సీడీలను ఆవిష్కరిస్తున్న అప్పిరెడ్డి తదితరులు
సాక్షి, అమరావతి: విప్లవాత్మక నిర్ణయాలు, చరిత్రాత్మక పథకాలతో అన్ని వర్గాల ప్రజల ఆదరణను చూరగొన్న సీఎం వైఎస్ జగన్‌కు తమిళనాడు వాసులు సైతం అభిమానులుగా మారుతున్నారు. జగన్ జన్మదినమైన ఈ నెల 21న తమిళనాడులోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. వారిలో కొందరు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి తరలివచ్చారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుడు లేళ్ల అప్పిరెడ్డిని కలిసి.. తమిళనాడులో తాము చేస్తున్న సేవా కార్యక్రమాలపై వివరించారు. అనంతరం తిరుత్తణికి చెందిన అభిమాని కె.ప్రభు, అరక్కోణంకు చెందిన పులియందిరన్ ఆధ్వర్యంలో సీఎం జగన్‌పై రూపొందించిన ఆడియో, వీడియో సీడీని అప్పిరెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో శ్రీదేవి, గణపతి, హేమంత్‌రెడ్డి, మణికంఠన్, కాటురాజా తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా సేవాదళ్ ప్రధాన కార్యదర్శి నారాయణరావు రూపొందించిన 2021 డైరీనీ అప్పిరెడ్డి ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment