tamilnadu people
-
సీఎం జగన్‌కు తమిళ తంబీల ఫాలోయింగ్
సాక్షి, అమరావతి: విప్లవాత్మక నిర్ణయాలు, చరిత్రాత్మక పథకాలతో అన్ని వర్గాల ప్రజల ఆదరణను చూరగొన్న సీఎం వైఎస్ జగన్‌కు తమిళనాడు వాసులు సైతం అభిమానులుగా మారుతున్నారు. జగన్ జన్మదినమైన ఈ నెల 21న తమిళనాడులోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. వారిలో కొందరు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి తరలివచ్చారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుడు లేళ్ల అప్పిరెడ్డిని కలిసి.. తమిళనాడులో తాము చేస్తున్న సేవా కార్యక్రమాలపై వివరించారు. అనంతరం తిరుత్తణికి చెందిన అభిమాని కె.ప్రభు, అరక్కోణంకు చెందిన పులియందిరన్ ఆధ్వర్యంలో సీఎం జగన్‌పై రూపొందించిన ఆడియో, వీడియో సీడీని అప్పిరెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో శ్రీదేవి, గణపతి, హేమంత్‌రెడ్డి, మణికంఠన్, కాటురాజా తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా సేవాదళ్ ప్రధాన కార్యదర్శి నారాయణరావు రూపొందించిన 2021 డైరీనీ అప్పిరెడ్డి ఆవిష్కరించారు. -
చిత్తూరు జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
-
‘బాబోయ్ శశికళ మాకొద్దు.. ఎన్నికలు పెట్టండి’
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ బాధ్యతలు చేపట్టడం అక్కడి ప్రజలకు ఏమాత్రం ఇష్టం లేదా? తమకు ఆమె సీఎంగా వద్దే వద్దని అంటున్నారా? ఒక వేళ సీఎంగా ఆమె పీఠంపై కూర్చుంటే తమిళ తంబీలు ఆగ్రహంతో నిరసనలకు దిగుతారా? అంటే ప్రస్తుతం ఏర్పడుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం రాజీనామా చేయడం, శశికళను శాసన సభాపక్ష నేతగా ఎన్నుకోవడం రెండు మూడు రోజుల్లో ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారంటూ వార్తలు రావడం నేపథ్యంలో చేంజ్ డాట్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఆదివారం రాత్రి ఆన్లైన్ పిటిషన్‌తో పోల్ ప్రారంభించింది. అందులో తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ రావడంపై అభిప్రాయాన్ని రాబట్టేందుకు ప్రయత్నించారు. అలా వారు అభిప్రాయ సేకరణ ప్రారంభించారో లేదో పది హేను నిమిషాల్లో దాదాపు 19,000మంది శశికళకు వ్యతిరేకంగా సంతకాలు పెట్టారు. తాము చదువుకున్న తెలివైన జయలలితకే ఓటు వేశాం తప్ప మరింకెవరికో కాదని, తమకు మరోసారి ఎన్నికలు పెట్టాలని కూడా నెటిజన్లు కోరినట్లు సదరు సంస్థ తెలిపింది. ఈ సంతకాలను రాష్ట్రపతికి, గవర్నర్‌కు అందజేస్తామని వారు తెలిపారు. శశికళపై తాము నిర్వహించిన ఈ పోల్‌లో ఉంచితే పన్నీర్ సెల్వాన్ని సీఎంగా తిరిగి ఎన్నికలు వచ్చే వరకు ఉంచాలని, లేదంటే మరోసారి ఎన్నికలు నిర్వహించాలని వారు అభిప్రాయపడినట్లు పేర్కొన్నారు. అలాగే, ఫేస్బుక్, ట్విట్టర్‌లాంటి వాటిల్లో ‘మేం ఓటు వేసింది జయలలితకు. ఆమె సహాయకురాలికి కాదు. మేం ప్రభుత్వానికి ఓటేశాం. అవినీతిపరులైన కుటుంబానికి కాదు. శశికళ సీఎం పదవి చేపడితే.. ప్రజాస్వామ్యానికి సంతాపం ప్రకటించాల్సిందే’ అంటూ ఓ న్యాయ విద్యార్థి పోస్ట్ చేశాడు. సంబంధిత వార్తలకై చదవండి (శశికళ సీఎం అవడంపై చిదంబరం కామెంట్) (శశికళ వ్యూహం అదుర్స్.. గ్రాండ్ సక్సెస్!) (సీఎం కల నెరవేర్చుకుంటుందా.. పార్టీ కోసమా!) (సీఎం అయ్యేందుకు ఏ అర్హత ఉంది?) (వీడియో షాపు నుంచి సీఎం దాకా) -
ఆంధ్రప్రదేశ్ ఆస్తులు కనబడితే చాలు ..
చెన్నై : శేషాచల అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై తమిళులు రగిలిపోతున్నారు. తమిళ రాష్ట్రంలో... ఆంధ్రప్రదేశ్ ఆస్తులు కనబడితే చాలు బూడిద చేసేందుకు ఆందోళనకారులు సిద్దపడుతున్నారు. నిన్న హెరిటేజ్ ఫుడ్స్‌పై దాడి చేసిన తమిళ తంబీలు...శుక్రవారం చెన్నైలో ఆంధ్రాబ్యాంకుపై దాడి చేశారు. బ్యాంకులోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మరోవైపు పాండిచ్చేరీలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సును దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. బస్సులోని సీట్లకు నిప్పంటించారు. అయితే బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సును మంటల నుంచి రక్షించారు. తుత్తుకుడిలో ఆంధ్రాబ్యాంక్పై నిన్న దుండగులు బాంబు విసిరిన విషయం తెలిసిందే. అయితే అప్పటికి బ్యాంక్ తెరవకపోవటంతో ప్రమాదం తప్పింది. -
మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించొద్దు
చిత్తూరు/తమిళనాడు: శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన ఓ వ్యక్తి మృతదేహానికి శుక్రవారం వరకూ అంత్య క్రియలు నిర్వహించవద్దంటూ మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాల్పుల్లో మరణించిన తన భర్త మృతిపై వాస్తవాలు వెలికి తీసేందుకు మళ్లీ పోస్టుమార్టం నిర్వహించాలంటూ పిటిషనర్ హైకోర్టును కోరింది. దాంతో ఈ ఎన్‌కౌంటర్‌పై సమాధానం ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. అలాగే ఎన్కౌంటర్లో మృతిచెందిన కూలీల మృతదేహాలకు మరోసారి పోస్ట్‌మార్టం నిర్వహించాలంటూ మృతుల కుటుంబీకులు గురువారం మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై అత్యవసర విచారణ చేయాలని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిని వారు కోరారు. అందుకు సమ్మతించిన న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. ఇదిలా ఉండగా, ఎర్రచందనం స్మగ్లర్ల మృతితో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పే అవకాశాలు ఉండటంతో తమిళనాడు డీజీపీ అన్ని జిల్లాల ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్లో మృతిచెందిన ఏడుగురి కూలీల మృతదేహాలు తిరువన్నామలై జిల్లా కన్నమంగళంకు చేరిన సంగతి తెలిసిందే. -
హెరిటేజ్‌పై తమిళ సంఘాల దాడి
-
హెరిటేజ్‌పై తమిళ సంఘాల దాడి
చెన్నై: చిత్తూరు జిల్లా శేషాచలం ఎన్కౌంటర్లో తమిళనాడుకు చెందిన 20 మంది ఎర్రచందనం స్మగ్లర్ల మృతిపై తమిళనాడు వాసులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏపీ సీఎం చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థపై తమిళ సంఘాలు గురువారం దాడి చేశాయి. మహిళాపూర్ శివారు ప్రాంతంలో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. హెరిటేజ్ వస్తువులు ఎవరు కొనుగోలు చేయవద్దంటూ నినాదాలు చేశారు. మృతదేహాలకు మరోసారి పోస్ట్‌మార్టం నిర్వహించాలని మృతుల కుటుంబీకులు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసర విచారణ చేయాలని హైకోర్టు న్యాయమూర్తిని కోరారు. అందుకు సమ్మతించిన న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. అయితే ఎర్రచందనం స్మగ్లర్ల మృతితో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పే అవకాశాలు ఉండటంతో తమిళనాడు డీజీపీ అన్ని జిల్లాల ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.