హెరిటేజ్పై తమిళ సంఘాల దాడి | Tamilnadu people attack on heritage foods | Sakshi
Sakshi News home page

హెరిటేజ్పై తమిళ సంఘాల దాడి

Published Thu, Apr 9 2015 2:16 PM | Last Updated on Mon, Aug 13 2018 3:10 PM

హెరిటేజ్పై తమిళ సంఘాల దాడి - Sakshi

హెరిటేజ్పై తమిళ సంఘాల దాడి

చెన్నై: చిత్తూరు జిల్లా శేషాచలం ఎన్కౌంటర్లో తమిళనాడుకు చెందిన 20 మంది ఎర్రచందనం స్మగ్లర్ల మృతిపై తమిళనాడు వాసులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏపీ సీఎం చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థపై తమిళ సంఘాలు గురువారం దాడి చేశాయి. మహిళాపూర్ శివారు ప్రాంతంలో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. హెరిటేజ్ వస్తువులు ఎవరు కొనుగోలు చేయవద్దంటూ నినాదాలు చేశారు.

మృతదేహాలకు మరోసారి పోస్ట్మార్టం నిర్వహించాలని మృతుల కుటుంబీకులు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసర విచారణ చేయాలని హైకోర్టు న్యాయమూర్తిని కోరారు. అందుకు సమ్మతించిన న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. అయితే ఎర్రచందనం స్మగ్లర్ల మృతితో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పే అవకాశాలు ఉండటంతో తమిళనాడు డీజీపీ అన్ని జిల్లాల ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement