతి మేకా యుగంధర్, బాబు బినామీ వడ్లమూడి నాగరాజా నాయుడు డెరైక్టర్లు. నాగరాజానాయుడి భార్య సుధాశారద, కుమార్తె లలిత వాటాదారులు. కంపెనీ అడ్రస్ కూడా వేరెక్కడో కాదు. ప్రస్తుతం చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్ ఎక్కడైతే ఉందో... అదే! అంటే 6-3-541/సి, పంజాగుట్ట, హైదరాబాద్!!. ఇది చాలు ఈ ‘ఏ2జెడ్ ఈ మల్టీసాఫ్ట్’ కంపెనీ చంద్రబాబుదేనని చెప్పడానికి. మరి ఈ కంపెనీలో డెరైక్టర్‌గా చేర్చుకున్న రాయపాటి వెంకటపతి కంపెనీకి... గచ్చిబౌలిలో అత్యంత విలువైన 5 ఎకరాల స్థలాన్ని కట్టబెట్టారంటే అర్థమేంటి? ఇది బాబు మార్కు మాయాజాలమని కాదా? 2002లో ఈ ‘ఏ2జెడ్’ కంపెనీ పేరును ‘బిజ్ ప్రో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్’గా కూడా మార్చారు. దీని అధీకృత మూలధనం అంటే ఆథరైజ్డ్ క్యాపిటల్‌ను రూ.10 కోట్లుగా పేర్కొన్నారు. అంటే రూ.10 విలువైన కోటి షేర్లను జారీ చేయడానికి దీనికి వీలుంటుందన్న మాట. ఆర్ఓసీ పత్రాల్లో రాయపాటి వెంకటపతిని విదేశీయుడిగా పేర్కొన్న భువనేశ్వరి అండ్ కో... ఆయన చిరునామాను 4706, విల్కాక్స్ అవెన్యూ, శాంటా క్లారా, కాలిఫోర్నియా, యూఎస్ఏగా పేర్కొన్నారు. ఎన్విడియా సంస్థలో విలీనమైన పోర్టల్ ప్లేయర్ 2003లో ఐదెకరాల స్థలం తీసుకున్న పోర్టల్ ప్లేయర్... తన కార్యకలాపాల కోసం హైదరాబాద్‌లోనే వివిధ భవనాలను ఏడాది, రెండేళ్లకు లీజుకు తీసుకుంది. ఈ మేరకు 2003లోనే జేఏ చౌదరి, రాయపాటి వెంకటపతి పలువురితో ఒప్పందాలు చేసుకున్నారు. అంతేతప్ప శాశ్వత కట్టడాల జోలికి పోలేదు. నాలుగేళ్లపాటు ఇలా అరకొర కార్యకలాపాలు నడిపించిన పోర్టల్ ప్లేయర్.. ఈ మధ్యలోనే ఎన్విడియా సంస్థకు షేర్లను విక్రయించింది. చివరకు తమ కంపెనీని ఎన్విడియాలో విలీనం చేసేయటం... చౌదరి బయటకు వచ్చేయటం... అన్నీ జరిగిపోయాయి. ఇదీ చంద్రబాబు బినామీ బాగోతం. గచ్చిబౌలిలో ఐదెకరాలంటే? నిజానికి ఏ జిల్లాలోనో, పల్లెటూరులోనో 500 లేదా 1000 ఎకరాలు కేటాయించినా చంద్రబాబు లాంటి నేతలకు పెద్దగా లాభం ఉండదు. ఎందుకంటే అక్కడ తన అనుయాయులకు గనక భూములు కేటాయిస్తే... వారు తప్పనిసరిగా పరిశ్రమలు పెట్టాల్సి ఉంటుంది. అందుకు భారీగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పెపైచ్చు ఆ కంపెనీ ఎగ్జిట్ అవ్వాలనుకున్నా... దాన్ని కొనటానికి ఎవరైనా ముందుకు రావటం కష్టం. అదే హైదరాబాద్‌లాంటి సిటీలో హైటెక్ సిటీ చుట్టూనో, గచ్చిబౌలి పక్కనో అయితే వారు భారీ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉండదు. రుణం ద్వారానో, మరో రకంగానో భవంతి నిర్మిస్తే చాలు. ఆ ఆస్తిని చూసి... ఆ కంపెనీని టేకోవర్ చేయడానికి ఏ సంస్థయినా ముందుకు వస్తుంది. ఈ తరహా బాబు జమానాలో టేకోవర్ అంటే మరేమీ కాదు. ఆ భవనాన్ని షేర్ల మార్గంలో కొనుక్కోవటమే. అంతే!! పెపైచ్చు జిల్లాలో ఎకరా ఏ 5-10 లక్షలో ఉంటే... ఇక్కడ దానికి 50 నుంచి వందల రెట్ల ధర ఉంటుంది. అంటే అక్కడ 500-1000 ఎకరాలిస్తే ఇక్కడ ఐదెకరాలకు సమానమన్న మాట. అందుకే బాబు స్మార్ట్ పాలన ఎంచుకున్నారు. ఐటీ మార్గంలో హైదరాబాద్ భూములన్నీ కొల్లగొట్టేశారు. బినామీలకు పంచేశారు. పైసా వసూల్!! రామోజీ సర్టిఫికెట్లు.. ‘ఈనాడు’లో ఇంటర్వ్యూలు విచిత్రమేంటంటే ఇలాంటి కుంభకోణాలపై ‘ఈనాడు’ అక్షరం ముక్క కూడా రాయదు. బాబు దోపిడీ జమానా గురించి సింగిల్ కాలమ్ వార్త కూడా ఎక్కడా ప్రచురించదు. హైటెక్ సిటీ చుట్టూ భూముల్ని బాబు ఇలా తన బినామీలకు పంచేయటం, ముందే అక్కడ హైటెక్ సిటీ వస్తోందన్న సమాచారాన్ని తన బినామీ మిత్రులు మురళీమోహన్ వంటివారికి చేరవేసి భారీగా భూములు కొనిపించడం... ఇవేవీ రామోజీరావుకు మోసాల్లా కనిపించవు. ఎందుకంటే బాబుకు బాకా ఊదటం ఆయన విధి కాబట్టి. కానీ తాను స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్టుగా... అందరికీ సుద్దులు చెబుతూ... ‘ఈనాడు ముందడుగు’ ‘యువ శంఖారావం’ అంటూ రామోజీ చెలరేగిపోవటమే ఆశ్చర్యకరం. పెపైచ్చు బాబు ద్వారా ప్రజా ధనాన్ని దోచుకున్న వారంతా ‘స్వచ్ఛంద, స్వతంత్ర’ పారిశ్రామికవేత్తలుగా, విశ్లేషకులుగా అవతారాలెత్తి జనాన్ని బాబువైపు తిప్పే ప్రయత్నం చేస్తుంటారు. వీళ్ల వెనకే నిల్చుని రామోజీ బాకా ఊదుతూ ఉంటారు. ఇదెక్కడి తీరు? ఈ రాష్ట్ర ప్రజలకు ఆలోచనా శక్తి లేదనుకుంటున్నారా వీళ్లంతా? లేక అప్పటిలానే జనానికి వార్తలు అందజేయడానికి ‘ఈనాడు’ ఒక్కటే ఉందనుకుంటున్నారా? లెట్స్ ఓట్... పేరిట బాబుకు స్వచ్ఛంద సేవ నాలుగు రోజుల కిందట ‘ఈనాడు’లో జేఏ చౌదరి ఇంటర్వ్యూ ప్రచురించారు రామోజీ. పారిశ్రామిక వేత్తలంతా చంద్రబాబు వెనకే ఉన్నారన్నది ఈ ఇంటర్వ్యూ సారాంశం. ఇంకా చిత్రమేంటంటే ఈ జేఏ చౌదరి ‘లెట్స్ ఓట్’ అనే స్వచ్ఛంద సంస్థ కూడా పెట్టారు. ‘‘అందరూ ఓటింగ్‌లో పాల్గొనాలి...’’ అని పిలుపునిస్తూ ఆ సంస్థ ద్వారా ర్యాలీలు, కార్యక్రమాలు చేశారు. అది స్వచ్ఛంద సంస్థ రూపంలో ఉంది కనక ఈ కార్యక్రమాల్లో పదవుల్లో ఉన్న ఎన్నికల అధికారులు సైతం పాల్గొన్నారు. కొందరు యువత కూడా ఈ మాటలు నమ్మి దీని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ ఎన్నికలొచ్చేసరికి ఈయన ముసుగు తీసేశారు. ‘పచ్చ’బొట్టు సాక్షిగా... జై చంద్రబాబు అనేశారు. దీన్ని ఏమనుకోవాలి? రామోజీ కూడా ‘ఈనాడు యువ శంఖారావం’ ‘ఈనాడు ముందడుగు’ అంటూ చేస్తున్న కార్యక్రమాలన్నీ బాబు కోసం కాదా? జననేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై రోజూ పేజీలకు పేజీలు విషం కక్కుతున్న రామోజీకి... తన ముసుగు ఏనాడో జనం తీసేశారని తెలీదా? ఇంకా ఎన్నాళ్లీ పచ్చరాతలు? -
పిల్లలతో ‘హెరిటేజ్’ చెలగాటం
