చిత్తూరు/తమిళనాడు: శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన ఓ వ్యక్తి మృతదేహానికి శుక్రవారం వరకూ అంత్య క్రియలు నిర్వహించవద్దంటూ మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాల్పుల్లో మరణించిన తన భర్త మృతిపై వాస్తవాలు వెలికి తీసేందుకు మళ్లీ పోస్టుమార్టం నిర్వహించాలంటూ పిటిషనర్ హైకోర్టును కోరింది. దాంతో ఈ ఎన్కౌంటర్పై సమాధానం ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. అలాగే ఎన్కౌంటర్లో మృతిచెందిన కూలీల మృతదేహాలకు మరోసారి పోస్ట్మార్టం నిర్వహించాలంటూ మృతుల కుటుంబీకులు గురువారం మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై అత్యవసర విచారణ చేయాలని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిని వారు కోరారు. అందుకు సమ్మతించిన న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు.
ఇదిలా ఉండగా, ఎర్రచందనం స్మగ్లర్ల మృతితో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పే అవకాశాలు ఉండటంతో తమిళనాడు డీజీపీ అన్ని జిల్లాల ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్లో మృతిచెందిన ఏడుగురి కూలీల మృతదేహాలు తిరువన్నామలై జిల్లా కన్నమంగళంకు చేరిన సంగతి తెలిసిందే.
మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించొద్దు
Published Thu, Apr 9 2015 7:39 PM | Last Updated on Mon, Aug 13 2018 3:10 PM
Advertisement
Advertisement