
ఆంధ్రప్రదేశ్ ఆస్తులు కనబడితే చాలు ..
చెన్నై : శేషాచల అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై తమిళులు రగిలిపోతున్నారు. తమిళ రాష్ట్రంలో... ఆంధ్రప్రదేశ్ ఆస్తులు కనబడితే చాలు బూడిద చేసేందుకు ఆందోళనకారులు సిద్దపడుతున్నారు. నిన్న హెరిటేజ్ ఫుడ్స్పై దాడి చేసిన తమిళ తంబీలు...శుక్రవారం చెన్నైలో ఆంధ్రాబ్యాంకుపై దాడి చేశారు. బ్యాంకులోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
మరోవైపు పాండిచ్చేరీలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సును దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. బస్సులోని సీట్లకు నిప్పంటించారు. అయితే బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సును మంటల నుంచి రక్షించారు. తుత్తుకుడిలో ఆంధ్రాబ్యాంక్పై నిన్న దుండగులు బాంబు విసిరిన విషయం తెలిసిందే. అయితే అప్పటికి బ్యాంక్ తెరవకపోవటంతో ప్రమాదం తప్పింది.