కుప్పం, న్యూస్‌లైన్ : ‘పశువైద్య శిబిరం పేరుతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ పుడ్స్ కంపెనీ చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడింది. పాఠశాల ఆవరణలోనే క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడంతో పలువురు అస్వస్థతకు లోనయ్యారు. ఉపాధ్యాయులు, గ్రామస్తులు సకాలంలో స్పందించడంతో పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని పైపాళెం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పైపాళెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 140 మంది విద్యార్థులు చదువుతున్నారు. గురువారం 40 మంది హాజరయ్యారు. ఉ.9 గంటలకు ప్రార్థన చేస్తుండగా అదే సమయంలో హెరిటేజ్ ఫుడ్స్ తరపున ఆ కంపెనీ ప్రతినిధులు సంచార పశు వైద్య శిబిరాన్ని పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేశారు. వద్దని ఉపాధ్యాయులు వారించినా వినలేదు. విద్యార్థులకు అతిసమీపంలో ఐదు పశువులపై బూటాక్స్ (విషపూరిత క్రిమిసంహారక మందు)ను స్ప్రే చేశారు. పక్కనే ఉన్న విద్యార్థులపై మందు తుంపర్లు పడ్డాయి. దీంతో 22 మంది విద్యార్థులు వాంతులు, కడుపునొప్పి, తలతిరగడం, శ్వాసకోశ బాధతో అక్కడే కుప్పకూలిపోయారు.విషయం తెలుసుకున్న గ్రామస్తులు, ఉపాధ్యాయులు విద్యార్థులను పీహెచ్‌సీకి తరలించారు. ఇద్దరికీ ఆక్సిజన్‌తోపాటు అత్యవసర చికిత్సలు అందించారు. మిగిలిన వారికి సాధారణ చికిత్స అందించి ఇళ్లకు పంపించేశారు. -
డెయిరీ తప్ప... హెరిటేజ్‌కు అన్నీ నష్టాలే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒక్క డెయిరీ వ్యాపారం తప్ప మిగిలిన అన్ని వ్యాపారాల్లో హెరిటేజ్ ఫుడ్స్ నష్టాలను ప్రకటించింది. ప్రధానమైన డెయిరీ వ్యాపారం లాభాల్లో ఉండగా, ప్రధానంగా దృష్టిసారిస్తున్న రిటైల్, అగ్రి, బేకరీ వ్యాపారాలు మాత్రం నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రస్తుత 2013-14 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో రిటైల్ విభాగం రూ.94 కోట్ల వ్యాపారంపై రూ.5 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అలాగే అగ్రి, బేకరీ విభాగాలు సంయుక్తంగా రూ.18 కోట్ల ఆదాయంపై రూ. కోటి నష్టాన్ని మూటకట్టుకున్నాయి. అయితే, డెయిరీ వ్యాపారాన్ని కలిపితే మొత్తం మీద లాభాల్లో ఉన్నా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నికరలాభంలో 30% క్షీణత నమోదయ్యింది. గత సంవత్సరం ఇదే కాలానికి రూ.14 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాదికి రూ.10 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో ఆదాయం రూ.402 కోట్ల నుంచి రూ.425 కోట్లకు పెరిగింది. మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో అరవింద్ పండలై, విష్ణు రాజు నంద్యాలను అదనపు డెరైక్టర్లుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. నిరుత్సాహకర ఫలితాలతో హెరిటేజ్ షేరు ధర మంగళవారం బీఎస్ఈలో 6.08% నష్టపోయి రూ.202.30 వద్ద ముగిసింది. -
'అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు ఎవరూ సాటిరారు'
తిరుపతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి మరోమారు మండిపడ్డారు. చంద్రబాబు సందర్బం లేకుండా ఆస్తులు ప్రకటించడంపై పలువురు నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఆస్తుల ప్రకటనలో నిజాయితీ ఉంటే బాబు గారూ..కాణిపాకంలో ప్రమాణ చేయగలరా అని చెవిరెడ్డి సవాల్ విసిరారు. ఒకవేళ బాబు అలా చేస్తే తన నిజాయితీని నిరూపించుకున్నట్లేనని ఆయన తెలిపారు. కాగా, బాబు తనంతట తానుగా సీబీఐ విచారణకు సిద్దపడాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ఆస్తులు, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. తన ఆస్తుల మొత్తం విలువ రూ. 42.06 లక్షలని ఆయన తెలిపారు. తన భార్య భువనేశ్వరి పేరిట రూ. 33.03 కోట్ల విలువైన ఆస్తులున్నాయన్నారు. తన కుమారు లోకేష్ ఆస్తుల విలువ రూ. 4.92 కోట్లు, కోడలు బ్రహ్మణి ఆస్తులు విలువ 3.30 కోట్లు అని వెల్లడించారు.. తాను ప్రకటించిన ఆస్తులు కాకుండా తనకింకా ఆస్తులు ఉన్నట్టు నిరూపిస్తే వాటా ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. -
చంద్రబాబు బంపర్ ఆఫర్!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ఆస్తులు, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు ప్రకటించారు. తన ఆస్తుల మొత్తం విలువ రూ. 42.06 లక్షలని ఆయన తెలిపారు. తన భార్య భువనేశ్వరి పేరిట రూ. 33.03 కోట్ల విలువైన ఆస్తులున్నాయన్నారు. తన కుమారు లోకేష్ ఆస్తుల విలువ రూ. 4.92 కోట్లు, కోడలు బ్రహ్మణి ఆస్తులు విలువ 3.30 కోట్లు అని వెల్లడించారు.. తాను ప్రకటించిన ఆస్తులు కాకుండా తనకింకా ఆస్తులు ఉన్నట్టు నిరూపిస్తే వాటా ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. తాము స్థాపించిన హెరిటేజ్ కంపెనీని పూర్తి పారదర్శకంగా పద్ధతి ప్రకారం నిర్వహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. 1992లో హెరిటేజ్ కంపెనీ ప్రారంభించామని చెప్పారు. గతేడాదితో పోలిస్తే 14.96 శాతం వృద్ధి సాధించిందని తెలిపారు. రాజకీయ నాయకుడిగా సమాజానికి జవాబుదారి కాబట్టి స్వచ్ఛందంగా ఆస్తులు ప్రకటించినట్టు తెలిపారు. తనలా ప్రజా జీవితంలో ఉన్న నాయకులు ఆస్తులు ప్రకటిస్తే బాగుంటుందన్నారు. తనకు డబ్బుల మీద వ్యామోహం లేదన్నారు. అయితే టీడీపీ నాయకులు అందరూ ఆస్తులు ఎందుకు ప్రకటించలేదన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమివ్వలేదు. ఆస్తుల ప్రకటించాలని వారిపై ఒత్తిడి పెంచాబోమని చెప్పారు. కాగా, తనకు రూ. 38 కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయని 2012లో చంద్రబాబు ప్రకటించారు. 2011లోనూ ఇదే మొత్తం చెప్పారు. సింగపూర్‌లో తనకు ఏవిధమైన ఆస్తులు లేవని మరీ మరీ చెప్పారు.